ఇస్లాంలో మహిళలు


ఇస్లాంలో మహిళలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇస్లాం మహిళకు తన ఆస్తి హక్కు ఇచ్చింది. ఆమె అల్లాహ్ ఆదేశించిన  (హలాల్) మార్గాల్లో తన ఆదాయాన్ని ఖర్చు చేసుకోవచ్చు. అలాగే ఆమెకు వారసత్వపు హక్కు కూడా కలదు.

 

విషయసూచిక

 

ప్రాముఖ్యత


ఇస్లాంలో మహిళలకు అధికగౌరవం ఇవ్వబడింది. ముస్లిం స్త్రీకి అల్లాహ్ పై అపారమైన విశ్వాసం ఉంటుంది, ఈ సృష్టిలో ఏది జరిగినా (మంచి – చెడు) అది అల్లాహ్ ఆజ్ఞ ప్రకారమే జరుగుతుందని విశ్వసిస్తుంది. ఇస్లాం స్త్రీలకు తల్లి, కూతురు, భార్య లాంటి హోదాలు ప్రసాదిస్తుంది.

 

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)సూక్తులు


దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి కొన్ని ప్రసిద్దిగాంచిన సూక్తులు :

"తల్లి పాదాల క్రింద స్వర్గం ఉంది." ఇబ్న్ మాజా 2771.

 

ఒక వ్యక్తి ప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ను నేను ఎవరికి ఎక్కువగా సేవ చేయాలి అని అడిగాడు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నీ తల్లి అని మూడు సార్లు అన్న తరువాత, నీ తండ్రి, ఆ తరువాత నీ దగ్గరి బంధువులు అని అన్నారు. సహీహ్ అల్ బుఖారీ వాల్యూం 8:2, సహీహ్ అల్ ముస్లిం 6181

 

అబూ హురైరా (రజి అల్లాహు అన్హు) సెలవిచ్చారు : ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) "స్త్రీల విషయంలో అల్లాహ్ కు భయపడండి, భార్యలను బాగా చూసుకొనేవాడే మీలో అందరికంటే మంచివాడు, ఒక ముస్లిం తన భార్యను అసహ్యించుకోకూడదు, ఒక విషయంలో ఆమె తప్పు చేసినా ఆమెలోని మంచి విషయాన్ని చూసి ఆమె తప్పులను మన్నించాలి, భార్యతో చాలా మంచిగా ఉండే భర్తయే ఉత్తమ విశ్వాసి" అని అన్నారు. సహీహ్ అల్ ముస్లిం 3469, తిర్మిజీ 278.

 

స్త్రీ హోదా


ఇస్లాంలో స్త్రీ స్థానం చాలా ఉన్నతమైనది. స్త్రీ ప్రభావం ప్రతి ముస్లిం జీవితంలో చాలా గొప్పది. నవ సమాజ నిర్మాణానికి స్త్రీ నాంది పలుకుతుంది. ఇది సాధ్యమవ్వాలంటే స్త్రీ దైవగ్రంథమైన ఖుర్ఆన్ మరియు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆదేశాలను అనుసరించాలి.

 

ఖుర్ఆన్ మరియు హదీసు నుండి దూరం ప్రతి ముస్లిం (పురుషుడు లేదా స్త్రీ) ను తప్పుదోవ పట్టిస్తుంది. కేవలం అల్లాహ్  చూపిన మార్గాన్ని, ప్రవక్తలు నడిచిన దారిని వదలడం వల్లనే నేడు అన్ని దేశాలు రకరకాల సమస్యలతో సతమతమవుతున్నాయి. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)సెలవిచ్చారు : “నేను రెండిటిని వదిలి వెళుతున్నాను, వాటిని వదలనంత వరకు మీరు మార్గభ్రష్టులు కాలేరు. అవి ఏమిటంటే దైవగ్రంథమైన ఖుర్ఆన్ మరియు నా ఉపదేశాలు (సున్నత్).” మాలిక్ ఇన్ అల్-మువత్తా 2:899, అల్-హాకిమ్1:93, దీన్ని అల్-అల్బానీ అస్-సహీహ1871లో ధ్రువీకరించారు.

 

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన సున్నత్ (హదీసు) లలో స్త్రీ భార్యగా, సోదరిగా, కూతురుగా నిర్వహించాల్సిన బాధ్యతలను వివరించారు.

 

స్త్రీ ప్రాముఖ్యత ఆమెపై మోయబడిన బాధ్యతల ద్వారా వ్యక్తమౌతుంది. ఆ బాధ్యతలను ఒక పురుషుడు కూడా మోయలేడు. అందువల్లే ప్రతి వ్యక్తి తన తల్లికి ప్రేమ, ఆప్యాయత, అనురాగం చూపాలని అల్లాహ్  ఆదేశించాడు. ఈ కారణంగా తండ్రిపై తల్లికి ప్రాధాన్యత ఇవ్వాలని ఉంది.

 

అల్లాహ్  సెలవిస్తున్నాడు :“ మరియు అల్లాహ్  ఇలా ఆదేశిస్తున్నాడు: ‘మేము మానవునకు తన తల్లిదండ్రుల యెడల మంచితనంతో మెలగటం విధిగా చేశాము. అతని తల్లి అతనిని బలహీనతపై బలహీనతను సహిస్తూ (తన గర్భంలో) భరిస్తుంది. మరియు ఆ బిడ్డ చనుపాలు మాన్పించే గడువు రెండు సంవత్సరాలు. నీవు నాకు మరియు నీ తల్లిదండ్రులకు కృతజ్ఞూడవై ఉండు. నా వైపునకే నీవు మరలి రావలసి ఉన్నది.”  సూరా లుఖ్మాన్ : 31:14

 

“మరియు మేము మానవునికి తన తల్లిదండ్రుల పట్ల మంచితనంతో మెలగాలని ఆదేశించము. అతని తల్లి అతనిని ఎంతో బాధతో తన గర్భంలో భరించింది మరియు ఎంతో బాధతో అతనిని కన్నది. మరియు అతనిని గర్భంలో భరించి అతనిని పాలు విడిపించే వరకు ముప్ఫై నెలలు అవుతాయి.” సూరా అల్ అహ్ ఖాఫ్ : 46:15

 

ఆధారాలు  


http://muttaqun.com/

http://www.islaam.net/main/display.php?id=526&category=153

2949 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్