దైవప్రవక్తలపై విశ్వాసం


దైవప్రవక్తలను విశ్వసించడం విశ్వాసపు మూలస్థంభాలలో ఒకటి. అల్లాహ్ తన దాసుల్లో నుంచి తాను ఎంచుకున్న వారిని దైవప్రవక్తలుగా నియమించాడు. వారిని ప్రతి జాతిలో, ప్రతి సమాజంలో పంపించాడు. వారు తమ జాతి ప్రజలను రుజుమార్గం వైపు దర్శకత్వం వహించేవారు. ప్రవక్తల పరంపరలో చిట్ట చివరి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం.

 

విషయసూచిక

 

ఖుర్ఆన్ వెలుగులో

“(ప్రజలారా!) ముహమ్మద్‌ (సఅసం)  మీ  మగవారిలో ఎవరికీ తండ్రికాడు. అయితే   ఆయన అల్లాహ్‌ యొక్క సందేశహరుడు.   ప్రవక్తల పరంపరను పరిసమాప్తం చేసే (చివరి) వాడు. అల్లాహ్‌ ప్రతిదీ తెలిసినవాడు.” (ఖుర్ఆన్ సూరా అహజాబ్ 33:40)

 

అల్లాహ్‌యే దైవదూతలలో నుంచి, మానవులలో నుంచి తన సందేశహరులను ఎంపిక చేసుకుంటాడు.నిశ్చయంగా అల్లాహ్‌ అంతా వింటాడు, అన్నీ చూస్తాడు.” (ఖుర్ఆన్ సూరా హజ్ 22:75)

 

దైవ ప్రవక్తలు

అల్లాహ్ తన గురించి ప్రజలకు తెలియజేయడానికి, వారిని సరియైన దారిలో నడిపించడానికి  ప్రతి యుగంలో దైవప్రవక్తలను పంపిస్తూ వచ్చాడు.  దైవ ప్రవక్తలపై, వారిచే అల్లాహ్ ద్వారా పంపించబడిన ఆదేశాలపై విశ్వసించడం ఇస్లామీయ విశ్వాసానికి మూలాధారం.

 

అంతిమ దైవప్రవక్త

అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహుఅలైహివసల్లమ్) ద్వారా పూర్తి మానవాళికి పంపించబడిన చిట్టచివరి దైవగ్రంథం ఖుర్ఆన్. “ఎవరైతే  దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహుఅలైహివసల్లమ్) కు విధేయత చూపుతారో వాస్తవంగా వారు అల్లాహ్ కు విధేయత చూపినట్లే”అని దివ్య ఖుర్ఆన్ లోని సూరా నిసా 4:80లో తెలుపబడినది.   

 

ఆధారాలు

www.teluguislam.net(ఇంగ్లిష్)

1320 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్