దైవానుగ్రహం పొందేవారు

విశ్వాసులైన పురుషులూ, విశ్వాసులైన స్త్రీలూ – వారంతా ఒండొకరికి మిత్రులుగా (సహాయకులుగా, చేదోడువాదోడుగా) ఉంటారు. వారు మంచిని గురించి ఆజ్ఞాపిస్తారు. చెడుల నుంచి వారిస్తారు. నమాజులను నెలకొల్పుతారు, జకాత్‌ను చెల్లిస్తారు. అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకు విధేయులై ఉంటారు. అల్లాహ్‌ అతి త్వరలో తన కారుణ్యాన్ని కురిపించేది వీరిపైనే. నిస్సందేహంగా అల్లాహ్‌ సర్వాధిక్యుడు, వివేచనాశీలి. సూరా తౌబా 9:71

విషయసూచిక

విశ్వాసులైన పురుషులూ, విశ్వాసులైన స్త్రీలూ

విశ్వాసులైన పురుషులూ, విశ్వాసులైన స్త్రీలూ – వారంతా ఒండొకరికి మిత్రులుగా (సహాయకులుగా, చేదోడువాదోడుగా) ఉంటారు. వారు మంచిని గురించి ఆజ్ఞాపిస్తారు. చెడుల నుంచి వారిస్తారు. నమాజులను నెలకొల్పుతారు, జకాత్‌ను చెల్లిస్తారు. అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకు విధేయులై ఉంటారు. అల్లాహ్‌ అతి త్వరలో తన కారుణ్యాన్ని కురిపించేది వీరిపైనే. నిస్సందేహంగా అల్లాహ్‌ సర్వాధిక్యుడు, వివేచనాశీలి. సూరా తౌబా 9:71

అల్లాహ్‌ను, అంతిమదినాన్ని విశ్వసించే వారు

మరి ఈ పల్లె జనులలోనే అల్లాహ్‌ను, అంతిమదినాన్ని విశ్వసించే వారు కూడా ఉన్నారు. తాము ఖర్చుపెట్టే సొమ్మును దైవసామీప్యం పొందే, దైవప్రవక్త వేడుకోలుకు (దుఆకు) సాధనంగా ఉపయోగపడే వస్తువుగా వారు తలపోస్తారు. తెలుసుకోండి! వారు చేసే ఈ ఖర్చు నిశ్చయంగా వారి యెడల సామీప్య సాధనం అవుతుంది. అల్లాహ్‌ తప్పకుండా వారిని తన కారుణ్యంలో చేర్చుకుంటాడు. నిస్సందేహంగా అల్లాహ్‌ క్షమాశీలుడు, దయామయుడు.సూరా తౌబా 9:99

విధేయులు

నమాజును నెలకొల్పండి. జకాతును ఇవ్వండి. దైవప్రవక్తకు విధేయులుగా మసలుకోండి. తద్వారానే మీరు కరుణించబడతారు.సూరా అన్ నూర్ 24:56

ఆధారాలు

http://www.askislampedia.com/te/quran/-/view/Surah/9#71

http://www.askislampedia.com/te/quran/-/view/Surah/9#99

http://www.askislampedia.com/te/quran/-/view/Surah/24#56

285 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్