తిరుగుబాటు- ఆరాచకాలు

నిషిద్ధ మాసాలలో యుద్ధం చెయ్యటం గురించి ప్రజలు నిన్ను అడుగుతున్నారు. నువ్వు వారికి చెప్పు : ఈ మాసాలలో యుద్ధం చేయటం మహాపరాధం. అయితే అల్లాహ్‌ మార్గంలో అవరోధాలు కల్పించటం, అల్లాహ్‌ను తిరస్కరించటం, మస్జిదె హరామ్‌ను సందర్శించే జనులను అడ్డుకోవటం, అక్కడ నివసించే వారిని అక్కడి నుంచి వెళ్ళగొట్టడం అల్లాహ్‌ దృష్టిలో అంతకన్నా ఘోరమైన అపరాధం. ఈ ఉపద్రవం (ఫిత్నా) హత్య కన్నా పెద్దది.వారు మీతో యుద్ధం చేస్తూనే ఉంటారు. చివరికి వారికి వీలు కలిగితే మిమ్మల్ని మీ ధర్మం నుంచి మరలించనయినా మరలించేస్తారు.మరి మీలో గనక ఎవరయినా తమ ధర్మం నుంచి తిరిగిపోయి, అవిశ్వాస స్థితిలో మరణిస్తే వారి ఇహపర లోకాల్లోని కర్మలు సర్వనాశనమైపోతాయి. అలాంటి వారే నరకవాసులు. వారందులో కలకాలం పడి ఉంటారు.సూరా అల్ బఖర 2:217

విషయసూచిక

అల్లాహ్‌ అమితంగా క్షమించేవాడు, అపా రంగా కరుణించేవాడని తెలుసుకోండి

ఎవరు అల్లాహ్‌తోనూ, ఆయన ప్రవక్తతోనూ పోరాడుతారో, భూమిలో కల్లోలాన్ని రేకెత్తిస్తూ తిరుగుతుంటారో వారు వధించబడాలి. లేదా ఉరి కంబం ఎక్కించబడాలి. లేదా ఎదురుగా వారి కాళ్లు చేతులు ఖండించబడాలి. లేదా వారిని దేశం నుంచి బహిష్కరించాలి.ఇది ఇహలోకంలో వారికి కలగవలసిన పరాభవం. పరలోకంలో వారికి విధించబడే శిక్ష (ఇంతకన్నా) ఘోరంగా ఉంటుంది. కాని వారిలో ఎవరయినా మీ అదుపులోకి రాకముందేపశ్చాత్తాపపడితే, అల్లాహ్‌ అమితంగా క్షమించేవాడు, అపా రంగా కరుణించేవాడని తెలుసుకోండి. సూరా అల్ మాయిద 5:33-34

ఘోరమైన అపరాధం

నిషిద్ధ మాసాలలో యుద్ధం చెయ్యటం గురించి ప్రజలు నిన్ను అడుగుతున్నారు. నువ్వు వారికి చెప్పు : ఈ మాసాలలో యుద్ధం చేయటం మహాపరాధం. అయితే అల్లాహ్‌ మార్గంలో అవరోధాలు కల్పించటం, అల్లాహ్‌ను తిరస్కరించటం, మస్జిదె హరామ్‌ను సందర్శించే జనులను అడ్డుకోవటం, అక్కడ నివసించే వారిని అక్కడి నుంచి వెళ్ళగొట్టడం అల్లాహ్‌ దృష్టిలో అంతకన్నా ఘోరమైన అపరాధం. ఈ ఉపద్రవం (ఫిత్నా) హత్య కన్నా పెద్దది.వారు మీతో యుద్ధం చేస్తూనే ఉంటారు. చివరికి వారికి వీలు కలిగితే మిమ్మల్ని మీ ధర్మం నుంచి మరలించనయినా మరలించేస్తారు.మరి మీలో గనక ఎవరయినా తమ ధర్మం నుంచి తిరిగిపోయి, అవిశ్వాస స్థితిలో మరణిస్తే వారి ఇహపర లోకాల్లోని కర్మలు సర్వనాశనమైపోతాయి. అలాంటి వారే నరకవాసులు. వారందులో కలకాలం పడి ఉంటారు.సూరా అల్ బఖర 2:217

అల్లాహ్‌యే మీ రక్షకుడు

ఫిత్నా (షిర్క్‌) సమసిపోనంత వరకూ, ధర్మం మొత్తం అల్లాహ్‌దే అయిపోనంత వరకూవారితో పోరాడండి. ఒకవేళ వారు గనక తమ వైఖరిని మానుకుని దారికివస్తే అల్లాహ్‌ వారి కర్మలను చూస్తాడు.ఒకవేళ వారు (దారికి రాకుండా) తిరిగిపోతేఅల్లాహ్‌యే మీ రక్షకుడనినమ్మండి. ఆయన ఉత్తమ సంరక్షకుడు, ఉత్తమ సహాయకుడూను.సూరా అల్ అన్ ఫాల్8:39-40

అల్లాహ్‌ యొక్క జ్యో తి

వారు అల్లాహ్‌ జ్యోతిని తమ నోటితో (ఊది) ఆర్పివేయాలని కోరుతున్నారు. అయితే అల్లాహ్‌ అవిశ్వాసులకు ఎంతగా సహించరానిదైనా సరే- తన జ్యోతిని పరిపూర్ణం చేయకుండా వదలిపెట్టటానికి అంగీకరించడు.ఆయనే తన ప్రవక్తకు మార్గదర్శకత్వాన్నీ, సత్యధర్మాన్నీ ఇచ్చి పంపాడు ముష్రిక్కులకు ఎంత సహించరానిదయినా సరే, ఇతర ధర్మాలపై దానికి ఆధిక్యతను వొసగటానికి!సూరా అత్ తౌబా 9:32-33

ఆధారాలు

http://www.askislampedia.com/te/quran/-/view/Surah/2#217

http://www.askislampedia.com/te/quran/-/view/Surah/5#33

http://www.askislampedia.com/te/quran/-/view/Surah/2#217

http://www.askislampedia.com/te/quran/-/view/Surah/8#39

http://www.askislampedia.com/te/quran/-/view/Surah/9#32

311 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్