ఖుర్బానీ


ఉర్దూ పదం ఖుర్బానీ (బలి) అరబీ పదం ఖుర్బాన్ నుండి వచ్చింది. దీని భావానువాదం మహోన్నతుడైన అల్లాహ్ ను ఆనందపరచడం, సంతోషపెట్టడం. వాస్తవంగా అల్లాహ్ సంతోషపడే అన్ని రకాల దానధర్మాలను ఖుర్బానీ అంటారు. ఇస్లామీయ పరిభాషలో అల్లాహ్ కోసం చేసే జంతు బలిని ఖుర్బానీ అంటారు.

 

విషయసూచిక

 

ప్రార్ధించే విధానం


జంతు బలి ప్రతి జాతిలో తమ ధర్మ శాస్త్రాల ప్రకారం గుర్తింపు పొందిన అల్లాహ్ ను ప్రార్ధించే విధానం. ప్రాచీన జాతుల్లో కూడా జంతు బలి ఇవ్వబడేది. కాని అది అల్లాహ్ కొరకు కాకుండా దైవేతరుల కొరకు ఇచ్చేవారు. ఇది ఇస్లామీయ బోధనలకు పూర్తిగా విరుద్ధమైనది.  

 

ఇస్లామీయ చట్టం ప్రకారం జంతు బలి గుర్తింపు పొందిన అల్లాహ్ ను ప్రార్ధించే విధానం. ఇది జుల్ హిజ్జా లోని 4 రోజుల్లోనే చేయాలి. ఆ రోజులు – జుల్ హిజ్జా మాసంలోని 10,11,12, మరియు 13 తేదీలు. బక్రీద్ పండుగ రోజు మరియు దాని తరువాతి మూడు తష్రీఖ్ రోజులు. అలీ ఇబ్న్ అబీ తాలిబ్ రజిఅల్లాహు అన్హు ఉల్లేఖించారు: “ఖుర్బానీ (బలి) ఇచ్చే రోజులు, (యౌమున్ నహర్) పండుగరోజు, దాని తరువాతి మూడు రోజులు.” ఈ రోజుల్లో ఉపవాసం ఉండటం నిషేధించబడింది. ఈ హదీసును అల్ అల్బాని గారు ధృవీకరించారు (అల్ సిల్సిలా అల్ సహీహా-2476).  ఆయిషా రజిఅల్లాహు అన్హా, ఇబ్న్ ఉమర్ రజిఅల్లాహు అన్హు ఇలా అన్నారు: “అల్ తష్రీఖ్ రోజుల్లో (జుల్ హిజ్జా మాసం10,11,12,13 తేదిల్లో) ఎవరికీ ఉపవాసం ఉండే అనుమతి లేదు. బలి ఇవ్వడానికి జంతువు లేని వారు తప్ప.”

 

ఇలా చేయడానికి మూల కారణం – తన సొంత కుమారున్ని అల్లాహ్ కోసం బలిఇవ్వడం  ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం  తన కలలో చూసి దాన్ని అమలు కూడా చేశారు. కాని అల్లాహ్ అతని విశ్వాసాన్ని మెచ్చుకొని అతని కుమారుని బదులు ఓ గొర్రెను పంపించాడు. సహీహ్ బుఖారీ (NE1884)

 

అల్లాహ్ కు విధేయత


ఖుర్బానీ ద్వారా మానవుడు అల్లాహ్ కు తనను తాను పూర్తిగా సమర్పిస్తాడు. అల్లాహ్ ఆజ్ఞలకు పూర్తిగా విధేయత చూపుతూ జీవితం గడుపుతాడు. ఖుర్బానీ ఇచ్చినప్పుడు అతను ఇదే చాటుతాడు. ఒకసారి అల్లాహ్ తరఫున ఒక ఆజ్ఞ వచ్చిందంటే ఇక అతడు దానికి వ్యతిరేకంగా ఎట్టి పరిస్థితుల్లోను వెళ్ళడు. అల్లాహ్ ఆజ్ఞకు అతను వ్యతిరేకంగా ఆలోచించడూ. ఎందుకంటే అతనికి తెలుసు అల్లాహ్ ఆదేశం ముందు తను ఆలోచించడం ఎంత అవివేకమో.   

 

ఖుర్ఆన్ వెలుగులో


అల్లాహ్ ఖుర్ఆన్ లో అనేక చోట్ల ఏమని సెలవిచ్చాడంటే, ఏ పని చేసినను అది కేవలం అల్లాహ్ కొరకై ఉండాలి. దివ్య ఖుర్ఆన్ లో ఇలా ఉంది: “quran translation”“కాబట్టి నువ్వు నీ ప్రభువు కోసమే నమాజు చెయ్యి, ఖుర్బానీ ఇవ్వు.” ఖుర్ఆన్ సూరా కౌసర్ 108:2  

 

ఆధారాలు


http://islamqa.com/en/ref/32469/adha

 

1994 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్