తెలుగు ఇస్లామిక్ నిఘంటువు

Go to:      దా    ఫా     ఘా     హా          మొ     కా     లా     మా     నా     ఖా     రా     సా     తా           వా          జా     

  1. ఆబిద్: ఆరాధించేవాడు, భక్తుడు. అల్లాహ్ ను ఆరాధించే భక్తుడు
     
  2. ఆద్: ఒక జాతి పేరు, ఈ జాతికి  చెందిన ప్రజలు యమన్ ప్రదేశంలో ఉండేవారు అని చెప్పబడుతుంది. అల్లాహ్ వీరి వద్దకు ‘హూద్’ ప్రవక్తను పంపాడు. (ఉదా: ఖుర్ఆన్ సూరా హూద్ 11:50-60) 
     
  3. ఆదాబ్: మర్యాదలు. పద్ధతులు,
    మర్యాదలుఉత్తమ పద్ధతులు, దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మనకు నేర్పిన పద్ధతులు. ఇవి విశ్వాసిని ఇతరులతో వేరుపరుస్తుంది.  ఒక ముస్లిం జీవితంలోని ప్రతి విషయంలో- సామాజిక, ఆర్ధిక, రాజకీయ మొదలగు వ్యవహారాలు అన్నిటిలో ఇస్లాం పద్ధతులను అవలంబించడం అవశ్యం. 

     
  4. ఆదం
    అల్లాహ్ సృష్టించిన మొట్టమొదటి వ్యక్తి. ఆయన సహవాసి ఈవ్. (ఆధారం కోసం ఖుర్ఆన్ లోని 2:30-38 ను చూడండి)

     
  5. అల్ ఆఖిర్: చివరిది, అంతిమమైనది 
    దైవగుణాల్లో ఒకటి. ఆయన తరువాత ఏదీ ఉనికిలో ఉండదు, ఎందుకంటే ఆయనే (అల్లాహ్ యే) ఎప్పటికీ ఉండేవాడు. 

     
  6. అల్ ఆఖిరహ్ : ప్రళయదినం, అంతిమ దినం 
    పరలోకపు జీవితం పై విశ్వాసం (శారీరకంగా మరియు మానసికంగా). ఇది ఇస్లామీయ విశ్వాసం (ఈమాన్) లోని ఆరు మూలస్థంభాలలో ఒకటి.  

     
  7. ఆలం అల్ బర్జఖ్: (మధ్యంతర, మాధ్యమిక స్థితి) 
     
  8. ఆల్ ఇమ్రాన్: ఇమ్రాన్ కుటుంబం
    ఖుర్ఆన్ లోని సూరా 3 లో, ఈసా అలైహిస్సలాం (జీసస్) తల్లి అయిన మర్యం అలైహిస్సలాం (మేరీ) కుటుంబం గురించి వివరించబడింది.   

     
  9. ఆల్ అల్ బైత్: దైవప్రవక్త  కుటుంబం 
    దైవప్రవక్త  ఇంటివారు.  ఇందులో దైవప్రవక్త  భార్యలు, సంతానం, ముస్లిం బంధువులందరూ (ఎవరిపైనైతే దానం – సదఖా- నిషేధించబడిందో వారందరూ) వస్తారు. 

     
  10. ఆలం అల్ ఘైబ్:  కానరాని ప్రపంచం  
    కనిపించని ప్రపంచం. ఇందులో రాబోయే కాలం మరియు పరలోక జీవితం అన్నీ వస్తాయి. దీని గురించి కేవలం అల్లాహ్ కే తెలుసు. 

     
  11. ఆలం అష్ షహాద: కనిపించే ప్రపంచం 
    ప్రస్తుత ప్రపంచం. ఇది పరలోకం లేదా రాబోయే కాలానికి విరుద్ధం. ‘ఆలం అల్ ఘైబ్’ (కానరాని ప్రపంచానికి) కు వ్యతిరేకం. 

     
  12. ఆలిమ్: విద్వాంసుడు 
    ఇస్లామీయ పరిభాషలో విద్వాంసుడు అంటే, ఇస్లాం ధర్మానికి చెందిన ప్రతి విషయంలో జ్ఞానం కలిగి ఉన్నవాడు. 

     
  13. ఆమ్ అల్ బుఊస్: రాయబారపు సంవత్సరం
    హిజ్రీ తొమ్మిదవ సంవత్సరాన్ని రాయబార సంవత్సరం అంటారు. ఎందుకంటే, అరబ్ ప్రతి చోట నుండి మదీనాలో దైవప్రవక్త  వద్దకు రాయబారులు వచ్చి, తాము ఇస్లాం స్వీకరించినట్లు ప్రకటించారు మరియు ఇస్లాం గురించి నేర్చుకుంటామని ఆసక్తి వ్యక్తం చేశారు. 

     
  14. ఆమ్ అల్ ఫీల్: ఏనుగుల సంవత్సరం 
    570 CE సంవత్సరంలో యమన్ లోని అబిసీనియా నాయకుడు మక్కాపై దాడి చేసి కాబాను ధ్వంసం చేయాలని సంకల్పించాడు. కాని అల్లాహ్ వారినే నాశనం చేశాడు. (ఖుర్ఆన్ లోని సూరా 105 చూడండి). అదే సంవత్సరంలో దైవప్రవక్త  జన్మించారు.  

     
  15. ఆమన (యూమిన్): విశ్వసించడం 
    క్రియను షరతులు లేకుండా ఖుర్ఆన్ లో వాడినప్పుడు, అల్లాహ్ పై విశ్వాసం అనే భావన వస్తుంది. 

     
  16. ఆమీన్: ఆమీన్ 
    అల్లాహ్ మీ ప్రార్ధనలు వినుగాక! ప్రతి నమాజులో పఠించే సూరా ఫాతిహా చివరిలో ‘ఆమీన్’ అంటారు.  “మాకు రుజుమార్గం (సన్మార్గం) చూపించు.నీవు అనుగ్రహించిన వారి మార్గం, నీ ఆగ్రహానికి గురికాని వారి, అపమార్గానికి లోనుకాని వారి మార్గం (చూపు).” (ఖుర్ఆన్ సూరా ఫాతిహా 1:6-7). ప్రతి దుఆ (వేడుకోలు) తరువాత ‘ఆమీన్’ అనాలి. 

     
  17. అల్ ఆఖిబ్: చివరివాడు (దైవప్రవక్త  పేరు)
    దైవప్రవక్త  చివరి ప్రవక్త కావడం వల్ల, ఈ పేరు ఆయనను సూచిస్తుంది. 

     
  18. ఆఖిలహ్: రక్త దానం చేసేవారు 
    హత్యకు పాల్పడిన తమ పూర్వీకుల బంధువులు. హత్య చేయబడిన వారి బంధువులకు రక్త దానం చేయాలి. 

     
  19. ఆఖిల్: వివేకవంతుడు
    బలంగా, ఆరోగ్యవంతంగా మేధస్సు  ఉన్నవారు. ఇందువల్ల వారు వారి కర్మలకు బాధ్యులు అవుతారు.

     
  20. ఆరియ్యహ్: రుణంగా పెట్టబడిన వస్తువు
    రుణగ్రస్తుడు రుణం తీసుకునేటప్పుడు పెట్టే వస్తువు. దీన్ని తిరిగి ఇచ్చే వరకు సాధ్యమైనంతగా యధాస్థితిలో ఉంచేందుకు ప్రయత్నించాలి.


     
  21. ఆమిల్: నిర్వాహకుడు ,ధికారి.
    సాధారణంగా, ఖలీఫా ఒక అధికారిని, ఒక ప్రత్యేక ప్రదేశాన్ని పరిపాలించడానికి నియమిస్తాడు.

     
  22. ఆసి లేదా ఆసిం: పాపాత్ముడు, అవిధేయుడు
    అల్లాహ్ ఆజ్ఞలకు ఉల్లంఘించే వాడు అయితే, పాపాత్ముడు అవుతాడు; లేదా అవిధేయుడు అవుతాడు.

     
  23. ఆషూరా: ముహర్రం నెల పదో రోజు
    ఇస్లామీయ క్యాలెండరు మొదటి సంవత్సరం లోని పదో రోజు. ఈ రోజు ఉపవాసం ఉండడం సున్నత్. దానితో పాటు ఒక రోజు ముందు లేదా ఒక రోజు తరువాత కలపాలి. ఈ రోజే మూసా అలైహిస్సలాం ఫిరౌను బారి నుండి కాపాడబడ్డారు.     

     
  24. అజ్ జకాహ్ లేదా జకాత్: పేదలకు దానధర్మాలు చేయడం 
    జకాత్ చెల్లించడం తప్పనిసరి. ఇది ఇస్లాం ఐదు మూలస్థంభాలలో ఒకటి.
  25. ఆయహ్:
    మొదటి అర్ధం: సూచన
    సృష్టిలోని సృష్టితాలన్నీ అల్లాహ్ సూచనలు; వీటిపై మానవుడు అధ్యయనం చేయాలి.  
    రెండో అర్ధం: ప్రకటన
    ఖుర్ఆన్ ప్రకటన (‘సూరా’ భాగం, సాధారణంగా అధ్యాయం అంటారు).
    మూడో అర్ధం: సాక్ష్యం, రుజువు

     
  26. అబ్ద్: పురుష బానిస, జామీనుదారుడు
    మొదటి అర్ధం: ఒక పురుష బానిస, ఎవరైతే యుద్ద మైదానంలో పట్టుబడ్డాడో లేదా ఒక బానిస స్త్రీ కొడుకు.
    రెండో అర్ధం: బానిస, ఆరాధించేవాడు
    ఒక మనిషికి అల్లాహ్ తో ఉన్న సంబంధాన్ని, సాధారణంగా ‘బానిస’ గా వివరిస్తారు.

     
  27. అదాలహ్: న్యాయం, సజ్జనత, చిత్తశుద్ది
    హదీసుపరంగా, దీని భావం చిత్తశుద్ది (ఉల్లేఖకుని).

     
  28. అదబ్ (బహువచనం- ఆదాబ్): ప్రవర్తన లేదా నడవడిక నిబంధన/తీరు.
     
  29. అద్దా: చేయడం
    నమాజ్ (సలాహ్) విషయంలో ఇది నిర్వర్తించడం, జకాత్ విషయంలో ఇది చెల్లించడం అవుతుంది.

     
  30. అజాబ్: శిక్ష, యాతన

  31. అజాబ్ అల్ ఖబ్ర్:  సమాధి శిక్ష
    పాపాత్ములు మరియు అవిశ్వాసులు సమాధిలో పొందే శిక్ష. ‘మున్కర్, నకీర్’ అనే దైవదూతలు వచ్చి అడిగే ప్రశ్నలకు జవాబులు సరిగా ఇవ్వనప్పటి నుంచి ఈ శిక్ష ప్రారంభమవుతుంది. 

     
  32. అజాన్: నమాజు (సలాహ్) కోసం పిలుపు ఇవ్వడం
    రోజువారి ఐదు పూటల నమాజ్ కోసం ఇవ్వబడే పిలుపు.

     
  33. అజ్కార్: నోటితో పలికే వచనాలు, దుఆలు
    అల్లాహ్ ను ప్రశంసించే, స్తుతించే మరియు అల్లాహ్ ను క్షమాపణ కోరే అన్ని రకాల వచనాలు.

     
  34. అజ్ల్: పెళ్లి నుండి ఆపుట
    ఒక స్త్రీను పెళ్లి నుండి ఆపుట; స్త్రీ సంరక్షకుని ద్వారా లేదా పూర్వపు భర్త ద్వారా.

     
  35. అల్ అద్ల్: ఎల్లప్పుడూ న్యాయం చేసేవాడు
    ఇది అల్లాహ్ గుణాల్లో ఒకటి. అల్లాహ్ తన నిర్ణయాల్లో ఎన్నడూ అన్యాయం చేయడు.

     
  36. అద్ల్: న్యాయం, పక్షపాతం లేని వ్యవహారము
    వ్యవహారము చేసేటప్పుడు, శత్రువుతో అయిననూ న్యాయంగా చేయాలి (5:8) మరియు తమ వారి వ్యవహారం అయిననూ పక్షపాతం చూపకూడదు అని ఖుర్ఆన్ బోధిస్తుంది (6:152).

     
  37. అద్ల్: చిత్తశుద్దిగలవాడు, నిజాయితీపరుడు
    విశేషణంలో వాడబడినప్పుడు, హదీసు ఉల్లేఖకుల గురించి వాడబడుతుంది. సాక్ష్యుల గురించి కూడా వాడబడుతుంది. చిత్తశుద్దిగలవాడు, నిజాయితీపరుడు మరియు అల్లాహ్ కు భయపడేవాడు అనే భావన వస్తుంది.

     
  38. అఫీఫ్: పవిత్రమైన, గౌరవప్రదమైన
    ఈ పదం పవిత్రత మరియు గౌరవం రెండిటినీ సూచిస్తుంది. మానవుడు అక్రమ లైంగిక సంపర్కాలకు దూరంగా ఉంటాడు మరియు తనను తాను ఎన్నడూ దిగజారనివ్వడు.

     
  39. అఫ్లహ: సాఫల్యం చెందడం, వర్ధిల్లడం
    ఇహలోకంలో మరియు పరలోకంలో సాఫల్యాన్ని ఈ పదం సమగ్రంగా వివరిస్తుంది.

     
  40. అఫ్తర: ఉపవాసం ముగించడం
    ఏదైనా తిని లేదా త్రాగి ఉపవాసాన్ని ముగించడం.

     
  41. అల్ అఫూవ్: ఉత్తమంగా క్షమించేవాడు
    ఇది అల్లాహ్ గుణాల్లో ఒకటి. ఆయన తన దాసుల పశ్చాత్తాపాన్ని స్వీకరించడమే కాక, వారి పాపాలను కూడా వారి లేక్కలోంచి చెరిపివేస్తాడు. ఈ గుణం గురించి ఖుర్ఆన్ లోని 39 సూరా 53 ఆయతులో బాగా వివరించబడింది.

     
  42. హదీస్ (బహువచనం – అహాదీస్)
    దైవప్రవక్తబోధనలు.

     
  43. (హబస) అహ్బాస్: ఆపుట లేదా ఆపి ఉంచుట
     
  44. అహద్: ఒడంబడిక, నిబంధన, వాగ్దానం
     
  45. అహ్దస 1: ‘హదత్’ చేయడం
    దీనివలన అపవిత్రత అవుతుంది, గాలి వీచేటప్పుడు మూత్రం పోయడం.         

     
  46. అహ్దస 2: కొత్త పోకడను సృష్టించడం
    దైవప్రవక్త ధర్మంలో (ఇస్లాంలో) చేయనిది లేదా చెప్పనిది.

     
  47. అహ్కాం: ఆదేశాలు, శాసనాలు
    ఇస్లాంలో అనేక రకాలైన నిబంధనలు ఉన్నాయి. వీటి ద్వారా మన కర్మల ప్రతిఫలం లభిస్తుంది. అవి: తప్పనిసరి లేదా విధిచేయబడినవి (ఫర్జ్, వాజిబ్),  గట్టిగా సిఫారసు చేయబడినవి (సున్నత్), ఆమోదయోగ్యమైనవి (ముస్తహబ్), చేయకూడనివి (మక్రూహ్), నిశిద్ధమైనవి (హరాం).

     
  48. అహ్ లుల్ అహ్వా: మనోవాంచకులు
    తమ మనోకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించేవారు.  

     
  49. అహ్ లుజ్ జి మ్మహ్: ఇస్లామీయ రాజ్యం ద్వారా మద్దతు పొందేవారు
    ఇస్లామీయ రాజ్యంలో ‘జిజియా’ (టాక్స్, పన్ను) ఇచ్చి, శాంతంగా నివసించే క్రైస్తవులు మరియు యూదులు (ముస్లిమేతరులు).

     
  50. అ హ్ లుల్ బైత్: దైవప్రవక్తముహమ్మద్  కుటుంబీకులు
    దైవప్రవక్త ముహమ్మద్  కుటుంబం వారు. ‘ఆల్ అల్ బైత్’ కూడా చూడండి.

     
  51. అ హ్ లుల్ ఫత్రహ్: మధ్యంతర ప్రజలు
    అల్లాహ్ ద్వారా ఏ ప్రవక్తా పంపబడని కాలంలో నివసించిన ప్రజలు.

     
  52. అ హ్ లుల్ కబాయిర్: పెద్ద పాపాలు చేసేవారు
    పెద్ద పాపాలకు పాల్పడేవారు.

     
  53. అ హ్ లుల్ కహఫ్: (కహఫ్) గుహ వాసులు
    ఖుర్ఆన్ (18:9-22)లో వివరించబడ్డ యువకులు. వారు అత్యత్భుతంగా దాదాపు 300 సంవత్సరాలు గుహ లోపల నిద్రలో గడిపారు.  

     
  54. అ హ్ లుల్ కితాబ్: గ్రంథ వహులు, గ్రంథం కల ప్రజలు
    ఇది యూదులు మరియు క్రైస్తవులను సూచిస్తుంది. దైవగ్రంథం పంపబడిన ప్రజలు.

     
  55. అ హ్ లుల్ ఖిబ్లహ్: ముస్లింలు (ఖిబ్లా ప్రజలు)
    కాబా వైపు ముఖం చేసి ప్రార్ధన చేసేవారు.

     
  56. అ హ్ లుర్ రాయి: అభిప్రాయకులు
    ఇస్లామీయ చట్టం ప్రకారం అభిప్రాయాలు తెలిపే ఇస్లామీయ విద్వాంసులు.

     
  57. అహ్మద్: ఎక్కువగా ప్రశంసించ బడేవాడు
    ఇది దైవప్రవక్త గారి పేర్లలో ఒకటి. ఆయన వస్తారని ఈసా అలైహిస్సలాం ఈ పేరుతో చెప్పారు.  (ఖుర్ఆన్ 61:6)లో చూడండి.

     
  58. అహ్సన-ఇలాహు అజాకుం: నిజాయితీ గల సంతాపం
    ఎవరైనా ఏదైనా కోల్పోయినప్పుడు, అల్లాహ్ వారికి శక్తి, స్థైర్యం ప్రసాదించాలని చేసే దుఆ.  

     
  59. అహ్సన: పవిత్రంగా ఉండడం
    అక్రమ సంబంధాల (లైంగిక) నుండి కాపాడుకోవడం.

     
  60. అజల్ (బహువచనం- అజాల్): నిర్ణయించిన సమయం
    ఇది ముందుగా నిర్ణయించబడిన ప్రతి సమయానికి వర్తిస్తుంది. కొన్ని సమయాల్లో ఇది జీవితం అంతమయ్యే సమయాన్ని (మరణ సమయాన్ని) సూచిస్తుంది.

     
  61. అజ్నబీ (బహువచనం- అజానిబ్): అపరిచితుడు
    ఈ పదం స్త్రీ కు “మహరం” కాని వ్యక్తికి వాడబడుతుంది. కావున అపరిచితుడు స్త్రీతో ఒంటరిగా ఉండరాదు.

     
  62. అజ్ర్ (బహువచనం- ఉజూర్): ప్రతిఫలం
    సాధారణంగా దీని అర్ధం పని చేయించుకుని ఇచ్చే వేతనం. కాని ధార్మిక పరిభాషలో అల్లాహ్ ఇచ్చే ప్రతిఫలం.

     
  63. అజ్ర్ వొ సవాబ్: ప్రతిఫలం మరియు పుణ్యం
    మంచి పనిపై అల్లాహ్ ముస్లింలకు ఇచ్చే ప్రతిఫలం మరియు పుణ్యం,

     
  64. అఖ్ మిన్ అర్ రదాల్: పెంపుడు సోదరుడు
    అల్ అఖ్ బిరజాఅ అని కూడా వింటాము. ఇద్దరు వేరు తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు, కాని ఒకే స్త్రీ చనువు పాలు త్రాగినవారు.   

     
  65. అఖ్లాఖ్: ప్రవర్తన, నైతిక విలువలు
    మంచి ప్రవర్తన మరియు మర్యాదలు ఇస్లామీయ ముఖ్య అంశాలలో ప్రముఖమైనవి. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “మంచి నైతిక విలువలను మరియు మర్యాదలను బోధించడానికే నేను పంపించబడ్డాను.” ఇస్లాంలో నైతిక విలువలు, మర్యాదలు ఖుర్ఆన్ మరియు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం బోధనల ద్వారా తెలియజేబడ్డాయి.

     
  66. అఖ్లఫ:  వాగ్దానం భంగపరచుట
    వాగ్దానాన్ని భంగపరచడం ‘మునాఫిఖ్’ (కపట విశ్వాసులు)లోని నాలుగు సూచనలలో ఒకటి అని దైవప్రవక్త
    అన్నారు.

     
  67. అకీలుర్ రిబా: వడ్డీ తినేవాడు.
  68. అలామాత్ అన్ నుబువ్వహ్: ప్రవక్త సూచనలు
    ఫలానా ఆయన దైవప్రవక్త అని సూచించే నిదర్శనాలు.
    ప్రవక్త పరంపరను అల్లాహ్ అంతం చేశాడు అని ఖుర్ఆన్ లో ఉంది: “(ప్రజలారా!) ముహమ్మద్‌ (సఅసం)  మీ  మగవారిలో ఎవరికీ తండ్రికాదు. అయితే   ఆయన అల్లాహ్‌ యొక్క సందేశహరుడు.   ప్రవక్తల పరంపరను పరిసమాప్తం చేసే (చివరి) వాడు. అల్లాహ్‌ ప్రతిదీ తెలిసినవాడు.” [ఖుర్ఆన్ సూరా అహ్జాబ్ 33:40]

     
  69. అలామాత స్సాఅ తి: ప్రళయపు చిహ్నాలు
    ప్రళయం వచ్చే ముందటి చిహ్నాలు. అందులో సూర్యుడు పడమర దిశ నుండి ఉదయించడం ముఖ్యమైనది.

     
  70. అలైహి సలాతు వస్ సలాం: ఆయనపై శాంతి మరియు కరుణ కురియుగాక.
    దైవప్రవక్త పేరు పలికినప్పుడు లేదా విన్నప్పుడు భక్తితో ఇలా చెబుతారు. కొన్ని సార్లు దీన్ని చిన్నదిగా చేసి ‘సల్లల్లాహు అలైహి వసల్లం’ అంటారు. కాని అరబీలో పూర్తిగా చెప్పడం ఉత్తమం.

     
  71. అలైహిస్సలాం: ఆయనపై శాంతి కలుగుగాక
    ఏ ప్రవక్త పేరు విన్నను, ప్రతి ముస్లిం ఇలా చెబుతాడు.

     
  72. అలీమ్: అన్నీ తెలిసినవాడు
    అల్లాహ్ లక్షణాల్లో ఒకటి. ఆయన (అల్లాహ్) కు అంతా తెలుసు; జరిగింది, జరుగుతుంది, జరగబోయేది, బహిర్గతమైనది, రహస్యంగా ఉన్నది.

     
  73. అల్ అలియ్యు: మహోన్నతుడైన
    అల్లాహ్ లక్షణాల్లో ఒకటి. ఇది సూరా బఖర ఆఖరి భాగంలో వివరించబడింది (2:255 – ఆయతుల్ కుర్సీ). ఆయన అన్నిటిపై ఆధిక్యం గలవాడు.

     
  74. అల్లాహ్: ప్రభువు
    ఇంగ్లీష్ పదం ‘గాడ్’ కు అరబీలో రెండు పదాలు ఉన్నాయి. ఒకటి ‘ఇలాహ్’ అంటే, పూజించబడే ఎవరైనను మరియు ‘అల్లాహ్’ అంటే, ఒక్కడైన ఆరాధ్యుడు. అందుకే కొందరు ముస్లిం విద్వాంసులు ‘గాడ్’ స్థానాన ‘అల్లాహ్’ అనే అనాలి అని అంటారు. కాని ఇలా అనడం వల్ల ముస్లింలు ప్రత్యేక అల్లాహ్ ను ఆరాదిస్తారని అనుకోకూడదు. ఖుర్ఆన్ సూరా 1 లో ఇలా ఉంది: “ఆయన సమస్త లోకాలకు పోషకుడు.” మరో ఆయతులో  గ్రంథం గలవారికి (క్రైస్తవులు మరియు యూదులకు) ఇలా చెప్పండని ముస్లింలకు ఆదేశించబడింది: “ఉత్తమ పద్ధతిలో తప్ప గ్రంథవహులతో వాదించకండి. అయితే వారిలోని దుర్మార్గులతో (వాదులాడటం సమంజసమే). "మేము మా వద్దకు పంపబడిన గ్రంథాన్నీ, మీ వద్దకు పంపబడిన గ్రంథాన్ని కూడా విశ్వసిస్తున్నాం. మా ఆరాధ్య దేవుడూ, మీ ఆరాధ్య దేవుడూ ఒక్కడే.  మేము  ఆయన ఆజ్ఞలకే కట్టుబడి ఉన్నాము" అని స్పష్టంగా చెప్పేయండి.” [ఖుర్అన్ సూరా 29:46]. వాస్తవంగా, అరబీ భాషలో మాట్లాడే యూదులు మరియు క్రైస్తవులు అల్లాహ్ అనే పదాన్నే వాడుతారు.
    అల్లాహ్ కు 99 పేర్లు (గణ గణాలు) ఉన్నాయని దైవప్రవక్త అన్నారు. వాటిని ‘అస్మాఉల్ హుస్నా’ (అందమైన పేర్లు) అని అంటారు. ఉదాహరణకు ఈ పేర్ల గురించి ఖుర్ఆన్ 2:256, 6:101-103, 59:22-24 లో చూడండి.  ఈ ఆయతులో సంక్షిప్తమైన వివరణ ఉంది: “భూమ్యాకాశాలనుపుట్టించినవాడుఆయనే. ఆయనమీకోసంమీనుండే  మీ  జతలనుచేశాడు. పశువుల  జతలనుకూడాచేశాడు.విధంగా(ఇలలో) మిమ్మల్నివ్యాపింపజేస్తున్నాడు.ఆయన్నిపోలినవస్తువేదీలేదు.ఆయనవినేవాడు, చూచేవాడు.” [ఖుర్ఆన్ సూరా షూరా 42:11] మరో సూరాలో ఇలా అనబడింది:  “(ముహమ్మద్సల్లల్లాహుఅలైహివసల్లం!) వారికిఇలాచెప్పు: అల్లాహ్(నిజమైనఆరాధ్యుడు)ఒక్కడు.అల్లాహ్నిరపేక్షాపరుడు.(అక్కరాలేనివాడు). ఆయన(ఎవరినీ) కనలేదు. ఆయన(కూడా) ఎవరికీపుట్టినవాడుకాదు.
    ఆయనకు సరిసమానుడు (పోల్చదగిన వాడు) ఎవడూ లేడు.” [ఖుర్ఆన్ సూరా ఇఖ్లాస్ 112:1-4]

     
  75. అల్లాహు అక్బర్: అల్లాహ్ గొప్పవాడు
    అల్లాహ్ గొప్పవాడు, చాలా గొప్పవాడు అనే అర్ధాలు వస్తాయి. అల్లాహ్ తప్ప గొప్పవాడు ఎవడూ లేడు, కావున అల్లాహ్ కు తప్ప ఇతరులకు భయపడరాదు.

     
  76. అల్లాహుమ్మ: ఓ అల్లాహ్!
    సాధారణంగా ఈ పదాన్ని దుఆ లేదా వేడుకోలులో వాడుతారు. ఉదా: అల్లాహుమ్మఘ్ ఫిర్లీ – ఓ అల్లాహ్! నన్ను క్షమించు!  

     
  77. అమాన్: రక్షణ
    ఎవరికైనా రక్షణ కల్పిస్తామని వాగ్దానం చేయడం (ముఖ్యంగా శత్రువులకు).

     
  78. ఆమల్: కార్యం, కర్మలు   
    మనిషి చేసే ప్రతి కర్మ. ఇందులో అతను చెప్పిన మరియు ఆలోచించినవి కూడా వస్తాయి.

     
  79. ఆమాల్ అజ్ జ్వావారి: శారీరక కర్మ
    మనిషి శారీరకంగా, అంటే, తన అవయవాల ద్వారా చేసే కార్యాలు.

     
  80. అమా లుల్ ల్లిసాన్: పదాలు మరియు మాటలు
    మనిషి నోటితో పలికిన పలుకులు.

     
  81. అమాలుల్ ఖల్బ్: హృదయంతో చేసే పని (మనసులో ఊహించే పని)
    ఆలోచించుట, సంకల్పించుట – ఇవి కూడా కర్మల్లోనే వస్తాయి. వీటి వల్ల కూడా మానవునికి మంచి ప్రతిఫలం లేదా శిక్ష లభిస్తుంది. దీన్ని  ‘మనసు కర్మ’ అంటారు.

     
  82. అమానత్ 1 : నిజాయితీ, నమ్మదగిన, విశ్వసనీయ
    ఒక విశ్వాసిలో (ముస్లింలో) ఉండాల్సిన ముఖ్య లక్షణం – నిజాయితీ మరియు విశ్వసనీయత.

    అమానత్ 2 : నమ్మదగిన, బాధ్యత
    ఏదైనా వస్తువు లేదా ధార్మిక విలువలతో కూడిన దాన్ని ఎవరి వద్దనైనా భద్రంగా ఉంచడం. (ఉదా: ఖుర్ఆన్ 2:283, 4:58, 33:72 లో చూడండి).

     
  83. అమతున్: బానిస బాలిక, జామీనుదారి స్త్రీ
     
  84. అమతుల్లాహ్: స్త్రీ, అల్లాహ్ దాసి
    దీని అర్ధం అల్లాహ్ దాసిని లేదా బానిస స్త్రీ. ఇది ‘అబ్దుల్లా’ కు స్త్రీ వచనం. అబ్ద్ కు సరిఅయిన పదం దాసుడు.

     
  85. అమీరుల్ మోమినీన్: రాజు, విశ్వాసుల నాయకుడు
    ఈ పదాన్ని ఉమర్ (రజి), రెండో ఖలీఫా, నిర్ధారించారు.

     
  86. అమ్మ: నాయకత్వం వహించడం
    సామూహిక నమాజులో నాయకత్వం వహించడం.

     
  87. అమ్ర్: ఆదేశం, ఆజ్ఞ
    ఇది ‘అమార’ అనే పదం నుండి తీసుకోబడింది. దీని భావం ఆదేశం మరియు ఆజ్ఞ అవుతుంది.

     
  88. అమ్ర్ బిల్ మారూఫ్: మంచి విషయాన్ని ఆదేశించడం
    మంచి విషయాన్ని బోధించడం మరియు ఆదేశించడం.

     
  89. అమ్వాల్: ధనం, ఆస్తి
    ‘మాల్’ అంటే ధనం. కాని ఇందులో ఆస్తి, అంతస్తూ అన్ని వస్తాయి.

     
  90. అంబియా: ప్రవక్తలు
  91. అన్సార్: సహాయకులు
    దైవప్రవక్త మరియు ఆయనతో పాటు మక్కా నుండి మదీనాకు వలస చేసి వచ్చిన వారికి (సహాబాకు) సహాయపడిన మదీనా వాసులు. మక్కా నుండి వలస వచ్చిన వారిని ‘ముహాజిర్’ అంటారు.

     
  92. అఖాయిద్: విశ్వాసపు పునాదులు
    దీని సాధారణ భావం విశ్వాసపు (ఇస్లామీయ విశ్వాసపు) పునాదులు.

     
  93. అఖామాస్ సలాహ్ 1 : సలాహ్ (నమాజ్) చేయుట మరియు దాన్ని చేయటానికి సిద్ధంగా ఉండడం.
    అఖామాస్ సలాహ్ 2 :  ఇది నమాజ్ కు ముందు పలికే పలుకులు కూడా అవుతుంది.

     
  94. అఖ్ద్ అన్ నికాహ్: పెళ్లి
    పెళ్లి చేసుకోవడం.

     
  95. అఖీదహ్: విశ్వాసం (ఇస్లామీయ విశ్వాసం), మత విశ్వాసం
    ఒకరికి ఒక విషయంపై ఉన్న గట్టి నమ్మకం, విశ్వాసం; ఇది ప్రధానంగా మతానికి సంబంధించినది.

     
  96. అఖీఖా: దైవప్రవక్త చేసిన కర్మ (సున్నత్)
    కొత్తగా పుట్టిన బిడ్డ సంతోషంలో చేసే కార్యం. ఈ సమయంలో మేకను బలి ఇస్తారు. దాని మాంసాన్ని పేదలకు పంచిపెడుతారు మరియు దాంతో భోజనం తాయారు చేసి అందరికీ తినిపిస్తారు.

     
  97. అఖ్ల్ 1 : తెలివి
    మనిషికి ఆలోచించే సామర్ధ్యం ఉండడం.
    అఖ్ల్ 2 : బుద్ధి
    ఒక మనిషికి ఆలోచింప జేసే సామర్ధ్యం.

     
  98. అఖ్సమ: ప్రమాణం చేయడం, అల్లాహ్ పై ప్రమాణం చేయడం
    ఈ పదానికి ‘బిల్లాహ్’ అనే పదం జతచేయకున్నా, ఇది అల్లాహ్ పై ప్రమాణం అనే భావనలో వస్తుంది. అంటే, ఫలానా దానికి అల్లాహ్ సాక్షి అనే అర్ధం వస్తుంది. ఇస్లాం ప్రకారం అల్లాహ్ తప్ప దేనిపైననూ ప్రమాణం చేయకూడదు.

     
  99. అఖ్తా: భూమి ఇవ్వడం
    ఇస్లామీయ చరిత్ర ప్రకారం ఒకరికి భూమి కొంత భాగాన్ని ఇవ్వడం, సాధారణంగా ముస్లిం నాయకుల ఇలా ఇస్తారు.

     
  100. అరాక్: అరాక్ చెట్టు
    ఈ చెట్టు ద్వారా ‘మిస్వాక్’ వస్తుంది. దీన్ని ముస్లింలు దైవప్రవక్త కాలం నుంచి తమ దంతాలను తోమడానికి, శుభ్రం చేయడానికి వాడుతారు.      

     
  101. బాఘి(బాగి) :తిరుగుబాటుదారుడు
    చట్టబద్ధ మైన పాలకుడిపై తిరుగుబాటు చేయడం.

     
  102. బా’ఇన్ (తలాఖుల్ బా’ఇన్): మూడవ సారి (చివరి సారి) విడాకులు తీసుకోవడం
    ఒక స్త్రీ చివరిగా మూడవ సారి విడాకులు తీసుకోవడం. తర్వాత ఆమె తన పూర్వపు భర్త దగ్గరకు వెళ్ళరాదు, కాని కొన్ని నియమనిభందనలు పూర్తియిన తర్వాత వెళ్ళవచ్చు. చూడండి “విడాకుల తర్వాత “

     
  103. బా’ఇస్ : ప్రళయదినానికి అధిపతి
     
  104. బాఖి: నిత్యం ఉండేవాడు (శాశ్వతముగా ఉండేవాడు)
    దేవుని గుణ లక్షణాలలో ఒకటి ఆయన ప్రతి వస్తువును మరియు ప్రతి దానిని శాసిస్తాడు.

     
  105. బారి: సృష్టిని ప్రారంభించిన వాడు
    దేవుని గుణ లక్షణం ఏమిటంటే ప్రతి దానిని మరియు ప్రతి  ఒక్కరిని తానే సృష్టించడం జరిగింది. ఈ పదం అల్ ఖాలిఖ్ అనగా సృష్టించేవాడు మరియు అల్-ముసవ్విర్ (మానవుల రూపాన్ని సృష్టించినవాడు.) చూడండి ఉదాహరణకు ఖుర్ ఆన్ 59: 24

     
  106. బా’ సిత్ :ఉదారమైన ప్రదాత
    దేవుని గుణ లక్షణం ఏమిటంటే ప్రతి దానిని ప్రభలింపజేసేవారు లేదా ఎవరైతే ఉదారంగా సహాయం చేయడానికి కేటాయించేవారు. (మొదటి అర్థానికి చూడండి ఖుర్ ఆన్30: 48;రెండవ అర్థానికి చూడండి 13:26 )



    దా

  107. దాబ్బతుల్-ఆర్ద్ : భూ పశువు
    ప్రళయదినానికి సమీపంలో వచ్చే ఒక వింత పసువు. ఇది ప్రళయపు చిహ్నాల్లోని ఒక చిహ్నం.

     
  108. దాఇ యహ్(బహువచనం దుఆత్ ): ఇస్లాం యొక్క ప్రచారకులు
    ఇస్లాం ప్రచారకులు, ముఖ్యంగా ముస్లిమేతరులనుఇస్లాం గురించి తెలియజేసేవారు.

     
  109. జాల్లున్ (బహువచనం): దారితప్పిన వారు
    సూరా ఫాతిహా లో జాల్లిన్ చెప్పబడింది  అనగా క్రైస్తవులను దారి తప్పిన వారుగా సూచించబడింది.

     
  110. జామిన్ : హామీ ఇచ్చేవారు, భాద్యత గల వ్యక్తి
    ఒక వ్యక్తి అప్పు తీసుకొని మరల ఇచ్చే భాద్యత తీసుకునేవారు. ఉదాహరణకి ఎవరైనా మూల్యాలను చెల్లించే భాద్యత తీసుకునేవారు.
    జామిన్:హామీ ఇచ్చేవారు
    ఒక వ్యక్తి భాధ్యత వ్యవహారం చేబట్టేవాడు మరియు ఆ భాద్యతను నెరవేర్చేవాడు..

     
  111. దరాహిమ్  :దిర్హం
     
  112. దారుల్–‘ఆఖిరహ్ :పరలోక నివాసం
    ఈ పదం మరణానంతర జీవితాన్ని సూచిస్తుంది.


    ఫా
  113. ఫా’ల్ హసన్ : మంచి శకునం
    ఇస్లాం మంచి శకునాలను ప్రోత్సహిస్తుంది,చెడు శకునాలను ప్రోత్సహించదు.

     
  114. ఫాహిషతున్ : వివాహేతర వ్యభిచారం;సిగ్గుచేటు లేదా నీచమైన కర్మలు
    ఈ పదం క్రియ క్రిందకు వస్తుంది  “ఇర్తకబా” వ్యభిచారానికి పాల్పడడం

     
  115. ఫాజిర్(బహువచనం ఫుజ్జార్ ): విచ్చలవిడిగా తిరిగేవాడు,నేరగాడు, అనైతిక(అవినీతి)
    విచ్చల విడిగా తిరిగే వారు నైతిక సూత్రాలను పాటించరు.

     
  116. ఫార్రూక్:వివేకం
    రెండవ ఖలీఫా అయిన ఉమర్ బిన్ ఖత్తాబ్ కి ఇవ్వబడిన బిరుదు.సాధారణంగా ఈ పదం ఎవరైనా వ్యక్తి చెడు నుండి మంచిని మరియు తప్పు నుంచి ఒప్పును బయటికి తీయడాన్ని అంటారు.

     
  117. ఫాసిద్:కల్లోలకుడు
    పరిసుభ్రమైన వాతావరణంలో కల్లోలం సృష్టించేవాడు.


    ఘా
  118. ఘాఫిల్(బహువచనం ఘాఫిలూన్ ) :నిర్లక్ష్యంగా వుండేవాడు
    సాధారణంగా ఒక వ్యక్తి తన చుట్టూ పరిసరాలను అంతగా పట్టించుకోకపోవడం.అల్లాహ్ ఆజ్ఞలను పట్టించుకోకపోవడం
    (చూడండి “ఘఫ్లహ్” మరియు ఖుర్ ఆన్ 7: 205.)

     
  119. ఘాలి  (యుఘాలి):ఖరీదు ఎక్కువ
     
  120. ఘార్ హిరా :హిరా గుహా
    జబలున్నూర్ (కాంతి పర్వతం )దగ్గర ఈ గుహ ఉన్నది.ఇస్లాం కి ముందు ఎక్కడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ధ్యానం కోసం నివసిచేవారు.

     
  121. ఘార్ సౌవర్ :సౌర్ గుహా
    ప్రవక్త ముహమ్మద్ సల్లల్లహు అల్లాహ్ మరియు అయన అనుచరుడు మక్కా నుండి మదీనా వలస వెళ్ళేటప్పుడు ఈ గుహలో నివసించారు.

     
  122. ఘారిం:ఋణం తీసుకున్న వ్యక్తి
    ఒక వ్యక్తి రుణం (అప్పు)లో కూరుకు పోయినప్పుడు అవసరం మేరకు దానధర్మాలు తీసుకోవచ్చు.

     
  123. ఘాజ్(లోపల) (బహువచనం. ఘుజాహ్) :అల్లాహ్ మార్గంలోయుద్ధం చేయడం
    ఇస్లాం కోసం మరియు ముస్లిం ల సామ్రాజ్యం కోసం యుద్ధంలో పాల్గొనడం.


    హా
  124. హా’యిజ్ :రుతుస్త్రావంలో(నెలసరి) ఉన్న స్త్రీ
    రుతుస్త్రావం లో ఉన్న స్త్రీ ఆరాధన చేయరాదు, ఉపవాసం కూడా ఉండరాదు, ఖుర్ ఆన్ పట్టుకోవటానికి అనుమతిలేదు . ఆమెకు గుర్తున్న సూరాలను చుదువుకోవాలి. రుతుస్త్రావంలో వున్నప్పుడు సంబోగం చేయడానికి అనుఅమతిలేదు.

     
  125. హాబిల్:హాబిల్హా
    బిల్ ఆదం కుమారుల్లో మంచివాడు. (చూడండి ఖుర్ ఆన్, 5: 31)

     
  126. అల్ హాది :అత్యున్నత మార్గదర్శి
    అల్లాహ్ యొక్క గుణ లక్షణం. అయన అత్యున్నత మార్గదర్శి.

     
  127. హాజినహ్ : పాలు పట్టే పని మనిషి
    ఇతరుల పిల్లలకు ఒక స్త్రీ కొన్ని నిబంధనల ప్రకారం పాలుపట్టడం (చూడండి హాజర్ )

     
  128. హాఫిజ్:  జ్ఞాపకం ఉంచుకునేవాడు, రక్షకుడు
    సాహిత్య పరమైన అర్థం ఏమిటంటే రక్షించేవాడు మరియు దాచి ఉంచేవాడు’,  కాని ఇస్లాం ప్రకారం  ఈ పదానికి అర్థం ఒక వ్యక్తి ఖుర్ ఆన్ ను లేదా చాలా హదీసులను కంటస్థం చేయడం అని భావిస్తారు.


  129. ఇబాదాత్ (ఏకవచనం. ‘ఇబాదహ్) :ఆరాధన.
    ఆరాధన చేయడం, నమాజు మరియు ఉపవాసం మొదలైనవి,షేకుల్ ఇస్లాం ఇబ్న్ తైమియ్యహ్ (రహిమ హుల్లాహ్)ఇలా చెప్పారు: “ ఇబాదత్ అనేది కొన్ని ఆరాధనలు కలిపితే వచ్చే పదం.ఏవైతే పదాలు, కార్యాలు అల్లాహ్ ప్రేమను పొందుతాయో ఆ వచనాలను మరియు అలాగే బహిరంగంగా లేదా బహిర్గతంగా చేసే పుణ్యాలు.”

     
  130. ఇబాదల్లాహ్ :అల్లాహ్ దాసులు, పురుషులుమాత్రమే
    .కొన్ని సందర్భాలలో ఇది పురుషులకు మరియు స్త్రీలకూ వర్తిస్తుంది.

     
  131. ఇబాదహ్:ఆరాధించడం
    ఆరాధన అనేది ఇస్లాం లో నాలుకతో చేసేది (అనగా అల్లాహ్ ను స్మరించడం లేదా మంచి మాటలు) లేదా శారీరకంగా చేసే పుణ్యాలు (నమాజు చేయడం లేదా ఇతరులకు సహాయం చేయడం) అది కూడా కేవలం అల్లాహ్ ప్రసన్నత పొందడం కోసమే చేయాలి.  కాబట్టి దానం అనగా ఒక మంచి పని లేదా మంచి మాట కావచ్చు. షేకుల్ ఇస్లాం ఇబ్న్ తైమియ్యహ్(రహిమ హుల్లాహ్) ఇలా చెప్పారు: “ ఇబాదహ్ అనేది కొన్ని ఆరాధనలు కలిపితే వచ్చే పదం.ఏవైతే పదాలు, కార్యాలు అల్లాహ్ ప్రేమను పొందుతాయో ఆ వచనాలను మరియు అలాగే బహిరంగంగా లేదా బహిర్గతంగా చేసే పుణ్యాలు.”

     
  132. ఇబాదతుల్ ఆవ్ సాన్:విగ్రహారాధన.
    విగ్రహాలను లేదా జీవం లేని దేవతలను ఆరాధించడం, అవేమిటంటే వివిధ రకాల వ్యక్తుల విగ్రహాలు.

     
  133. ఇబాదిల్లాహ్ : అల్లాహ్ యొక్క దాసులు
     
  134. ఇబాహాహ్:చట్టబద్ధమైన వాటికి అనుమతివ్వడం

    మొ
  135. మొహ్సిల్  :పన్ను వసూలు చేసేవాడు
    ప్రభుత్వం తరపున పన్ను వసూలు చేసేవాడు మరియుదాన ధర్మాలు చేసేవాడు

     
  136. జాహర(యుజాహిర్) : వ్యక్తమవటం
     
  137. జాహి-లియ్యా హ్ : అజ్ఞాన కాలం , ఇస్లాం కి పూర్వకాలం
    ఇస్లాం కి పూర్వం అరబ్ దేశం అజ్ఞానం లో  ఉండేది. ఈ పదం ఇస్లాం ను అమలు చేయని వారికి కూడా గుర్తిస్తుంది.

     
  138. జాయిజ్: అనుమతించబడినది    ఇది  నాజాయిజ్  అనుమతించబడనది, నిషిద్ధం  
    ఇది హరాం(అధర్మం)కు వ్యతిరేకం.

     
  139. జాలూత్:జాలుత్  ప్రవక్త దావూద్ అలైహిస్సలాం చేతిలో చంపబడ్డాడు.
    అవిశ్వాసుల యొక్క క్రూరమైన రాజు, ఈయన ప్రవక్త దావూద్ అలైహిస్సలాం చేతిలో చంపబడ్డాడు. (చూడండి ఖుర్ ఆన్, సూరా 2: 250- 251)


    కా
  140. కాఫిర్ (బహువచనం కుఫ్ఫార్/కాఫిరూన్) : అవిశ్వాసి,
    సత్య తిరస్కారి (అల్లాహ్ ను మరియు అల్లాహ్ ధర్మమును తిరస్కరించేవాడు), ఇస్లాం మరియు ఇస్లాం భోదనలు విశ్వసించని వ్యక్తి.

     
  141. కాహిన్ (బహువచనం కుహ్హాన్ /కహనహ్) :మత గురువు , జ్యోతిష్యం చెప్పేవారు
    హస్త గీతల ఆధారంగా భవిష్యవాణి వినిపించేవాడు.ఒక ముస్లిం కు మాత్రం వీటి నుండి నిరోధించడ మైనది

     
  142. కాతిబ్(బహువచనం. కుత్తాబ్)అల్–వహి:  దైవ సందేశం
    ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్ ఆన్ వాక్యాలు అవతరిస్తున్నప్పుడు అనుచరులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా విని వ్రాసేవారు.

     
  143. కాజిమ్  : కోపాన్ని అణచి వేయడం
    ఒక వ్యక్తి తన కోపాన్ని మరియు ఆగ్రహాన్ని అణచివేసుకోవాలి. కోపాన్ని దిగమింగడం అతి గోప్ప పని. (చూడండి.ఖుర్ ఆన్, 3: 134.)

     
  144. కా’బహ్:  కాబా
    మక్కానగర  మధ్య భాగంలో ఉండే పవిత్ర మస్జీద్ అయినటువంటి క్యూబిక్ భవనం. దీనిని ప్రవక్త ఇబ్రహీం మరియు ఆయన కుమారుడైన ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు నిర్మించడమైనది(చూడండి ఖుర్ ఆన్ సూరా,2: 127.).  ఇది అల్లాహ్ యొక్క మొదటి గృహం.అల్ బైత్(గృహం)లేదా రెండవది అల్-బైతుల్ అతీక్ (పాత గ్రహం’)అని ఖుర్ ఆన్ లో చెప్పడం అయినది.


    లా
  145. లా హౌలా వ అలా ఖువ్వతా ఇల్లా బిల్లాహ్: చెడు నుండి ఆపే శక్తి మరియు మంచిని చేసే శక్తి అల్లాహ్ వైపు నుండి మాత్రమే వుంది.
    ఈ పదాన్నీ ఇబ్బందుల నుండి దూరం కావటానికి వాడుతారు,చదువుతారు.

     
  146. లా ఇలాహ ఇల్లల్లాహ్ :అల్లాహ్ తప్ప వేరొక నిజమైన ఆరాధకుడు మరెవ్వరూ లేడు.
     
  147. లాహూత్: వేదాంతశాస్త్రం
     
  148. లాత్:లాత్
    అరేబియాలోవుండిన అన్యమతస్తుల వారు ఆరాధించే విగ్రహం పేరు.

     
  149. లా’నత్ :  శాపం, దూషణం
    దేవుని దయ కోల్పోవడం,లేదా అయన కారుణ్యంలో ఒక భాగాన్ని కోల్పోవడం


    మా
  150. అల్–మాజిద్:గొప్పవాడు, ప్రఖ్యాతి చెందినవాడు
    అల్లాహ్ యొక్క దివ్య లక్షణం. ఆయన మహిమపరచబడుటకు సరైన పాత్రుడు.

     
  151. మాల్(బహువచనం. అమవాల్) : డబ్బు,ఆస్తి, ధనం.
    ఈ పదం తరచుగా ఆస్తులకు ఉపయోగిస్తారు.

     
  152. మాలిక్:ప్రభువు, యజమాని
    ఈ క్రియ పదం మలక అనగా స్వాదీనం పరచుకోవడం నుండి వస్తుంది. ఈ పదం ను సూరా ఫాతిహ (మొదటి సూరా) అలాగే ఖుర్ ఆన్ లో చాలా సార్లు ఈ పదం ను గమనించవచ్చు.
    మాలిక్:మాలిక్న
    రక పాలకుడి పేరు. ( చూడండి ఖుర్ ఆన్, 43: 77).
    మలిక్ : మలిక్
    ఇమాం మాలిక్ నలుగురి ఇస్లాం తత్త్వ వేత్తలలో ఒకరు.ఈయన మదీనాలో జన్మించారు. ఈయన ఒక సాంప్రదాయవాది గా పేర్కొన్నారు.ఈయన భోదించిన విధానాలను(మద్ హ్హబ్ )ఆఫ్రికా మిగతా దేశాలు అమలుపరుస్తారు.

     
  153. అల్-మాలిక్  అల్-ముల్క్: ప్రళయకాపు అధిపతి
    అల్లాహ్ యొక్క దివ్య లక్షణం. ఆయన సృష్టికి యజమాని మరియు రాజులకు రాజు.(చూడండి ఖుర్ ఆన్, 3: 26.)
    కొన్నిసార్లు మనం ఇలా వింటుంటాము “మాలిక్ అల్-ముల్క్ వ అల్-మల్కూత్”.

     
  154. మాలికియ్యి (బహువచనం. మాలికియ్యహ్) : ఇమామ్ మాలిక్ ను అవలంబించేవారు లేదా అనుసరించేవారు.

    నా
  155. అన్–నాఫి : లాభం చేకూర్చేవారు.
    అల్లాహ్ యొక్క దివ్య లక్షణం. అయన ఒక్కడే అందరికి లాభం చేకూర్చేవారు.

     
  156. నాఫిలహ్ (బహువచనం. నవాఫిల్) : స్వచ్చంద ఆరాధనలు
    ఆరాధనలకు ఈ పదాన్ని ఉపయోగిస్తారు, అనగా స్వచ్చంద ఆరాధనలు (ఫర్జ్ నమాజు కాకుండా మిగతావి ) లేదా ఉపవాసం (ఫర్జ్ ఉపవాసాలు కాకుండా మిగతావి అనగా రమజాన్ నెలలో కాకుండా మిగతా రోజులలో ఉండే ఉపవాసాలు )

     
  157. నాజియ హ్ (ఒక వర్గం-ఫిర్కహ్) :రక్షణ పొందిన సమూహం
    ముస్లిం లు ప్రళయదినం రోజున ఖుర్ ఆన్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భోధనలను పాటించినందుకు వారు రక్షించబడతారు,పాటించనివారు నష్టపోతారు.

     
  158. నాషిజ్ : తిరుగుబాటు చేసే భార్య
    అన్యాయం కారణంగా భార్య తన భర్తపై తిరుగుబాటు చేయడం జరుగుతుంది.దాని వలన ఆమె “నఫఖహ్”(జీవన ఖర్చు) ఆర్థికంగా నష్టపోతుంది.

     
  159. నాసిఖ్ (బహువచనం. నవాసిఖ్) : కొట్టివేయడం
    పూర్వం అవతరింపజేసినవి మార్పు చేర్పులకు అయినందున అవి కొట్టివేయబడినవి.


    ఖా
  160. ఖాబిదహ్ లేదా ఖాబిజ్: ఆదినపరచుకోవడం లేదా స్వాదీనపరచుకోవడం  
    అల్లాహ్ యొక్క దివ్య లక్షణం. అయన తలుచుకున్న దానిని తన స్వాదీనంలోకి తీసుకోనబడును.

     
  161. ఖాబిల్: హాబిల్ సోదరుడు, ఖాబిల్
    ఆదం యొక్క కుమారుడు, హాబిల్ సోదరుడు.హాబిల్ ఖాబిల్ చేత చంపబడ్డారు.

     
  162. ఖాజి (బహువచనం.ఖుజాత్): తీర్పుచేసేవాడు
    ప్రస్తుత కాలంలో మనం వినే “ ఖాజి షరియ్యత్” అనగా ఇస్లాం ప్రకారం న్యాయం చెప్పేవాడు.

     
  163. ఖాదిర్: సామర్థ్యం కలవారు
    అల్లాహ్ యొక్క దివ్య లక్షణం. అల్లాహ్ అన్నిటి సామర్థ్యం కలవారు

     
  164. ఖా’ఇఫ్ (ఉర్దూ పదం : ఖియా వఫ్): ముఖ కవళికలు గుర్తు పట్టేవారు.
    శరీరాకృతిని గుర్తు పట్టి తండ్రి కుమారుల సంబంధాల గురించి చెప్పేవారు.


    రా
  165. రాఫి’ : లేవనేత్తుట
    అల్లాహ్ యొక్క దివ్య లక్షణం. అల్లాహ్ యొక్క ఆజ్ఞలను పాటించేవారి స్థానాలను పెంచుతాడు.

     
  166. రాఫిదహ్ లేదా రాఫిజ్ (ఏకవచనం.రాఫిదియ్య) : తిరస్కరించేవారు.
    షియా లకూ ఈ పదం వాడబడుతుంది.ఎందుకంటే వీరు మొదటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులను  మరియు ఖలీఫా ను తిరస్కరిస్తారు.అలాగే అలీ రజిఅల్లాహు అన్హు ను ప్రవక్త వారసునిగా విశ్వసిస్తారు.

     
  167. రాహిబ్ (బహువచనం. రుహ్ బాన్ ) : సన్యాసి
    సన్యాసి అనగా ఇస్లామీయ పరభాషలో మఠాలలో  దైవారాధన చేస్తూ ఉండేది. ఇది క్రైస్తవులకు సంబందించినది.

     
  168. రా’యి: భాధ్యతగల వ్యక్తి
    ఈ పదం గొర్రెల కాపరికి వర్తిస్తుంది. ఇది ఎవరైనా వేరొకరి భాద్యత తీసుకున్న వారిని తెల్పుతుంది. తండ్రి లేదా పాలకుడు మొదలైనవారు.

     
  169. రా’ షి : లంచం తీసుకునే మధ్య వర్తి  
    ఎవరైతే లంచం ఇచ్చేవారికి మరియు లంచం తీసుకునే వారికి మధ్యవర్తిగా ఉంటాడో. ఇతను కూడా వారి లాగే పాపం చేసిన వాడు అవుతాడు.



    సా
  170. సా’ఇయ్య  :నడవడం, ముందుకు వెళ్ళడం
    సఫా మరియు మర్వా మధ్య నడవడం. చూడండి“స’యీ

     
  171. సా’(బహువచనం. ఆస్వా’):  సా’
    ఇస్లాం ప్రకారం కొలిచేకొలమానం.

     
  172. సా’అత్:ప్రళయదినం
    ప్రళయదినం రోజు

     
  173. సాబియహ్/అస్ సాబిఊన్ : నక్షత్రాలను ఆరాధించేవారు, లేదా దైవదూతలను ఆరాధించేవారు.
    కొంతమంది ప్రజలు నక్షత్రాలను ఆరాధించేవారు, లేదా దైవదూతలను ఆరాధించేవారు, ఖుర్ ఆన్ లో వీరిని క్రైస్తవుల తో పాటు మరియు యూదులతోపాటుజమ చేయడం జరిగింది. (చూడండి ఖుర్ ఆన్ సూరా, 5: 69).

     
  174. సాబిర్:సహనం వహించేవాడు
    ఈ పదం దురదృష్ట సమయాల్లో సహనం ను పాటిస్తూ మంచి పనులు చేసేవారిని సూచిస్తుంది.చూడండి“సబ్ర్”


    తా
  175. తా’అహ్(బహువచనం. తా’ఆత్ ):విధేయత చూపటం
    దీని సాహిత్యపరమైన అర్థం సిరసావహించడం. ఇక్కడ అల్లాహ్ ఆజ్ఞలను పాటించే విధానాన్ని తెల్పుతుంది.

     
  176. త’అబ్బుదియ్యత్:దేవుని ఆజ్ఞ,కర్మ
    ముస్లిం ఏ పని చేసినా అది తన ధర్మాజ్ఞ ప్రకారం అమలుపరిచాడు అనే దానిని తెల్పుతుంది.

     
  177. తాబి’(ఏకవచనం)అత్-తాబిఈన్:అనుచరుడు : సహాబాలను విశ్వాస స్థితిలో కలిసిన వాడు
    మూడవ తరానికి చెందిన ముస్లిం అంటారు.ప్రవక్త ముహమ్మద్  సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచరులు మొదటి తరానికి చెందిన వారు. వారిని అనుసరించే వారిని  తాబి అంటారు.

     
  178. తాబియ్యహ్ :రెండవతరం ముస్లింలు
    ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహ్ వసల్లం వారి అనుచరుల జీవిత కాలంలో వీరిని కలిసిన వారు.

     
  179. తాబూత్(బహువచనం.తవాబిత్): పూర్వపు కాలపు పేటిక
    ఈ పదం పేటిక అనేఅర్థాన్ని సూచిస్తుంది. “నిశ్చయంగా, అతని ఆధిపత్యానికి లక్షణం ఏమిటంటే, అతని ప్రభుత్వ కాలంలో ఆ పెట్టె (తాబూత్) మీకు తిరిగి లభిస్తుంది.”(చూడండి ఖుర్ఆన్ 2:248.)


  180. ఉబూదియ్యత్:అల్లాహ్ ను ఆరాధించేవారు
    ధర్మ పరమైనపదం. ఏమిటంటే ఇది దేవుడికి మరియు ఆయన దాసునికి గల మధ్య సంబందాన్ని తెలియజేస్తుంది.

     
  181. ఉజ్ హియ్యతు (బహువచనం. అదాహి):జంతుబలి లేదా   కుర్భాని
    హజ్యాత్ర లో యాత్రికులుజంతువులను కుర్భాని కొరకై ఉపయోగిస్తారు. మేక(ఒక సంవత్సరం లోపు ఉండకూడదు). గొర్రె(ఆరు నెలల లోపు ఉండకూడదు). ఆవు లేదా ఎద్దు (రెండు సంవత్సరాల లోపు ఉండకూడదు) లేదా ఒంటె(ఐదు సంవత్సరాల లోపు ఉండకూడదు).
    ఒక మేక లేదా గొర్రె ఒక హజ్ యాత్రికుడికే సంబందిస్తుంది,ఆవు లేదా ఎద్దు ఏడు మందికి సంబందిస్తుంది.
    ఒకవేళ హజ్ యాత్రికులు కాకపోతే పైవన్నీ కలిపి ఒక కుటుంబానికే సంబందిస్తుంది. ఒక వ్యక్తికి సంబందించినది కాదు.

     
  182. ఉజ్ర్  (బహువచనం. అజార్) : సాకులు చెప్పడం
    చెప్పిన పని చేయకపోవడం వలన చెప్పే సమాధానం.

     
  183. ముహసిన (యుహసను) :పెళ్లి చేసుకున్నాడు
    ఈ పద క్రియను ఖుర్ ఆన్ లో  పెళ్లిచేసుకోవడాన్ని గురించి తెలపడం జరుగింది. (చూడండి ఖుర్ ఆన్  4: 25.)

     
  184. అహద్ (బహువచనం. ఉహూద్):ఒడంబడిక మరియు ఒప్పందం  
    ఒడంబడికను మరియు ఒప్పందం ను వ్రాత రూపంలో ఉంచబడుతుంది.


    వా
  185. అల్–వాహిద్: ఒక్కడే
    అల్లాహ్ యొక్క గుణలక్షణం. ఆయన ఒకే ఒక్కడు, నిరుపేక్షాపరుడు మరియు ప్రత్యేకత కలవాడు, ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు.

     
  186. వాఇజ్(బహువచనం. వు”ఆజ్ ) :  ప్రచారకుడు
    ఎవరైనా ఒక వ్యక్తి ఇతరులకు ప్రసంగం ఇవ్వడం లేదా ప్రచారం చేయడం.

     
  187. వాజిబ్ : తప్పనిసరి
    ధర్మంలో తప్పనిసరిగా ఉండవలసినవి.
    వాజిబ్(బహువచనం. వాజిబాత్) : విధిబాధ్యత
    ధర్మలో కొన్ని విషయాలు భాద్యత గా చేయవలసినవి ఉంటాయి.

     
  188. వజద :పొందేవాడు
     
  189. వాలి  (బహువచనం. వులాత్):అధికారి
    రాజులేదా ఖలీఫా అనుమతి ప్రకారం ఒక అధికారిని ఏదైనా ప్రాంతానికి నియమించవచ్చు


  190. యదన్ బి-యదిన్:తక్షణ మార్పిడి
    ఇస్లాం ధర్మం లావాదేవిల క్రమంలో కొన్ని వస్తువులను త్వరగా మార్పు చేర్పులు చేసుకోవడానికి అనుమతి ఇస్తుంది.

     
  191. యఘూస్  :యఘూస్
    ప్రవక్త నూహ్ అలైహిస్సలాం నాటి కాలంలో ప్రజలు ఆరాధించే విగ్రహం పేరు. (చూడండి ఖుర్ ఆన్ 71:23)

     
  192. యహూద్ (ఏకవచనం యహూదియ్య ):యూదుడు
    చూడండి“యహూదియ్య”

     
  193. యహూదియ్య (బహువచనం యహుద్ ):యూదులు
    ఇస్లాం ప్రకారం యూదుల గ్రంథ ప్రజలు.

     
  194. యహూదియహ్: జుడాయిజం
    నిజమైన  ధర్మాన్ని భోదించిన ప్రవక్త మూసా అలైహిస్సలాం తర్వాత వారు అపమార్గం పట్టారు.వీరి గ్రంథం అత్ తౌరాత్. కాని ఇప్పుడు అది తల్మూద్, యూదుల యొక్క గ్రంథంగా పిలువబడుతుంది


    జా
  195. జాహర(యుజాహిరు): జిహార్ ను ప్రకటించడం
    చూడండి జిహార్.

     
  196. జాహిద్: సన్యాసి
    ఒక వ్యక్తి తన జీవితాన్ని సన్యాసత్వంలో గడపడం.(చూడండి “జుహ్ద్”).

     
  197. జాహిర్: స్పష్టమైన
    అల్లాహ్ యొక్క గుణ లక్షణం. ఎవరికైతేతను సృష్టించిన సృష్టి వాటి కార్యాలు మరియు అవి ఎప్పుడు అంతమవుతాయి అనే ప్రతి విషయానికి ఒక స్పష్టమైన సమయం నిర్ణయించారు.

     
  198. జాహిర్ అల్-మజ్ హ్హబ్ :
    మజ్ హ్హబ్ ఆజ్ఞలు స్పష్టంగా ఉన్నాయా తెలుసుకోవటం.

     
  199. జాహిరియ్యహ్:  ఒక వర్గం పేరు
     
  200. జిహార్:జిహార్
    “జిహార్”అరబ్బులపూర్వపు ఆచారం. ఇస్లాం దీనిని  కూడా విడాకుల కు సమానంగా సూచిస్తుంది. ఇక్కడ ఒక వ్యక్తి తన భార్యకు ఇలా చెప్పడం,“ నీవు నాకు అమ్మ లాంటి దానివి” అని చెప్పడం” (చూడండి ఆధారాలు ఖుర్ ఆన్ 58: 1-4)

1050 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్