దైవప్రవక్త పట్ల కపట విశ్వాసుల వైఖరి


ఓ ప్రవక్తా! అవిశ్వాసంలో ముందుకు దూసుకుపోయే వారిని చూసి నువ్వు దుఃఖించకు. తాము ముస్లిములమేనని వారు నోటితో పలికినా సరే – వాస్తవానికి వారి హృదయాలు విశ్వాస పూరితం కావు (వాటిలో కాపట్యం ఉంది). కాగా; యూదుల్లోని కొందరు తప్పుడు మాటలను ఆసక్తితో చెవియొగ్గి వింటారు. ఇంకా ఇంతవరకూ నీవద్దకు రాని వారికోసం గూఢచారులుగా వ్యవహరిస్తున్నారు. వారు పదాల అసలు సందర్భాన్ని విడిచిపెట్టి, వాటిని తారుమారు చేస్తారు. ''మీకు ఈ ఆదేశమే గనక ఇవ్వబడితే దాన్ని స్వీకరించండి. ఈ ఆదేశం గనక లభించకపోతే దూరంగా ఉండండి'' అని (ప్రజలకు) చెబుతారు. అల్లాహ్‌ ఎవరినయినా వినాశాని (ఫిత్నా)కి లోనుచేయదలిస్తే అల్లాహ్‌కు ప్రతిగా నీకు వారిపై ఏ అధికారం ఉండదు. అల్లాహ్‌ పరిశుద్ధ పరచదలచుకోలేనిది ఇటువంటి వారి హృదయాలనే. వారికి ఇహలోకంలోనూ పరాభవం ఉంటుంది, పరలోకంలో కూడా వారికి ఘోర శిక్ష తప్పదు. నిస్సందేహంగా అల్లాహ్‌ న్యాయశీలురను ప్రేమిస్తాడు. (సూరా అల్ మాయిద 5:41)

 

విషయసూచిక

 

గ్రంథవహులలోని ఒక వర్గం

గ్రంథవహులలోని ఒక వర్గం ఇలా అన్నది :''విశ్వసించిన వారిపై అవతరించిన దానిని ఉదయం విశ్వసించి, సాయంత్రం తిరస్కరించండి. బహుశా ఇలాగయినా వారు మరలిపోతారేమో!'' సూరా ఆలి ఇమ్రాన్ 3:72

 

నిశ్చయంగా అల్లాహ్‌ చూపే మార్గమే సన్మార్గం

''మీరు మీ ధర్మాన్ని అనుసరించే వారిని తప్ప వేరెవరినీ నమ్మవద్దు'' (అని అంటారు). (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : ''నిశ్చయంగా అల్లాహ్‌ చూపే మార్గమే సన్మార్గం.'' (గ్రంథవహులు తమ వారికి ఇంకా ఈ విధంగా కూడా నూరిపోస్తారు:) ''మీకు ఇవ్వబడినదే వేరెవరికయినా ఇవ్వబడి ఉండవచ్చనీ, లేక వారు మీప్రభువు సమక్షంలో మీకు వ్యతిరేకంగా వాదిస్తారని (మీరు ఎంతమాత్రం అనుకోకండి).'' ఓ ప్రవక్తా! వారితో అను: ''అనుగ్రహాలన్నీ అల్లాహ్‌ చేతిలో ఉన్నాయి. ఆయన తాను కోరిన వారికి వాటిని ఇస్తాడు. అల్లాహ్‌ గొప్ప విస్తృతి కలవాడు, అన్నీ తెలిసినవాడు.'' సూరా ఆలి ఇమ్రాన్ 3:73

 

యూదులు పదాలను వాటి నిజస్థానం నుంచి తారుమారు చేస్తారు

కొంతమంది యూదులు పదాలను వాటి నిజస్థానం నుంచి తారుమారు చేస్తారు. ''మేము విన్నాము, అవిధేయులం అయ్యాము'' అని వారంటారు. అంతేకాదు - ''విను. నీకేమీ వినపడకూడదు. రాయినా'' అని పలుకుతారు. అలా అనేటప్పుడు వారు తమ నాలుకను మెలితిప్పుతారు. (ఇస్లాం) ధర్మాన్ని ఎగతాళి చేయాలన్నది అసలు వారి ఉద్దేశం. ఇలా అనే బదులు వారు, ''మేము విన్నాము. విధేయులమయ్యాము'' అనీ, ''వినండి. మా వంక చూడండి'' అని పలికి ఉంటే అది వారికొరకు ఎంతో శ్రేయస్కరంగా, సమంజసంగా ఉండేది. కాని అల్లాహ్‌ వారి అవిశ్వాసం మూలంగా వారిని శపించాడు. ఇక వారిలో విశ్వసించేది బహుకొద్దిమంది మాత్రమే. సూరా అన్ నిసా 4:46

 

కపట విశ్వాసులు

ఓ ప్రవక్తా! అవిశ్వాసంలో ముందుకు దూసుకుపోయే వారిని చూసి నువ్వు దుఃఖించకు. తాము ముస్లిములమేనని వారు నోటితో పలికినా సరే – వాస్తవానికి వారి హృదయాలు విశ్వాస పూరితం కావు (వాటిలో కాపట్యం ఉంది). కాగా; యూదుల్లోని కొందరు తప్పుడు మాటలను ఆసక్తితో చెవియొగ్గి వింటారు. ఇంకా ఇంతవరకూ నీవద్దకు రాని వారికోసం గూఢచారులుగా వ్యవహరిస్తున్నారు. వారు పదాల అసలు సందర్భాన్ని విడిచిపెట్టి, వాటిని తారుమారు చేస్తారు. ''మీకు ఈ ఆదేశమే గనక ఇవ్వబడితే దాన్ని స్వీకరించండి. ఈ ఆదేశం గనక లభించకపోతే దూరంగా ఉండండి'' అని (ప్రజలకు) చెబుతారు. అల్లాహ్‌ ఎవరినయినా వినాశాని (ఫిత్నా)కి లోనుచేయదలిస్తే అల్లాహ్‌కు ప్రతిగా నీకు వారిపై ఏ అధికారం ఉండదు. అల్లాహ్‌ పరిశుద్ధ పరచదలచుకోలేనిది ఇటువంటి వారి హృదయాలనే. వారికి ఇహలోకంలోనూ పరాభవం ఉంటుంది, పరలోకంలో కూడా వారికి ఘోర శిక్ష తప్పదు. సూరా అల్ మాయిద 5:41

 

నిస్సందేహంగా అల్లాహ్‌ న్యాయశీలురను ప్రేమిస్తాడు

వీరు చెవి యొగ్గి అబద్ధాలు వినేవారు,నిషిద్ధమైన సొమ్ము (హరాం) చాలాఎక్కువగా తినేవారు. ఒకవేళ వారు (తమ గొడవలను) నీ వద్దకు తీసుకువస్తే, నీకిష్టముంటే వారి మధ్య తీర్పుచెప్పు, లేదంటే విముఖతను తెలుపు. ఒకవేళ నువ్వు వారి నుంచి ముఖం త్రిప్పుకున్నా వారు నీకెలాంటి హానీ కలిగించలేరు. ఒకవేళ నువ్వు (వారి వ్యవహారాలపై), తీర్పు చెబితే వారిమధ్య న్యాయసమ్మతంగా తీర్పు చెప్పు. నిస్సందేహంగా అల్లాహ్‌ న్యాయశీలురను ప్రేమిస్తాడు. సూరా అల్ మాయిద 5:42

 

న్యాయనిర్ణేత

దైవాదేశాలు పొందుపరచబడివున్న తౌరాతు గ్రంథం తమ వద్ద ఉన్నప్పటికీ వారు నిన్ను ఎట్లా న్యాయనిర్ణేతగా చేసుకుంటున్నారు? (ఇది ఆశ్చర్యకరం కదూ?!) ఆ తరువాత మళ్ళీ తిరిగిపోతున్నారు. యదార్థమేమిటంటే వారసలు విశ్వాసులే కారు.సూరా మాయిద 5:43

 

చదువురాని వారు

వారిలో చదువురాని వారు కొందరున్నారు – వారికి గ్రంథజ్ఞానం లేదు. వారు కేవలం ఆశల్ని నమ్ముకొని ఉన్నారు. లేనిపోని అంచనాలువేసి, ఊహల్లో విహరిస్తూ ఉంటారు. సూరా అల్ బఖర 2:78

 

వినాశం

తమ స్వహస్తాలతో లిఖించిన గ్రంథాన్ని దైవగ్రంథమని చెప్పి,ప్రాపంచిక తుచ్ఛ ప్రయోజనాన్ని పొంద జూసే వారికి'వినాశం' కలదు. వారి ఈ స్వహస్త లిఖిత రచన కూడా వారి వినాశానికి దారి తీస్తుంది. వారి ఈ సంపాదన కూడా వారి నాశనానికి కారణ భూతం అవుతుంది. సూరా అల్ బఖర 2:79

 

ఆధారాలు

http://www.askislampedia.com/te/quran/-/view/Surah/5#41

http://www.askislampedia.com/te/quran/-/view/Surah/3#72

http://www.askislampedia.com/te/quran/-/view/Surah/3#73

http://www.askislampedia.com/te/quran/-/view/Surah/4#46

http://www.askislampedia.com/te/quran/-/view/Surah/5#41

http://www.askislampedia.com/te/quran/-/view/Surah/5#42

http://www.askislampedia.com/te/quran/-/view/Surah/5#43

http://www.askislampedia.com/te/quran/-/view/Surah/2#78

http://www.askislampedia.com/te/quran/-/view/Surah/2#79

 

307 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్