దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం విద్యాపరమైనపద్ధతులు


దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం యావత్ మానవాళికి ఆదర్శమూర్తులు. కావున ఆయన అవలంబించిన విద్యాపరమైన పద్ధతులను మనం కూడా అమలుచేసినచో,దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తమ లక్ష్యంలో సాఫల్యం పొందినట్టే, మనం కూడా సాఫల్యం పొందగలము.

 

విద్యా విధానంలో అన్నిటికంటే ముఖ్యమైనది, బోధించే విధానం. ప్రజలకు, అందులోనూ యువకులకు మంచి విషయాలు నేర్పడం చాలా ముఖ్యం. కాని ఇది ప్రభావంతమైన విధంగా చేయాలి.సాధారణంగా నచ్చని ఉపాధ్యాయుడు చెప్పే విషయం కూడా నచ్చదు. మంచి ఉపాధ్యాయుడు తన శిష్యులను ప్రేమిస్తాడు, వారి గురించి శ్రద్ద వహిస్తాడు, తనవృత్తికి న్యాయం చేస్తాడు.దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తన కర్తవ్యాన్ని నెరవేర్చడంలో పూర్తిగా నిమగ్నమైపోయేవారు.దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం వద్ద ఒక ఉపాధ్యాయునిలో ఉండాల్సిన లక్షణాల కంటే ఎక్కువ ఉండేవి. చెప్పే విషయం కన్నా చెప్పే విధానం చాలా ముఖ్యం అనిమానసిక నిపుణులు అంటారు. ఒక పరిశోధన ప్రకారం – పలికే మాటలు ఏడు శాతం, గొంతులోని గాంభీర్యం ముఫ్ఫై ఎనిమిది శాతం, హావభావాలు మరియు శరీర భాష యాభై ఐదు శాతం వినేవాడిపైప్రభావం చూపుతాయి.


దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం లాంటివక్త, ఉపన్యాసకులు ఏ యుగంలోనూ జన్మించలేదు.ఆయన చెప్పే మాట ఎదుటి వాని మనసులో దిగేలా చెప్పడంలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంకు ఎవరూ సాటిలేరు. అందువల్లేఆయన అందరి హృదయాల విజేత అయ్యారు.ఆయన ముందుగా ప్రజల హృదయాలను దోచుకున్నారు, ఆ తరువాత వారికి బోధించడం ప్రారంభించారు.దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తన ఉపన్యాసాల్లో ప్రజలను వశపరిచే విధానం అవలంబించారు. దాని ద్వారా ప్రజలు ఆయన మాటలపై ఆలోచించడం మొదలెట్టారు. ఈ విధంగా దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తన బోధనల ద్వారా ప్రజల ప్రవర్తనలో నిలకడను మరియు ఓ నవయుగాన్ని తెచ్చారు.

 

 

విషయసూచిక

 

ఆయన మంచి ప్రవర్తనను ప్రోత్సహించేవారు

ప్రజలు మంచి పనులు చేయాలి మరియు చెడు నుండి దూరంగా ఉండాలి అంటే, వారిని మంచి పనులు చేసినప్పుడు దానికి తగిన ప్రతిఫలం ఇచ్చి ప్రోత్సహించాలి.


ఒకసారిదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం(కాలకృత్యాలు తీర్చుకోవడానికి)మరుగుదొడ్డిలోకి వెళ్లారు. నేనుఆయన వుజూ కోసం అక్కడ నీళ్ళు ఉంచాను. “ఈ నీళ్ళను ఇక్కడ ఎవరు ఉంచారు” అనిదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అడిగారు. ఎవరు పెట్టారో ఆయనకు చెప్పబడింది. అప్పుడుదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా దుఆ చారు: “ఓ అల్లాహ్!ఇతన్ని(ఇబ్న్ అబ్బాస్ ను) ధార్మిక (ఇస్లామీయ) విద్వాంసునిగా చేయి.” (సహీహ్ బుఖారీ vol 1:143)

 

ఆయన ఏదైనా విషయం గురించి చెప్పేటప్పుడు దానికి సంబంధించిన ఉదాహరణను ఇచ్చేవారు

బోధపరిచే మంచి విషయాల్లో, దానికి సంబంధించిన ఉదాహరణలు మరియు కథలు చెప్పడం చాలా అవసరం. ఎందుకంటే, దీని ద్వారా అవి మనసులో ఎల్లప్పుడూ గుర్తుండి పోతాయి.అందుకే,ఆయన ఏదైనా విషయం గురించి చెప్పేటప్పుడు దానికి సంబంధించిన ఉదాహరణను ఇచ్చేవారు.నమాజ్ గురించి చెప్పేటప్పుడు ఆయన ఇలా అన్నారు: “ఒక మనిషి ఇంటి ముందు సెలయేరు ఉండి, అందులో అతను ఐదు సార్లు స్నానం చేస్తే, అతని శరీరంపై మురికి ఉంటుందా? అక్కడున్నవారు, “లేదు, అతని శరీరంపై ఎలాంటి మురికి ఉండదు” అని జవాబిచ్చారు. అప్పుడుదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “ఐదు పూటల నమాజు కూడా అంతే. దీని వల్లఅల్లాహ్ మనిషినిపాపాల నుండి పరిశుద్ధ పరుస్తాడు.” (బుఖారీ, మవాఖిత్ 6; తిర్మిజి, అదబ్ 80)

 

ఆయన స్వయంగా అమలు చేసి చూపేవారు

బోధపరిచే విషయంలో స్వయంగా దానిపై అమలు చేసి చూపడం చాల ఉత్తమమైన పద్ధతి. ఇలా చేయడం వల్ల ప్రజలు దాన్ని మరచిపోరు.
దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం వుజూ గురించి తెలుసుకోవాలనుకున్న ఒక మనిషికి వుజూ చేసే విధానాన్ని స్వయంగా చేసి చూపించారు. కొన్ని ఉల్లేఖనాల్లో మూడు సార్లు అని ఉంది.(సునన్ అబీ దావూద్, తహారత్ 106)


అమలు చేసి చూపించడం వల్ల చూసే వాడి కళ్ళు, చెవులు రెండూ దాన్ని గ్రహిస్తాయి. దీని వల్ల అది మదిలో ఎప్పటికీ ఉండిపోతుంది.

 

ఆయన చిత్రలేఖనాల ద్వారా ప్రజలకు బోధపరిచేవారు

చిత్రలేఖనాల ద్వారా బోధించడం కూడా చాలా ఉత్తమమైనది. దీని వల్ల చెప్పబడిన విషయం వినేవాడి మస్తిష్కంలో ఎప్పటికీ ఉండిపోతుంది.మెదడులోని కుడి భాగం చిత్రాలను తొందరగా పొందుపరుచుకుంటుంది. అవిచాలా రోజుల వరకు జ్ఞాపకం ఉంటాయి మరియు తొందరగా అర్ధమవుతాయి.


జాబిర్ రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖించారు: ఒకసారి నేను దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంతో కలిసి కూర్చుని ఉండగా, అయన భూమిమీద ఒక గీత గిసి ఇలా అన్నారు, “ఇది అల్లాహ్ మార్గం.” ఆ తరువాత ఆయన ఆ గీతకు కుడి ప్రక్కన రెండు గీతలు మరియు దాని ఎడమ వైపు మరో రెండు గీతలు గీసి, “ఇవి షైతాన్ మార్గాలు” అని అన్నారు. ఆ తరువాత మధ్య గీతపై తన చేయిని ఉంచి ఖుర్ఆన్ లోని ఈ ఆయతును పఠిoచారు: “ఇదే నా రుజుమార్గం. కనుక మీరు దీనినే అనుసరించండి. ఇతరత్రా మార్గాలను అనుసరించకండి. అవి మిమ్మల్ని అల్లాహ్‌ మార్గం నుండి వేరు పరుస్తాయి. మీరు భయభక్తుల వైఖరిని అవలంబించేటందుకుగాను అల్లాహ్‌ మీకు ఈ విధంగా తాకీదు చేశాడు.”(ఖుర్ఆన్, సూరాఅనామ్ 6:153)

 

కొన్నిటిని పునరావృతం చేసేవారు

ఏదైనా బోధించేటప్పుడు అందులోని ముఖ్యాంశాలను మరీ మరీ నొక్కి చెప్పడం చాలా అవసరం. దీని వల్ల దాని ప్రాముఖ్యత తెలిసి వస్తుంది మరియు అది ఎల్లకాలం గుర్తుండిపోతుంది. మరీ మరీ చెప్పడం వల్ల లేదా చదవడం వల్ల, అది చిన్న మెదడులో నుంచి పెద్ద మెదడులోకి వెళుతుంది. ఎక్కువ సార్లు చదవడం లేదా చెప్పడం వల్ల, అది మస్తిష్కంలో గట్టిగా ఉండిపోతుంది. కావున చాలా రోజుల తరువాత దాని అవసరం వచ్చిననూ అది వెంటనే గుర్తుకు వస్తుంది. అందువల్లేదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఏదైనాకొత్తవిషయాన్నితనసహచరులకుచెప్పేటప్పుడు, దాన్నిమూడు సార్లు చెప్పేవారు. దీని వల్ల ఆ విషయం మరియు అందులోని ముఖ్యాంశాలు వారి మదిలో చాలా గట్టిగా నాటుకుపోయేవి.ఎన్ని సార్లు చెప్పాలనేది వినేవారి జ్ఞాపక శక్తిపై కూడా ఆధారపడి ఉంటుంది. కొందరు ఒక్కసారి చెబితే గుర్తుంచుకుంటారు, మరి కొందరు ఎక్కువసార్లు చెబితేనే గుర్తుంచుకోగలరు.అనస్ రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖనం:దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఏదైనావిషయాన్ని మూడు సార్లు చెప్పేవారు. అది మంచిగా అర్ధం అవ్వాలని ఆయన ఇలా చేసేవారు.” (సహీహ్ బుఖారీ 6244)

 

నేర్చుకునేవారికి వ్రాయటం అలవాటు చేసేవారు

ఏదైనా విషయాన్ని నేర్చుకోవాలనుకుంటే దాన్ని వ్రాసుకోవడం చాలా ఉత్తమం.వ్రాసేటప్పుడు వ్రాసే వాని ధ్యానమంతా ఆ విషయంపైనే ఉంటుంది. ఇంకా తరువాత చదువుకోవటానికి అతని దగ్గర ఓ వ్రాత ప్రతి ఉంటుంది. ఒకసారి వ్రాయడం వంద సార్లు చదవడంతో సమానం. వ్రాయడం వల్ల ఆ విషయం ఒకేసారి కాగితంపైననూ మరియు మస్తిష్కంలోనూ ఉండిపోతాయి. దీని గురించి దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “వ్రాయడం ద్వారా జ్ఞానాన్ని పరిరక్షించుకోండి.” జ్ఞానాన్ని పంచిన యుద్ద ఖైదీలను విడిచివేసేవారు.దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం జ్ఞానాన్ని బోధించడాన్ని, అర్జించడాన్ని ఎంత విలువ ఇచ్చేవారో దీని ద్వారా మనకు తెలుస్తుంది.(ముస్నద్ అహ్మద్ vol 4/ పేజి 47)

 

ప్రవర్తనను తప్పుపట్టేవారు, మనిషిని కాదు

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంను అల్లాహ్ ప్రజలకు మంచినైతికత నేర్పడానికి పంపించాడు. కావున అల్లాహ్ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ద్వారా మంచి పనులు మరియు మంచి కర్మలే చేయించాడు. చెడు మాటలు మనసుపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. అందువల్లేదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఎన్నడూ చెడు మాట మాట్లాడలేదు. ఆయన తన శత్రువుతోనూ చెడు వచనం పలుకలేదు. ఎదుటి వాని మనసును నొప్పించే మాట ఆయన నోటి నుండి ఎన్నడూ రాలేదు.తనను వేధించిన వారితో కూడా ఆయన ఎప్పుడూ దురుసుగా ప్రవర్తించలేదు. వారి తప్పులను సరిదిద్దటానికి ప్రయత్నించారు. ఎవరిలోనైనా ఏదైనా తప్పును చూసినప్పుడు,దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం సూటిగా ఆ మనిషి ముఖంపై దాని గురించి చెడుగా చెప్పేవారు కాదు.


దీని గురించి దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “ఇలా చెప్పేవారు లేదా చేసేవారి గతి ఏమగును!” (సునన్ అబీ దావూద్ 4788 – షేక్ అల్బాని గారు దీన్ని ధ్రువీకరించారు)

 

ముగింపు

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అవలంబించిన విద్య విధానాలు సహచరులను మొత్తం ప్రపంచంలోనే ఉన్నత స్థాయికి చేర్చాయి. ఆ తరం లాంటి వారు ఎన్నటికీ రాలేరు. వారి సమానం కాదు కదా, వారి దరిదాపులకు కూడా ఎవరూ చేరలేరు.దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం జీవితాన్ని, ఆచరణలను ఆదర్శంగా తీసుకున్నచో మన సమస్యలన్నీ తీరిపోతాయి. మనం ఎంతో ఎత్తుకు ఎదుగగలం. మనం వీటిని నిర్లక్ష్యం చేసినచో, కోల్పోయేది కూడా మనమే. వీటికి ప్రాధాన్యత ఇవ్వక పోవడం చాలా పెద్ద పొరపాటు.దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం జీవితాన్ని, ఆచరణలను ఆదర్శంగా తీసుకున్న వారు తప్పకుండా సాఫల్యం పొందుతారు.

 

ఆధారాలు

http://www.thepenmagazine.net/the-educational-methods-of-our-prophet-pbuh/ (ఇంగ్లీష్)
 

344 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్