మదీనా - MADINA


మదీనాను ముందు యత్రిబ్ అనేవారు. కాని తరువాత దీని పేరు మదీనతున్నబీ (ప్రవక్త పట్టణం), మదీనా తయ్యిబా (పవిత్ర పట్టణం), మదీనతున్ నబవి (ప్రవక్త పట్టణం)గా మారింది. సాధారణంగా దీన్ని మదీనా (పట్టణం) అంటారు. మదీనా, ఇస్లాంలో మక్కా తరువాత మదీనా రెండో పవిత్ర పట్టణం.

 

విషయసూచిక

 

పరిచయం

మదీనా, మక్కాకు 447 కిలో మీటర్ ల దూరంలో ఉత్తర దిశలో ఉంది. ఇది ఇస్లాంలోని పవిత్ర నగరాల్లో రెండో స్థానంలో ఉంది. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంను మరియు ఆయన సహచరులను (సహాబాలను) మక్కా అవిశ్వాసులు చాలా ఘోరంగా హింసించారు. అప్పుడు అంటే, 622 CE లో దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తన అనుచరులతో కలిసి మదీనా పట్టణానికి వలస వెళ్లారు. మదీనా వాసులు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మరియు ఆయన అనుచరులను చాలా ప్రేమతో ఆహ్వానించారు. ఇస్లామీయ సామ్రాజ్యం మొట్ట మొదటగా మదినాలోనే ఆరంభమయింది.

 

ప్రాముఖ్యత మరియు ప్రాధాన్యత

మదీనా దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం పట్టణం. ఈ పట్టణంలో ఖుర్ఆన్ అవతరించింది. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అనుచరులు ఈ పట్టణం నుండే ఇస్లామీయ రాజ్యాన్ని నడిపారు. ఇస్లామీయ రాజ్యపు మొదటి పట్టణం ఇదే.  దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం బోధనలను వ్యాపింపజేయడానికి ఇస్లామీయ సేనలు- ఈజిప్ట్, పర్షియా, సిరియా మొదలైన దేశాలకు, మదీనా నుండే వెళ్ళాయి. ఈ పట్టణంలోనే దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం సమాధి ఉంది. [1]

 

ప్రదేశం

మదీనా పట్టణం సౌదీ అరేబియాలోని పశ్చిమ దిశలో ఉంది. ఇది మక్కా పట్టణానికి దాదాపు 270 మైళ్ళ దూరంలో ఉంది.

 

చరిత్ర

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంకు ముందు మదీనాను యత్రిబ్ అని పిలిచేవారు. మదీనా భూమి సారవంతమైనది. ఈ పట్టణం వ్యాపార లావాదేవీలకు చాలా ముఖ్యమైనది. యత్రిబ్ (మదీనా) వాసులు సంవత్సరానికి ఒకసారి మక్కాకు తీర్థయాత్రకు వచ్చేవారు. అక్కడ వారు ‘మనత్’, రెండు పట్టణాల ముఖ్య దేవత మరియు విధి దేవతను పూజించేవారు. ఇస్లాంకు పూర్వం ఔస్ మరియు ఖజ్రజ్, రెండు అరబ్ జాతులు మదీనాలో ఉండేవి.


హిజ్రత్(దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంకు మక్కా నుండి మదీనా వలస) నుండి ఇస్లామీయ కాలెండర్ మొదలవుతుంది. కొన్ని సంవత్సరాల వరకు మదీనా ముస్లిం రాజ్యాల రాజధానిగా ఉండింది. 661 CE తరువాత ముస్లింల రాజధానిగా డమాస్కస్ (ఉమయ్యద్ ఖలీఫాల రాజధాని) ఎదిగింది. ఆ తరువాత మదీనా ముస్లిం ప్రపంచంలో రెండో పవిత్ర పట్టణంగా ప్రాముఖ్యత చెందింది. [2]

 

మస్జిదె నబవి

మస్జిదె నబవి ప్రపంచంలో రెండో అతి పెద్ద మస్జిద్. ఇది మదీనాలో ఉంది. ఇది ఇస్లాం ప్రకారం రెండో పవిత్ర స్థానం. ఇక్కడ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం సమాధి ఉంది. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మదీనాకు (హిజ్రత్) వలస వెళ్ళాక, ఆయన ఆదేశంపై ఈ మస్జిద్ నిర్మించబడింది. దీనిపై ఉన్న పచ్చని గోపురం (ఇది మస్జిద్ మధ్యలో ఉంది) చాలా ప్రసిద్ది చెందింది.


మొదట కట్టిన మస్జిద్ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇంటికి పక్కన ఉండేది. అది సామాజిక కేంద్రంగా, న్యాయస్థానంగా, ధార్మిక విద్య సంస్థగా – ఇలా పలు రకాలుగా ఉపయోగపడేది. ఇది ఖర్జూరపు మొండాలతో, మట్టి గోడలతో నిర్మితమయింది. దీనికి మూడు ద్వారాలు ఉండేవి – బాబ్ రహ్మహ్ (కారుణ్యపు ద్వారం) దక్షిణ దిశలో, బాబ్ జిబ్రీల్ (జిబ్రీల్ ద్వారం) పశ్చిమ దిశలో, బాబ్ అల్ నిసా (స్త్రీల ద్వారం) తూర్పు దిశలలో ఉండేవి. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంకు మస్జిద్ కు దక్షిణ దిశలో నీడ గల చోటును నిర్మించారు. దాని పేరు ‘సుఫ్ఫా’, అది కొత్తవారికి మరియు బీదవారికి నివాస స్థలముగా ఉపయోగపడేది. నమాజ్ చేసే దిశ మొదటి పదహారు నెలల వరకు జెరూసలెం (ఉత్తర దిశ) వైపు ఉండేది. ఆ తరువాత అల్లాహ్ ఆజ్ఞతో దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఖిబ్లా (నమాజ్ చేసే దిశ)ను మక్కాలోని కాబా వైపు మార్చారు.  

 

మస్జిదె నబవి సద్గుణాలు

అబూ హురైరా (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “నా మస్జిద్ లో నమాజ్ చేయడం ఇతర మస్జిద్ లలో నమాజ్ చేయడం కంటే వెయ్యి రెట్లు మేలైనది, కాకపోతే  మస్జిదె హరాం తప్ప.” (సహీహ్ బుఖారీ 1190)


అబూ హురైరా (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “మూడు మస్జిద్ లు తప్ప ఇతర మస్జిద్ లకు ప్రతిఫలం రీత్యా ప్రయాణం చేయకండి. అవి – మస్జిదుల్ హరాం, దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మస్జిద్, మస్జిదె అల్ అఖ్సా (జెరూసలెం మస్జిద్).” (సహీహ్ బుఖారీ 1189) [3]

 

మదీనా చుట్టుప్రక్కల గల మస్జిద్ లు

సౌదీ అరేబియాలో చారిత్రక ప్రదేశాల గురించి వివరాలు:

 • మస్జిదె జుమా
   
 • మస్జిదె ఖుబా
   
 • మస్జిదె ఖిబ్లతైన్
   
 • మస్జిదె ఘమామ
   
 • ఇతర మస్జిద్ లు
   
 • అల్ బఖి

 

మస్జిదె జుమా

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మదీనాకు వెళ్ళేటప్పుడు మొదటి జుమా నమాజు చదివిన మస్జిద్.

 

మస్జిదె ఖుబా

ఇస్లాంలో ఇది మొట్ట మొదటి మస్జిద్. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మదీనా చేరాక, స్వయంగా దీని పునాది వేశారు.

“దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు:  ‘మస్జిదె ఖుబాలో నమాజ్ చదివిన వ్యక్తికి, ఉమ్రా చేసినంత ప్రతిఫలం లభిస్తుంది.” (సునన్ ఇబ్న్ మాజా vol 1, బుక్ 5, హదీస్ 1412)

 

మస్జిదె ఖిబ్లతైన్

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఈ మస్జిద్ లో నమాజ్ చదువుతున్నప్పుడు, నమాజ్ ఖిబ్లాను (దిశను) జెరుసలెం నుండి మక్కాలోని కాబా వైపు చేయమని అల్లాహ్ ఆదేశించాడు. ఈ మస్జిద్ పేరుకు అర్ధం, ‘రెండు ఖిబ్లాల (దిశల) మస్జిద్.’

 

మస్జిదె ఘమామ

ఈ మస్జిద్ లో దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఈద్ నమాజ్ చేశారు. ఈ మస్జిద్ మస్జిదె నబవికు దగ్గరగా ఉంది.

 

ఇతర మస్జిద్ లు

మదీనాలోని అబూ బకర్ అల్ సిద్దీఖ్ మస్జిద్.


మస్జిదె ఘమామ సమీపంలో మూడు ఇతర మస్జిద్ లు ఉన్నాయి.

 • మస్జిద్ అబూ బకర్
   
 • మస్జిద్ అలీ
   
 • మస్జిద్ ఉమర్ అల్ ఫారూఖ్

అల్ బఖి (స్మశాన వాటిక)

బఖీలో ఉన్న వారి కోసం చేయవలసిన దుఆ:

 السَّلاَمُ عَلَيْكُمْ دَارَ قَوْمٍ مُؤْمِنِينَ وَأَتَاكُمْ مَا تُوعَدُونَ غَدًا مُؤَجَّلُونَ وَإِنَّا إِنْ شَاءَ اللَّهُ بِكُمْ لاَحِقُونَ اللَّهُمَّ اغْفِرْ لأَهْلِ بَقِيعِ الْغَرْقَدِ ‏"‏

అర్ధం: ఇక్కడ నివసిస్తున్న విశ్వాసులారా, మీ పై శాంతి కురియుగాక. మీకు వాగ్దానం చేయబడ్డది రేపు మీకు దొరుకుతుంది, కాస్త ఆలస్యంగా దొరుకుతుంది; అల్లాహ్ తలిస్తే మేము మిమ్మల్ని కలుస్తాము. ఓ అల్లాహ్, బఖీ అల్ ఘర్ ఖద్ లోని వారికి మన్నింపు ప్రసాదించు. (సహీహ్ ముస్లిం 974 a [NE 2126])


కొందరు అల్ బఖీ అల్ ఘర్ ఖద్ (స్మశాన వాటిక)ను జన్నతుల్ బఖీ అని అంటారు. ఇలా అనడం సరిఅయినది కాదు. ఇందులో పాతిపెట్టబడ్డవారు అందరూ, స్వర్గానికి వెళ్తారని ప్రజలు భావిస్తున్నారు. ఇందులో పాతిపెట్టబడ్డవారు అందరూ, స్వర్గానికి వెళ్తారని ఖచ్చితంగా ఎలా చెప్పగలం. దీనికి ఏదైనా ప్రమాణం ఉందా? ఎవరైతే ముస్లింగా, మువహ్హిద్ గా (ఏకేశ్వరోపాసన చేసేవానిగా) మరణిస్తారో, వారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం షఫాత్ (సిఫారసు పొందుతారనేది సత్యం. “ఎవరైతే మదీనాలో మరణిస్తారో, మరణించనివ్వండి. మదీనాలో చనిపోయిన వారి కోసం నేను సిఫారసు చేస్తాను.” (సహీహ్ అత్ తర్ఘీబ్ వత్ తర్హీబ్ 1192 – షేక్ అల్బాని దీన్ని ధృవీకరించారు)   

 

كنَّا معَ رسولِ اللَّهِ في بعضِ أسفارِهِ، فقالَ إنَّ جبريلَ عليْهِ السَّلامُ أتاني وإنَّ ربِّي خيَّرني بينَ خَصلتينِ بينَ أن يدخلَ نِصفُ أمَّتيَ الجنَّةَ وبينَ الشَّفاعةِ فاخترتُ الشَّفاعةَ وفيهِ عن مِعقلِ بنِ يسارٍ عنِ النَّبيِّ اثنانِ لا تنالُهما شفاعَتي ومَن ماتَ في المدينةِ كنتُ لَهُ شفيعًا المصدر: تخريج كتاب السنة - الصفحة أو الرقم 829

 

ఈ స్మశాన వాటికలో ఎందరో దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం సహచరులు, భార్యలు, కూతుళ్ళు పాతిపెట్టబడ్డారు. ఈ స్మశాన వాటిక మస్జిదె నబవి ప్రాంగణానికి కొంత దూరంలో ఉంది. [4][5]

 

ఏదైనా స్మశాన వాటికలో చదవాల్సిన దుఆ

‘ఓ సమాధుల్లో ఉన్న ముస్లిం మరియు విశ్వాసులారా,  మీ అందరిపై శాంతి కురియుగాక. అల్లాహ్ తలిస్తే, మేము మిమ్మల్ని కలుస్తాము. మేము మా కోసం మరియు మీ కోసం మంచి జరగాలని అల్లాహ్ ను వేడుకుంటాము.’

 

ఆధారాలు

[1] http://www.saudinf.com/main/a84.htm(ఇంగ్లీష్)

[2] http://www.hajinformation.com/main/h201.htm(ఇంగ్లీష్)

[3] http://www.sunnah.com/bukhari/20(ఇంగ్లీష్)

[4] http://www.hajinformation.com/main/h202.htm(ఇంగ్లీష్)

[5] http://www.hajinformation.com/main/h2026.htm(ఇంగ్లీష్)

 

467 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్