విధివ్రాత


మీలో ప్రతి ఒక్కరి స్థానం స్వర్గం లేక నరకంలో వ్రాయబడి ఉంది. అతను సౌభాగ్యుడా లేక దౌర్భాగ్యుడా అనే విషయం ముందుగానే వ్రాయబడింది

 

విషయసూచిక

 

శ్మశానవాటిక

1697. హజ్రత్ అలీ (రధి అల్లాహు అన్హు) కధనం :-మేమొక జనాజా(శవం) వెంట ‘బఖీ’ శ్మశానవాటికకు వెళ్ళాము.అంతలో దైవప్రవక్త (సల్లల్లాహుఅలైహి వసల్లం) కూడా వచ్చి ఓ చోట కూర్చున్నారు. మేము ఆయన చుట్టూకూర్చున్నాము. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చేతిలో ఒక బెత్తంఉంది. ఆయన తల వంచుకొని బెత్తంతో నేలను గీకసాగారు.

 

మనిషి స్థానం

కాస్సేపటికి మీలో ప్రతిఒక్కరి స్థానంస్వర్గం లేక నరకంలోవ్రాయబడి ఉంది. అతను సౌభాగ్యుడా లేక దౌర్భాగ్యుడా అనే విషయం ముందుగానేవ్రాయబడింది.అని అన్నారు ఆయన.

 

కర్మలు

ఒకతను ఈ మాట విని దైవప్రవక్తా! అయితే మనంవిధివ్రాతని భావించి కర్మలు ఆచరించకుండా ఎందుకు కూర్చోకూడదు. మనలో ఎవరైనాసౌభాగ్యుడై ఉంటే అతను ఎలాగూ సత్కర్మలు ఆచరిస్తాడు, దౌర్భాగ్యుడైతే ఎలాగూదుష్కర్మలు ఆచరిస్తాడు కదా!అని అన్నాడు.

 

ఆచరణ

దానికి దైవప్రవక్త (సల్లల్లాహుఅలైహి వసల్లం) సమాధానమిస్తూ కాని వాస్తవం ఏమిటంటే అదృష్టవంతుడికిసత్కార్యాలు చేసే సద్బుద్ధి కలుగుతుంది, దౌర్భాగ్యుడికి దుష్కార్యాలు చేసేదుర్భుద్ది పుడ్తుంది.అని అన్నారు. ఆ తరువాత ఆయన (దివ్య ఖుర్ఆన్ లోని) ఈసూక్తులు పఠించారు

 

సద్బుద్ధి

 ధనాన్ని దానం చేసిదైవ అవిధేయతకు దూరంగా ఉంటూ, మంచిని (సత్యాన్ని) సమర్ధించే వాడికి మేముసన్మార్గాన నడిచేందుకు సౌలభ్యం కలుగజేస్తాము.(ఖుర్ ఆన్ సూరా 92 : 5-10)

 

పిసినారితనం

(దీనికి భిన్నంగా)పిసినారితనం వహించి (దైవంపట్ల) నిర్లక్ష్య భావం ప్రదర్శిస్తూ, మంచిని(సత్యాన్ని) ధిక్కరించే వాడికి మేము కఠిన మార్గాన నడిచేందుకు సౌలభ్యంకలగజేస్తాము.(ఖుర్ ఆన్ సూరా 92 : 5-10)

 

ఆధారాలు

www.teluguislam.net

[సహీహ్ బుఖారీ : 23 వ ప్రకరణం - జనాయిజ్, 83 వ అధ్యాయం - మౌఇజతిల్ ముహద్దిసి ఇన్దల్ ఖబ్ర్ వఖూవూది అస్ హాబిహీ హౌలహు]విధివ్రాత ప్రకరణం – 1 వ అధ్యాయం మాతృగర్భంలో మానవ నిర్మాణ స్థితి, అతని ఉపాధి, వయస్సు, కర్మలు మొదలగునవి  మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

 

687 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్