బహుదైవారాధకులు


''అల్లాహ్‌ అవతరింపజేసిన గ్రంథాన్ని అనుసరించండి'' అని వారికి చెప్పినప్పుడల్లా, ''మా తాతలు తండ్రులు అవలంబిస్తూ ఉండగా చూచిన పద్ధతినే మేము పాటిస్తాము'' అని వారు సమాధానమిస్తారు. వారి పూర్వీకులు ఒట్టి అవివేకులు, మార్గవిహీనులైనప్పటికీ (వీళ్లు వారినే అనుసరిస్తారన్నమాట!) సూరా బఖర 2:170

 

విషయసూచిక

 

అవిశ్వాసుల కర్మల ఉపమానం

అవిశ్వాసుల కర్మల ఉపమానం చదునైన ఎడారి ప్రదేశంలో మెరిసే ఎండమావిలాంటిది. దప్పిక గొన్నవాడు దూరం నుంచి చూసిదాన్ని నీరని భ్రమ చెందుతాడు. తీరా దాని దగ్గరకు వెళితే అక్కడ ఏమీ ఉండదు. అయితే అతనక్కడ అల్లాహ్‌ను పొందుతాడు. ఆయన అక్కడికక్కడే అతని లెక్కను తేల్చివేస్తాడు. అల్లాహ్‌ లెక్క తీసుకోవటంలో మహాశీఘ్రగామి. సూరా అన్ నూర్ 24:39

 

అల్లాహ్ గురించి ప్రస్తావన

అల్లాహ్‌ ఒక్కని గురించి ప్రస్తావించినప్పుడు పరలోకాన్ని నమ్మని వారి గుండెలు అక్కసుతో ఉడికిపోతాయి. మరి అల్లాహ్‌ తప్ప ఇతరుల గురించి చెప్పినప్పుడు మాత్రం అవి ఆనందంతో విప్పారుతాయి. సూరా అజ్ జుమర్ 39:45

 

అల్లాహ్ పవిత్రుడు

వారసలు అల్లాహ్‌ను గౌరవించవలసిన విధంగా గౌరవించలేదు. ప్రళయదినాన భూమి అంతా ఆయన గుప్పెట్లో ఉంటుంది. ఆకాశాలన్నీ ఆయన కుడిచేతిలో చుట్టబడి ఉంటాయి. ఆయన పవిత్రుడు. వీళ్లు కల్పించే భాగస్వామ్యాలకు అతీతుడు – ఎంతో ఉన్నతుడు. సూరా అజ్ జుమర్ 39:67

 

అల్లాహ్‌ అవతరింపజేసిన గ్రంథం

''అల్లాహ్‌ అవతరింపజేసిన గ్రంథాన్ని అనుసరించండి'' అని వారికి చెప్పినప్పుడల్లా, ''మా తాతలు తండ్రులు అవలంబిస్తూ ఉండగా చూచిన పద్ధతినే మేము పాటిస్తాము'' అని వారు సమాధానమిస్తారు. వారి పూర్వీకులు ఒట్టి అవివేకులు,మార్గవిహీనులైనప్పటికీ (వీళ్లు వారినే అనుసరిస్తారన్నమాట!) సూరా బఖర 2:170

 

సత్యతిరస్కారుల ఉపమానం

సత్యతిరస్కారుల ఉపమానం పశువుల కాపరి యొక్క కేకను, అరుపును మాత్రమే వినే పశువుల వంటిది (ఆలోచన అన్న మాటే ఉండదు). వారు చెవిటివారు, మూగవారు, గ్రుడ్డివారు. వారు అర్థం చేసుకోరు. సూరా బఖర 2:171

 

ముష్రిక్కులు

''అల్లాహ్‌ తలచుకొని ఉంటే మేము గానీ, మా తాతముత్తాతలు గానీ షిర్క్‌కు పాల్పడే వారం కాము; ఏ వస్తువునూ నిషిద్ధంగా ఖరారు చేసే వారం కూడా కాము''అని ముష్రిక్కులు అంటారు. వీరికి పూర్వం గతించిన వారు కూడా ఇలాగే ధిక్కార వైఖరిని అవలంబించారు. కడకు వారు మా శిక్షను చవి చూశారు. (ఓ ప్రవక్తా!) వారిని అడుగు: ''మీ దగ్గర ఏదైనా ప్రమాణం ఉంటే, దాన్ని మా ముందు సమర్పించండి. మీరు కేవలం ఊహలను అనుసరిస్తారు. అంచనాలతో మాట్లాడతారు.''సూరా అల్ అన్ అమ్ 6:148

 

తలబిరుసుతనం

ఒకవేళ మేము వారిపై దయదలచి, వారి కష్టాలను దూరం చేస్తే వారు తమ తలబిరుసుతనంలో మరింతగా మొండికేసి, అంధులుగా ప్రవర్తిస్తారు. సూరా అల్ మూమినూన్ 23:75

 

శిక్ష

మేము వారిని శిక్షలో (భాగంగా) కూడా పట్టుకున్నాము. కాని వారు తమ ప్రభువు సమక్షంలో లొంగనూ లేదు, వినమ్రతను వ్యక్త పరచనూ లేదు. సూరా అల్ మూమిమూన్ 23:76

 

కఠినమైన శిక్ష

ఆఖరికి మేము వారిపై కఠినమైన శిక్షా ద్వారాన్ని తెరచి వేసినప్పుడు, వారు వెంటనే నిరాశా నిస్పృహలకు లోనయ్యారు. సూరా అల్ మూమినూన్ 23:77

 

సిఫారసు

ఆయన వద్ద – ఆయన అనుమతించిన వారి కొరకు తప్ప- (ఒకరి) సిఫారసు (ఇంకొకరికి) ఏ మాత్రం ఉపకరించదు. తుదకు వారి హృదయాలలోని ఆందోళన తొలగించబడిన తరువాత, "ఇంతకీ మీ ప్రభువు సెలవిచ్చినదేమిటి?" అని అడుగుతారు. "సత్యమే పలికాడు. ఆయన మహోన్నతుడు, ఘనాఘనుడు" అని వారు చెబుతారు. సూరా సబా 34:23

 

ప్రాపంచికంగానూ, పారలౌకికంగానూ నష్టపోఏ వారు

ప్రజలలో మరి కొంతమంది (కూడా ఉన్నారు. వారు) ఎలాంటి వారంటే, వారు ఒక అంచున (నిలబడి) అల్లాహ్‌ను ఆరాధిస్తుంటారు. తమకేదన్నా లాభం కలిగితే ఆరాధన పట్ల సంతృప్తి చెందుతారు. ఏదన్నా ఆపద వచ్చిపడితే మాత్రం అప్పటికప్పుడే ముఖం తిప్పుకుని పోతారు. అలాంటి వారు ప్రాపంచికంగానూ, పారలౌకికంగానూ నష్టపోయారు. స్పష్టంగా నష్టపోవటం అంటే ఇదే. సూరా అల్ హజ్ 22:11

మరి వారు అల్లాహ్‌ను వదలి తమకు నష్టంగానీ, లాభంగానీ కలిగించలేని వారిని మొరపెట్టుకోసాగుతారు. చాలా దూరపు అపమార్గం అంటే ఇదే. సూరా అల్ హజ్ 22:12

 

స్థిరనివాసం

"మేమే గనక నీతో చేరి సన్మార్గాన్ని అనుసరిస్తే మా భూభాగం నుంచి మేము తరిమి వేయబడటం ఖాయం" అని వారు గగ్గోలు చెందసాగారు. ఏమిటి? మేము వారికి సురక్షితమైన, పవిత్రమైన చోట స్థిరనివాసం కల్పించలేదా? అక్కడ వారికి అన్ని రకాల పండ్లు ఫలాలు ఉపాధి రూపంలో మావద్ద నుంచి సరఫరా చేయబడ లేదా? కాని వారిలోని చాలామంది (ఈ యదార్థాన్ని) తెలుసుకోరు. సూరా అల్ ఖసస్ 28:57

 

ఆధారాలు

http://www.askislampedia.com/te/quran/-/view/Surah/2#170

http://www.askislampedia.com/te/quran/-/view/Surah/24#39

http://www.askislampedia.com/te/quran/-/view/Surah/39#45

http://www.askislampedia.com/te/quran/-/view/Surah/39#67

http://www.askislampedia.com/te/quran/-/view/Surah/2#171

http://www.askislampedia.com/te/quran/-/view/Surah/6#148

http://www.askislampedia.com/te/quran/-/view/Surah/23#75

http://www.askislampedia.com/te/quran/-/view/Surah/23#76

http://www.askislampedia.com/te/quran/-/view/Surah/23#77

http://www.askislampedia.com/te/quran/-/view/Surah/34#23

http://www.askislampedia.com/te/quran/-/view/Surah/22#11

http://www.askislampedia.com/te/quran/-/view/Surah/22#12

http://www.askislampedia.com/te/quran/-/view/Surah/28#57

 

 

458 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్