దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం జీవితంలో జరిగిన కొన్ని ముఖ్య సంఘటనలు


దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మక్కాలో 571 CE లో సోమవారం నాడు జన్మించారు. అది ఏనుగుల సంవత్సరం. ఆయన తండ్రి పేరు అబ్దుల్లా ఇబ్న్ అబ్దుల్ ముత్తలిబ్. ఆయనదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం జన్మించకముందే మక్కాలోమరణించారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఐదు వంశాల పరంపర – ముహమ్మద్ ఇబ్న్ అబ్దుల్లా ఇబ్న్ అబ్దుల్ ముత్తలిబ్ ఇబ్న్ హాషిం ఇబ్న్ అబ్ద్ మనాఫ్ ఇబ్న్ ఖుసై ఇబ్న్ కిలాబ్.

 

విషయసూచిక

 

ఖుర్ఆన్

“ఇంకా – మేము నీ కీర్తిని ఉన్నతం చేశాము.అయితే (ప్రతి) కష్టంతో పాటే సౌలభ్యం కూడా ఉంది.” (ఖుర్ఆన్, సూరా షర్ 94:4,5)

 

571 నుంచి 595 CE వరకు జరిగిన సంఘటనలు

571 CE: దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం సౌదీ అరేబియాలోని మక్కాలో సోమవారం నాడు జన్మించారు.

 

576 CE: దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తల్లి ఆమినా మరణించారు. అప్పుడుదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం వయసు 6 సంవత్సరాలు మాత్రమే. ఆయనఅనాథ అయిపోయారు. బనీ హాషిం తెగకు నాయకులైన అబ్దుల్ ముత్తలిబ్ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంకుసంరక్షకులు అయ్యారు. ఆయనదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం గారికి తాత అవుతారు.


578 CE: దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తాత అబ్దుల్ ముత్తలిబ్ గారి మరణం. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం గారి చిన్నాన అబూ తాలిబ్ ఆయనకు సంరక్షకులు అయ్యారు.


582 CE:అబూ తాలిబ్ సిరియాకు ప్రయాణిస్తారు. అక్కడ క్రైస్తవుల సమూహం ఒకటి దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ప్రవక్తత్వం గురించి చెబుతుంది.


595 CE: దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం 25 ఏళ్లకు ఖదీజా రజిఅల్లాహుఅన్హాను వివాహమాడారు. అప్పుడు ఆమె వయసు 40 సంవత్సరాలు.దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం కంటే 15 సంవత్సరాలు ఎక్కువ. ఆమె ఓ ఉత్తమురాలైన విధవ మరియు ధనవంతురాలు.

 

602 నుంచి 615 CE వరకు జరిగిన సంఘటనలు

602-609 CE

సమాజంలో ఉన్న హింస, అనైతికత, వ్యభిచారం చూడలేక దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం హిరా అనే గుహకు వెళ్ళేవారు. అది జబల్ అన్ నూర్ అనే పర్వతం వద్ద ఉంది. అది మక్కా నగర పొలిమేర్లలో ఉంది. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అక్కడకు వెళ్లి ధ్యానం చేసేవారు.

 
610 CE

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఆ హిరా గుహ దగ్గర ఉన్నప్పుడే ఆయనకు అల్లాహ్ ప్రవక్తగా నియమించాడు. దైవదూత జిబ్రయీల్ అలైహిస్సలాం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం వద్దకు వచ్చి ‘చదువు’ అని అన్నారు. ఖుర్ఆన్ లోని “(ఓ ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం!) చదువు, సృష్టించిన నీ ప్రభువు పేరుతో.......” సూరా అలఖ్ 96:1-5 అక్కడే అవతరించింది.

 
613 CE

ప్రజల్లోఇస్లాంప్రబోధించడం ప్రారంభమయింది.శక్తివంతులైన ఖురైష్ నాయకులు ముస్లింలను వేధించడం మొదలెట్టారు. కొందరు ముస్లింలు చంపబడ్డారు (యాసిర్మరియు అతని భార్య సుమయ్యా), కొందరు కాల్చబడ్డారు, కొట్టబడ్డారు(బిలాల్ మొదలైనవారు), మరికొందరుకొరడాతో కొట్టబడ్డారు (ఉస్మాన్, ఖబ్బాబ్, అమ్మార్రజిఅల్లాహు అన్హుం మొదలైనవారు).

 
615 CE

మక్కాలో తమపై జరుగుతున్న అత్యాచారాలను తట్టుకోలేక దాదాపు 70మంది ముస్లింలు అబిసీనియాకు వలస వెళ్లారు.అక్కడ వారు క్రైస్తవ రాజు నెగస్ ఆశ్రయంపొందారు.

 

616 నుంచి 625 CE వరకు జరిగిన సంఘటనలు

616 CE

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం చిన్నాన హమ్జా రజిఅల్లాహుఅన్హు మరియు ఉమర్ రజిఅల్లాహుఅన్హు ఇస్లాం స్వీకరించారు. దీనివల్ల ముస్లింల మనోస్థైర్యం పెరిగింది. ముస్లింల మనోబలం పెరగడం చూసి మక్కా ఖురైషులు, ముస్లింలను మరియు వారిని రక్షించే తెగలను సామాజిక బహిష్కరణ చేశారు. ముస్లింలు ఏకాంతంగా షఅబ్ అబీ తాలిబ్ అనే లోయలోజీవితం గడపసగారు. ముస్లింలు మరియు వారి రక్షకులు చాలా కష్టాలను ఎదుర్కున్నారు.

 

619 CE

సామాజిక బహిష్కరణ అంతమైపోయింది.దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంకు అండగా ఉన్న ఇద్దరు –భార్యఖదీజా రజిఅల్లాహుఅన్హా మరియు చిన్నాన అబూ తాలిబ్ రజిఅల్లాహుఅన్హు మరణించారు.ఇస్రా మరియు మేరాజ్ సంఘటనలు సంభవించాయి - దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంను అల్లాహ్ ఒక రాత్రిలో కాబా నుండి బైతుల్ మఖ్దిస్ తీసుకెళ్ళారు మరియు స్వర్గ నరకాలు చూపించారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అల్లాహ్ ను కలిశారు. ముస్లింలపై ఐదు పూటల నమాజ్ తప్పనిసరి చేయబడింది.


620 CE

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తాయిఫ్(మక్కాకు దక్షిణ దిశగా)కు వెళ్లారు. కాని, అక్కడి ప్రజలు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంపై రాళ్ళు రువ్వారు. మదీనా(యత్రిబ్) నుండి ఆరు మంది ఇస్లాం స్వీకరించారు.

 
621 CE

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంకు విధేయత చూపుతామని 12 మంది మదీనా ముస్లింలు మొదటిసారి ‘అఖబా’ వాగ్దానం చేశారు.దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ముసాబ్ ఇబ్న్ ఉమైర్ ను ఇస్లాం ప్రభోదించటానికి మదీనా పంపారు.

 
622 CE

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంకు అండగా నిలుస్తామని మరియు అవసరమైతే ప్రాణాలను సైతం త్యాగం చేస్తామని - 72 మంది మదీనా ముస్లింల సమూహంరెండో అఖబా వాగ్దానం చేశారు.ప్రతి నాలుగు ఇండ్లలో ఒక ఇల్లు ఇస్లాం స్వీకరించింది అని ముసాబ్ రజిఅల్లాహుఅన్హు తెలియజేశారు. మదీనా వాసులు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంను మదీనాకు రమ్మని ఆహ్వానించారు.

 
622 CE

వలస వెళ్ళడం.దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం (మక్కా వాసులైన) తన సహచరులతో మదీనా నగరానికి వలస వెళ్లారు. ముందు తన సహచరులను సురక్షితంగా మక్కా నుంచి పంపించాక, చివరగాదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మక్కా వదిలారు.ఇక్కడి నుండి ముస్లిం కాలెండర్ మొదలవుతుంది. మదీనా చేరాక దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం రాజ్యాంగాన్నినిర్మించారు.ఇస్లామీయ రాజ్యంలో ముస్లింల హక్కులు మరియు బాధ్యతలు, అలాగే ముస్లిమేతరుల హక్కులు మరియు బాధ్యతలు స్పష్టంగా వివరించబడ్డాయి.దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇస్లామీయ రాజ్యమైన మదీనాకు రాజు, న్యాయమూర్తి మరియు మధ్యవర్తిగా నియమించబడ్డారు.

 
624 CE

బద్ర్ యుద్ధం జరిగింది. ఇది 313 మంది ఆయుధాలు లేని ముస్లింలు మరియు 1000 మంది అన్ని రకాల ఆయుధాలు గల మక్కా అవిశ్వాసుల మధ్య జరిగింది. దైవకృప వల్ల ముస్లింలు గెలిచారు. 13మంది ముస్లింలు అల్లాహ్ మార్గంలో ప్రాణాలొదిలారు. ఖురైషుల ప్రముఖ నేతలు (అబూ జహల్, ఉత్బాహ్, శైబహ్, వలీద్ మొదలైనవారు) కూడా చంపబడ్డారు లేదా పట్టుబడ్డారు. బనూ ఖైనుఖ అనే యూద జాతి వారిని మదీనా నుండి వెలి వేయడం జరిగింది. వారు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారు మరియు ముస్లింలతో యుద్ధానికి తయారయ్యారు.

 
625 CE

700 ముస్లింలు మరియు 3000 ఖురైషుల మధ్య ఉహద్ యుద్ధం జరిగింది.ప్రతిష్టంభనలో ఆగిపోయింది. 72 మంది ముస్లింలు అల్లాహ్ మార్గంలో ప్రాణాలు కోల్పోయారు. 300 మంది కపట విశ్వాసులు ముస్లింలను వదలి వెళ్ళిపోయారు. రెండో యూద జాతి ‘బనూ నాదిర్’ కూడా మదీనా నుండి బహిష్కరించబడింది. వారుద్రోహానికి పాల్పడ్డారు మరియు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంను హత్య చేయడానికి ప్రయత్నించారు.

 

627నుంచి 632 CE వరకు జరిగిన సంఘటనలు

627 CE

ఖందఖ్ (గుంటల) యుద్ధం జరిగింది. 10000 మంది మక్కీయులు మదీనాను ఒక నెల వరకు ముట్టడించారు. ముస్లింలు తవ్విన గుంటలు శత్రువులను ముందుకు రాకుండా ఆపాయి. కొన్ని చిన్న యుద్ధాలు జరిగాయి. వారి వద్ద ఉన్న సామాగ్రి అంతమవడం మొదలయింది.వారిలో విబేధాలు మొదలయ్యాయి. వాతావరణం కూడా వారికి ప్రతికూలంగా మారిపోయింది. మదీనా ముట్టడిని సడలించారు. మూడోయూద జాతి – బనూ ఖురైజా–కుశిక్ష విధించబడింది. వారిని వారి చట్ట ప్రకారమే శిక్షించబడింది. వారు మదీనా రాజ్యంతో ద్రోహానికి పాల్పడ్డారు. వారి స్త్రీలు మరియు పిల్లలు బానిసలుగా చేయబడ్డారు. వారిని ఖైబెర్ జలాశయం వద్దకు తీసుకెళ్ళబడింది.

 
628 CE

ముస్లింలు మరియు మక్కీయుల మధ్యహుదైబియా ఒప్పందం జరిగింది. ఇందులో అనేక విషయాలు ముస్లింలకు విరుద్ధంగా ఉండేవి. ఈ ఒప్పందం వల్ల ముస్లింలు ఉమ్రా చేయకుండానే మదీనాకు తిరిగి వెళ్ళిపోవాల్సి వచ్చింది.ఈ ఒప్పందం వల్ల 10 సంవత్సరాల వరకు శాంతి నెలకొంది. ఖైబర్ జలాశయం వద్ద ఉన్న యూదులు మదీనా పై దండయాత్రకు సిద్ధమవసాగారు. ముస్లింలు ఖైబర్ పై దాడి చేసి దాన్ని చేజిక్కించుకున్నారు.దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంచుట్టుప్రక్కల ఉన్న రాజ్యాల రాజులకు మరియు మధ్య తూర్పు దేశాల అధినేతలకు, తన ప్రతినిధులను పంపి ఇస్లాం స్వీకరించమని సందేశం పంపారు.ఖాలిద్ బిన్ వలీద్ మరియు అమ్ర్ బిన్ అల్ ఆస్ రజిఅల్లాహుఅన్హుమ్ – ఇద్దరు ఖురైషు ప్రముఖ యోధులు ఇస్లాం స్వీకరించారు. కాని, హుదైబియా ఒప్పందం మూలంగా మదీనాకు రాలేకపోయారు. యమన్ పర్షియన్ గవర్నర్ కూడా ఇస్లాం స్వీకరించాడు.

 
629 CE

హుదైబియా ఒప్పందం ప్రకారం ముస్లింలు ఉమ్రా చేయడానికి వెళ్తారు.

 
630 CE

మక్కా వాసుల మిత్రులు హుదైబియా ఒప్పందాన్ని ఉల్లంఘించి, ముస్లింలమిత్రుల తెగపై దాడిచేస్తారు. దానికిప్రతీకారంగా, 10000 మంది ముస్లింలు మక్కాపై దాడి చేసి, ఎలాంటి రక్తపాతం లేకుండా మక్కాను జయించారు. అబూ సుఫ్యాన్ మరియు ఇతర ఉన్నత మక్కీయులు కూడా ఇస్లాం స్వీకరించారు. ముస్లింలుమక్కా జయించాక, హవాజిన్ అనే తెగ బెదిరిపోయి,ముస్లింలను లోబరుచుకోవటానికి ప్రయత్నం మొదలుపెట్టింది. రెండు నెలల తరువాత, 12,000 మంది ముస్లింలు 30,000 మంది హవాజిన్ లను హునైన్ దగ్గర తలపడుతారు. చిన్న ఎదురుదెబ్బ తరువాత చివరికి ముస్లింలు విజయం సాధిస్తారు.

 
630 CE

అరేబియాలోని అన్నితెగల, జాతుల పెద్దలు మదీనాలోదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం వద్దకు వచ్చి ఆయనకు విధేయత చాటారు.అరేబియా మొత్తం ఇస్లామీయ రాజ్యంలో వచ్చేసింది.

 
631 CE

అబూ బకర్ రజిఅల్లాహుఅన్హు నేతృత్వంలో ఓ దళం హజ్ కు వెళ్ళింది. అప్పటికి దాదాపు అరేబియాలోని అరబ్బులందరూ ఇస్లాం స్వీకరించారు.

 
632 CE

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంవీడ్కోలు హజ్ చేశారు. అరఫాలోవీడ్కోలు ప్రసంగం లేదా అంతిమ ప్రసంగం చేశారు.

 
632 CE

ఖుర్ఆన్ అవతణ పూర్తి అయింది .దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇస్లాం సందేశాన్ని పూర్తిగా ప్రబోధించారు.అంతిమ ప్రవక్త,ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం మదీనాలో 12 రబీ ఉల్ అవ్వల్ రోజున, తన 63వ ఏట మరణించారు.

 

ఆధారాలు

http://www.islamawareness.net/Muhammed/saw.html#childhood (ఇంగ్లీష్)
 
 

335 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్