రమదాన్ సద్గుణాలు – హుసైన్ అల్ ఆష్ షేక్


ఇన్నల్ హమ్ద లిల్లాహ్ నహ్మదుహు వ నస్తయీనుహు వ నస్తగ్ ఫిరుహు, వ నఊజు బిల్లాహి మిన్ షురూరి అన్ ఫుసినా వ మిన్ సయ్యిఆతి ఆ’మాలినా. మయ్ యహ్దిహిల్లాహు ఫలా ముజిల్ల లహ్, వ మయ్ యుజ్లిల్–హు ఫలా హాదియ లహ్. వ అష్-హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వహ్-దహు లా షరీక లహ్, వ అష్-హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహ్.


إِنَّ الْحَمْدُ لِلَّهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ وَنَعُوذُ بِاللَّهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا مَنْ يَهْدِهِ اللَّهُ فَلَا مُضِلَّ لَهُ وَمَنْ يُضْلِلْ فَلَا هَادِيَ لَهُ وَأَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ وَأَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ

 

(ప్రశంసలన్ని అల్లాహ్ కే, మేము అతని సహాయం మరియు అతని క్షమ కోరుతున్నాము. మేము మా స్వంత ఆత్మల కీడు నుండి మరియు మా చెడు చేష్టల నుండి అల్లాహ్ శరణు కోరుతున్నాము. అల్లాహ్ రుజుమార్గం చూపించిన వానిని ఎవరూ అపమార్గం పట్టించలేరు. అదే అల్లాహ్ మార్గభ్రష్టతకు లోను చేసిన వాడిని ఎవరూ రుజుమార్గం చూపలేరు. అల్లాహ్ తప్ప ఆరాధ్యుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను, అల్లాహ్ ఒక్కడే, భాగస్వాములెవరూ లేరు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం అల్లాహ్ దాసుడు మరియు ప్రవక్త అని సాక్ష్యమిస్తున్నాను.)


[ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ حَقَّ تُقَاتِهِ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنْتُمْ مُسْلِمُون ]


ఓ విశ్వాసులారా! అల్లాహ్‌కు ఎంతగా భయపడాలో అంతగా భయపడండి. ముస్లింలు గా తప్ప మరణించకండి. సూరా ఆలి ఇమ్రాన్ 3:102


[ يَا أَيُّهَا النَّاسُ اتَّقُوا رَبَّكُمِ الَّذِي خَلَقَكُمْ مِنْ نَفْسٍ وَاحِدَةٍ وَخَلَقَ مِنْهَا زَوْجَهَا وَبَثَّ مِنْهُمَا رِجَالًا كَثِيرًا وَنِسَاءً وَاتَّقُوا اللَّهَ الَّذِي تَسَاءَلُونَ بِهِ وَالْأَرْحَامَ إِنَّ اللَّهَ كَانَ عَلَيْكُمْ رَقِيبًا ]


మానవులారా! మిమ్మల్ని ఒకే ప్రాణి నుంచి పుట్టించి,దాన్నుంచే దాని జతను కూడా సృష్టించి, ఆ ఇద్దరి ద్వారా ఎంతోమంది పురుషులను, స్త్రీలను వ్యాపింపజేసిన మీ ప్రభువుకు భయపడండి. ఎవరి పేరుతో మీరు పరస్పరం మీకు కావలసిన వాటిని అడుగుతారో ఆ అల్లాహ్‌కు భయపడండి. బంధుత్వ సంబంధాల తెగత్రెంపులకు దూరంగా ఉండండి. నిశ్చయంగా అల్లాహ్‌ మీపై నిఘా వేసి ఉన్నాడు. సూరా అన్ నిసా 4.1

 

[ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَقُولُوا قَوْلًا سَدِيدًا يُصْلِحْ لَكُمْ أَعْمَالَكُمْ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ وَمَنْ يُطِعِ اللَّهَ وَرَسُولَهُ فَقَدْ فَازَ فَوْزًا عَظِيمًا]

 

ఓ విశ్వాసులారా! అల్లాహ్‌కు భయపడండి. మాట్లాడితే సూటిగా మాట్లాడండి (సత్యమేపలకండి). తద్వారా అల్లాహ్‌ మీ ఆచరణలను చక్కదిద్దుతాడు. మీ పాపాలను మన్నిస్తాడు. ఎవరయితే అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకు విధేయత కనబరచాడో అతను గొప్ప విజయం సాధించాడు. ఖుర్ ఆన్ సూరా ఆహ్ జాబ్ 33:70 -71

 

విషయసూచిక

 

హమ్ద్

ప్రశంసలు అల్లాహ్ కే చెందుగాక. అన్ని ప్రపంచాలకు ప్రభువు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్ల్లం)పై, ఆయన కుటుంబం వారిపై, ఆయన అనుచరులపై అల్లాహ్ యొక్క కారుణ్యం వర్షించుగాక.

 

పరిచయం

ఓ ముస్లిములారా అల్లాహ్ కు భయపడండి. దాని వలన మీకే లాభాదాయకరం మరియు మీ అల్లాహ్ భాదలను దూరం చేస్తాడు.


ఓ ఇస్లామీయ సోదరులారా! ఒక గొప్ప నెల కారుణ్యం తో మీ ముందుకు రాబోతుంది. ఈ నెలలో నే మంచి పుణ్యాల రెట్లు పెరగడం పాపాల ను నిర్మూలిస్తుంది.

 

ఖుర్ ఆన్

కారుణ్యం గల ఈ నెలను అల్లాహ్ మనకు ప్రసాదించినందు వల్ల మనం అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలపాలి. కాబట్టి ఇదే మంచి సమయం పుణ్యాలు చేసుకొని స్వర్గాన్ని పొంది నరకం నుండి రక్షణ పొందండి. అల్లాహ్ ఖుర్ ఆన్ లో ఇలా సెలవిస్తున్నాడు “ఓ విశ్వసించినవారలారా! ఉపవాసాలుండటం మీపై విధిగా నిర్ణయించబడింది - మీ పూర్వీకులపై కూడా ఇదే విధంగా ఉపవాసం విధించబడింది. దీనివల్ల మీలో భయభక్తులు పెంపొందే అవకాశం ఉంది”. సూరా అల్ బఖర 2:183

 

హదీథ్

దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు. ఉపవాసం మరియు ఖుర్ఆన్ రెండు ప్రళయ దినాన విశ్వాసికి సహాయ పడతాయి. ఉపవాసం అల్లాహ్ ఇలా అంటుంది, ఓ అల్లాహ్ నేను ఇతనిని ఆహారం కు దూరంగా అలాగే శారీరకవాంచకు కూడా దూరంగా ఉంచాను. కాబట్టి ఆ వ్యక్తిని నా తరపున వదిలివేయండి. అలాగే ఖుర్ ఆన్ కూడా అల్లాహ్ తో ఇలా అంటుంది. నేను నీ దాసుడిని నిద్రకు దూరంగా ఉంచాను. కాబట్టి ఆ వ్యక్తిని నా తరపున వదిలివేయండి.(అహ్మద్ మరియు తబరాని)
ఓ ముస్లిములారా! రమదాన్ నెల పాప ప్రక్షాళన చేసుకునే నెల మరియు కారుణ్యం కురిసే నెల. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవిచించారు.రమదాన్ నెలలో స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి.నరక ద్వారాలు మూసి వేయబడతాయి. షైతానులు బందించబడతాయి. సహీహ్ అల్ బుఖారీ 1899 (విభాగం.3:123)


ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు. ఎవరైతే లైలతుల్ ఖద్ర్ రాత్రి అల్లాహ్ పై నమ్మకం ఉంచి ఆరాధిస్తారో వారి పూర్వపు పాపాలను అల్లాహ్ క్షమిస్తాడు. అలాగే రమదాన్ నెలలో ఉపవాసాలు పాటించిన వారి పూర్వపు పాపాలు కూడా క్షమించబడతాయి.సహీహ్ అల్ బుఖారీ 37 మరియు సహీహ్ ముస్లిం 760


కాబట్టి ఈ రమదాన్ నెల యొక్క సదవాకాశాన్ని ఉపయోగించుకొని మనలో ఉన్న లోపాలను దూరం చేసుకోవాలి. ఈ నెల లో మంచి పుణ్యాలను సంపాదించుకొని ఉత్తమమైన జీవితాన్ని గడపాలి.

 

ఆరాధన కేవలం అల్లాహ్ కోసమే

ఓ విశ్వాసులారా! పూర్వపు చరిత్ర ను చవి చూస్తే మార్పులు చేర్పుల వలన మనకు మంచి గుణపాటం ఉంది. ఎప్పుడైతే రమదాన్ మాసం మన ముందు వచ్చినప్పుడు పూర్వపు చరిత్ర లో ముస్లిం లు విజయం పొందిన బద్ర్ మరియు యర్మూక్ అలాగే అల్ కాదిసియ్యహ్ యుద్ధంలో జరిగిన విషయాలు మనకు తెలుపుతుంది. అప్పుడు ముస్లిం లు వారి గొపాతనం కోసం గాని వారి పేరు ప్రతిష్ట ల కోసం యుద్ధం చేయలేదు. కేవలం అల్లాహ్ మరియు ఆయన ధర్మమైన ఇస్లాం కోసం యుద్ధం చేశారు.


ప్రస్తుత ముస్లిం ల పరిస్థితి – ఎవరైతే వివిధ రకాల భాధలకు గురై ఉన్నారో వారిని ఆ దురావస్థల నుంచి బయటపడాలంటే వారు మన:స్పూర్తితో అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భోధించిన వాటిని(ఖుర్ ఆన్ మరియు హదీస్) విశ్వసించాలి. పూర్వపు ముస్లిం లు ఇలా విశ్వసించం వలన వారు అల్లాహ్ కారుణ్యం వలన సంతోషంతో ఉండేవారు కాని వారు ఇప్పుడున్న ముస్లిం ల పరిస్థితిలో ఉండేవారు కాదు.

 

దాతృత్వం కలిగి ఉండడం

ఓ విశ్వాసులారా! రమదాన్ నెల కారుణ్యం మరియు దాతృత్వం కురిసే నెల. ఇబ్నె అబ్బాస్ ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాలా దాతృత్వం కలవాడు. ఆ సమయంలో జిబ్రీల్ అలైహిస్సలాం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను కలిసేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రమదాన్ లోని ప్రతి రాత్రి నుంచి చివరి రాత్రి వరకు జిబ్రీల్ అలైహిస్సలాం కు పూర్తి ఖుర్ ఆన్ వినిపించేవారు. అపుడు ఆ సమయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాలా దాతృత్వం తో వుండేవారు. సహీహ్ అల్ బుఖారీ 6
ఓ సోదరులారా దాత్రుత్వంలో చాలా రకాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ దాతృత్వాన్ని కలిగి ఉండాలి. ఎవరైతే అల్లాహ్ దాసులపై దాతృత్వం చూపిస్తారో అల్లాహ్ వారికి శుభవార్త ను వినిపిస్తూ, వారిపై కూడా దాతృత్వం కురిపిస్తాడు. అన్నిటి కన్నా దాతృత్వం ఆకలితో అలమటిస్తున్న వారిపై చూపించాలి. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు. ఎవరైతే ఉపవాసం ఉన్న ఒక వ్యక్తికి అ వ్యక్తి ఉపవాసం వదలడానికి ఆహారం ను అందజేస్తారో వారికి కూడా ఆ రోజు ఉపవాసం ఉన్నంతా పుణ్యం లభిస్తుంది, దాని లో ఎటువంటి లోటు ఉండదు. సున్నన్ ఇబ్న్ మాజహ్ 1746 మరియు జామి అత్ తిర్మీజి 807

 

అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయడం

దాతృత్వం కు ఒక ఉదాహరణ ను పరిశీలిస్తే ఒక నిజాయితి గల వ్యక్తి ఒక రోజు ఉపవాసం ఉన్నాడు. ఆ రోజు ఆ వ్యక్తి ఉపవాసం ను విరమించేటప్పుడు, ఒకానొక వ్యక్తి అల్లాహ్ ఋణం ఇచ్చే వారు ఎవరైనా ఉన్నారా. అప్పుడు ఆ వ్యక్తి ఇలాంటి అవకాశాన్ని ఏ దాసుడు వదులుకుంటాడు అని ఆ ఉపవాసి తన భోజనాన్ని తీసుకెళ్ళి ఒక భిక్షవాడికి వేశాడు. ఆ ఉపవాసి ఆ రాత్రి ఆకలి తోనే నిదురపోయాడు.


అల్లాహ్ ఖుర్ ఆన్ ఇలా సెలవిస్తున్నాడు. తాము అమిత అవసరంలో ఉన్నప్పటికీ తమపైన వారికే ప్రాధాన్యతనిస్తారు. వాస్తవానికి తమ స్వార్థ ప్రియత్వం (పేరాశ) నుండి రక్షించబడినవారే కృతార్థులు. అల్ హష్ర్ 59:9


ఓ ముస్లిములారా! ప్రపంచంలో చాలా వారి స్థలాల నుండి తరిమివేయబడిన పేద ముస్లింలు, చాలా మంది చంపబడుతున్నారు మరియు బహిష్కరించబడినవారున్నారు, వారి కుటుంబాలను కూలగోట్టేస్తున్నారు. కాబట్టి వారిని దృష్టిలో ఉంచుకొని వారికి ఆహారంను, బట్టలను(చొక్కాలు), మందులను (మెడిసిన్) ను అందజేయాలి. అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా సెలవిస్తున్నాడు. (అల్లాహ్‌ మార్గంలో) మీరు ఏది ఖర్చు చేసినా ఆయన దానికి (సంపూర్ణ) ప్రతిఫలం ఇస్తాడు. ఆయన అందరికన్నా ఉత్తమ ఉపాధి ప్రదాత. సూరా సబా 34:39


ప్రపంచంలోని ప్రతి చోట హింసించబడుతున్న ముస్లిం సోదరుల కోసం కూడా ప్రార్థన చేయండి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు. ముగ్గురు వ్యక్తుల ప్రార్థన ఎప్పటికీ అల్లాహ్ ముందు తిరస్కరించబడదు. వారిలో ఎవరైతే ఉపవాసి ఉపవాసం విరమించే సమయంలో చేసే ప్రార్థన. జామి అత్ తిర్మీజి 3598


ఓ విశ్వాసులారా! రెండు పవిత్ర మస్జీదులైన ప్రాంతంలో చాలా సులువుగా ఇస్లామీయ వాతావరణాన్ని మరియు ఇస్లామీయ నిర్నాయాలను ఉపయోగిస్తున్నారు. వివిధ రకాల పనులకు గాను ముస్లిం సంస్థలు అక్కడ ఒకరినొకరు గౌరవభావంతో కలిసి కట్టుగా పని చేస్తాయి. ఇలాంటి ముస్లిం సంస్థలు ప్రత్యేకంగా ఈ రమదాన్ నెలలో సహాయం చేయడం వలన దాతృత్వం మరియు కారుణ్యం కు ప్రతినిధి.


దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు. దానం చేస్తే మీ సంపాదనలో ఏమీ తరగదు, ఇంకా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరించారు. ఒక చిన్న కర్జూరపు దానం ముక్కనైన దానం చేసి నరకం నుంచి కాపాడుకోండి. సహీహ్ ముస్లిం 1016

ఉపవాసపు నిభందనలు

ఓ ముస్లిములారా! ఉపవాసం ఒక డాలు వంటిది, ఎందుకనగా ఉపవాసం అన్ని పాపాల నుంచి దూరంగా ఉంచుతుంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు. ఉపవాసం ఒక డాలు వంటిది, ఎవరైన ఉపవాసం ఉన్నప్పుడు వారితో ఏవరైన గొడవ పడడానికి వస్తే వారితో ఇలా అనండి, నేను ఈ రోజు ఉపవాసం ఉన్నాను అని చెప్పేయండి. సహీహ్ అల్ బుఖారీ 1894


ఉపవాసం యొక్క ప్రత్యేకత ఏమిటంటే వారి ఆత్మలను పరిశుద్ధ పరుచుకొని వారి అవయవాలు కూడా నియంత్రణ కు గురై ఉంటాయి. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు. ఎవరైతే ఉపవాసం ఉండి కూడా తన తప్పునడతను సరిచేసుకోకపోతే అల్లాహ్ కు వారిని ఆహారం మరియు నీటి నుంచి దూరంగా ఉంచాలనుకోవడం ఏ మాత్రం ఇష్టపడడు. సహీహ్ అల్ బుఖారీ 1903

 

ఖుర్ ఆన్ పారాయణం

ఓ ముస్లిం సోదరులారా! ఖుర్ఆన్ పారాయణం చేసేవారికి అల్లాహ్ సుబ్ హానహు వత ఆలా ఇహపరలోకాల్లో ఉన్నత హోదాన్ని ప్రసాదిస్తాడు. ప్రతి విశ్వాసికి ఖుర్ఆన్ లాభదాయకమైనది. అజ్ జుహ్రీ ఉల్లేఖనం ప్రకారం, రమదాన్ నెల ఖుర్ఆన్ పారాయణం చేసే నెల, మరియు దానధర్మాలు చేసే నెల. కొంతమంది పుణ్యపురుషులు పూర్తి ఖుర్ ఆన్ ను ఏడు రోజులలోనే చదివేవారు.


ఖుర్ఆన్ పారాయణం చేసేవారు దాని అర్థం చేసుకుంటూ ఖుర్ఆన్ ఆజ్ఞ లపైనే నడుచుకోవాలి. ఖుర్ఆన్ పారాయణం చేయడం వలన ఎటువంటి శక్తిగాని, మహిమలు గాని లభించదు. ఖుర్ఆన్ మరియు సున్నత్ లపై ఆచరిస్తే మంచి ఆరోగ్యాన్ని(బలాన్ని) మరియు శాంతి ని పొంది అలాగే అల్లాహ్ శిక్ష నుంచి విముక్తి పొందుతారు. అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా సెలవిస్తున్నాడు. నిశ్చయంగా ఈ ఖుర్‌ఆన్‌ అన్నిటికంటే సవ్యమైన మార్గాన్ని చూపిస్తుంది. మంచి పనులు చేసే విశ్వాసులకు గొప్ప పుణ్యఫల ముందన్న శుభవార్తను అది వినిపిస్తుంది. సూరా అల్ ఇస్రా(బనీ ఇస్రాయిల్) 17:9


ముగింపు

ఓ విశ్వాసులారా! రమదాన్ నెల అల్లాహ్ కారుణ్యం పొందే నెల. ఈ కారుణ్యం ఎందుకంటే ఈ నెలలో విశ్వాసులు ప్రార్థన(దుఆ) వలన , రాత్రి ఆరాధనల వలన అల్లాహ్ కు చేరువవుతారు. సోదరులారా ఎవరైతే తరావీహ్ నమాజు లో ఇమాం హో పాటు చివరి వరకు పాల్గొంటారో వారి గురించి లెక్కల పత్రం లో వ్రాయబడుతుంది.

 

సారాంశం

  1. రమదాన్ రాక
     
  2. రమదాన్ నెల కారుణ్యం పొందే నెల .
     
  3. రమదాన్ యొక్క సద్గుణాలు
     
  4. రమదాన్ నెలలో మన చేసే స్వయం కృషి
     
  5. రమదాన్ నెల గొప్ప సాఫల్యం పొందే నెల
     
  6. నేటి ముస్లిం సమాజం పరిస్థితి
     
  7. రమదాన్ నెల దాతృత్వం కలిగిన నెల. [2]

 

ఇవి కూడా చూడండి : మిగతా ఖుత్భాలు

  • జుమా ఖుత్బా ఆకృతి
     
  • లైలతుల్ ఖద్ర్ (అవతరణ రాత్రి) – షేక్ ముహమ్మద్ అల్ ఉథైమీన్
     
  • రమదాన్ వీడ్కోలు – అబ్దుర్ర్ రహ్మాన్ అస్ సుదైస్
     
  • జకాతుల్ ఫిత్ర్ నియమాలు - ముహమ్మద్ సాలిహ్ అల్ ఉథైమీన్
     
  • ఈదుల్ ఫిత్ర్ వీడ్కోలు – ముహమ్మద్ అల్ ఉతైమీన్
     
  • ఉపవాసం- దైవానికి చేరువవడం – సాలిహ్ ఇబ్న్ హుమైద్

 

ఆధారాలు

[1] http://d1.islamhouse.com/data/en/ih_books/single/en_selected_friday_sermons.pdf

[2] http://www.alminbar.com/khutbaheng/2234.htm
 

 

1710 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్