దైవప్రవక్త వ్యక్తిత్వం


హజ్రత్ ఆయిషా (రజి అల్లాహు అన్హ) కధనం :-రెండు విషయాల్లో ఒకదాన్ని అవలంబించే స్వేచ్చ ఇవ్వబడినప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ రెండింటిలో సులభమైన విషయాన్నే ఎంచుకునేవారు. అయితే ఆ విషయం పాపకార్యం అయి ఉండరాదు. ఒకవేళ ఆ సులభమైన విషయం పాపకార్యమైతే అందరికంటే ఆయనే దానికి దూరంగా ఉంటారు.

 

విషయసూచిక

 

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు అన్నిటికంటే ఎక్కువగా ఏ పని అంటే ఇష్టం?

హజ్రత్ మస్రూఖ్ (రహ్మతుల్లా అలై) కధనం :-నేను (ఓసారి) హజ్రత్ ఆయిషా (రజి అల్లాహు అన్హ) ని “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు అన్నిటికంటే ఎక్కువగా ఏ పని అంటే ఇష్టం?” అని అడిగాను. దానికామె “ఆయనకు నిత్యం క్రమం తప్పకుండా చేసేపని అంటే ఎంతో ఇష్టం” అని సమాధానమిచ్చారు.  “మరి రాత్రివేళ ఆయన (తహజ్జుద్ నమాజు చేయడానికి) ఎప్పుడు లేస్తారు? అని అడిగాను మళ్ళీ. అందుకామె “కోడికూత వినగానే లేస్తారు” అని అన్నారు.


429. [సహీహ్ బుఖారీ : 19 వ ప్రకరణం - తహజ్జుద్, 7వ అధ్యాయం - మన్ నామ ఇన్ద స్సహార్] ప్రయాణీకుల నమాజు ప్రకరణం – 17 వ అధ్యాయం – ఇషా నమాజులో పఠించవలసిన రకాతుల సంఖ్య మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan )

 

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏనాడూ తన స్వవిషయంలో ఎవరిపైనా ప్రతీకారం తీర్చుకోలేదు

హజ్రత్ ఆయిషా (రజి అల్లాహు అన్హ) కధనం :-రెండు విషయాల్లో ఒకదాన్ని అవలంబించే స్వేచ్చ ఇవ్వబడినప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ రెండింటిలో సులభమైన విషయాన్నే ఎంచుకునేవారు. అయితే ఆ విషయం పాపకార్యం అయి ఉండరాదు. ఒకవేళ ఆ సులభమైన విషయం పాపకార్యమైతే అందరికంటే ఆయనే దానికి దూరంగా ఉంటారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏనాడూ తన స్వవిషయంలో ఎవరిపైనా ప్రతీకారం తీర్చుకోలేదు. కాని దైవాజ్ఞల పట్ల అపచారం జరిగితే మాత్రం ఆయన తప్పకుండా ప్రతీకారం తీర్చుకునేవారు.


1502. [సహీహ్ బుఖారీ : 61 వ ప్రకరణం - మనాఖిబ్, 23 వ అధ్యాయం - సిఫతిన్నబియ్యి (సల్లల్లాహు అలైహి వసల్లం) ] ఘనతా విశిష్ఠతల ప్రకరణం : 20 వ అధ్యాయం – దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సొంత వ్యవహారంలో ప్రతీకారం తీర్చుకోరు మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2 సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

 

ఆధారాలు

http://telugudailyhadith.wordpress.com/2012/10/15/doing-good-deeds-regularly/

http://telugudailyhadith.wordpress.com/2012/11/05/choosing-easy-one-and-do-not-take-revenge-for-personal-things/
 

 

1076 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్