రమల్ - RAML


రమల్ అంటే చిన్న చిన్న అడుగులతో వేగంగా నడవడం. రమల్ హజ్ మరియు ఉమ్రాలలో చేస్తారు. సౌదీ అరబియలోని మక్కాలో ఉన్న కాబా చుట్టు వేగంగా నడవడమే ఈ ఆచరణ. [1]

 

విషయసూచిక

 

పరిచయం

ఇది దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం సున్నత్ (ఆచరణ). కాని ఇది కేవలం పురుషులకే వర్తిస్తుంది. స్త్రీలకు వర్తించదు. ఇది తవాఫె ఖుదూంలో (మక్కాకు చేరాక చేసే మొదటి తవాఫ్) చేస్తారు.

 

ఇఫ్రాద్ మరియు ఖిరాన్ హజ్ చేసేవారు కుడి భుజాన్ని వివస్త్రం చేసి, చిన్న చిన్న అడుగులతో (రమల్) వేగంగా నడవాలి. ఇది ఉమ్రా తవాఫ్ మరియు తవాఫ్ అల్ ఖుదూం (మక్కాలో ప్రవేశించాక చేసే మొదటి తవాఫ్) చేసేటప్పుడు చేయాలి. ఇతర తవాఫ్ లలో ఇవి సూచించబడలేదు. కావున తవాఫ్ అల్ ఇఫాదాలో రమల్ (వేగంగా నడవడం) మరియు కుడి భుజాన్ని వివస్త్రం చేయకూడదు. మీరు తవాఫ్ ఇహ్రామ్ స్థితిలో చేసినా, ఇహ్రామ్ స్థితిలో లేకుండా చేసినా సరే.

 

పురుషులు తవాఫ్ లోని మొదటి మూడు ప్రదక్షిణలు యమాని మూల వరకు వేగంగా చేయాలి. దీన్ని ‘రమల్’ అంటారు. యమాని మూల నుండి నల్ల రాయి (హజరె అస్వద్) వరకు మామూలుగా నడవాలి. పురుషుల మిగతా (నాలుగు) ప్రదక్షిణలు మరియు స్త్రీలు మొత్తం (ఏడు) ప్రదక్షిణలు మామూలుగా చేయాలి. (సహీహ్ బుఖారీ 672)

 

రమల్ లో కుడి భుజాన్ని వివస్త్రం చేయడం మరియు చిన్న అడుగులతో వేగంగా నడవడం – రెండూ చేయాలి.

 

హదీస్

ఇబ్న్ అబ్బాస్ (రజి) ఉల్లేఖించారు: దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తన అనుచరులతో వచ్చినప్పుడు బహుదైవారాధకులు ఇలా అన్నారు: “యత్రిబ్ జ్వరంతో బలహీనులైనవారు వచ్చారు.” అప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మొదటి మూడు ప్రదక్షినల్లో వేగంగా (రమల్) నడవండని తన అనుచరులకు ఆదేశించారు... మరో ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు, “వేగంగా నడిచి, మేము బలంగా ఉన్నామని బహుదైవారాధకులకు చాటండి.” [సహీహ్ బుఖారీ vol 2:469, 470, 1602 (NE) & సహీహ్ ముస్లిం vol 2:991, 992, 1262 (NE)]

 

తవాఫ్ అల్ ఇఫాదా లో రమల్ ఉండదు

ఇబ్న్ అబ్బాస్ (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తవాఫ్ అల్ ఇఫాదా లోని ఏడు ప్రదక్షినల్లోనూ వేగంగా నడవలేదు. (సహీహ్ అబూ దావూద్ 2001 లో దీన్ని అల్ అల్బాని గారు ధృవీకరించారు)

 

రమల్ లో సిఫారసు చేయబడ్డ పనులు

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఒక భుజం (కుడి భుజం)పై నుంచి వస్త్రాన్ని జరిపి ఇలా అన్నారు: “మీరు బలహీనులు అని ప్రజలు భావించకుండా మెలగండి.” ఇబ్న్ అబ్బాస్ (రజి) ఉల్లేఖనం ప్రకారం, దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తన ఆఖరి హజ్ లో ఇలా చేశారు.

 

రమల్ (వడివడిగా నడవడం) మరియు కుడి భుజంపై నుండి వస్త్రాన్ని జరపడం వేరు. ఏడు ప్రదక్షినల్లోనూ కుడి భుజాన్ని వివస్త్రం చేయడం సున్నత్. కాని రమల్ విషయంలో- మొదటి మూడు ప్రదక్షినల్లో చేయడమే సున్నత్. మిగతా నాలుగు ప్రదక్షినల్లో మామూలుగా నడవాలి. ఇలా చేయడం సున్నత్ అనేది హజ్ మరియు ఉమ్రా కోసం చేసే తవాఫె ఖుదూం కే పరిమితం.

 

విద్వాంసుల అభిప్రాయం

షేక్ ఇబ్న్ బాజ్ (రహి) ఇలా అన్నారు: మక్కాలో చేరాక చేసే మొదటి తవాఫ్, తవాఫె ఖుదూం లో పురుషులు మొదటి మూడు ప్రదక్షినలలో వడివడిగా నడవాలి. ఇది ఉమ్రా అయినా, హజ్జె తమత్తు అయినా, కేవలం హజ్ అయినా, హజ్ మరియు ఉమ్రా (హజ్జె ఖిరన్) అయినా సరే. మిగతా నాలుగు ప్రదక్షినలలో మామూలుగా నడవాలి. ఈ తవాఫ్ (తవాఫె ఖుదూం)లో, తవాఫ్ పూర్తయ్యేవరకు కుడి భుజంపై నుండి వస్త్రాన్ని కాస్త జరపడం ముస్తహబ్. కాని మిగతా తవాఫ్ లలో ఇలా చేయకూడదు. (ఫతావా ఇబ్న్ బాజ్ 16/60) [2]

 

ఆధారాలు

[1] http://islamqa.info/en/ref/31819 (ఇంగ్లీష్)
[2] http://islamqa.info/en/ref/42153 (ఇంగ్లీష్)
 

 

345 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్