కాబా


అరబీలో కాబా అంటే చాలా గౌరవప్రదమైన, ఉన్నతమైన స్థానం. దీని మరో అర్ధం ఘనాకార వస్తువు. దీనికి గల ఇతర పేర్లు:

 1. బైత్ ఉల్ అతీఖ్ – దీని ఒక అర్ధం ప్రాచీనమైనది. రెండో అర్ధం ప్రకారం స్వతంత్రమైనది, స్వేచ్చమైనది. రెండూ సరిఅయినవే.
   
 2. బైత్ ఉల్ హరం – గౌరవప్రదమైన స్థలం. [1]

 

విషయసూచిక

 

ప్రదేశం

సౌదీ అరేబియా దేశంలోని మక్కా పట్టణంలో మస్జిదె హరం మధ్యలో కాబా ఉంది.[2]

 

చరిత్ర

కాబా ఆదం అలైహిస్సలాం కాలంలో నిర్మించబడింది. దాని పునః నిర్మాణం ఇబ్రాహీం అలైహిస్సలాం కాలంలో జరిగింది. దాన్ని స్వయంగా ఇబ్రాహీం అలైహిస్సలాం మరియు అయన కొడుకు ఇస్మాయీల్ అలైహిస్సలాం నిర్మించారు.


ఆ తరువాత దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం హయాంలో దీన్ని మళ్ళి నిర్మించారు. అప్పుడుదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం వయసు 35 సంవత్సరాలు. (ది సీల్డ్ నెక్టార్, పేజి : 63,64)

 

నాలుగు దిక్కులు

 • హజరె అస్వద్
   
 • రుక్నె ఇరాఖి
   
 • రుక్నెషమి
   
 • రుక్నె యమాని

 

నల్ల రాయి

నల్ల రాయిని కాబాకు ఒక మూలలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అమర్చారు. మక్కా వాసులు కాబాను పునర్నిర్మించినప్పుడు ఓ వివాదం తలెత్తింది. అప్పుడు ఓ పెద్ద మనిషి, అబూ ఉమైయా బిన్ ముఘిరహ్అల్ మఖ్జుమిఒక ప్రతిపాదన పెట్టారు. దాన్ని అందరూ అంగీకరించారు. అతను అన్నది ఏమిటంటే: “ఈ పవిత్ర స్థలంలో ఎవరు ముందుగా ప్రవేశిస్తారో వారే నల్లరాయిని అమర్చాలి.” దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మొట్ట మొదటగా ప్రవేశించగానే అందరూ ఒకే కంఠంతో ఇలా అన్నారు: “అల్ అమీన్ (నిజాయితీపరుడు) వచ్చాడు. మేము ఇతని నిర్ణయాన్ని అంగీకరిస్తాము.” (ది సీల్డ్ నెక్టార్, పేజి : 63,64)  

 

ఖిబ్లా (దిశ)    

ఈ ఖుర్ఆన్ ఆయతు (సూరా బఖర 2:144) తరువాత ఖిబ్లా బైతుల్ మఖ్దిస్ నుండి కాబాకు మారింది. “(ఓ ప్రవక్తా!) నువ్వు నీ ముఖాన్ని మాటిమాటికీ ఆకాశం వైపుకు ఎత్తటం మేము గమనిస్తూనే ఉన్నాము. కాబట్టి ఇప్పుడు మేము, నువ్వు ఇష్టపడే ఆ దిశ వైపుకే నిన్ను త్రిప్పుతున్నాము. కనుక నువ్వు నీ ముఖాన్ని మస్జిదె హరామ్‌ వైపుకు త్రిప్పుకో.  మీరెక్కడున్నా సరే ఇక మీదట మీ ముఖాలను దాని వైపుకే త్రిప్పాలి. (ఖిబ్లా మార్పుకు  సంబంధించిన) ఈ విషయం, తమ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యమేనని గ్రంథం ఇవ్వబడిన వారికి బాగా తెలుసు. అల్లాహ్‌ వారి కార్యకలాపాల పట్ల అజాగ్రత్తగా లేడు.” (ఖుర్ఆన్ సూరా బఖర 2:144) [3]

 

హదీస్

బరా బిన్ అజిబ్ రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖించారు: దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం పదహారు లేదా పదిహేడు నెలల వరకు బైతుల్ మఖ్దిస్ వైపు నమాజ్ చేసేవారు, కాని ఆయనకు కాబా వైపు ముఖం చేసి నమాజ్ చేయాలనే కోరిక ఉండేది. అందుకే అల్లాహ్ ఈ ఆయతులను అవతరింపజేశాడు: “(ఓ ప్రవక్తా!) నువ్వు నీ ముఖాన్ని మాటిమాటికీ ఆకాశం వైపుకు ఎత్తటం మేము గమనిస్తూనే ఉన్నాము.  కాబట్టి ఇప్పుడు మేము,  నువ్వు ఇష్టపడే  ఆ దిశ వైపుకే నిన్ను త్రిప్పుతున్నాము.  కనుక నువ్వు  నీ  ముఖాన్ని మస్జిదె హరామ్‌ వైపుకు త్రిప్పుకో.  మీరెక్కడున్నా సరే  ఇక మీదట మీ ముఖాలను దాని వైపుకే త్రిప్పాలి. (ఖిబ్లా  మార్పుకు  సంబంధించిన)  ఈ విషయం,  తమ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యమేనని  గ్రంథం ఇవ్వబడిన వారికి బాగా తెలుసు. అల్లాహ్‌ వారి కార్యకలాపాల పట్ల అజాగ్రత్తగా లేడు. (ఖుర్ఆన్, సూరా బఖర 2:144). అప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తన ముఖాన్ని కాబా వైపు తిప్పుకున్నారు. యూదుల్లోని కొందరు మూర్ఖులు ఇలా అన్నారు, ‘వారు తమ ఖిబ్లా (బైతుల్ మఖ్దిస్) నుంచి ఎందుకు మరలారు.’ అప్పుడు అల్లాహ్ ఈ ఆయతును అవతరింపజేశాడు: “వీరు ఏ ఖిబ్లా వైపుకు అభిముఖులయ్యేవారో దాన్నుంచి  మరలటానికి కారణం ఏమిటీ?” అని  మూర్ఖజనులు అంటారు. (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: తూర్పు పడమరలు (అన్నీ) అల్లాహ్‌వే. తాను తలచిన వారికి ఆయన రుజుమార్గం చూపుతాడు.” (ఖుర్ఆన్, సూరా బఖర 2:142)


ఒకతను దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంతో (కాబాకు ముఖం చేసి) నమాజు చదివి వెళ్ళాడు. అతను కొందరు అన్సార్లు బైతుల్ మఖ్దిస్ వైపు ముఖం చేసి అసర్ నమాజ్ చదవడం చూశాడు. అప్పుడు అతను ఇలా అన్నాడు: “నేను దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంతో కలసి కాబా వైపు ముఖం చేసి నమాజ్ చదివాను.” అప్పుడందరూ తమ ముఖాలను కాబా వైపు త్రిప్పుకున్నారు. (సహీహ్ అల్ బుఖారీ vol 1:392)[4]

 

ఆధారాలు

[1] http://www.missionislam.com/knowledge/Kaaba.htm (ఇంగ్లీష్)
[2] http://www.missionislam.com/knowledge/Kaaba.htm (ఇంగ్లీష్)
[3] http://quran.com (ఇంగ్లీష్)
[4] http://tsmufortruth.wordpress.com/2011/09/14/hadith-of-the-day-251/ (ఇంగ్లీష్)
 
 

1249 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్