షాబాన్ నెలలో ఉపవాసపు ప్రాముఖ్యత ఇస్లామీయ క్యాలెండర్ ప్రకారం ఎనిమిదవనెల షాబాన్. ఈ నెలలో ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంఅధికంగా నఫిల్ ఉపవాసాలుండేవారు నిమిదవనెల షాబాన్ ఇస్లామీయ క్యాలెండర్ ప్రకారం ఎనిమిదవనెల షాబాన్. ఈ నెలలో ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంఅధికంగా నఫిల్ ఉపవాసాలుండేవారు. నఫిల్ ఉపవాసాల మాసం సహీ బుఖారీ 1969లోఉంది: హజ్రత్ ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా తెలిపారుః ప్రవక్తసల్లల్లాహు అలైహి వసల్లం రమజాన్ తప్ప మరే మాసమంతా ఉపవాసం ఉన్నది చూడలేదు.మరియు షాబాన్ కంటే ఎక్కువ (ఇతర మాసాల్లో నఫిల్) ఉపవాసాలున్నది చూడలేదు. గౌరవనీయ నాలుగు మాసాల్లో ఒకటి ఈ మాసములో ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం ఎందుకు అధికంగా ఉపవాసాలుండేవారో ఉసామా బిన్ జైద్ రజియల్లాహు అన్హుస్వయంగా ప్రవక్త గారినే అడిగారు, అందుకు ప్రవక్త ఇలా సమాధానమిచ్చారుః ఈ మాసం, ప్రజలు ఒక మాసము గురించి నిర్లక్ష్యం వహిస్తున్నారు అది రజబ్ మరియు రమజానుమాసాల మధ్యలో ఉంది. (మానవుల) కర్మలు పైకి లేపబడే మాసం ఈ మాసంలోనేసర్వలోకాల ప్రభువు వైపునకు (మానవుల) కర్మలు లేపబడతాయి, మరియు నేను ఉపవాసస్థితిలో ఉండగా నా కర్మలు లేపబడాలన్నది నా కోరిక. (ముస్నద్ అహ్మద్ 36/85, సహీ తర్గీబ్ 1022. దీని సనద్ హసన్ అని షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ తెలిపారు). ఆధారాలు http://teluguislam.net/(ఇంగ్లీష్) http://telugudailyhadith.wordpress.com/(ఇంగ్లీష్) |