పంది మాంసం ఎందుకు నిషేధించబడింది


పంది ఒక అపవిత్రమైన మరియు అపరిశుద్ధమైన జంతువు అనీ మరియు దానిని తినటమనేది మానవుడికి హాని కలుగజేస్తుందనే వాస్తవాలను మనం ఒక్క క్షణం కూడా మరవలేము. అంతేకాక అది మురికిలోను మరియు విసర్జితాలలోను జీవిసిస్తుంది. మంచి ప్రవర్తన గలవారు దానిని ముట్టుకోవటాన్ని కూడా అసహ్యించుకుంటారు. మరి అలాంటిది, దానిని తినటం అనేది ఆ వ్యక్తి యొక్క విచిత్ర ప్రవర్తనకు కారణమై ఉంటుంది లేదా అతని విచిత్ర ప్రవర్తనకు ఒక సూచన అయి ఉంటుంది.

 

విషయసూచిక

  

ఖుర్ఆన్ వెలుగులో


అల్లాహ్ తన దయ వలన మరియు కరుణ వలన అన్ని స్వచ్ఛమైన వాటిని మరియు పరుశుద్ధమైన వాటిని తినటానికి మనకు అనుమతించినాడు. ఆయన కేవలం అపవిత్రమైనవాటిని మరియు హాని కలిగించే వాటిని మాత్రమే నిషేధించినాడు. ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు (ఖుర్ఆన్ వచనపు భావం యొక్క అనువాదం): 

 

“…అతను వారికి ధర్మమును ఆదేశిస్తాడు మరియు అధర్మమును నిషేధిస్తాడు మరియు వారి కొరకు పరుశుద్ధమైన వస్తువులను ధర్మసమ్మతం చేసి అపరిశుద్ధమైన వాటిని నిషేధిస్తాడు. వారిపై మోపబడిన భారాలను మరియు నిర్భంధాలను తొలగిస్తాడు. కావున అతనిని సమర్థించి, అతనితో సహకరించి, అతనిపై అవతరింపజేయబడిన జ్యోతిని అనుసరించేవారు మాత్రమే సాఫల్యం పొందేవారు.” [ఖుర్ఆన్ సూరా అల్ అరాఫ్ 7:157]

 

“(ఓ ప్రవక్తా) వారికి తెలుపు: నా పై అవతరింపజేయబడిన దివ్యజ్ఞానంలో: ఆహార పదార్థాలలో చచ్చిన జంతువు, కారిన రక్తం, పంది మాంసం – ఎందుకంటే అది అపరిశుద్ధమైనది; లేక అల్లాహ్ అవిధేయతకు పాల్పడి – ఆయన పేరుతో గాక – ఇతరుల పేరుతో కోయబడిన జంతువు తప్ప, ఇతర వాటిని తినటాన్ని నిషేధించబడినట్లు నేను చూడలేదు. కాని ఎవడైనా గత్యంతరం లేని పరిస్థితులలో దుర్నీతికి  ఒడిగట్టకుండా, ఆవశ్యకత వలన, హద్దులు మీరకుండా (తింటే) నీ ప్రభువు నిశ్చయంగా క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.”[ఖుర్ఆన్ సూరా అల్ అన్ఆమ్ 6:145]

 

పంది మాంసం వల్ల కలిగే హాని


‎కొలెస్టరోల్ అతి ఎక్కువగా ఉన్న మాంసములలో పంది మాంసం కూడా ఒకటి. రక్తప్రవాహంలో దాని హెచ్చుదల గుండె నుండి రక్తాన్ని తీసుకువెళ్ళే ధమని నాళాలను తరచుగా అవరోధించవచ్చు, అడ్డగించవచ్చు.  పంది మాంసంలో కొవ్వుతో కూడి ఉన్న ఆమ్లముల (fatty acids) నిర్మాణం అటువంటి ఆమ్లములు కలిగి ఉన్న ఇతర పదార్థాలతో పోల్చినట్లయితే, అది సాధారణమైనది కాదని గుర్తించబడింది. అంటే ఆ పంది మాంసంలోని ఆ కొవ్విన ఆమ్లములు సులభంగా మానవశరీరంలో కలిసిపోవటం వలన, అవి కొలస్టొరాల్ స్థాయిని బాగా పెంచివేస్తాయి. 

 

‎పంది మాంసం మరియు పంది కొవ్వు - పెద్దపేగు, పురీష స్థానం, పురీష నాళం, మలాశయం, వస్తి గ్రంథి మరియు రక్తములలో కేన్సరు వ్యాప్తికి తోడ్పడతాయి.

 

‎పంది మాంసం తినటమనేది గజ్జి, చర్మరోగం, ఎలర్జీ, కడుపులో పుండు వంటి వాటికి దారి తీస్తుంది.

 

‎అంతేకాక పంది మాంసం – మానవుల ఊపిరితిత్తులలో, చిన్నప్రేగులో పెరిగే ఒక జాతి పురుగు (బద్దె పురుగు) వలన కలిగే ఊపిరితిత్తుల రోగాలకు మరియు ఇతర సూక్ష్మ హృద్రోగాలకు కారణమవుతుంది.

 

ఆధునిక విజ్ఞాన శాస్త్రము ఋజువుచేసిన  భౌతిక, శారీరక హానికర విషయాలు


పంది మాంసం తినటంలో అత్యంత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే ఊపిరితిత్తులలో, చిన్నప్రేగులో దాదాపు 2 – 3 మీటర్ల వరకు పెరగ గలిగే ఒక జాతి పురుగు tapeworm (బద్దె పురుగు) దానిలో ఉంటుంది. ఈ పురుగుల గ్రుడ్లు మెదడులో పెరిగితే, అవి మానవుల పిచ్చితనానికి మరియు  అపస్మారక స్థితికి దారితీయవచ్చును. అవే గనుక హృదయం చుట్టుప్రక్కల ప్రాంతంలో పెరిగితే, అధిక రక్తపు పోటులకు మరియు గుండె పోటులకు దారి తీయవచ్చును. పంది మాంసంలో కనబడే మరొక రకమైన పురుగు పేరు trichinosis worm. ఇది వండటం వలన కూడా చావదు. మన శరీరంలో దాని పెరుగుదల  పక్షవాతానికి మరియు చర్మం పై పొక్కులు లేవటానికి దారితీయవచ్చు. మానవులకు మాత్రమే వచ్చే కీళ్ళవాత రోగ జ్వరం మరియు కీళ్ళనొప్పులు వంటి వ్యాధులు కొన్ని ఉన్నాయి. అయితే పందులలో తప్ప ఇతర ప్రాణులలో అవి కనబడవు.

 

పంది మాంసం గురించి ఇతర మత గ్రంథాలలో 


 “నీవు హేయమైనదేదియు తినకూడదు. మీరు  తినదగిన జంతువులూ ఏమనగా........  మరియు  పంది రెండు డెక్కలు గలదైనను  నేమరువేయదు గనుక అది మీకు హేయము, వాటి మాంసము తినకూడదు, వాటి కళేభరము ముట్ట కూడదు .” Deuteronomy 14:3-8

 

ఆధారాలు


www.islamhouse.com

www.Islamqa.com

 

1178 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్