మస్జిద్ ఎ ఖుబా - MASJID E QUBAఅల్లాహ్ ను ఆరాధించే చోటును (కట్టడాన్ని) మస్జిద్ అంటారు. ఇస్లామీయ చరిత్రలో మస్జిద్ కు చాలా ప్రాముఖ్యత ఉంది. మస్జిద్ సమాజానికి కేంద్ర బిందువుగా వుంటుంది. అంతే కాక దాని వల్ల చుట్టుప్రక్కల ఊళ్లు ఏర్పడుతాయి. ప్రస్తుత కాలంలో ప్రత్యేకంగా ముస్లిం దేశాలలో ప్రతి వీధికి ఒక మస్జిద్ కనపడుతుంది. దీని వల్ల ముస్లింలకు ఐదు పూటల నమాజు చేయడానికి చాలా సౌకర్యం కలుగుతుంది.
ప్రతి మస్జిద్ లో ఒక “మిహ్రాబ్”(ప్రత్యేక స్థానం) ఉంటుంది. అది మక్కా దిశను సూచిస్తుంది. ముస్లింలు నమాజ్ ఆ దిశ వైపే చేస్తారు. సాధారణంగా ప్రతి మస్జిద్ లో (మింబర్) ఒక వేదిక ఉంటుంది. దానిపై నిలబడి ఇస్లామీయ విద్వాంసులు ముస్లింలకు సంబోధిస్తారు (ఉపన్యసిస్తారు). [1]
చరిత్రమదీనాలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మొట్ట మొదట నిర్మించిన మస్జిద్, మస్జిదె ఖుబా.
ఇబ్నుల్ ఖయ్యిం (రహి) ప్రకారం (జాద్ అల్ మాద్ 3/58)లో దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మదీనాలో ప్రవేశించిన సందర్భాన్ని వివరిస్తూ: దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం రాకపై సంతోషపడుతూ, ముస్లింలు తక్బీర్ (అల్లాహు అక్బర్) చెబుతూ, ఆయనను కలవడానికి వెళ్లారు... దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఖుబా వరకు వెళ్లి బనూ అమ్ర్ ఇబ్న్ ఔఫ్ వద్ద ఆగారు. వారి మధ్య దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం పద్నాలుగు రోజులు ఆగారు. అప్పుడే ఖుబా మస్జిద్ ను స్థాపించారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ప్రవక్తగా నియమించబడ్డాక స్థాపించిన మొదటి మస్జిద్ ఇది.
ప్రఖ్యాత ఇస్లామీయ విద్వాంసులు ముహమ్మద్ అల్ అమీన్ అల్ శంఖీతి (రహి) ఇలా అన్నారు: ప్రజానికానికి నిర్మించబడ్డ మస్జిద్ లలో, మొట్ట మొదటి మస్జిద్, మస్జిదె హరాం. ముస్లింల ద్వారా నిర్మించబడ్డ మొదటి మస్జిద్, మస్జిదె ఖుబా. మస్జిదుల్ హరాం ఇబ్రాహీం అలైహిస్సలాం ద్వారా నిర్మించబడ్డది. మస్జిదె ఖుబా అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ద్వారా నిర్మితమయింది. మస్జిదె హరాం ప్రదేశాన్ని అల్లాహ్ నిర్ణయించాడు.
ప్రదేశంఇది మదీనాకు (సౌదీ అరేబియా) దక్షిణ దిశలో ఉంది. దీని ఆకృతి ప్రస్తుత కాలానిది. పాత కాలపు కట్టడం ఏది ఇప్పుడు కానరాదు.
విస్తరణముస్లింలు ఖుబా మస్జిద్ కు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ముందుగా ఉస్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్ (రజి), ఆ తరువాత ఉమర్ ఇబ్న్ అబ్ద్ అల్ అజీజ్ (రజి) ఈ మస్జిద్ ను పునరుద్ధరించారు. ఇతర ఖలీఫాలు కూడా దీన్ని పునరుద్ధరించారు. దీని ఆఖరి పునరుద్ధరణ 1406 AH లో జరిగింది.
555 AH సంవత్సరంలో కమాలు ద్దీన్ అల్ ఇస్ఫహాని ఈ మస్జిద్ కు అనేక విధాలుగా తీర్చిదిద్దారు. ఆ తరువాత 671, 733, 840, 881 AH లలో ఎన్నో మార్పులు చేర్పులు జరిగాయి. సుల్తాన్ అబ్దుల్ మాజిద్ కాలంలో (1245 AH) దీని తాజా పునరుద్ధరణ జరిగింది.
ప్రస్తుత కాలంలో సౌదీ ప్రభుత్వం (హజ్ కార్యకలాపాలు చూసే సంస్థ) ఈ మస్జిద్ బాధ్యతలను తీసుకోని పాత కట్టడంలో ఎన్నో కొత్త మార్పులు చేసింది. ఇందులో 20 వేల కంటే ఎక్కువ మంది నమాజ్ చేసే అవకాశం ఉంది. 1984 లో సౌదీ రాజు ఫహద్ బిన్ అబ్దుల్ అజీజ్ దీని విస్తరణకు పునాది వేశారు. రెండు సంవత్సరాల తరువాత విస్తరణ పూర్తి అయ్యాక, ఆయనే దీన్ని శంకు స్థాపన చేశారు.
ప్రాంతంనమాజ్ చదివే ప్రాంతం 5035 స్క్వేర్ మీటర్లు గలదు. మస్జిద్ పూర్తి స్థలం అన్ని సదుపాయాలతో కలిపి 13,500 స్క్వేర్ మీటర్లు ఉంది.
మస్జిద్ ప్రాంగణంలో ఎన్నో ద్వారాలు ఉండేవి. ఉత్తర ద్వారం స్త్రీల కోసం ప్రత్యేకించబడింది. ఈ మస్జిద్ కు నాలుగు మినార్లు ఉన్నాయి. 56 గోపురాలు ఉన్నాయి. మస్జిద్ కు ఆనుకొని ఇమాం మరియు ముఅజ్జిన్ ల ఇళ్ళు, ఓ గ్రంథాలయం, రక్షక భటుల నివాస స్థలాలు ఉన్నాయి. ఇవి 112 స్క్వేర్ మీటర్ ల స్థలంలో ఉన్నాయి. వాణిజ్య కేంద్రంలో 450 స్క్వేర్ మీటర్లలో 12 దుకాణాలు ఉన్నాయి. మస్జిద్ కు 7 ముఖ ద్వారాలు మరియు 12 అనుబంధ ద్వారాలు ఉన్నాయి.
ఈ మస్జిద్ లో పురుషుల కొరకు 64 మరియు స్త్రీల కోసం 32 మరుగుదొడ్లు కలవు. 42 వుజూ స్థానాలు కలవు. మస్జిద్ లో చల్లదనం కోసం మూడు సెంట్రల్ ఏసీలు ఉన్నాయి. ఒక్కొక్క ఏసీ ఒక మిలియన్ ఎనభై వేల థర్మల్ యూనిట్ల సామర్ధ్యం గలది. ఖుబా మస్జిద్ ఓ మైలురాయి లాంటిది. దీని తెల్ల కట్టడం చాలా దూరం నుంచి కూడా కనిపిస్తుంది. [2] [3]
ఖుర్ఆన్అల్లాహ్ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంను మస్జిదె ఖుబాలో ప్రార్ధించండని ప్రోత్సహించారు. ఎందుకంటే, ఈ మస్జిద్ భయభక్తుల పునాదిపై నిర్మించబడింది. అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా సెలవిచ్చాడు: “అయితే తొలినాటి నుంచే భయభక్తుల పునాదిపై నిర్మించబడిన మస్జిదు నువ్వు నిలబడటానికి అన్ని విధాలా తగినది. బాగా పరిశుద్ధతను పొందటాన్ని ఇష్టపడే వారు అందులో ఉన్నారు. బాగా పరిశుద్ధతను పాటించేవారిని అల్లాహ్ ప్రేమిస్తాడు.” (ఖుర్ఆన్ సూరా తౌబా 9:108)
హదీస్దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “ఎవరైతే తన ఇంట్లో పరిశుద్ధులై, ఖుబా మస్జిద్ లో నమాజ్ చేస్తారో, వారికి ఉమ్రా చేసినంత ప్రతిఫలం లభిస్తుంది.” (సునన్ ఇబ్న్ మాజా 1476, 1477 & జామి అత్ తిర్మిజి 324)
దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం నడుస్తూ లేదా స్వారి చేస్తూ ప్రతి శనివారం మస్జిదె ఖుబాకు వెళ్ళేవారు. అక్కడ రెండు రకాతులు నమాజ్ చేసేవారు. (సహీహ్ బుఖారీ vol 2:1191, 1192 & సహీహ్ ముస్లిం 1399)
మస్జిదె ఖుబాను సందర్శించడం మరియు నమాజ్ చేయడం సున్నత్మదీనాకు వెళ్ళే వారు, అక్కడ నివసించే వారు మస్జిదె ఖుబాకు వెళ్ళడం మరియు అక్కడ నమాజ్ చేయడం వల్ల సున్నత్ ను పాటించిన మరియు ఉమ్రా చేసిన ప్రతిఫలం లభిస్తుంది. సహల్ ఇబ్న్ హనీఫ్ ఉల్లేఖించారు: దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “ఎవరైతే ఈ మస్జిద్ – అంటే మస్జిదె ఖుబా – కు వచ్చి నమాజ్ చేస్తారో, వారికి ఉమ్రాకు సమానమైన ప్రతిఫలం లభిస్తుంది.” (ముస్నద్ అహ్మద్ 3/437; అల్ నసాయి 699; షేక్ అల్బాని గారు దీన్ని సహీహ్ అల్ తర్ఘీబ్ 1180,1181 లో ధృవీకరించారు).
సహీహ్ బుఖారిలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ప్రతి శనివారం కాలినడకన లేదా స్వారీపై మస్జిదె ఖుబాకు వెళ్లి, రెండు రకాతుల నమాజ్ చేసేవారు అని ఉంది. (సహీహ్ బుఖారీ 1191, సహీహ్ ముస్లిం 1399) [4]
ఇంకా చూడండి Masjid ; Masjid E Aqsa; Masjid E Haram; Masjid E Nabwi; Makkah; Madina; Expansion of Masjid Al Haram; Allah; Messenger of Allah;
ఆధారాలు[1] http://www.islamreligion.com/articles/2748/(ఇంగ్లీష్) [2] http://islamqa.info/en/70467(ఇంగ్లీష్) [3] http://www.arabnews.com/news/600996(ఇంగ్లీష్) [4] http://abdurrahman.org/umrah/virtues-masjid-quba.html(ఇంగ్లీష్)
|
.