పవిత్ర మాసమైన ‘ముహర్రం’ శుభాలు


అల్లాహ్ యొక్క పవిత్ర మాసమైన ముహర్రం మాసం దీవెనలతో కూడిన మరియు ఒక ప్రత్యేకమైన మాసం. ఇది హిజ్రీ క్యాలెండరులోని మొదటి మాసం. ఇస్లామీయ సంవత్సరంలోని నాలుగు పవిత్ర మాసములలోని ఒక మాసం.

 

విషయసూచిక

 

ఖుర్ఆన్ వెలుగులో

“నిశ్చయంగా, అల్లాహ్ దగ్గర నెలల సంఖ్య పన్నెండు, భూమ్యాకాశాలు సృష్టించినప్పుడే అల్లాహ్ దీనిని నిర్ణయించెను; వాటిలో నాలుగు పవిత్రమైనవి. అది సరైన ధర్మము, కాబట్టి మీకుగా మీరు దారి తప్పవద్దు…” [ఖుర్ఆన్, సూరా తౌబా 9:36]

 

హదీసు వెలుగులో

అబూ బకర్ రజిఅల్లాహు అన్హు ఉల్లేఖించిన ఒక హదీస్ ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఇలా ఉపదేశించినారు: “సంవత్సరంలో పన్నెండు నెలలు ఉన్నాయి, వాటిలో నాలుగు పవిత్రమైనవి, వరుస క్రమంలోని మూడు–జుల్ ఖైదహ్, జుల్ హజ్జ్, ముహర్రం మరియు (నాలుగవది) రజబ్  ఏదైతే జుమాదా మరియు షాబాన్ మాసముల మధ్యలో వచ్చునో.” (బుఖారీ:2958)

 

ముహర్రం అనే పేరు దాని పవిత్రతను సూచిస్తున్నది మరియు ధృవపరుస్తున్నది

అల్లాహ్ యొక్క పదాలు (ఖుర్ఆన్ పదాల భావానికి అర్థం): “కాబట్టి మీకుగా మీరు దారి తప్పవద్దు…”అంటే ఈ పవిత్ర మాసములలో మీరు స్వయంగా తప్పులు చేయవద్దు. ఎందుకంటే ఈ పవిత్ర మాసములలోని తప్పులు, పాపములు మిగిలిన మాసములలోని తప్పులు, పాపముల కంటే తీవ్రమైనవి.

 

“కాబట్టి మీకుగా మీరు దారి తప్పవద్దు…”అనే పదముల గురించి ఇబ్నె అబ్బాస్ రజిఅల్లాహు అన్హు యొక్క అభిప్రాయం ఇలా ఉన్నది – ఈ ఆయత్ (వచనం) మొత్తం నెలల సంఖ్యను తెలియజేసి, ఆ తర్వాత ప్రత్యేకంగా వాటిలో నుండి ఈ నాలుగింటిని వేరు పరచి, వాటిని పవిత్రమైనవిగా ప్రకటించినది. కాబట్టి ఈ పవిత్ర మాసములలో చేసిన పాపము చాలా గంభీరమైనది మరియు తీవ్రమైనది. అలాగే ఈ మాసములలో చేసిన మంచి పనులు అనేక రెట్ల పుణ్యాలను సంపాదించి పెట్టును. 

 

“కాబట్టి మీకుగా మీరు దారి తప్పవద్దు…”అనే ఆయత్ (వచనం) గురించి ఖతాదా అనే ఆయన ఇలా అభిప్రాయపడినారు – పవిత్ర మాసములలో చేసే తప్పుడు పనులు (గునాహ్) ఇతర మాసములలో చేసే తప్పుడు పనుల కంటే చాలా గంభీరమైనవి మరియు చాలా పాపాత్మకమైనవి. తప్పుడు పనులు చేయటం అనేది ఏ సమయంలోనైనా సరే పాపాత్మకమైనదే, కాని అల్లాహ్ తన ఇష్టానుసారం కొన్నింటిని ఎక్కువ గంభీరమైనవిగా ప్రకటించెను. అల్లాహ్ తన సృష్టిలో నుండి కొన్నింటిని ఎన్నుకొనెను. తన దైవదూతలలో కొందరిని వార్తాహరులుగా ఎన్నుకొనెను. అలాగే మానవులలో కొందరిని ప్రవక్తలుగా, సందేశహరులుగా ఎన్నుకొనెను. పలుకులలో కొన్నింటిని తన జికర్ (ధ్యానం) కోసం ప్రత్యేకింపబడిన పలుకులుగా ఎన్నుకొనెను. భూమండలంపై ఉన్న ప్రాంతాలలో మస్జిద్ ప్రాంతాలను పవిత్రమైనవిగా ఎన్నుకొనెను. మాసములలో రమదాన్ మాసాన్ని మరియు ఇతర పవిత్ర మాసాలను ఎన్నుకొనెను. వారంలో శుక్రవారాన్ని పవిత్రమైన దినంగా ఎన్నుకొనెను. దినములలో అరఫాహ్ దినాన్ని పవిత్రమైన దినంగా ఎన్నుకొనెను. రాత్రులలో లైలతుల్ ఖదర్ రాత్రిని పవిత్రమైన రాత్రిగా ఎన్నుకొనెను. కాబట్టి వేటినైతే ప్రత్యేకంగా గౌరవించమని అల్లాహ్ ప్రకటించెనో, వాటిని మనం తప్పకుండా గౌరవించవలెను. (తఫ్సీర్ ఇబ్నె కథీర్, ఖుర్ఆన్, సూరాతౌబా 9:36)

 

ముహర్రంలో నఫిల్ (ఐచ్ఛిక) ఉపవాసాలు ఎక్కువగా ఉండటం వలన లభించే శుభాలు

అబూ హురైరా రజిఅల్లాహు అన్హు ఉల్లేఖించిన ఒక హదీస్ లో ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించినారు: ‘అల్లాహ్ యొక్క మాసమైన ముహర్రం మాసపు ఉపవాసము, రమజాన్ తర్వాతి ఉపవాసాలలో ఉత్తమమైనది.’ (ముస్లిం - 1982)

 

వ్యాకరణ పరంగా అల్లాహ్ యొక్క మాసం” అనే పదాలు, ఈ మాసపు పేరును అల్లాహ్ యొక్క పేరుతో కలిసి రావటమనేది, ఈ నెల యొక్క ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను, ప్రత్యేకతను సూచిస్తున్నది. అల్ ఖారీ ఇలా తెలిపారు: ముహర్రం మాసం మొత్తం పవిత్రమైనదే” అనేది దీనిలో ప్రదర్శితమవుతున్న అర్థం. కాని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రమజాన్ మాసం తప్ప వేరే ఇతర ఏ మాసమూ పూర్తిగా ఉపవాసం ఉండలేదనేది నిరూపింపబడిన వాస్తవము. కాబట్టి, ఈ హదీస్ ముహర్రంలో ఎక్కువగా ఉపవాసాలు ఉండటాన్ని ప్రోత్సహిస్తున్నదని భావించవచ్చును. అంతేగాని ముహర్రం నెల మొత్తం ఉపవాసాలు ఉండమని కాదు. 

 

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం షాబాన్ మాసంలో అధికంగా ఉపవాసాలు ఉండేవారని వేరే హదీస్ లలో నమోదు చేయబడినది. ముహర్రం మాసం యొక్క పవిత్రత గురించి అల్లాహ్ యొక్క ఆదేశములు వారి చివరి దినముల వరకు అవతరించి ఉండక పోవచ్చును మరియు ఆ ఆదేశముల తర్వాత మరుసటి ముహర్రం మాసం వచ్చేలోగానే ఆయన మరణించి ఉండవచ్చును. (షరహ్ అన్నవావి అలా సహీహ్ ముస్లిం)

 

అల్లాహ్ తన ఇష్టానుసారం సమయాన్ని, ప్రాంతాన్ని ఎన్నుకొనును

అల్ ఇజ్జ్ ఇబ్నె అబ్దుస్సలామ్ (రహిమహుల్లాహ్) ఇలా తెలిపారు: “సమయాలకు, ప్రాంతాలకు రెండు విధాలుగా ప్రత్యేకత ఇవ్వవచ్చును – ప్రాపంచికంగా లేక ధార్మికంగా. ధార్మికంగా అంటే , ఈ ప్రత్యేక సమయాలలో, ప్రాంతాలలో ప్రతి పుణ్యకార్యానికి అనేక రెట్ల పుణ్యాలను ప్రసాదిస్తూ, అల్లాహ్ తన దాసులపై ప్రత్యేక దీవెనలు కురిపించును. ఉదాహరణకు రమజాన్ మాసపు ఉపవాసాలకు లభించే పుణ్యాలు మిగిలిన సమయాల ఉపవాసాలకు లభించే పుణ్యాల కంటే ఎన్నో రెట్లు అధికమైనవి. అలాగే ఆషూరా దినపు ఉపవాసానికి మిగిలిన నఫిల్ (ఐచ్ఛిక) ఉపవాసాల కంటే ఎన్నో రెట్ల పుణ్యాలు లభించును. దీనికి కారణం ఆయా శుభదినాలలో అల్లాహ్ తన ఇష్టానుసారం తన దాసులపై కురిపించే ప్రత్యేక దయాదాక్షిణ్యాలు, కారుణ్యాలు.…(ఖవాయిద్ అల్ అహ్కామ్, 1/38)

 

ఆధారాలు

www.islamhouse.com(ఇంగ్లీష్)

 

 

1724 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్