మఖామె ఇబ్రాహీం - MAQAM E IBRAHIM


కాబా నిర్మించేటప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం ఉపయోగించిన రాయిని మఖామె ఇబ్రాహీం అంటారు. ఈ రాయి మీద ఇబ్రాహీం అలైహిస్సలాం పాదాల గుర్తులు ఉన్నాయి. ఈ రాయి కాబాకు ఉత్తర దిశాన గాజు గోడల మధ్య ఉంది. దీని మీద ఇబ్రాహీం అలైహిస్సలాం పాదాల గుర్తులు ఇస్లాంకు పూర్వం ఉండేవి. (అల్ బిదాయా వల్ నిహాయా 1/163) [1]

 

విషయసూచిక

 

ప్రాధాన్యత

తవాఫ్ పూర్తిచేశాక, హాజీలు మఖామె ఇబ్రాహీం వైపు వెళ్ళాలి. వీలైనచో, మఖామె ఇబ్రాహీం వెనక రెండు రకాతుల నమాజ్ చేయాడం మంచిది.

 

వివరణ

మఖామె ఇబ్రాహీం చిన్న ప్రదేశం. ఇది గుండ్రంగా ఉంటుంది. ఇది కాబా ద్వారం మరియు ముల్తజం ముందు ఉంది. ఈ రాయి ఇబ్రాహీం అలైహిస్సలాం కాలం నుండి ఉంది. కాబా నిర్మాణ సమయంలో ఇబ్రాహీం అలైహిస్సలాం, ఈ రాయిని వాడారు, అందుకే దీన్ని మఖామె ఇబ్రాహీం అంటారు. హజ్ సమయంలో తవాఫ్ లోని ఏడు ప్రదక్షిణలు పూర్తి అవ్వగానే, ఈ ప్రదేశానికి వెళ్లి రెండు రకాతుల నమాజ్ చేయాలి.

 

కాబా పై భాగపు గోడను పూర్తిచేయడానికి ఇబ్రాహీం అలైహిస్సలాం ఒక పెద్ద బండ రాయి మీద నిలబడేవారు. ఒక్కో భాగం పూర్తి అవగానే, ఆ బండరాయిని జరుపుతూ పోయేవారు. కాబా కట్టడం పూర్తి అయ్యాక, ఆ పెద్ద బండరాయిని కాబా అవతల తూర్పు దిక్కున పెట్టేశారు. అది మఖామె ఇబ్రాహీంగా ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం ఆ రాయి (మఖామె ఇబ్రాహీం) కాబా ద్వారం ముందుగా ఉంది. ఇది దాదాపు 2 x 3 అడుగులు ఉంది. ప్రస్తుతం ఇది ఇబ్రాహీం అలైహిస్సలాం నమాజ్ చేసిన చోట ఉంది.

 

ఖుర్ఆన్

నిశ్చయంగా మానవుల కొరకు ప్రప్రథమంగా ఖరారు చేయబడిన (దైవ) గృహం బక్కాలో (మక్కాలో) ఉన్నదే. అది శుభప్రదమైనది, సమస్త లోకవాసులకు మార్గదర్శకం కూడాను.


అందులో స్పష్టమయిన సూచనలున్నాయి. మఖామె ఇబ్రాహీం (ఇబ్రాహీం నిలబడిన స్థలం) ఉన్నది. అందులోకి ప్రవేశించినవాడు రక్షణ పొందుతాడు. అక్కడికి వెళ్ళే స్థోమత గలవారికి, ఆ గృహ హజ్‌(యాత్ర) చేయటాన్ని అల్లాహ్‌ విధిగా చేశాడు. మరెవరయినా (ఈ ఆజ్ఞను శిరసావహించటానికి) నిరాకరిస్తే అల్లాహ్‌కు సమస్త లోకవాసుల అవసరం ఎంతమాత్రం లేదు. (ఖుర్ఆన్ సూరా ఆలి ఇమ్రాన్ 3:96,97)

 

(జ్ఞాపకం చేసుకోండి) మేము ఈ గృహాన్ని (కాబా గృహాన్ని) మానవులందరి పుణ్యక్షేత్రంగానూ, శాంతినిలయంగానూ చేశాము. మీరు ఇబ్రాహీము నిలబడిన ప్రదేశాన్ని నమాజు స్థలంగా చేసుకోండి. ''నా గృహాన్ని (సందర్శించి) ప్రదక్షిణ చేసేవారి కోసం, అక్కడ ఏతెకాఫ్‌ పాటించేవారి కోసం, రుకూ సజ్దాలు చేసేవారి కోసం మీరు దానిని పరిశుభ్రంగా, పరిశుద్ధంగా ఉంచాలి'' అని ఇబ్రాహీము, ఇస్మాయీలు నుంచి మేము వాగ్దానం తీసుకున్నాము. (ఖుర్ఆన్ సూరా బఖర 2:125) [2]

 

ప్రతీకాత్మక కళ

ప్రతి సంవత్సరం దాదాపు అనేక మిలియన్ ప్రజలు హజ్ కోసం వస్తారు. ప్రపంచంలో ఇదే అతి పెద్ద ధార్మిక సమూహం. ఇది ఒక ఆరాధన మాత్రం కాదు, మానవుని ఆత్మ తన స్వస్థలానికి చేరుతుంది. ఇది ముస్లిం జీవితపు ముఖ్య ఉద్దేశాలలో ఒకటి. శారీరకంగా, మానసికంగా, ఆర్ధికంగా స్థోమత గల ప్రతి ముస్లింపై ఇది విధి గావించబడింది.

 

హజ్ ఆచారాలు అన్నీ కాబా వద్దనే మొదలవుతాయి మరియు అంతమవుతాయి. దీన్ని మొట్ట మొదట ఆదం అలైహిస్సలాం నిర్మించారు, ఆ తరువాత ఇబ్రాహీం అలైహిస్సలాం మరియు ఆయన పెద్ద కుమారుడు ఇస్మాయీల్ అలైహిస్సలాం దీన్ని (కాబాను) పునఃనిర్మించారు.

 

ఈ ప్రదేశంలో రెండు రకాతులు నమాజ్ చేయాలి

మఖామె ఇబ్రాహీం వెనుకే రెండు రకాతులు నమాజ్ చేయడం తప్పనిసరి కాదు. అల్ హరం (మక్కాలోని పవిత్ర మస్జిద్)లో ఎక్కడైనా చేయవచ్చు. ఎవరైనా ఈ నమాజ్ చేయడం మరచిపోయినా, ఎలాంటి దోషం లేదు. ఎందుకంటే, ఈ నమాజ్ విధి కాదు, ఉత్తమ ఆరాధనలలో ఒకటి. (షేక్ ఇబ్న్ బాజ్ గారి అభిప్రాయం)

 

ప్రజలు తవాఫ్ చేసే ప్రదేశం నుండి జరిగి రెండు రకాతుల నమాజ్ చేయవచ్చు. ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ (రజి) ఈ రెండు రకాతుల నమాజ్ ‘జూ తువా’ (ప్రదేశం పేరు)లో చేశారు. ఈ ప్రదేశం మస్జిదె హరం కు చాలా దూరంలో ఉంది మరియు ఇది మస్జిదె హరం హద్దులోకి కూడా రాదు. [3]

 

విద్వాంసుల ధృక్పధం

షేక్ ఇబ్నె ఉసైమిన్ ఇలా అన్నారు:

మఖామె ఇబ్రాహీం ధ్రువీకరించబడింది. గాజు గోడల మధ్య ఉన్నదే మఖామె ఇబ్రాహీం. కాని దాని మీద కనిపించే పాదాల చిహ్నాలు అవి కావు. ఎందుకంటే, చరిత్ర ద్వారా తెలిసేది ఏమిటంటే, ఆ పాద చిహ్నాలు చాలా కాలం క్రితమే చెరిగిపోయాయి. ఇప్పుడున్నగుర్తులు కేవలం చిహ్నాలై ఉండవచ్చు. ఇవి ఖచ్చితంగా ఇబ్రాహీం అలైహిస్సలాం పాదాల గుర్తులు అని ఖచ్చితంగా చెప్పలేము. [4]

 

ఆధారాలు

[1] http://islamqa.com/en/ref/36521/Ibraaheem(ఇంగ్లీష్)

[2] http://www.umrahpackagesuk.co.uk/umrah-information/history-and-importance-of-maqam-e-ibrahim/(ఇంగ్లీష్)

[3] http://studyislaam.org/index.php?option=com_content&view=article&id=508:offering-two-rakahs-after-tawaf-behind-maqam-ibrahim-is-sunnah-but-not-an-obligation-&catid=94:faq-of-hajj-a-umrah&Itemid=32(ఇంగ్లీష్)

[4] http://islamqa.com/en/ref/36521(ఇంగ్లీష్)

Station of Ibrahim (Maqam Ibrahim)

 

 

774 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్