పారితోషికాలు


హజ్రత్ అబూ హమీద్ సాయిదీ (రజి అల్లాహు అన్హు) కధనం :-దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జకాత్, సదఖాలు (రెవెన్యూ) వసూలు చేయడానికి ఒక వ్యక్తిని (తహసీల్ దారుగా) నియమించారు. అతను తన కప్పగించబడిన పని పూర్తి చేసుకొని తిరిగొచ్చి “ధైవప్రవక్తా! ఈ ధనం మీది, ఇది నాకు పారితోషికంగా లభించింది” అని అన్నాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ మాటలు విని “నీవు నీ తల్లిదండ్రుల ఇంట్లోనే ఎందుకు కూర్చోలేదు? అప్పుడు నీకెవరైనా పారితోషికం తెచ్చిస్తారో లేదో తెలుస్తుంది కదా!” అని అన్నారు.

 

విషయసూచిక

 

జకాత్ సదఖాలను వసూలు చేయడం

హజ్రత్ అబూ హమీద్ సాయిదీ (రజి అల్లాహు అన్హు) కధనం :-దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జకాత్, సదఖాలు (రెవెన్యూ) వసూలు చేయడానికి ఒక వ్యక్తిని (తహసీల్ దారుగా) నియమించారు.

 

బైతుల్ మాల్ ను సొంతదిగా పరిగణించడం

అతను తన కప్పగించబడిన పని పూర్తి చేసుకొని తిరిగొచ్చి “ధైవప్రవక్తా! ఈ ధనం మీది, ఇది నాకు పారితోషికంగా లభించింది” అని అన్నాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ మాటలు విని “నీవు నీ తల్లిదండ్రుల ఇంట్లోనే ఎందుకు కూర్చోలేదు? అప్పుడు నీకెవరైనా పారితోషికం తెచ్చిస్తారో లేదో తెలుస్తుంది కదా!” అని అన్నారు.

 

దైవప్రవక్త ఉపన్యాసం

ఆ తరువాత ఆయన ఇషా నమాజ్ చేసి (ఉపన్యాసమివ్వడానికి) నిలబడ్డారు. ముందుగా ఆయన షహాదత్ కలిమా (సత్యసాక్ష వచనం) పఠించి ధైవస్తోత్రం చేశారు. దానికి దేవుడే యోగ్యుడు. ఆ తరువాత ఆయన ఇలా అన్నారు : “ఈ కార్యనిర్వహకులకు ఏమయింది? మేమొక వ్యక్తిని కార్య నిర్వాహకునిగా (అంటే రెవెన్యూ వసూలు చేసే ఉద్యోగిగా) నియమించి పంపితే అతను తిరిగొచ్చి ‘ఇది నన్ను వసూలు చేయడానికి పంపిన ధనం, ఇది నాకు పారితోషికంగా లభించిన ధనం’ అని అంటున్నాడు. అతను తన తల్లిదండ్రుల ఇంట్లోనే ఎందుకు కూర్చోలేదు. అప్పుడు తెలుస్తుందిగా అతనికి పారితోషికం ఎవరు తెచ్చిస్తారో! ఎవరి అధీనంలో ముహమ్మద్ ప్రాణం ఉందో ఆ శక్తిమంతుని సాక్షి! ఈ (ప్రభుత్వ) రాబడిలో ఎవరు నమ్మకద్రోహానికి పాల్పడతాడో ప్రళయదినాన దొంగిలించబడిన ఆ ధనం అతని మెడ మీద పెనుభారంగా పరిణమిస్తుంది.

 

దొంగలించిన సొమ్ము

అతను ఒంటెను దొంగిలించి ఉంటే ఆ ఒంటె అతని మెడ మీద ఎక్కి అరుస్తూ అతనికి దుర్భరంగా మారవచ్చు. ఒకవేళ అతను ఆవును దొంగిలించి ఉంటే ఆ ఆవు అతని మెడ మీద అంబా అంటూ ఉండవచ్చు, మేకయితే ‘మేమే’ అంటూ ఉండవచ్చు. గుర్తుంచుకోండి! నేను అల్లాహ్ ఆజ్ఞలన్నీ మీకు అందజేశాను (నా బాధ్యత తీరిపోయింది, ఇక ఎవరి కర్మలకు వారే బాధ్యులు)”.


దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచిస్తూ తమ హస్తాన్ని బాగా పైకెత్తారు. అప్పుడు మాకు ఆయన చంకలోని తెలుపుదనం కన్పించింది”.


1202.[సహీహ్ బుఖారీ : 83 వ ప్రకరణం - అల్ ఐమాన్ వన్నుజూర్, 3 వ అధ్యాయం - కైఫా కాన యమీనున్నబియ్యి (సల్లల్లాహు అలైహి వసల్లం) ] పదవుల ప్రకరణం : 7 వ అధ్యాయం – ప్రభుత్వోద్యోగులు పారితోషికాలు, కానుకలు స్వీకరించడం నిషిద్ధం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-2

సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ

 

ఆధారాలు

http://telugudailyhadith.wordpress.com/2012/09/28/public-employees-accpeting-gifts/#

 

418 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్