ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరు


 

విషయసూచిక

 

ఆయన సర్వలోకాల  పాలిట  కారుణ్యంగా పంపబడ్డారు

ముహమ్మద్ (సఅసo) మేము నిన్ను సమస్త లోకవాసుల కోసం కారుణ్యoగా చేసి పoపాము. సూరె అల్ అంబియా 21:107

 

మానవులంత అనుసరించదగ్గ గొప్ప  ఆదర్శవంతుడు

నిశ్చయంగా  దైవప్రవక్త లో  మీ కొరకు అత్యుత్తమ ఆదర్శం ఉంది,. అల్లాహ్ పట్ల అంతిమ దినం పట్ల ఆశ కలిగి  ఉండి, అల్లాహ్  ను అత్యదికంగా స్మరించే ప్రతి  ఒక్కరి కొరకు.  ( సూరె అల్ ఆహజాబ్  33:21)

 

ఆయన మొత్తం మానవాళి కోసం  పంపబడినవారు

ముహమ్మద్ ! మేము నిన్ను సమస్త జనులకు సుభవార్త  అందజేసేవానిగా , హెచ్చరించేవానిగా  చేసి పంపాము , అయితే జనులలో అధికులకు ఈ విషయం తెలియదు. ( సూరె సబా  34:28)

 

మానవాళికంతటికి  అల్లాహ్ తరపు నుంచి ప్రవక్తగా పంపబడ్డారు

ముస్లిములారా ! మీరు అల్లాహ్ ను ,ఆయన ప్రవక్తను విశ్వసిoచటానికి , అతనికి తోడ్పడటానికి ,అతనికి గౌరవిoచటానికి , ఉదయం సాయంత్రం అల్లాహ్ పవిత్రతను కొనియాడుతూ ఉండటానికి గాను (మేము ఈ ఏర్పాటు చేశాము).( సూరె అల్ ఫతహ్ 48:9,29,   సూరె  అల్ ఆరాఫ్ 7:158)

 

అంధకారం నుంచి వెలుగు వైపుకు తీసుకువస్తారు

అనగా అల్లాహ్ యొక్క స్పష్టమైన వాక్యాలను (ఆదేశాలను) చదివి వినిపించి, విశ్వసించి సత్కార్యాలు చేసినవారిని  ఆయన కారు చీకట్లలో  నుండి వెలుగులోనికి తీసుకువచ్చేoదుకు ఒక ప్రవక్తను పంపాడు . మరెవరైతే అల్లాహ్ ను విశ్వసించి సదాచారణ చేస్తారో   వారిని అల్లాహ్ క్రింద కాలువలు ప్రవహించే (స్వర్గ)వనాలలో ప్రవేశింపజేస్తాడు. వాటిలో వారు కలకాలం ఉంటారు . నిశ్చయంగా  అల్లాహ్ అతనికి అత్యుత్తమ ఉపాధిని  వొసగాడు. ( సూరె అత్ తలాఖ్ 65 :11 )

 

సత్య ధర్మానికి ఇతర ధర్మాలన్నిటిపై విజయం చేకూర్చటానికి ఏతెంచినవారు

ఆయనే తన ప్రవక్తకు సన్మార్గాన్ని, సత్యధర్మాన్నిఇచ్చి పంపాడు-  దాన్ని మతధర్మాలన్నింటిపై  ఆధిక్యం వహించేలా చేయటానికి! ఈ విషయం బహుదైవారాధకులకు ఇష్టంలేకపోయినా సరే.  సూరా అస్ సఫ్ 61:9

 

ఆధారాలు

www.teluguislam.net/ahsanulbayan

2807 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్