రజి అల్లాహు అన్హుమ్


రజి యల్లాహు అన్హుం (బహువచనం), రజి యల్లాహు అన్హు (ఏకవచనం). దీని అర్ధం ‘అల్లాహ్ వారితో సంతృప్తి చెందుగాక.’ సహాబా(దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అనుచరులు) పేర్ల తరువాత గౌరవసూచకంగా ‘రజి’ అని వాడుతారు.[1]

 

పురుషులైన సహాబా(దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అనుచరులు)కోసం రజి అల్లాహు అన్హు మరియు స్త్రీలైన సహాబా కోసం రజి అల్లాహు అన్హా వాడుతారు.[2]

 

అరబీرضي الله عنهم (బహువచనానికిandرضي الله عنه (ఏకవచనానికి)

 

విషయసూచిక

 

ఖుర్ఆన్

ప్రతి ముస్లిం – పురుషుడైనా, స్త్రీ అయినా – సహాబాను (దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అనుచరులు) విశ్వసించాలి. అల్లాహ్ఖుర్ఆన్ లో ఇలా సెలవిచ్చాడు: “ముహాజిర్లలో, అన్సార్లలో ప్రప్రథమంగా ముందంజ వేసిన వారితోనూ, తరువాత చిత్తశుద్ధితో వారిని అనుసరించిన వారితోనూ అల్లాహ్‌ ప్రసన్నుడయ్యాడు. వారు అల్లాహ్‌ పట్ల ప్రసన్నులయ్యారు. క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలను అల్లాహ్‌ వారికోసం సిద్ధం చేసి ఉంచాడు.  వాటిలో వారు కలకాలం ఉంటారు. గొప్ప సాఫల్యం అంటే ఇదే.(ఖుర్ఆన్, సూరా తౌబా 9:100)[3]

 

సహాబా హోదా

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అనుచర సమాజంలో సహాబా(దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అనుచరులు) అందరికంటే ఉత్తములు. వారి తరువాత తాబయీన్, తబే తాబయీన్. అబ్దుల్లా రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “ప్రజల్లో అందరికంటే ఉత్తములు, నా కాలపు ప్రజలు. ఆ తరువాత వారి తరువాతి కాలపు ప్రజలు, వారి తరువాత వారి తరువాతి కాలం ప్రజలు. ఆ తరువాత వారి తరువాతి కాలం వారు. ఆ తరువాత వచ్చే ప్రజల సాక్ష్యం వారి ప్రమాణాల్ని మించుతాయి  మరియు వారి ప్రమాణాలు సాక్ష్యాల్ని మించుతాయి.” (సహీహ్ బుఖారీ vol 5:3, 8:437 & సహీహ్ ముస్లిం 6159)[4]

 

ఆధారాలు

[1] http://www.islamic-dictionary.com/index.php?word=radhiallahu+anhum(ఇంగ్లీష్)

[2] http://www.missionislam.com/kidsclub/islamicterms.htm(ఇంగ్లీష్)

[3] http://quran.com/(ఇంగ్లీష్)

[4] http://www.sunnah.com/(ఇంగ్లీష్)

ఇస్లాంలో సహాబా వ్యాసం కూడా చూడండి.

 

897 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్