దాచవలసిన శరీర భాగాలు


ఔరహ్ అనే పదం ఇస్లామీయ పదం. స్త్రీలు మరియు పురుషులు బట్టలతో కప్పిఉంచవలసిన శరీర భాగాలను ఔరహ్ అంటారు.వీటిని బహిరంగ పరచడం ఇస్లాంలో నిషేధించబడింది. ఇలా చేయడం మహా పాపం.[1]
 

విషయసూచిక

 

పారిభాషిక అర్ధం

అరబీలో ఔరహ్ అంటే, అంచున ఉన్న బలహీనమైన అంశం.

 
ఇస్లామీయ భావం

శరీరపు ఏ భాగాన్ని బహిరంగ పరిస్తే సిగ్గు కలుగుతుందో, ఆ భాగాన్ని కప్పి ఉంచడాన్ని ఔరహ్ అంటారు. ఇది స్త్రీ పురుషులిద్దరికీ వర్తిస్తుంది.(అల్ మౌసూఅ అల్ ఫిఖియ్యా 24/173)[2]

 
ఖుర్ఆన్

“ఓ ఆదం సంతతి వారలారా!  మేము  మీ కోసం దుస్తుల్ని దించాము.  అవి మీ మర్మస్థానాలను కప్పి ఉంచటమేగాకుండా, మీ శరీరానికి శోభాయమానంగా కూడా ఉంటాయి. అయితే భయభక్తులతో కూడుకున్న దుస్తులు ఇంతకన్నా  మంచివి. ఇవి వీళ్లు  జ్ఞాపకముంచుకునేందుకుగాను  అల్లాహ్‌  (చేసిన) సూచనలలోనివి.” (ఖుర్ఆన్, సూరా అల్ ఆరాఫ్ 7:26)
 

“ఓ ప్రవక్తా!   తమపై నుంచి తమ దుప్పట్లను  (క్రిందికి) వ్రేలాడేలా కప్పుకోమని నీ భార్యలకు, నీ కుమార్తెలకు, విశ్వాసులైన స్త్రీలకు చెప్పు. తద్వారా వారు చాలా తొందరగా (మర్యాదస్తులుగా) గుర్తించబడి,  వేధింపుకు  గురికాకుండా  ఉంటారు. అల్లాహ్‌  క్షమించేవాడు, కనికరించేవాడు.” (ఖుర్ఆన్, సూరా అల్ ఆహ్ జాబ్ 33:59)[3]


హదీస్

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “ఏ స్త్రీ ఇతర స్త్రీను నగ్నంగా చూడకూడదు మరియు ఏ పురుషుడు ఇతర పురుషుణ్ణి నగ్నంగా చూడకూడదు.” (సహీహ్ బుఖారీ vol 1:661)

 
అబూ హురైరా రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “నరకంలో రెండు రకాల వారు ఉంటారు. అందులో ఒకరు- ఎద్దు తోకల మాదిరిగా ఉన్న కొరడాలను కలిగి ఉంటారు మరియు దానితో ప్రజలను కొడుతుంటారు. రెండో రకం వారు- దుస్తులు ధరించినప్పటికీ నగ్నంగా కనిపించే స్త్రీలు. వారు ఇతరులను మొహింపజేస్తారు. ఇలాంటి స్త్రీలు స్వర్గంలో ప్రవేశించరు. వారి ముక్కులకుస్వర్గపు సువాసన చేరదు. స్వర్గపు సువాసన చాలా దూరం నుండి వస్తుంది అయిననూ వారికి చేరదు.” (సహీహ్ ముస్లిం 6840)[4]


స్త్రీలు మరియు పురుషులు దాచవలసిన శరీర భాగాలు

ఖుర్ఆన్ మరియు హదీసుల ఆధారంగా ఇస్లామీయ విద్వాంసులు పురుషుల ఔరహ్ ను నాభి నుంచి మోకాళ్ళ వరకు అని నిర్ణయించారు. కేవలం ముఖము మరియు చేతి మణికట్టు వరకు వదలిపెట్టి మిగతా శరీరం అంతా స్త్రీల ఔరహ్ పరిధిలో వస్తుంది.[5]

 

ఆధారాలు

[1] http://islamic-dictionary.tumblr.com/post/5658467793/awrah-arabic-is-a-term-used (ఇంగ్లీష్)
[2] http://islamqa.info/en/ref/126265/awrah (ఇంగ్లీష్)
[3] http://quran.com (ఇంగ్లీష్)
[4] http://www.sunnah.com/search/the-one-possessing-whips-like-the-tail-of-an-ox%2C-and-they-flog-people-with-them (ఇంగ్లీష్)
[5] http://www.muslimaccess.com/articles/Women/womans_dress.asp (ఇంగ్లీష్)
 
 

421 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్