ఉమ్రా

ఉమ్రా ఇస్లామీయ ఆచరణ. కాబాకుచేరే ధార్మిక యాత్ర.మక్కాలోకొన్ని ధార్మిక ఆచరణలు సంవత్సరంలో ఎప్పుడైనా చేయడాన్ని ఉమ్రా అంటారు.దీని కోసం ప్రత్యేకమైన దుస్తులు ‘ఇహ్రామ్' ధరిస్తారు. ఆచరణలన్ని దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం చేసిన విధంగా ఉండాలి.దీన్ని చిన్న హజ్ అని కూడా అంటారు.

హజ్జ్ చరిత్ర

సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం హదీస్ గ్రంథాలలో నమోదు చేయబడిన ఇబ్నె ఉమర్ రజియల్లాహు అన్హుమ్ మరియు ఇతరుల హదీసుల ఆధారంగా ‘అల్లాహ్ పవిత్ర గృహానికి చేసే హజ్జ్ యాత్ర' అనేది ఇస్లాం యొక్క ఐదు మూలస్థంభాలలోని (మూలసిద్ధాంతాలలోని) ఒక మూలస్థంభమనే విషయంలో ప్రాచీన-ఆధునిక, పూర్వ-ప్రస్తుత పండితులు ఏకీభవిస్తున్నారనేది ముస్లింలందరికీ తెలుసు.

ఖుర్బానీ

ఉర్దూ పదం ఖుర్బానీ (బలి) అరబీ పదం ఖుర్బాన్ నుండి వచ్చింది. దీని భావానువాదం మహోన్నతుడైన అల్లాహ్ ను ఆనందపరచడం, సంతోషపెట్టడం. వాస్తవంగా అల్లాహ్ సంతోషపడే అన్ని రకాల దానధర్మాలను ఖుర్బానీ అంటారు. ఇస్లామీయ పరిభాషలో అల్లాహ్ కోసం చేసే జంతు బలిని ఖుర్బానీ అంటారు.

జుల్ హిజ్జా మాసం

జుల్ హిజ్జా మాసపు తొలి దశకంలో ఉపవాసం మరియు ఇతర సత్కార్యాల ఘనత

జమ్ జమ్ - కాబాలోని పవిత్ర నీళ్ళు

హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం తన జేష్ఠ పుత్రుడైన ఇస్మాయీల్ ను, సతీమణి అయిన హజ్రత్ హాజిరా అలైహిస్సలాం ను కాబా ఎగువ భాగాన వదలివెళ్లిన తర్వాత ఉన్న ఆ కాసిన్ని ఖర్జూరాలు, నీళ్ళూ అయిపోయాయి. ఏ ప్రాణి నివసించని ఆ రాతి నేలలో తీవ్రమయిన దాహంతో నాలుక పీక్కుపోయింది. చివరికి పసికందుని తాపించేందుకు పాలు కూడా లేకుండా ఇంకిపోయాయి. ఏం చేయాలో, ఎలా దాహం తీర్చుకోవాలో, ఏ విధంగా బాలుడ్ని రక్షించుకోవాలో తోచని అయోమయ స్థితిలో పడిఉన్నారు హజ్రత్ హాజిరా అలైహిస్సలాం.

మస్జిదె హరమ్ విస్తరణ

మస్జిదె హరమ్ మరియు మస్జిదె నబవి ఇస్లాం లో చాలా పవిత్రమైన మస్జిదులు. ఇవి రెండూ సౌదీ అరబ్ లో ఉన్నాయి. ఈ భూమిపై మొట్టమొదటి మస్జిద్ (ప్రార్థనా నిలయం) మస్జిదె హరమ్. అంటే ఇది మక్కా ప్రదేశంలో ఉంది.(మస్జిదె హరమ్) మరియు మదీనా ప్రదేశంలో ఉన్న(మస్జిదె నబవి)లలో చేయాల్సిన ప్రార్థనా పద్ధతుల గురించి దాదాపు అన్ని ప్రపంచపు భాషలలో అనేక పుస్తకాలు ప్రచురించబడ్డాయి. హజ్, ఉమ్రా చేయాల్సిన పద్ధతుల గురించి అనేక పుస్తకాల్లో సవివరంగా తెలియజేయబడింది.

మదీనా – మస్జిదె నబవీ

పూర్వం మదీనా నగరం ‘యస్రిబ్'గా పిలువబడేది.మక్కా నుండి హిజ్రత్ చేసిన తరువాత దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఈ నగరంలో స్థిరపడ్డారు. తన ఇంటి పక్కనే ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం నిర్మించిన మస్జిద్ ‘మస్జిదె నబవీ'(ప్రవక్త మస్జిదు)గా, ప్రసిద్దిచెందింది. మదీనా నగరం హరమె నబవీ సల్లల్లాహు అలైహివ సల్లం గా, దారుల్ హిజ్రత్ గా ఖ్యాతి చెం దింది. ఇంకా ఇది దైవాజ్ఞలు అవతరించిన కేంద్రంగా భాసిల్లింది. దైవప్రవక్త హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం మక్కాను పవిత్ర స్థలంగా ఖరారు చేసినట్లే దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మదీనా నగరాన్ని పుణ్యక్షేత్రంగా ఖరారు చేశారు. ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా సెలవిచ్చారు:

కాబా

అరబీలో కాబా అంటే చాలా గౌరవప్రదమైన, ఉన్నతమైన స్థానం. దీని మరో అర్ధం ఘనాకార వస్తువు. దీనికి గల ఇతర పేర్లు: 1. బైత్ ఉల్ అతీఖ్ – దీని ఒక అర్ధం ప్రాచీనమైనది. రెండో అర్ధం ప్రకారం స్వతంత్రమైనది, స్వేచ్చమైనది. రెండూ సరిఅయినవే. 2. బైత్ ఉల్ హరం – గౌరవప్రదమైన స్థలం.

అరఫా

అరఫా అనే నల్ల రాయి పర్వతం మక్కా నగరానికి తూర్పు దిశన ఉంది. దీన్ని దయ పర్వతం (జబల్ అర్ రహ్మాహ్) అని కూడా అంటారు. దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం హజ్ చేసినప్పుడు, తన చివరి ప్రసంగం ఈ కొండపై నుంచే ఇచ్చారు. హజ్ చేసినప్పుడు ఇక్కడ ఆగడం చాలా ముఖ్యం. ఇది ముజ్దలిఫా తరువాత వస్తుంది.

జుల్ హజ్జ్ మాసపు పది దినాల ప్రత్యేకత

ఉపవాసం. జుల్ హజ్జ్ 9వ తేదీన ఉపవాసం ఉండటమనేది ఒక సున్నత్ అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా ఆచరించి మార్గదర్శకత్వం వహించిన ఆచరణలలోనిది. ఈ శుభసమయంలో మంచి పనులు చేయవలెనని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించి ఉన్నారు. మరి, ఉపవాసమనేది పుణ్యకార్యాలలో ఒక మహోన్నతమైన పుణ్యకార్యం కదా. సహీహ్ బుఖారీ హదీస్ గ్రంథపు ఒక హదీస్ ఖుద్సీలో ఉపవాసాన్ని తను ఎన్నుకున్న ఆరాధనగా అల్లాహ్ ప్రకటించెను: "అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: ‘ఒక్క ఉపవాసం తప్ప, ఆదం సంతానపు పుణ్యకార్యాలన్నీ వారి కోసమే. అది మాత్రం నా కోసం. మరియు దాని ప్రతిఫలాన్ని నేను స్వయంగా అతనికి ప్రసాదిస్తాను. "ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జుల్ హజ్జ్ మాసపు 9వ రోజున ఉపవాసం ఉండేవారు. హునైదహ్ ఇబ్నె ఖాలిద్ తన భార్య ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కొందరు భార్యలు ఇలా పలికినారని ఉల్లేఖించెను: " ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 9వ జుల్ హజ్జ్ దినమున, అషూరహ్ దినమున, ప్రతి నెల మూడు దినములలో మరియు ప్రతి నెల మొదటి రెండు సోమవారాలు మరియు గురువారాలు ఉపవాసం ఉండేవారు."

పండుగ

అందరూ గుమిగూడే దినాన్ని (ఈద్) పండుగ అంటారు. దీని మూల పదం ‘ఆదా' అనగా మళ్ళి మళ్ళి రావడం.కొందరు ఇది ‘ఆదాహ్' (ఆచారం, అలవాటు) అనే పదం నుంచి వచ్చిందని అంటారు. ప్రజలు దీన్ని ఓ ఆచరణగా పాటిస్తున్నారు. దీని బహువచనం ‘ఆయాద్'. ఇబ్నుల్ అరబీ ఇలా అన్నారు: "దీన్ని ఈద్ (పండుగ) అనడానికి కారణం ఇది ప్రతి సంవత్సరం రెట్టింపు ఉత్సాహంతో వస్తుంది."లిసాన్ ఉల్ అరబ్

ఇబ్రాహీం అలైహిస్సలాం

దానికి దైవదూతలు,''నువ్వు దైవ శక్తి పట్ల ఆశ్చర్యపడుతున్నావా? ! (ఇబ్రాహీము) ఇంటివారలారా! మీపై అల్లాహ్‌ కారుణ్యం, ఆయన శుభాలు కురియుగాక! నిశ్చయంగా ఆయన స్తుతించదగినవాడు, మహాఘనత కలవాడు'' అని చెప్పారు. ఖుర్ ఆన్ సూరా హూద్ 11:73

ముస్లిం పండుగలు

ఇస్లాంలో సంవత్సరానికి రెండే పండుగలు ఉన్నాయి. అవి: (1) ఉపవాసాలు విరమించే పండుగ (ఈద్ ఉల్ ఫిత్ర్ – రమజాన్). ఇది ఇస్లామీయ నెల షవ్వాల్ మొదటి తేదీన జరుపబడుతుంది. (2) పండుగ (ఈద్ ఉల్ అజ్హా – బక్రీద్). ఇది ఇస్లామీయ నెల జుల్ హిజ్జా పదోవ తేదీన జరుపబడుతుంది.

ఈద్ నమాజు

ఒక ఈద్ అనగా సేకరణ రోజు. ఇది ఆద(Aada) అనే పదం నుండి వచ్చింది. కొంతమంది విద్వాంసులు ప్రకారం ఈద్ అనే పదం ఆదహ్ (Aadah) అనే పదం నుంచి వచ్చింది అని వ్యాక్యానించారు. దీనిని ప్రజలు చాలా గౌరవప్రదంగా జరుపుకునే పండుగగా భావిస్తారు. దీని బహువచనం అ యాద్ (A`yaad). ఇబ్న్ అల్ అరబీ ఇలా చెప్పారు దీనినే ఈద్ అని అంటారు. ఎందుకంటే ఇది ప్రతి సంవత్సరం జరుపుకునే పునరుద్ధరించబడే ఆనందం. "లిసాన్ ఉల్` అరబ్"