సుభానహు వ తాలా


అల్లాహ్ పేరుతో, మేము ఆయన్ని స్తుతిస్తాము, సహాయంఅర్ధిస్తాము, క్షమాపణ కోరుకుంటాము. ఎవరినైతే అల్లాహ్ సన్మార్గం చూపుతాడో, అతన్ని ఎవరూ మార్గభ్రష్టతకు లోను చెయ్యలేరు. అలాగే ఎవరినైతే అల్లాహ్ మార్గభ్రష్టతకు లోను చేస్తాడో, అతన్ని ఎవరూ సన్మార్గం చూపలేరు. అల్లాహ్ తప్ప ఆరాధ్యానికి అర్హుడు ఎవ్వరూ లేరని మేము సాక్ష్యమిస్తున్నాము మరియు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అల్లా అంతిమ ప్రవక్త మరియు దాసులు అని మేము సాక్ష్యమిస్తున్నాము.

 

అరబీ - سبحانه و تعالى

 

విషయసూచిక

 

సాహిత్యపర అర్ధం

సాహిత్యపర అర్ధం ప్రకారం సుభానహు అనగా ‘కీర్తించబడేవాడు’ మరియు తాలా అనగా ‘అత్యంత ఉన్నతుడు, సంపూర్ణుడు.’

 

‘సుభానహు’ అని అనగానే, అల్లాహ్ పై మన పూర్తి విశ్వాసం వెల్లడవుతుంది.ఆయనే స్తుతించదగినవాడు, ఉన్నతుడు,అన్నీ తెలిసినవాడు, ఆయను అన్ని రకాల లోపాలకు అతీతుడు, ఆయనే అన్నిటినీ చేసేవాడు, ఆయనే సర్వ జ్ఞానీ అని ప్రకటిస్తాం.

 

ఖుర్ఆన్

“ఆయన  పరిశుద్ధుడు. వారు అనే ఈ మాటలకు ఎంతో అతీతుడు, ఎంతో ఉన్నతుడు.సప్తాకాశాలు, భూమి, వాటిలో ఉన్నవన్నీ ఆయన పవిత్ర తనే కొనియాడుతున్నాయి.   ఆయన స్తోత్రంతో పాటు ఆయన పవిత్రతను కొనియాడని వస్తువంటూ ఏదీ లేదు. అయితే మీరు వాటి స్తుతిని గ్రహించలేరు. ఆయన గొప్ప సహనశీలుడు, క్షమాగుణం కలవాడు.” (ఖుర్ఆన్, సూరా ఇస్రా 17: 43-44)

 

“ఆకాశాలలో, భూమిలో ఉన్నదంతా అల్లాహ్‌దే. నిశ్చయంగా అల్లాహ్‌ ఏ అక్కరా లేనివాడు, స్తుతింపదగినవాడు.భూమండలంలో ఉన్న వృక్షాలన్నీ కలములుగా, సముద్రాలన్నీ సిరాగా మారినా,ఆపైన మరో సప్త సముద్రాలు (సిరాగా) చేరినా అల్లాహ్‌ మాటలు (రాయటానికి)  పూర్తికావు. నిస్సందేహంగా అల్లాహ్‌ సర్వాధికుడు, వివేకవంతుడు.”(ఖుర్ఆన్, సూరా లుఖ్మాన్ 31:26-27)

 

ఆధారాలు

http://www.islamhelpline.com/node/2408

817 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్