అల్లాహ్ ఆయనకు శాంతి మరియు గౌరవం ప్రసాదించుగాక


అల్లాహ్ ఆయనకు శాంతి మరియు గౌరవం ప్రసాదించుగాక (అరబీలో సల్లల్లాహు అలైహివ సల్లం). ఇది పలకడం ద్వారా దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంపై శాంతి మరియు గౌరవం ప్రసాదించమని అల్లాహ్ ను వేడుకుంటున్నాము.

అరబీలో  - صلى الله عليه وسلم (or)

 

విషయసూచిక

 

ఖుర్ఆన్ ఆజ్ఞ

“నిశ్చయంగా అల్లాహ్‌, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై  కారుణ్యాన్ని పంపిస్తున్నారు.  ఓ  విశ్వాసులారా! మీరు కూడా ఆయనపై దరూద్‌ పంపండి. అత్యధికంగా ఆయనకి 'సలాములు'     పంపుతూ ఉండండి.” (ఖుర్ఆన్, సూరా అహజాబ్ 33:56)[1]

 

సున్నత్ ఆజ్ఞ

“దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు, ఎవరి ఎదుటనైనా నా పేరు ఉచ్చరించబడ్డాక కూడా, నాపై దరూద్ (సలాం) పంపనివాడిపై పరాభవం కలుగు గాక. రమజాన్ నెల చూశాక కూడా, మన్నించబడనివానిపై పరాభవం కలుగుగాక.తల్లిదండ్రులువృద్ధాప్యానికిచేరుకున్నాక కూడా, వారి ఆశిస్సులు పొందనివానిపై పరాభవం కలుగుగాక.” (ఫిఖ్ ఉస్ సున్నహ్ 4.138 & తిర్మిజి, తుహ్ఫత్ అల్ అహ్వధి 9:531)[2]

 

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “నాపై ఒక సలాం (దరూద్) పంపిన వారిపై, అల్లాహ్ పది సలాములు (శుభాలు) పంపుతాడు.” (సహీహ్ ముస్లిం 747)

 

సహాబా తీరు

సహాబాదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంపై పూర్తి దరూద్ (సలాం) పంపేవారు. సహాబా ఎన్నడూ సగ భాగాన్ని ఉపయోగించేవారు కాదు. [3][4]

 

ఆధారాలు

[1]http://quran.com(ఇంగ్లీష్)

[2]http://www.islamicstudies.info/ibnkathir/ibnkathir.php?sid=33&tid=42121(ఇంగ్లీష్)

[3] http://www.islamhelpline.com/node/4226(ఇంగ్లీష్)

[4] http://sunnah.com/muslim(ఇంగ్లీష్)

 

1080 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్