దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం – పూర్తి మానవాళికి కారుణ్యమూర్తి


దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ధైర్య పరాక్రమాలలో ముందున్నట్లే, ప్రజలపై చాలా కరుణ కూడా చూపేవారు. ఆయన ఎంతగా కారుణ్యం చూపేవారంటే, ఇతరులపై కాస్త అన్యాయం జరిగినా,వెంటనేకంటనీరు పెట్టుకునేవారు. అల్లాహ్దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం గురించి ఖుర్ఆన్ లో ఇలా అన్నారు: “అల్లాహ్‌ను  ఆరాధించే  దాసుల కోసం  ఇందులో  (ఈ ఖుర్‌ఆనులో) ఓ గొప్ప సందేశం ఉంది.(ఓ ముహమ్మద్‌!)   మేము  నిన్ను సమస్త లోకవాసుల కోసం కారుణ్యంగా చేసి పంపాము.” (ఖుర్ఆన్, సూరాఅంబియా 21:106,107)

 
“(ఓ ముహమ్మద్‌!) వారికి చెప్పు : “ఓ ప్రజలారా! నేను భూమ్యాకాశాల సామ్రాజ్యానికి అధిపతి అయిన అల్లాహ్‌ తరఫున మీ అందరి వద్దకు పంపబడిన ప్రవక్తను. ఆయన తప్ప  మరో ఆరాధ్యుడు లేడు. ఆయనే బ్రతికించేవాడు, ఆయనే మరణాన్ని ఇచ్చేవాడు. కనుక అల్లాహ్‌ను విశ్వసించండి. సందేశహరుడు,నిరక్షరాసి అయిన ఆయన ప్రవక్తను కూడా విశ్వసించండి - ఆ ప్రవక్త అల్లాహ్‌ను మరియు ఆయన ఆదేశాలను విశ్వసిస్తాడు. అతన్ని  అనుసరించండి. తద్వారా మీరు సన్మార్గం పొందుతారు.”(ఖుర్ఆన్, సూరా ఆరాఫ్ 7:158)

 

విషయసూచిక

 

విశ్వాసుల పట్ల కారుణ్యం  

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం విశ్వాసులపై ఎనలేని ప్రేమను, వాత్సల్యాన్ని, కరుణను చూపేవారు. దీని గురించి ఖుర్ఆన్ లో ఇలా సెలవీయబడింది: “మీ దగ్గరకు స్వయంగా మీలోనుంచే ఒక ప్రవక్త వచ్చాడు. మీకు కష్టం కలిగించే ప్రతిదీ అతనికి బాధ కలిగిస్తుంది. అతను మీ మేలును ఎంతగానో కోరుకుంటున్నాడు. విశ్వాసుల యెడల అతను వాత్సల్యం కలవాడు, దయామయుడు.” (ఖుర్ఆన్, సూరా తౌబా 9:128)


సాద్ బిన్ ఉబాదా రజిఅల్లాహుఅన్హు అనారోగ్యానికి గురయ్యారు.దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఆయన్ని చూడడానికి వచ్చారు. అప్పుడుఆయన కంటనీరు పెట్టుకున్నారు. ఆ తరువాత ఇలా అన్నారు: “అల్లాహ్ కంటనీటికోసం గానీ, బాధకోసం గానీ ఎవరినీ శిక్షించడు. కాని ఒక దాని కోసం శిక్షిస్తాడు, అని తన నాలుకను చూపారు.” (సహీహ్ బుఖారీ 1304)

 

శత్రువుల పట్ల కారుణ్యం

బద్ర్ యుద్ధం తరువాత పట్టుబడ్డ యుద్ధ ఖైదీలు,దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం కు బద్ధ విరోధులు. అయిననూదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం వారితో చాలా మంచిగా ప్రవర్తించారు. వారిలో సుహైల్ బిన్ అమ్ర్ ఒకడు.అతనుతన ప్రసంగాలలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం గురించిచాలా చెడుగా మాట్లాడేవాడు.దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంకు చాలా సమీప అనుచరులైన ఉమర్ రజిఅల్లాహుఅన్హుదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంతో ఇలా అన్నారు: ‘అతడు మీ గురించి చాలా చెడుగా మాట్లాడేవాడు, కావునఅతనిక్రింద దవదలోని రెండు పళ్ళను పీకి వేద్దాము.’ దానికిదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “నేను ప్రవక్తను అయిననూ, ఇలా చేసినచో, అల్లాహ్అంతిమదినాన నన్ను అందవిహీనంగా మార్చివేస్తాడు.” (హదీస్)


మక్కాలోదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంను అతని జాతి ప్రజలు (మక్కా వాసులు) చాలా వేధించారు. చివరకుదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మక్కాకు వలస వెళ్లారు. ఆ తరువాత కూడా వారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంపై ఐదు సంవత్సరాలపాటు యుద్ధం చేశారు.చివరికి అల్లాహ్ కృప వల్ల దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఎలాంటి రక్తపాతం లేకుండా, 21వ హిజ్రీ కాలంలో మక్కాపై విజయం సాధించారు. అప్పుడుదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మక్కా అవిశ్వాసులను సంబోధించి ఇలా అడిగారు: “నేను మీతో ఎలా ప్రవర్తిస్తానని మీరు ఊహిస్తున్నారు?” దానికి వారు(మక్కావాసులు) ఏకగ్రీవంగా ఇలా అన్నారు: ‘మీరు చాలా ఉన్నత వ్యక్తిత్వం గలవారు. ఓ ఉన్నత వ్యక్తిత్వం గల వారి సంతానం.” “మిమ్మల్ని క్షమిస్తున్నాను. మీకు ఎలాంటి శిక్ష విధించడం జరగదు. అల్లాహ్మిమ్మల్ని క్షమించుగాక!” అనిదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అన్నారు.

 

స్త్రీల పట్ల కారుణ్యం

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం స్త్రీలతో చాలా కారుణ్యంగా మెలిగేవారు. ఆ కాలంలో స్త్రీలను చాలా నీచంగా చూసేవారు.దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం స్త్రీలను, పురుషులతో సమానంగా చూసేవారు. ఉమర్ రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖించారు: “మేము మక్కాలో ఉన్న సమయంలో స్త్రీలను హీనంగా చూసేవారము. కాని, మదీనాలో స్త్రీలకు చాల గౌరవం లభించింది.దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తన ప్రబోధనల మరియు ఆదేశాల  ద్వారా స్త్రీల హక్కులను మరియు వారి హోదాను సమాజంలో ఉన్నత స్థానానికి చేర్చారు.”


అబూ హురైరా రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “ఓ అల్లాహ్ నువ్వు సాక్షిగా ఉండు – ఇద్దరు బలహీనుల హక్కుల(నెరవేర్చాలని) గురించి నేను వీరికి హెచ్చరించాను. ఒకరు- అనాథలు, మరొకరు- స్త్రీలు.” (సునన్ ఇబ్న్ మాజా 3678)

 

పిల్లల పట్ల కారుణ్యం

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ప్రత్యేకంగా పిల్లలకు చాలా ఆప్యాయత చూపేవారు. ఎవరైనాపిల్లాడు ఏడిస్తే, ఆయన వారి ప్రక్కన కూర్చొని, వారిభావనలను పంచుకునేవారు. ఆ పిల్లల తల్లుల కంటే ఎక్కువగా ఆయన బాధపడేవారు. ఓ సారి ఆయన ఇలా అన్నారు: “నేను నమాజులో ఉండగా దాన్ని, సుదిర్ఘంగా చదవాలని అనుకుంటాను. కాని, ఎవరైనా పిల్లాడి ఏడుపు వినపడగానే, నమాజును చిన్నదిగా చేసేస్తాను. ఎందుకంటే, ఆ పిల్లాడి తల్లి హృదయం ఎంతగా కలవరిస్తుందో నాకు తెలుసు.” (సహీహ్ ముస్లిం 470)

 

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం పిల్లలను తన చేతుల్లో తీసుకుని గుండెలకు హత్తుకునేవారు. ఒకసారి ఆయన తన ప్రియమైన మనవళ్ళను (హసన్, హుస్సేన్) హత్తుకుంటుండగా, అది చూసి అఖ్ ర బిన్ హాబిస్ ఇలా అన్నాడు: “నాకు పది మంది సంతానం గలదు. నేను ఒక్కసారి కూడా వారిని ముద్దు పెట్టుకోలేదు.” దానికి జవాబుగా దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “ఎవరికైతే ఇతరులపై ప్రేమ ఉండదో, అతడిని ఎవరు ప్రేమించరు.” (తిర్మిజి vol 4, బుక్ 1, హదీస్ 1911)

 

బానిసల పట్ల కారుణ్యం  

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం బానిసలపై కరుణ చూపండని అజ్ఞాపించారు. జాబిర్ ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “మీ బానిసలకు మీరు తినే దాన్నే ఇవ్వండి, మీరు తొడుక్కునే వాటినే తొడిగించండి మరియు అల్లాహ్ దాసులకు ఇబ్బంది కలిగించకండి.´దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇంకా ఇలా కూడా అన్నారు: “మీ పై ఆధార పడ్డ వారుమీసోదరుల్లాంటి వారు. మీ సోదరుడు మీ క్రింద పనిచేసినచో, మీరు అతనికి, మీరు తినే తిండిని, వేసుకునే బట్టలను ఇవ్వండి. అతడు చేయలేని పనిని, మోయలేని భారాన్ని అతనిపై వేయకండి. ఒకవేళ తప్పనిసరి అయిన పరిస్థితిలో మీరు కూడా అతనికి సహాయపడండి.” (సునన్ అబూ దావూద్ 5158)

 

అనాథల, అగత్యపరుల, విధవల పట్ల కారుణ్య

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం విధవలకు మరియు నిరుపేదలకు ఎల్లప్పుడూ అండగా ఉండేవారు మరియు వారి అవసరాలను తీర్చేవారు. ఆయన బలహీనులు మరియు వ్యాధిగ్రస్తులైన ముస్లింలను సందర్శించేవారు. ముస్లింల అంతక్రియలకు హాజరయ్యేవారు. అనాథలతో మంచిగా మెలగేవారు మరియు ఆర్థికంగా వారిని ఆదుకునేవారు.అనాధులతో మంచిగా మెలగండి మరియు వారికి ఆర్థికంగా సహాయపడండి అని ఇతరులకు ప్రేరేపించేవారు. వాటి ప్రతిఫలాల శుభవార్త కూడా వారికి ఇచ్చేవారు: “నేను మరియు అనాథకు సహాయపడినవాడు స్వర్గంలో చాలా దగ్గరగా ఉంటాము (చూపుడు వేలు మరియు మధ్య వేలును కలిపి చూపించారు).” (సహీహ్ బుఖారీ 5304)


అబూ హురైరా ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా ఉపదేశించారు: “విధవరాలిని మరియు నిరుపేదను ఆదుకోవడానికి ప్రయత్నించేవాడు, అల్లాహ్ మార్గంలో కష్టపడేవానితో సమానం లేదా రాత్రంతా నమాజులో గడిపిన వానితో సమానం లేదా పొద్దంతా ఉపవాసం పాటించిన వానితో సమానం.” (సహీహ్ బుఖారీ 5353)

 

జంతువుల పట్ల కారుణ్యం

అబ్దుల్లా బిన్ ఉమర్ రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “ఓ స్త్రీ కేవలం ఒక పిల్లిని తినడానికి ఏమీ ఇవ్వకుండా, దాన్ని కట్టి ఉంచి నందున, నరకంలోవేయబడింది.” (సహీహ్ బుఖారీ 3318)

 

షద్దాద్ బిన్ ఆస్ రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “అల్లాహ్ ప్రతి ఒక్కరిపై కారుణ్యం చూపమన్నారు (జంతువులకు కూడా). జంతువులను చంపేటప్పుడు మంచిగా చంపండి. జిబాహ్ చేసేటప్పుడు జంతువును నెమ్మదిగా జిబాహ్ చెయ్యండి. జిబాహ్ చేసే ముందు కత్తిని పదునుపెట్టుకోండి. దానితో మంచిగా వ్యవహరించండి.” (సహీహ్ ముస్లిం 1955)

 

ముగింపు

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అన్ని రకాల సృష్టితాలకు చూపే కరుణ, ఈ రోజుల్లో తమను తాము మానవతావాదులు అని చెప్పుకునే వారి కారుణ్యం లాంటిది కాదు.దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తన కరుణ మరియు ప్రేమలో సంతులనం పాటించేవారు. ఆయన చూపించిన కరుణ, వాత్సల్యం లాంటిదిఇతరులెవరూ చూపించలేరు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంను అల్లాహ్ స్వయంగా ఎంచుకున్నాడు. కావున ఆయనను ప్రతి ప్రాణి కోసం మార్గదర్శకంగా చేసి పంపారు.కావునదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తన కోసం కాక, ఎల్లప్పుడూ ఇతరుల కోసం జీవించారు.దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం పూర్తి మానవాళి కొరకు కారుణ్యంగా చేయబడ్డారు.

 

ఆధారాలు

http://www.islamweb.net/emainpage/index.php?page=articles&id=134199 (ఇంగ్లీష్)

 

1126 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్