దైవదూతలపై విశ్వాసం


దైవదూతలను విశ్వసించడం విశ్వాసపు మూలస్థంభాలలో ఒకటి. దైవదూతలు ఉన్నారని విశ్వసించాలి. దైవదూతలు ఎల్లప్పుడూ అల్లాహ్ విధేయతలో ఉంటారు. కావున మనము వారిని ప్రేమించాలి. వారు కూడా నిజమైన విశ్వాసులను ప్రేమిస్తారు, కాబట్టి వారి కోసం అల్లాహ్ యందు దుఆ చేస్తారు.

 

విషయసూచిక

 

ఖుర్ఆన్ వెలుగులో

“తీసుకోవలసిన ఇద్దరు (దూతలు) తీసుకోవటానికి వెళ్ళినప్పుడు (వారిలో) ఒకతను కుడి ప్రక్కన, మరొకతను ఎడమ ప్రక్కన కూర్చొని ఉంటాడు.(మనిషి) నోట ఒక మాట వెలువడటమే ఆలస్యం, అతని దగ్గర ఒక పర్యవేక్షకుడు (దాన్ని నమోదు చేయడానికి) సిద్ధంగా ఉంటాడు.” (ఖుర్ఆన్ సూరా ఖాఫ్ 50:17-18)

 

దైవదూతలు

ఈ భూమిపై తమతో పాటు కనిపించని ఇతర రకాల జీవులలో దైవదూతలూ ఉన్నారని ముస్లిములు విశ్వసిస్తారు. దైవదూతలు అల్లాహ్ తో సమానం లేదా భాగస్వాములు కానేకారు. వారు కేవలం అల్లాహ్ చేత సృష్టించబడినవారు.

 

 

ఆజ్ఞలను పాటించేవారు

వారు కూడా ఒక్కడైన ఆ అల్లాహ్ నే ఆరాధిస్తూ ఆయన ఆజ్ఞల్ని తుచ తప్పకుండ పాటిస్తారు.వారు మానవులతో సమానం కారు. వారి ప్రపంచమే వేరు. ముస్లింలు కూడ వారిని  వేడుకోరు. వారికి అల్లాహ్ కొన్ని కార్యాలను నిర్దేశించాడు. జిబ్రఈల్ (అలైహిస్సలాం) వారిలో అత్యుత్తములు.

 

ఆధారాలు

www.teluguislam.net(ఇంగ్లిష్)

1441 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్