సృష్టి


ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆకాశం వైపు చూడడం ప్రతి మనిషి స్వభావంలో ఉంటుంది.బాధ కలిగినప్పుడు, నష్టం కలిగినప్పుడు మనిషి అల్లాహ్ వైపుకు తిరుగుతాడు. ఇది మానవుని నైజంలో ఉంది.


మానవుని నైజం ప్రకారం అతనికి తాను పుట్టించబడడానికి కారణం తెలుసుకోవాలనే తపన ఉంటుంది. ఈ సృష్టి అనుకోకుండా ఉనికిలోకి వచ్చిందా లేదా దీన్ని సృష్టించినవాడెవడైనా ఉన్నాడా, అనే ప్రశ్న మానవుని మనసులో ఉత్పన్నమవ్వడం స్వాభావికం.


ఈ ప్రశ్నలకు జవాబు దొరకనంత వరకూ, మానవుని జీవితంలో అశాంతి, అలజడి ఉంటుంది. కావున వీటికి సమాధానాలు దొరికితే, మానవుని జీవితంలో శాంతి, లక్ష్యంనెలకొంటుంది.

 

విషయసూచిక

 

ఖుర్ఆన్

తన పుట్టుకకు పరమార్ధం తెలియనిచో మనిషి అలజడికి లోనవుతాడు. ఖుర్ఆన్ మనిషిని భూమిలో తిరిగి, దానిలోని అనేక సంకేతాలను చూసి, తన పుట్టుకకు, ఈ ప్రపంచం సృష్టించబడటానికి కారణం తెలుసుకోండని ప్రేరేపిస్తుంది.


ఖుర్ఆన్ లో ఇలా అనబడింది: “వారికి చెప్పు :  "భువిలో సంచరించండి. అల్లాహ్‌ ఏ విధంగా సృష్టిని మొదలెట్టాడో కాస్త చూడండి! మరి అల్లాహ్‌యే మలిసారి పునరుజ్జీవనం కూడా  ప్రసాదిస్తాడు. నిశ్చయంగా అల్లాహ్‌ అన్నింటిపై అధికారం గలవాడు."(ఖుర్ఆన్, సూరా అన్ కబూత్ 29:20)

 

విశ్వ సృష్టి

ఈ సృష్టిని పూర్తి ఏకాగ్రతతో పరిశీలించిన మీదట మనకు తెలిసేది ఏమిటంటే, దీన్ని సృష్టించినవాడు అద్వితీయుడు మరియు దీన్ని ఓ లక్ష్యంతో సృష్టించాడు అని అర్ధం అవుతుంది.


మీరు ఏదైనా మంచి పోస్టర్ చూసినప్పుడు, దాన్ని తీర్చిదిద్దిన వాడిని (designer)అని ప్రశంసిస్తారు. అతను ఒక్కొక్క అక్షరాన్ని, రంగును ఎంత బాగా తీర్చిదిద్దాడు అని అతని పనితనాన్ని మెచ్చుకుంటారు.


మీ గురించి కాస్త తెలుసుకోండి. మీ ఆకారం గురించి ఆలోచించండి. మీ అవయవాలను చూసుకోండి. మీ కళ్ళు ఎంత అందంగా తీర్చిదిద్దబడ్డాయి, మీమనసు ఎలా ప్రతి విషయాన్ని గ్రహిస్తుంది, మీ మెదడు ఎలా పనిచేస్తుంది- మానవుడు సృష్టించిన అత్యుత్తమ కంప్యూటర్ కన్నా, ఎన్నో రెట్లు వేగంగా, శక్తివంతంగా పనిచేస్తుంది. ఇంత అద్భుతమైన మానవుణ్ణి సృష్టించిన సృష్టికర్త ఎవరు?


ఈ భూమి గురించి కాస్త దీర్ఘంగా ఆలోచించండి. దీన్ని సృష్టించిన వాని ఔన్నత్యాన్ని గుర్తించండి. దీనిపై ఉన్న ప్రతి వస్తువు సమతుల్యంగా, ఒక లక్ష్యం ప్రకారం సృష్టించబడింది.అలా కానిచో, మానవుడు దీనిపై జీవితం గడపడం దుర్భరమైపోయేది. మానవుడు తన జీవితాన్ని హాయిగా గడిపేందుకు సర్వోన్నతుడైన అల్లాహ్ ఈ విశ్వంలో అతని కోసం ఎన్నో సదుపాయాలను సమకూర్చాడు.

 

“భూమ్యాకాశాలు కలిసి వుండగా, మేము వాటిని విడదీసినవైనాన్ని తిరస్కారులు చూడలేదా? ఇంకా, ప్రాణమున్న ప్రతి దానినీ మేము నీటితోనే చేశాము.అయినప్పటికీ వీళ్లు   విశ్వసించరా?” (ఖుర్ఆన్, సూరా అంబియా 21:30)


“నిశ్చయంగా భూమ్యాకాశాల సృష్టిలో, రేయింబవళ్ల రాకపోకలలో విజ్ఞులకు ఎన్నో సూచనలున్నాయి.” (ఖుర్ఆన్, సూరా ఆలి ఇమ్రాన్ 3:190)


“ఆయనే మీ కోసం రేయింబవళ్ళనూ, సూర్యచంద్రులను నియంత్రణలో పెట్టాడు. నక్షత్రాలుకూడా ఆయన ఆజ్ఞకు కట్టుబడి ఉన్నాయి. బుద్ధిమంతుల కోసం ఇందులో ఎన్నో నిదర్శనా లున్నాయి.” (ఖుర్ఆన్, సూరా నహల్ 16:12)

 

మానవ సృష్టి

“మానవులారా! మిమ్మల్ని ఒకే ప్రాణి నుంచి పుట్టించి, దాన్నుంచే దాని జతను కూడా సృష్టించి, ఆ ఇద్దరి ద్వారా ఎంతో మంది పురుషులను, స్త్రీలను వ్యాపింపజేసిన మీ ప్రభువుకు భయపడండి. ఎవరిపేరుతో మీరు పరస్పరం మీకు కావలసిన వాటిని అడుగుతారో ఆ  అల్లాహ్‌కు భయపడండి. బంధుత్వ సంబంధాల తెగత్రెంపులకు దూరంగా ఉండండి.  నిశ్చయంగా అల్లాహ్‌ మీపై నిఘావేసి ఉన్నాడు.” (ఖుర్ఆన్, సూరా నిసా 4:1)


మీకు ఏదైనా బహుమానం లభిస్తే, అది ఒక పుస్తకమైననూ సరే,మీరు ఆ బహుమానం ఇచ్చిన వ్యక్తికి తప్పకుండా ధన్యవాదాలు తెలుపుతారు. మీకు కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు ఇంకా ఎన్నో – లెక్కించలేనన్ని అనుగ్రహాలను ప్రసాదించిన సృష్టికర్త అల్లాహ్ కు ధన్యవాదాలు తెలుపరా? మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్త (అల్లాహ్)కు ధన్యవాదాలు తెలిపే విధానమే- అతన్ని ఆరాధించడం మరియు అతనికి విధేయత చూపడం.


“నేను జిన్నాతులను, మానవులను సృష్టించినది వారు నన్ను ఆరాధించటానికి మాత్రమే.” (ఖుర్ఆన్, సూరా ఆదియాత్ 51:56)


అల్లాహ్ మనకు తినడానికి తిండిని, త్రాగడానికి నీటిని, ధరించడానికి దుస్తులను ప్రసాదించాడు. ఇలా అతను ప్రసాదించిన ప్రతి అనుగ్రహానికి అతనికి ఎల్లవేళల కృతజ్ఞులై ఉండాలి.


''నేనుభువిలోప్రతినిధినిచేయబోతున్నాను'' అనినీప్రభువుతనదూతలతోఅన్నప్పుడు, ''భూమిలోకల్లోలాన్నిరేకెత్తించి,రక్తంప్రవహింపజేసేవాణ్ణిఎందుకుసృష్టిస్తావు (ప్రభూ)?  నిన్నుస్తుతించటానికి, ప్రశంసించటానికి, నీపవిత్రతనుకొనియాడటానికిమేమున్నాముకదా!'' అనివారన్నారు. దానికిఅల్లాహ్‌, ''నాకుతెలిసినవన్నీమీకుతెలియవు''అనిఅన్నాడు.(ఖుర్ఆన్, సూరా బఖర 2:30)


మానవ సృష్టిలో దైవలక్షణాలైన- దయ, క్షమాపణ, కారుణ్యం – స్పష్టమవుతాయి.

 

మరణం తరువాత జీవితం ఉందా?

ముస్లింలు ఈ ప్రాపంచిక జీవితాన్ని ఆశాశ్వతంగా భావిస్తారు. ఇది పరలోక జీవితానికి సిద్ధమయ్యే దశ మాత్రమే. ఇహలోక జీవితాన్నే ధ్యేయంగా చేసుకోకూడదు. మరణం అంతం కాదు,ఒక ప్రపంచం నుండి వేరే ప్రపంచానికి తరలింపు మాత్రమే.పరలోకానికి ఒక మెట్టు మాత్రమే. అక్కడ శాశ్వతమైన స్వర్గ నరకాలు ఉంటాయి. అక్కడ లభించే ప్రతిఫలం – మంచి లేదా చెడు – శాశ్వతమైనది.


అల్లాహ్ అంతిమ దినాన మానవులందరినీ జమ చేసి వారి కర్మలకు అనుగుణంగా లెక్క తీసుకుంటాడు. మనిషికి కర్మలు చేసే విషయంలో స్వేచ్ఛ ఇవ్వబడింది. ఎవరైతే దైవదేశాలకు అనుగుణంగా జీవితం గడుపుతారో వారికి ఎన్నటికీ అంతం కాని ప్రతిఫలాలు ఇవ్వబడుతాయి.


మరణాంతర జీవితంపై విశ్వాసం, ఇస్లామీయ విశ్వాసపు మూలస్థంభాలలో ఒకటి.


“ప్రతి ప్రాణీ మృత్యువు రుచి చూడవలసిందే. ప్రళయదినాన మీరు అందరూ మీ కర్మల పూర్తి ఫలితాన్ని పొందుతారు. అప్పుడు ఎవడు నరకాగ్ని నుంచి కాపాడబడి, స్వర్గంలో ప్రవేశం  కల్పించబడతాడో అతడు నిశ్చయంగా సఫలీకృతుడయ్యాడు. ప్రాపంచిక జీవితమైతే ఒక మాయావస్తువు తప్ప మరేమీ కాదు.” (ఖుర్ఆన్, సూరా ఆలి ఇమ్రాన్ 3:185)

 

ఆధారాలు

http://www.fanar.gov.qa/Understand/creation.html (ఇంగ్లీష్)
 
 

818 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్