దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం – పిల్లలకు కారుణ్యమూర్తి


చిన్న పిల్లలు కాస్త ప్రత్యేకం. వాళ్ళకు ఓ ప్రత్యేక స్థానం ఉంది.దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తన ఆచరణ ద్వారా దీన్ని చాటారు. ఆయన పిల్లలను అమితంగా ప్రేమించేవారు మరియు వారిపై కరుణ చూపేవారు. పిల్లలపై ప్రేమను అనేక రకాలుగా వెల్లడించారు. ఆయనపిల్లలను కౌగిలించుకునేవారు. వారివీపులను తట్టేవారు. వారి తలపై చేయిపెట్టి, జుట్టును తన చేతులతో దువ్వేవారు.


దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంపిల్లలతో ఆడటానికి ఇష్టపడేవారు. ఆయన పిల్లలను ఒక వరుసలో నిలబెట్టి, స్వయంగాఆయన వారికి కాస్త దూరంలో నిలబడి, చేతులు చాచి వారితో ఇలా అనేవారు: “పరుగెత్తుకుంటూ నా దగ్గరకు రండి.మొట్ట మొదటగా నన్ను పట్టుకునేవానికి బహుమానం ఇవ్వబడును.” పిల్లలందరూ ఆయన వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చేవారు. వారుదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంను చేరగానే అందరూ ఆయనపై పడేవారు.దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఈ ఆటను బాగా ఆస్వాదించేవారు. గెలిచిన వారికి ఖర్జూర పండ్లు, మిఠాయిలు బహుమానంగా ఇచ్చేవారు. అక్కడున్న పిల్లలందరినీ ముద్దు పెట్టుకుని, గుండెకు హత్తుకునేవారు.

 

విషయసూచిక

 

ఖుర్ఆన్

“(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “రండి, మీ ప్రభువు మీపై నిషేధించిన వస్తువులు ఏవో మీకు చదివి వినిపిస్తాను. అవేమంటే; అల్లాహ్‌కు సహవర్తులుగా ఎవరినీ కల్పించకండి. తల్లిదండ్రుల యెడల ఉత్తమరీతిలో మెలగండి. పేదరికపు భయంతో మీ సంతానాన్ని హతమార్చకండి. మేము మీకూ ఆహారం ఇస్తున్నాము, వారికీ ఇస్తాము.” (ఖుర్ఆన్, సూరాఅనామ్ 6:151)


''నా ప్రభూ! నన్ను నమాజును నెలకొల్పేవానిగా చెయ్యి. నా సంతతి నుండి కూడా (ఈ వ్యవస్థను నెలకొల్పే వారిని నిలబెట్టు). ప్రభూ! నా ప్రార్థనను ఆమోదించు.''(ఖుర్ఆన్, సూరా ఇబ్రహీమ్ 14:40)


వారు ఇలా ప్రార్థిస్తూ ఉంటారు : "ఓ మా ప్రభూ! నువ్వు మా భార్యల ద్వారా, మా సంతానం ద్వారా మా కళ్లకు చలువను ప్రసాదించు. మమ్మల్ని దైవ భక్తిపరుల (ముత్తఖీన్‌ల) నాయకునిగా చేయి."(ఖుర్ఆన్, సూరా ఫుర్ఖాన్ 25:74)


"నా ప్రభూ! నాకు గుణవంతుడైన కుమారుణ్ణి ప్రసాదించు."(ఖుర్ఆన్, సూరాసాఫ్ఫాత్37:100)

 

హదీస్

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం పిల్లలకు ముద్దుపెట్టుకునేవారు మరియు వారిని అమితంగా ప్రేమించేవారు.అబూ హురైరా రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖనం: “దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అల్ హసన్ బిన్ అలీని ముద్దాడారు. అప్పుడు అల్ అఖ్రా బిన్ హాబిస్ అత్ తమీమ్ అక్కడ కూర్చుని ఉన్నారు. అతనుదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంతో ఇలా అన్నాడు: “నాకు పది పిల్లలు ఉన్నారు. కాని నేను ఏనాడూ వారిని ముద్దు పెట్టుకోలేదు.” దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అతని వైపు చూసి ఇలా అన్నారు, “ఇతరులపై కరుణ చూపని వాడిపై అల్లాహ్ కరుణ చూపడు.” (సహీహ్ బుఖారీ 5997)


దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రేమించడం మరియు వారి కొరకు పాటుబడటం చూసి చాలా సంతోషించేవారు. ఒకసారిదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “అల్లాహ్ ఎవరికైతే పిల్లలిచ్చాడో వారు పిల్లలను ప్రేమించి, వారి బాగోగులు చూసినచో, అల్లాహ్ వారిని (ఆ తల్లిదండ్రులను) నరకాగ్ని నుంచి కాపాడుతాడు.”

 

పిల్లలను మంచిగా పెంచడం

ఈ రోజుల్లో మనకుగణాంకాలు,పుస్తకాలు, పరిశోధనల ద్వారా పిల్లలను మంచిగా ఎలా పెంచాలో, ఇట్టే తెలిసిపోతుంది.దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం బోధించిన ప్రతి విషయం చాలా జ్ఞానంతో కూడినది. ఆయన ఒక చిన్న విషయాన్ని కూడా వదలిపెట్టలేదు. ఆయన మనకు ప్రేమను, ఓర్పును మొదలైన ఎన్నో మంచి గుణాలను నేర్పారు. పిల్లల్ని మంచిగా ఎలా తీర్చిదిద్దాలో ఈ వ్యాసంలో వివరించబడింది.ఒక మంచి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాలంటే, వీటిలోని మంచి మాటలపై అనుసరించడం తప్పనిసరి.

 

పిల్లలను అభినందించాలి

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం పిల్లల ముందు నుంచి ఎప్పుడు వెళ్ళిననూ ఆయనే మొదటగా వారిని ‘అస్సలాము అలైకుమ్’ అని అభినందించేవారు. స్వారీ చేస్తున్నప్పుడు పిల్లలను తనతో పాటు ఒంటెపై, గాడిదపై కూర్చోబెట్టుకునేవారు.(సహీహ్ ముస్లిం 2168)

 

వారిపై ప్రేమను చూపండి

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం పిల్లలపై తనకున్న ప్రేమను దాచేవారు కాదు. దాన్ని వెల్లడించేవారు. పిల్లలను తన చేతుల్లో ఎత్తుకునేవారు, వారితో ఆడేవారు, వారిని ముద్దాడేవారు.


అనస్ ఇబ్న్ మాలిక్ రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖనం: నేనుదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం కంటే ఎక్కువగా పిల్లలను ప్రేమించేవారిని చూడలేదు. ఆయన కొడుకు ఇబ్రాహీం ఓ నర్స్ పర్యవేక్షణలో ఉండేవారు. ఆమె మదీనాకు దూరంగా కొండల్లో ఉండేవారు.దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అక్కడకు వెళ్ళేవారు. మేము కూడా ఆయనతో పాటు వెళ్ళేవారము.దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇంట్లో ప్రవేశించగానే తన కొడుకును ఎత్తుకుని ముద్దుపెట్టుకునేవారు. ఆ తరువాత తిరిగి వెళ్ళేవారు.(సహీహ్ ముస్లిం 2316)

 

వారికి ప్రాధాన్యత ఇవ్వండి

పై హదీసు ద్వారా దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం పిల్లలను ఎంతగా ప్రేమించేవారో తెలిసివస్తుంది. ఈ విధంగా పిల్లలకు వారి ప్రాధాన్యత తెలుస్తుంది.దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం పిల్లలఇష్టాలకు కూడా ప్రాధాన్యమిచ్చేవారు.


అనస్ బిన్ మాలిక్ రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖనం:దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మాతో చాల కలిసిపోయేవారు. ఓసారి ఆయన ఇలా అన్నారు: “ఓ అబూ ఉమైర్ ! నుఘైర్ (ఒక రకమైన పిచ్చుక) ఏం చేసింది?” (సహీహ్ బుఖారీ 6129)

 

పిల్లలకు అల్లాహ్ తో గట్టి బంధాన్ని ఏర్పరచాలి

అబ్దుల్లా బిన్ అబ్బాస్ ఉల్లేఖనం: ఒకరోజు నేను దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం వెనుక ఉన్నాను. అప్పుడు ఆయన ఇలా అన్నారు, “ఓ యువకుడా! నేను నీకు కొన్ని మాటలు (హితోపదేశాలు) చెబుతాను.అల్లాహ్ ను స్మరిస్తూ ఉండు, అల్లాహ్నిన్ను రక్షిస్తాడు. అల్లాహ్ ను గుర్తుపెట్టుకో, అల్లాహ్ నీ ముందు ఉంటాడు. ఏదైనా అడగాలంటే, అల్లాహ్ నే అడుగు. ఏదైనా సహాయం కోరితే, అల్లాహ్ నే కోరు. పూర్తి ప్రపంచం కలిసి నీకు ఏదైనా మేలు చేయదలిస్తే, అల్లాహ్ ముందుగా నీకు నిర్ణయించిన మేరకే మేలు చేయగలరు. అలాగే ప్రపంచం మొత్తం కలిసి నీకు ఏదైనా కీడు చేయదలిస్తే, అల్లాహ్ ముందుగా నీకు నిర్ణయించిన మేరకే కీడు కలిగించగలరు. కలములు ఎత్తుకోబడ్డాయి, కాగితాలు పొడిఅయిపోయాయి.” (జామి తిర్మిజి vol 4:2516)

 

మతం, జాతి, రంగును చూడకుండా పిల్లలను ప్రేమించాలి

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ప్రేమకేవలంతనపిల్లలకోలేదామనువళ్ళకోపరిమితంకాలేదు.ఆయన ప్రేమ, కరుణ పిల్లలందరిపై సమానంగా ఉండేది. ఉసామా ఇబ్న్ జైద్ రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖించారు:దైవప్రవక్త


సల్లల్లాహు అలైహివ సల్లం ఒకతొడపై నన్ను, మరో తొడపై అల్ హసన్ ఇబ్న్ అలీ రజిఅల్లాహుఅన్హు ను కూర్చోబెట్టుకునేవారు. మా ఇద్దరిని కౌగిలించుకొని ఇలా అనేవారు, “ఓ అల్లాహ్! నేను వీరిపై కరుణ చూపినట్లు, నీవు కూడా వీరిపై కరుణ చూపు.” (సహీహ్ బుఖారీ 6003)

 

పిల్లలతో ఓర్పు వహించాలి, వారి భావాలను కించపరచకూడదు

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అందరి భావాలకు విలువనిచ్చేవారు. ఈ హదీసు దీని గురించి క్లుప్తంగా చెబుతుంది. అనస్ ఇబ్న్ మాలిక్ రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖనం:దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “నేను నమాజ్ మొదలుపెట్టినప్పుడు దీర్ఘంగా చదవాలని అనుకుంటాను. ఎవరైనా పిల్లాడు ఏడ్వడం వినపడగానే, నమాజ్ ను చిన్నదిగా చేస్తాను. ఎందుకంటే, ఆ పిల్లాడి తల్లి మనసు ఎంతగా ఉబలాటపడుతుందో నాకు తెలుసు.” (సహీహ్ బుఖారీ 709)


అబూ ఖతాద ఉల్లేఖించారు: “అబీ అల్ అస్ కూతురును (తన మనవరాలిని) తన భుజాలపై ఎత్తుకునిదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మా వద్దకు వచ్చారు. ఆయన నమాజు చేశారు.సజ్దా చేయాల్సి వచ్చినప్పుడు, ఆమెను క్రిందకు దించారు. తిరిగి లేచినప్పుడు ఆమెను మళ్ళి ఎత్తుకున్నారు.” (సహీహ్ బుఖారీ 5996)

 

వారికోసం వారి జీవితాన్ని ఆహ్లాదకరంగా చేయాలి

మహమూద్ బిన్ రాది రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖించారు:నాకు ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు, నాకు గుర్తుంది,దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఒక బకెట్ లో నుంచి నీళ్ళు తీసి తన నోటిలో ఉంచుకుని, దాన్ని నా ముఖం మీద పుక్కిలించారు.(సహీహ్ బుఖారీ 77)

 

సరిపోలని ఓర్పు

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం పిల్లలపై చూపే ఓర్పు సరిపోలనిది. ఈ హదీసు ద్వారా అది నిరూపితమౌతుంది. ఆయిషా రజిఅల్లాహుఅన్హ ఉల్లేఖనం: దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంఒకపిల్లాడిని తహ్నిక్ (ఒక ఖర్జూర పండును తన నోటిలో నమిలి దాని ద్రవాన్ని ఆ పిల్లాడి నోటిలో వేశారు) కోసం తన ఒడిలోకి తీసుకున్నారు. అప్పుడే ఆ పిల్లాడు మూత్రం పోశాడు.దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం కొంచెం నీళ్ళు తెప్పించుకొని, వాటిని మూత్రం పోసిన చోట వేశారు.(సహీహ్ బుఖారీ 6002)

 

పిల్లలు విఫలం అయినచో, వారిని విఫలురు అనుకోకూడదు

అనస్ రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖనం: నేనుదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంకు పది సంవత్సరాలు సేవ చేశాను. ఆయన ఒక్కసారి కూడా ‘ఉఫ్’ (అసహనం చూపుతూ అనే ఎలాంటి పదం) అనలేదు. “ఇలా ఎందుకు చేశావు లేదా ఇలా ఎందుకు చేయలేదు” అనినన్ను ఎన్నడూ నిందించలేదు.(సహీహ్ బుఖారీ, కితాబుల్అదబ్, 6038)


కావున మనము కూడా పిల్లలకు ప్రోత్సహిస్తూ, వారికి ఎదిగే అవకాశం ఇవ్వాలి. దాని కోసం ఎంత సమయం తీసుకున్న సరే!

 

పిల్లల అనుచిత ప్రవర్తనను విస్మరించాలి

చిన్న పిల్లల అనుచిత ప్రవర్తనలను చూసీ చూడనట్టు వదిలి పెట్టాలి. ఈ విషయంలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంను ఉదాహరణగా తీసుకోవాలి.


అనస్ బిన్ మాలిక్ రజియల్లాహుఅన్హు ఉల్లేఖనం: “దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇతరులతో వ్యవహరించే తీరు అత్యుత్తమమైనది. ఒక రోజు ఆయన నన్ను ఒక పనిపై వెళ్ళమన్నారు. ‘నేనువెళ్ళను’ అని నేను జవాబిచ్చాను. కానిదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఆదేశించారు కావున ఆ పని చేయాలి అని నేను మనసులో అనుకున్నాను. నేను ఆ పనిపై వెళుతుండగా దారిలో కొందరు పిల్లలు ఆడుతూ ఉన్నారు. ఆ సమయంలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అక్కడకు చేరి వెనుకనుంచినా మెడ పట్టుకున్నారు. నేనువెను తిరిగి చూస్తే, ఆయనచిరునవ్వు చిందిస్తూ కనిపించారు.అప్పుడుదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అడిగారు: “ఉనైస్(అనస్మారుపేరు), నేను చెప్పిన చోటికి వెళ్ళావా?” దానికి నేను, “ఓ దైవప్రవక్తా! అవును, వెళుతున్నాను” అని జవాబిచ్చాను.(సహీహ్ ముస్లిం 2310 a, 2309 e)

 

పిల్లలందరినీ సమానంగా చూడాలి

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ముస్లింలందరూ తమ పిల్లలను (ఆడ, మగ) సమానంగా చూడాలని ఆదేశించారు. “అల్లాహ్ కు భయపడండి. మీ పిల్లలకు న్యాయం చేయండి.” (సహీహ్ బుఖారీ 2587)

 

వారు చెప్పే దానిని వినాలి

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం చిన్న పిల్లలపై శ్రద్ధ చూపేవారు. వారు ఏదైనా చెప్పదలుచుకుంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం వారి మాటలను చాలా శ్రద్ధగా వినేవారు.

 

వ్యక్తిత్వాన్ని నిర్మించే విషయంలో రాజిపడకూడదు

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం పిల్లలపై చూపిన ప్రేమ మరియు వాత్సల్యం కేవలం హావభావాల కోసం కాదు. ఆయన వారి వ్యక్తిత్వాల్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేసేవారు. వారిని సమాజానికి ఉపయోగాన్ని చేకూర్చే వారిగా మలిచేవారు.

 
దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం పిల్లలను పెద్దవారి సమావేశాల్లో తీసుకెళ్ళేవారు. దీని వలన వారి జ్ఞానం పెరుగుతుంది. సహచరులు కూడా దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంతో సమావేశమైనప్పుడు తమ పిల్లలను తమతో పాటు తీసుకు వచ్చేవారు. ఈ విషయాన్ని ధృవీకరించే హదీసును ముఆవియా ఇబ్న్ ఖుర్రా గారి తండ్రి ఉల్లేఖించారు: “దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తన సహచరులతో కలిసి కూర్చునేవారు. ఒకతను తనతో పాటు తన కొడుకును తీసుకు వచ్చాడు.దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఆ పిల్లాడిని వెనుక నుంచి తీసుకొచ్చి తన ముందు కూర్చోబెట్టారు...” (సునన్ నసాయి vol 3:2088)

 
దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం పిల్లలకు మంచి మర్యాదలు, ప్రవర్తనలు నేర్పించేవారు. అబూ హురైరా రజియల్లాహుఅన్హు ఉల్లేఖించిన హదీసులో దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “యువకులు ముసలివాళ్ళను సలాం చేయాలి , నడుస్తున్నవారు కూర్చుని ఉన్న వారిని సలాం చేయాలి, చిన్న సమూహం పెద్ద సమూహాన్ని సలాం చేయాలి.” (సహీహ్ బుఖారీ 6231)

 
ఇతరుల ముందు పిల్లలకు దక్కాల్సిన గౌరవ మర్యాదలను వారికి ఇచ్చేవారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం. ఈ హదీసు ద్వారా అది నిరూపితమవుతుంది: సహల్ ఇబ్న్ సాద్ ఉల్లేఖనం:దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం వద్దకు ఒక కప్పు వచ్చింది. అందులో నుంచిఆయన త్రాగారు.దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం కుడి వైపు అందరికంటే వయసులో చిన్నవాడైన ఒక బాలుడు ఉన్నాడు మరియు పెద్దవారంతా ఎడమ వైపు ఉన్నారు.దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “ఓ బాలుడా! నేను దీన్ని ఈ పెద్దవారికి ఇవ్వడానికి అనుమతి ఇస్తావా?” ఆ బాలుడు ఇలా అన్నాడు: “ఓ దైవప్రవక్తా! నావాటాలో వచ్చే దాన్ని నేను ఇతరులకు ఇవ్వదలచుకోలేదు.” అప్పుడుదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఆ కప్పును అతనికి (బాలునికి) ఇచ్చారు.(సహీహ్ బుఖారీ 2366)

 

ఆధారాలు

http://www.farhathashmi.com/articles-section/seerah-and-sunnah/prophet-muhammad/ (ఇంగ్లీష్)
 

382 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్