దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం వినయం


వినయం, వినమ్రత ఉన్నతమైన సద్గుణాలు. ఈ సద్గుణాలు లేనివాడు అవిశ్వాసి. ఇది అవిశ్వాసానికి ప్రతీక. మనిషి కోపంలో ఉన్నప్పుడు అతని ముఖం ఎర్రగా మారిపోతుంది. ఆ సమయంలో దీని ప్రభావం కనపడుతుంది.దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం చాలా వినయులు మరియు సిగ్గరి.అనేక ఉల్లేఖనల ద్వారా ఏమని తెలుస్తుందంటే,దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఒక కన్య కన్నా ఎక్కువగా వినయం చూపేవారు మరియు సిగ్గుపడేవారు. ఆయన ఎన్నడూ ఎత్తైన గొంతుతో గానీ, అసభ్యకరంగా గానీ మాట్లాడేవారు కాదు. బజారులో వెళ్ళినప్పుడు అందరితో చిరునవ్వు చిందిస్తూ పలకరించేవారు. ఏదైనా అసభ్యకరమైన మాట వింటే, ప్రజలను(ఆ మాట అన్నవారిని) దూషించేవారు కాదు. కాని, ఆయన ముఖం ద్వారా ఆయన భావాలూతెలిసిపోయేవి(కోపంగా ఉన్నారని). దాన్ని అనుచరులు వెంటనే గమనించి మౌనంగా ఉండిపోయేవారు.దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఎన్నడూ తన నోటిలోని భాగం కనపడేలా బిగ్గరగా నవ్వేవారు కాదు, కేవలం చిరునవ్వు చిందించేవారు అని ఆయిషా (రజి) అన్నారు.

 

విషయసూచిక

 

హదీస్

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “వినయం విశ్వాసపు శాఖ.” ఇంకా ఆయన ఇలా అన్నారు, ‘నిస్సందేహంగా, వినయం మరియు విశ్వాసం కలిసి ఉన్నాయి.’

 

ఖుర్ఆన్

ఓ విశ్వాసులారా! మీకు అనుమతి లేనిదే మీరు ప్రవక్త ఇండ్లలోకి వెళ్ళకండి. భోజనార్థం మీకు పిలుపు అందినపుడు మాత్రం వెళ్ళండి. అయితే భోజనం తయారయ్యేవరకు వేచి ఉండే విధంగా కాదు. మరి భోజనం చేసిన వెంటనే బయలుదేరండి. కబుర్లు చెప్పుకుంటూ అక్కడే ఉండిపోకండి. ఈ రకమయిన మీ ప్రవర్తనవల్ల ప్రవక్తకు బాధ కలుగుతుంది. మొహమాటం కొద్దీ అతను మీకేమీ చెప్పడు. (ఖుర్ఆన్ సూరా అహజాబ్ 33:53)

 

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం వినయం గురించి ఆయన అనుచరులు సాక్ష్యమిచ్చారు

సాక్ష్యం 1:

ఇబ్న్ ఉమర్ ఉల్లేఖనం ప్రకారం అన్సార్ లోని ఓ వ్యక్తి తన సోదరునికి అతని సిగ్గు మరియు వినయానికి, అతన్ని కోప్పడుతున్నాడు. అదిచూసిదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు, “అతన్ని కోప్పడకు. సిగ్గు విశ్వాసంలోని ఒక భాగం.”

 

సాక్ష్యం 2:

జైద్ ఇబ్న్ తల్యా ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “ప్రతి ధర్మానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇస్లాం ప్రత్యేకత వినయం మరియు వినమ్రత.” అబూ హురైరా ఉల్లేఖించారు: “తనకు సమర్పించబడిన ఆహారాన్ని దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఎన్నడూ విమర్శించలేదు. నచ్చితే తినేవారు, లేకుంటే దాన్ని వదిలేసేవారు (ఎలాంటి పేరు పెట్టకుండా).”

 

సాక్ష్యం 3:

ఇబ్న్ మసూద్ ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “నా అనుచరుల్లో ఎవరూ ఇతరుల గురించి నాకు చెడుగా చెప్పకూడదు. నేనుప్రతిఒక్కరి వద్దకు ఎలాంటిచెడు అభిప్రాయాలూ లేకుండా రావాలని అనుకుంటాను.” అబ్దుల్లా ఇబ్న్ ముసలం ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు:పూర్వపు ప్రవక్తలందరూ వినయం గురించి బోధించారు. వినయం లేని వాడు ఏదైనా చేయవచ్చు.” దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మక్కాలో ఓ వర్తకునిగా మరియు ప్రవక్తగా; మదీనాలో ఓ రాజ్యాధినేతగా మరియు ప్రవక్తగా చాలా సాదాసీదా జీవితాన్ని గడిపారు.మక్కాలో ఒక వర్తకునిగా గడిపిన జీవితంలో మరియు మదీనాలో ఒక రాజ్యాధినేతగా గడిపిన జీవితంలో ఎలాంటి మార్పు రాలేదు. ఉమర్(రజి) ఉల్లేఖనం ప్రకారందైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “మర్యం కుమారుడైన ఈసాను క్రైస్తవులు పొగిడినట్టుగా, మీరు నన్ను పొగడకండి. నేను కేవలం అల్లాహ్ దాసుణ్ణి. కాబట్టి నన్ను దైవప్రవక్త మరియు అల్లాహ్ దాసుడు అని పిలవండి.” (సహీహ్ బుఖారీ)

 

సాక్ష్యం 4:

అబ్దుల్లా బిన్ అబూ ఔఫా ఉల్లేఖనం : “దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తన దాసులతో గానీ, విధవరాల్లతో గానీ వారి పనుల కోసం వెళ్ళడానికి వెనుకాడేవారుకాదు.” అనస్(రజి) ఉల్లేఖనం ప్రకారం, ఏ బానిస బాలిక లేదా సేవకురాలు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంచేయిని పట్టుకొని, తనకు నచ్చింది చెప్పేది మరియు తనకు నచ్చిన చోటికి తీసుకెల్లేది. అదీ బిన్ హాతిందైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంను కలవడానికి వచ్చారు.దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఆయనను ఇంటి లోపలికి పిలిచారు. ఓ సేవకురాలు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం విశ్రాంతి తీసుకోవడానికిఓ పరుపు తెచ్చింది. కానిదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం దాన్ని తమ ఇద్దరి మధ్యలో ఉంచి, తాను భూమి మీద కూర్చున్నారు. ఇది చూసి ఆదీ, తరువాత ఇలా అన్నారు; దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం రాజు కాదు, దైవప్రవక్త.

 

సాక్ష్యం 5:

అనస్(రజి) ఉల్లేఖనం:దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం రోగగ్రస్తుల్ని సందర్శించేవారు, అంత్యక్రియలకు హాజరయ్యేవారు, గాడిదపై పయనించేవారు మరియు బానిస పిలుపుపైఅతని ఇంటికి భోజనానికి వెళ్ళేవారు.జాబిర్(రజి) ఉల్లేఖనం,దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం బలహీనుల కోసం తన నడకను నెమ్మది గావించేవారు మరియు వారి కోసం ప్రార్ధన చేసేవారు. అనస్(రజి) ఉల్లేఖనం,దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంకుకేవలం రొట్టెముక్క మరియు రుచి మారిపోయిన పులుసు ఇచ్చిననూ, ఆయన ఎవరి ఆహ్వానాన్ని తిరస్కరించేవారు కాదు.

 

సాక్ష్యం 6:

అనస్(రజి) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు:“నేను అల్లాహ్ దాసుణ్ణి. నేనుబానిసలా తింటాను, బానిసల కూర్చుంటాను.” అబ్దుల్లా బిన్ అమ్ర్ (రజి) ఉల్లేఖనం: “దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఒకసారి మా ఇంటికి వచ్చారు. నేను ఆయనకు బెరడు పరుపును ఇచ్చాను. కానిఆయన దాన్ని మా మధ్య ఉంచి, భూమిపై కూర్చున్నారు.” దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తనఇంటిని శుభ్రపరిచేవారు,ఒంటెలకు పగ్గాన్ని కట్టేవారు, జంతువులకుఆహారాన్ని తినిపించేవారు, తన సేవకులతోపాటు భోజనం చేసేవారు, తన సేవకులకు పిండి రుబ్బడంలో, బజారు నుండి సమానులు తేవడంలో సహాయపడేవారు.

 

విశ్లేషణ

ఇవిదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం వినయానికి, వినమ్రతకు ఉదాహరణలు.దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంను అనుసరించడానికి ఈ ఉదాహరణలు చాలు. సర్వోన్నతుడైన అల్లాహ్ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంప్రవర్తనను అందరికోసం ఆదర్శవంతంగా చేశారు. అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా సెలవిస్తున్నాడు:నిశ్చయంగా దైవప్రవక్తలో మీ కొరకు అత్యుత్తమ ఆదర్శం ఉంది- అల్లాహ్‌ పట్ల, అంతిమ దినం పట్ల ఆశ కలిగి ఉండి, అల్లాహ్‌ను అత్యధికంగా స్మరించే ప్రతి ఒక్కరి కొరకు.(ఖుర్ఆన్ సూరా అహజాబ్ 33:21)

 

ఆధారాలు

http://www.pbuh.us/prophetMuhammad.php?f=Ch_Modesty (ఇంగ్లీష్)

 

376 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్