ప్రముఖ ముస్లిమేతరులు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఏమన్నారు


విషయసూచిక

 

మైఖేల్ హె చ్ ఆర్ట్

నేను ప్రపంచంలోని అత్యంత ప్రభావ శీల వ్యక్తుల్లో ముహమ్మద్ ప్రవక్త కు మొట్టమొదటి ప్రాధాన్యత నివ్వడం కొంత  మంది పాఠకులకు కొంత ఆశ్చర్యమూ, మరికొంతమందికి ప్రశ్నార్తకము కావచ్చు. కాని చరిత్ర మొత్తంలో ఈ ఒక్క వ్యక్తీ మాత్రమే ఆధ్యాత్మికంగాను,లౌకికంగాను మహోన్నతమైన,అపూర్వమైనా విజయాలు సాధించారు. ఆయన వ్యక్తిత్వం చరిత్రలో ఎవరికి సరిపోలనిది కావడం మూలంగానే ఆయన్ని నేను అత్యంత ప్రభావశీల ఏకైక వ్యక్తిగా భావిస్తున్నాను

 

అనిబిసెంట్ (ది లైఫ్ టీచింగ్స్ అఫ్ ముహమ్మద్)

ఆరేబియాకు చెందిన ఆ గొప్ప ప్రవక్త గురించి అధ్యయనం చేసిన వారికి , ఆయన ఎలా భోధించారో ఎలా జీవించారో,తెలిసిన వారికి ఆయన పట్ల ఆదరభావం తప్ప మరో భావం కలగడం ఆసాధ్యం. ఆయన మహోన్నత ప్రవక్త. ప్రభువు పంపిన గొప్ప సందేశహరులలో ఒకరు . నేను మీ ముందు ఉంచుతున్న వాటిలో చాలా విషయాలు మీకు తెలిసే ఉంటాయని నేను అనుకుంటాను. అయినా నా అనుభవం ఏమిటంటే ఆ విషయాలను నేను పునరధ్యాయనం చేసినప్పుడల్లా మహానీయుడైనా ఆ అరబ్బు భోదకుని పట్ల ఓ క్రొత్త ప్రశంసా భావం ఓ క్రొత్త  ఆదరభావం ఏర్పడుతుంది నాలో.  

 

ప్రో రామకృష్ణ రావు మైసూర్ (యూనివర్సిటిలో తత్వశాస్త్రంలో  రిటైర్డ్ ప్రొఫెస్సర్)

ముహమ్మద్ ప్రకటించిన విశ్వజనీన సోదరత్వ సిద్దాంతం, మానవ ఏకత్వపు భావన, మానవాళి సామాజిక ప్రగతి కొరకు ఆయన అందజేసిన గొప్ప వర ప్రసాదాలు. ఈ ధర్మాలను ప్రపంచంలోని గొప్ప మతాలన్నీ భోధించాయి. కాని,ఇస్లాం ప్రవక్త ఈ సిద్దాంతాలను వాస్తవ ఆచరణలో పెట్టారు. అయితే దాని విలువను మానవాళి బహుశ ఇకపైనే గుర్తించగల్గుతుంది. అంతర్జాతీయతా స్ఫూర్తి జాగృత మయినప్పుడు, పటిష్టమయిన మానవ సౌబ్రాత్రభావన ఉనికిలోనికి వచ్చినప్పుడు, దీనికి గుర్తింపు లభిస్తుంది.

 

లా మార్టిన్ హిస్టోరి డి లా టర్కీ  ఫారిస్ 1854  vol.II  PP 276-77

ఈ సిద్దాంతంలో రెండు అంశాలున్నాయి. దేవుని ఏకత్వం, దేవుడు నిరాకారుడన్న భావం. మొదటిది దైవమేంటో తెల్పుతుంది. రెండవది దేవుడు ఏమికాడో తెల్పుతుంది. ఒకటేమో మిధ్యా దేవుళ్ళను పడదోస్తే  రెండవది మాటలతో భావాన్ని నిర్మిస్తుంది. తత్వవేత్త ఉపన్యాసకుడు, మత ప్రచారకుడు, శాసనకర్త, యుద్దవీరుడు, భావాల విజేత హేతుబద్ధ సిద్దాంతాలు, విగ్ర రహిత మత విధానాల నిర్మాత, ఇరవై ఇహలోక సామ్రాజ్యాలు, ఓ ఆధ్యాత్మిక సామ్రాజ్య ఆవిష్కర్త ఆయనే ముహమ్మద్, మానవుని ఔన్నాత్యానికి  సంబంధించిన అన్ని ప్రమాణాలతో కొలిచి, ఆయన్ను మించిన వారెవరన్నా ఉన్నారా? అని మనం ఆశ్చర్యపోతాం!

 

మేధావి అన్నాదోరై (మద్రాసు నగరంలో మహానగర తీరాన)

మన సమాజంలో వివేకాన్ని మేలుకొలువ వలెనని మాలాంటి వారు హెచ్చరించినపుడు, మమ్మల్ని తరిమి తరిమి కొట్టి దూరంగా పొమ్మంటున్నారు. అయితే పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం , రకరకాల దేముళ్లను, పలు దేవతా విగ్రహాలను పూజించే టటు వంటి ప్రజలకి-“నువ్వు మొక్కవలసినది ఈ విగ్రహానికి కాదు, నువ్వు వెల్ల వలసింది ఈ కోవెలకు కాదు “అని చెప్పగల గుండె ధైర్యంతో, అందులోనూ అటువంటి మోటు మనుషులకి తమ సందేశాన్ని, ఆత్మస్థైర్యంతో సిద్దాంత పూర్వకంగా చెప్పగలిగారు. అందుకనే ఆయనని మహోన్నత వ్యక్తీ అని గౌరవించి , అభిమానిస్తున్నాను. ఆనాడు మహా ప్రవక్త ప్రేరణ వల్ల కలిగిన ఆత్మ బలం, ఇప్పుడు, ఈనాడు ఆ మార్గం స్వీకరించిన వారికి కూడా వున్నదీ అంటే- అందుకు ఆశ్చర్యపడనక్కర లేదు

 

ఆధారాలు

లామార్టిన్హిస్టోరిడిలాటర్కీ  ఫారిస్1854  vol.II  PP 276-77

 

1457 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్