తెల్లవారడం


“మనిషి రాత్రివేళ పడుకున్నా తరువాత షైతాన్ అతని ముచ్చిలి గుంటపై మూడు ముళ్ళు వేస్తాడు. ప్రతిముడి మీద ‘రాత్రి ఇంకా చాలా ఉంది, హాయిగా పడుకో’ అంటూ మంత్రించి ఊదుతాడు.

 

విషయసూచిక

 

పడుకున్న తరువాత షైతాన్ ముడులు వేయడం

హజ్రత్ అబూ హురైరా (రజి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:- “మనిషి రాత్రివేళ పడుకున్నా తరువాత షైతాన్ అతని ముచ్చిలి గుంటపై మూడు ముళ్ళు వేస్తాడు. ప్రతిముడి మీద ‘రాత్రి ఇంకా చాలా ఉంది, హాయిగా పడుకో’ అంటూ మంత్రించి ఊదుతాడు.

 

అల్లాహ్ స్మరణ వలన మొదటి ముడి వూడిపోవడం

అప్పుడు మనిషి మేల్కొని దేవుడ్ని స్మరించగానే ఒక ముడి ఊడిపోతుంది.

 

వుజూ చేస్తే రెండవ ముడి వూడిపోవడం

తరువాత వుజూ చేస్తే రెండవ ముడి ఊడిపోతుంది.

 

నమాజు చేసిన తరువాత మూడవ ముడి వూడిపోవడం

ఆ తరువాత నమాజు చేస్తే మూడవ ముడి కూడా ఊడిపోతుంది. దాంతో ఆ వ్యక్తి తెల్లవారుజామున ఎంతో ఉత్సాహంతో, సంతోషంతో లేస్తాడు. అలా చేయకపోతే వళ్ళు బరువయి బద్ధకంగా లేస్తాడు”

444. [సహీహ్ బుఖారీ : 19 వ ప్రకరణం - తహజ్జుద్, 12 వ అధ్యాయం - అఖ్దషైతాని అలా ఖాఫియాతిర్రాస్] ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం – 28 వ అధ్యాయం మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-2 సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ

 

ఆధారాలు

http://telugudailyhadith.wordpress.com/2012/04/24/sleeping-until-sunrise-without-prayer/
 

 

293 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్