దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం చాలా క్షమాశీలి


దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం యొక్క అనేక ఉత్తమ లక్షణాల్లో ఒకటి క్షమా గుణం. ఆయన తన స్వంత విషయాల్లో ఎన్నడూ ప్రతీకారం తీర్చుకోలేదు. తన బద్ధ శత్రువులను కూడా క్షమించేవారు. ఆయిషా రజిఅల్లాహుఅన్హా ఉల్లేఖనం ప్రకారం,దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం తన విషయంలోగానీ లేదా ఇతరుల విషయంలోగానీ ఎన్నడూ ప్రతీకారం తీర్చుకోలేదు. ఆయన తన ప్రసంగంలో, మాటల్లో ఎన్నడూ అసహ్యకరమైన పదాలను వాడలేదు.పెద్దస్వరముతోవీధుల్లో మాట్లాడలేదు. చెడును చెడుతో జవాబివ్వలేదు. తనకు చెడు చేసినవారికి మంచితో జవాబిచ్చేవారు మరియు క్షమించేవారు. మక్కావాసులుదైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లంను దూషించారు, అసభ్యంగా ప్రవర్తించారు, హేళన చేశారు, కొట్టారు, చివరికి చంపడానికి ప్రయత్నించారు.దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం మదీనాకు వలస వెళ్ళాక, ఆయనపై దండయాత్ర కూడా చేశారు. అయిననూదైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం మక్కాపై విజయం సాధించాక,10,000 మందిసైన్యులతో మక్కాలో అడుగుపెట్టినప్పటికీ, ఎవరిపై ఎలాంటి ప్రతీకారం తీర్చుకోలేదు. అందరినీ, బద్ధ శత్రువు అయిన అబూ సుఫ్యాన్ ను సైతం క్షమించారు. అబూ సుఫ్యాన్ దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లంకు విరుద్ధంగా అనేక యుద్ధాలు చేశాడు. అతన్నే కాదు, అతని ఇంట్లో శరణు తీసుకున్న ప్రతి ఒక్కడిని దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం క్షమించారు.

 

విషయసూచిక

 

ఖుర్ఆన్

దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లంఈ క్షమాగుణం వల్ల ప్రజలనుపాపాల నుంచి, నేరాల నుంచి కాపాడారు.ప్రజలు ఇస్లాంను ప్రేమించేలా చేశారు.దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం ఈ క్రింది ఆయతుకు సరిగ్గా సరితూగుతారు.“మంచీ - చెడు (ఎట్టిపరిస్థితిలోనూ) సమానంకాలేవు. (ఓప్రవక్తా!) చెడునుమంచిద్వారాతొలగించు. ఆతరువాత (నువ్వేచూద్దువుగాని), నీకూ- తనకూమధ్యబద్ధవిరోధంఉన్నఅతనుసైతంనీకుప్రాణస్నేహితుడైపోతాడు.” (ఖుర్ఆన్, సూరా ఫుస్సిలత్ 41:34)


దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం చాలా క్షమాశీలురు. దయశీలురు. దీని గురించి ఖుర్ఆన్ లో ఇలా అనబడింది:“(ప్రవక్తా!) మన్నింపులవైఖరినిఅవలంబించు.మంచినిప్రబోధిస్తూఉండు.మూర్ఖులనుపట్టించుకోకు.” (ఖుర్ఆ, సూరా ఆరాఫ్ 7:199)


తాయిఫ్ సంఘటన

ప్రజలను ఇస్లాం వైపు పిలవడానికి దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం

తాయిఫ్ ప్రదేశానికి వెళ్ళినప్పుడు,ఆయనను రాళ్ళతో కొట్టడానికి అక్కడి నాయకులు కొందరు తుంటరి వెధవలను నియమించారు.దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం వారిని సైతం క్షమించారు.

కపటుల నాయకుడైన అబ్దుల్లా బిన్ ఉబై
జీవితాంతందైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లంకు మరియు ఇస్లాంకు విరుద్ధంగా పనిచేసిన అబ్దుల్లా బిన్ ఉబైను సైతం క్షమించారు. అతను ఉహుద్ యుద్ధంలో 300 సైనికులను పెడద్రోవ పట్టించి, ముస్లింలవెన్నెముకను విరగ్గొట్టాడు.అతనుదైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం మరియు ముస్లింలకు విరుద్ధంగా అనేక చర్యలకు పాల్పడ్డాడు.దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం భార్య ఆయిషా రజిఅల్లాహుఅన్హాపై అపనిందను మోపడంలో ఇతను కీలక పాత్ర వహించాడు.
 
ఈ పెద్ద అపనిందను కల్పించి తెచ్చినది కూడా మీలోని ఒక వర్గమే. మీరు దీనిని మీ పాలిట కీడుగా భావించకండి. పైగా ఇది మీ కొరకు మేలైనదే. కాకపోతే (ఈ వ్యవహారంలో),వారిలో ప్రతి ఒక్కరికీ వారు సంపాదించిన దాన్ని బట్టి పాపం లభిస్తుంది. మరి వారిలో చాలా పెద్ద పాత్రను పోషించిన వాడికి మాత్రం మహాశిక్ష పడుతుంది. (ఖుర్ఆన్, సూరా నూర్ 24:11)

 అబూ సుఫ్యాన్ (రజి) భార్య

“హమ్జా రజిఅల్లాహుఅన్హు (దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం చిన్నాన)ను ఉహుద్ యుద్ధంలో ఒక అబిసీనియా బానిస హతమార్చాడు. అతను మక్కా విజయం తరువాత ఇస్లాం స్వీకరించినప్పుడు,దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం అతన్ని క్షమించేశారు.ఉహుద్ యుద్ధంలో హమ్జా రజిఅల్లాహుఅన్హుఛాతీని చీల్చి, అందులో నుండి కాలేయాన్ని, హృదయాన్ని ముక్కలు ముక్కలుగా చేసిన అబూ సుఫ్యాన్ భార్య. ఆమె మెల్లిగా దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం వద్దకు వచ్చి ఇస్లాం స్వీకరించింది.దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం ఆమెను గుర్తించి కూడా ఏమీ అనలేదు.దానికిఆమె చాలా ప్రభావితమై, “ఓ దైవప్రవక్తా! ఇన్ని రోజులు అన్నిటికంటే మీ గుడారం నాకు నిర్జీవంగా కనిపించేది. ఇప్పుడు అన్నిటికంటే మీ గుడారమే నాకు చాలా ప్రియమైనది.”


అబూ జహల్ కొడుకు, ఇక్రామా

అబూ జహల్ కొడుకు, ఇక్రామాదైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం కు మరియు ఇస్లాంకు బద్ధ శత్రువు. మక్కా విజయానంతరం అతను యమన్ కు పారిపోయాడు. అతని భార్య ఇస్లాం స్వీకరించింది. ఆమె అతన్ని దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం వద్దకు తీసుకు వచ్చింది.దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం అతన్ని చూసి ఇలా అన్నారు, “ఓ వలస వెళ్ళిన వాడా! స్వాగతం.” సుఫ్వాన్ బిన్ ఉమయ మక్కా నాయకుల్లో ఒకడు. అతనుదైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం మరియు ఇస్లాంకు బద్ధ విరోధి. అతనుదైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం ను చంపడానికిఉమైర్ ఇబ్న్ వహాబ్ ను పంపించాడు. మక్కా విజయం తరువాత సుఫ్వాన్ బిన్ ఉమయ జిద్డాకు పారిపోయి, అక్కడి నుంచి సముద్రం ద్వారా యమన్ వెళ్లిపోవాలి అనుకున్నాడు. ఉమైర్ ఇబ్న్ వహాబ్ దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం వద్దకు వచ్చి ఇలా అన్నాడు, “ఓ దైవప్రవక్తా!సుఫ్వాన్ బిన్ ఉమయ ఈ జాతికి నాయకుడు. అతను భయపడి ఇక్కడి నుంచి పారిపోయాడు.” అతనికి(సుఫ్వాన్ బిన్ ఉమయ) రక్షణ ఇవ్వబడింది. అతను తిరిగి వచ్చాడు. అతనుదైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లంను రెండు నెలల వ్యవధి ఇవ్వమని అడిగాడు.దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం అతనికి ఆలోచించటానికి నాలుగు నెలలు ఇచ్చారు. అతను స్వయంగానే ఇస్లాం స్వీకరించాడు.

 

జైనబ్(రజి) సంఘటన

హాబిర్ ఇబ్న్ అల్ అస్వద్ దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం మరియు ముస్లింల విరోధుల్లో ఒకడు. అతను జైనబ్ రజిఅల్లాహుఅన్హాకు పెద్ద హాని కలిగించాడు. ఆ సమయంలో ఆమె గర్భం దాల్చి ఉంది. ఆమె మక్కా నుండి మదీనాకు వలస వెళ్తుంది.మక్కా బహుదైవారాధకులు ఆమెను ఆపడానికి ప్రయత్నించారు. హబ్బార్ బిన్ అల్ అస్వద్ కావాలని ఆమెను ఒంటెపై నుంచి పడేశాడు. ఆమెకు చాలా దెబ్బలు తగిలాయి మరియు ఆమె గర్భం పడిపోయింది. అతను అనేక నేరాలు చేశాడు. మక్కా విజయానంతరం అతను పర్షియా పారిపోవాలని చూశాడు. కాని అతను దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం వద్దకు రాగానే, ఆయన అతన్ని మన్నించారు.

 

ముగింపు

దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం ఎల్లప్పుడూ చెడును మంచితో, దయతో, క్షమతో జవాబిచ్చేవారు.ద్వేషాన్ని ప్రేమతో, కోపాన్ని క్షమతో జయించాలి అని అనేవారు. అజ్ఞానాన్ని జ్ఞానంతో పూడ్చేవారు.

 

ఆధారాలు

http://www.pbuh.us/prophetMuhammad.php?f=Ch_Forgiveness (ఇంగ్లీష్)
 

287 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్