తాయిఫ్


తాయిఫ్ పట్టణం సౌదీ అరేబియాలోని మక్కా ప్రాంతం నుండి  1,879 mదూరంలో సరవాత్ పర్వతాల మధ్య (6,165 ft)వైశాల్యం తో ఉన్నది. అక్కడ (2004 జనాభ లెక్కల ప్రకారం)దాదాపు 521,273 మంది ప్రజలు ఉన్నారు. ఈ పట్టణం ద్రాక్ష తోటల మరియు పూలు మరియు తేనే లభించే ప్రాంతం మధ్యలో  ఉన్నది.

 

విషయసూచిక

 

ప్రారంభ చరిత్ర

6 వ శతాబ్దంలో తాయిఫ్ పట్టణం బనూ తకిఫ్ ఆదిపత్యం లో ఉండేది. ఈ పట్టణం మక్కా కి దక్షిణం దిక్కున 100 km దూరంలో (62 miles) ఉన్నది. ఇక్కడ తాయిఫ్ లోయలో అల్లాత్ అనే దేవత ఉండేది, ఈమెను తాయిఫ్ స్త్రీ అని కూడా అనేవారు. తాయిఫ్ పట్టణ వాతరవరణం చాలా పొడిగా ఉండడాన్ని గమనించవచ్చు మరియు అక్కడి చుట్టు ప్రక్కల ఉన్న ఎడారు ప్రజలు ఎర్ర సముద్రానికి దగ్గరలో ఉంటారు. ఈ పట్టణం వారు ఏనుగు సంవత్సరపు యుద్ధంలో పాల్గొన్నారు.

 

తాయిఫ్ మరియు మక్కా రెండు ప్రాంతాలు యాత్రికుల సందర్శన ప్రదేశం గా ఉండేది.  మక్కా కంటే తాయిఫ్ ప్రాంతం అందరికి అనుగుణంగా ఉండేది, తాయిఫ్ ప్రజలకు మక్కా ప్రజలతో మంచి వ్యాపారా సంభందాలు ఉండేవి. తాయిఫ్ ప్రజలు తమ పండ్లను మరియు వ్యవసాయానికి గల సామాగ్రిని మక్కా కు సరఫరా చేసేవారు.

 

ప్రాంతం మరియు వాతావరణం

తాయిఫ్ పట్టణం సౌదీ అరేబియాలోని పర్వతాలలో ఉన్నది, ఇది జిద్దా నుండి రెండు గంటల సమయపు దూరంలో ఉన్నది. తాయిఫ్ పట్టణం 6,000 అడుగుల ఎత్తులో మరియు ఉదారమైన వర్షపాతం కారణంగా,నగరం వేసవి కాలంలో అనువైన వాతావరణం (80-90F డిగ్రీల) మరియు చల్లని శీతాకాలంలో వాతావరణం  (40F వెచ్చని దుస్తులు అవసరమవుతుంది) ఇలా సంవత్సరం పొడవునా ఉంటుంది.

 

ప్రవక్తవారి తాయిఫ్ ప్రయాణం

 ప్రవక్త ముహమ్మద్ ఒక సంవత్సరంలో చాలా దుఃఖములో ఉండిరి. మొదట, తన ప్రియమైన భార్య ఖదీజాرضياللهعنهమరణించారు. ఆమె ప్రజలన్నిటిలోకల్లా ప్రవక్తకు ఉత్తమ మద్దతుదారుగా ఉన్నారు. తన బాబాయి అబూతాలిబ్ కూడా మరణించారు. ఈయన ప్రవక్తవంశంకు శిరస్సు లాంటి వారు, ఇతను ఖురైష్ లలోని మిగిలిన తెగల నుండి ప్రవక్తకు రక్షణ ఇవ్వగల సామర్థ్యంగల ఏకైక వ్యక్తి. అబూతాలిబ్ తన అన్న కుమారుడైన ముహమ్మద్ను మనస్పూర్తిగా ప్రేమించేవాడు. ప్రవక్త ముహమ్మద్ తన బాబాయిగారు అవిశ్వాసిగా మరణించినందుకు చాలా భాధపడ్డారు.

 

అలాగే ప్రవక్త బాబాయి చనిపోవడం వలన ప్రవక్తమరియు ఆయనఅనుచరులకు తోడూగా సహాయం చేసేవారు లేకుండా పోయారు.

 

ఖురైష్ లోని మిగతా వర్గం వారు ఈ అవకాశాన్ని ఆసరా తీసుకొని వారి దుర్జన చేష్టలను ముస్లింలపై పూర్తిగా పటిష్టం చేశారు. ప్రవక్తవంశం అయిన బనూ హాషిం కు అబూ తాలిబ్ తర్వాత అబూ లహబ్ నాయకుడై ప్రవక్త కు బద్ధ శత్రువుగా తయారయ్యారు. హజ్ యాత్ర సమయంలో ప్రవక్తబజారులోఉన్నప్పుడు ఆయన పై మట్టిని మరియు దుమ్మును పోసేవారు, అలాగే సాబిఆన్ మరియు అబద్దీకుడు అని పిలిచేవారు, అలాగే ప్రవక్త  ను విశ్వసించేవారిని హెచ్చరించేవారు.

 

హదీస్  

ప్రవక్త గారి భార్య అయిషా ర.జి ఉల్లేఖనం ప్రకారం: అయిషా ర.జి అయన కు అడిగారు: “ ఉహద్ యుద్ధం కంటే మరేదైనా భాదాకరమైన రోజు ఏదైనా ఉందా అని అడిగారు?

ప్రవక్త ఇలా సమాధానమిచ్చారు: మీ తెగవారు(ఖురైష్ లు) నన్ను చాలా ఇబ్బందికి గురి చేశారు,  అఖబా రోజు నేను ఇబ్న్‘ అబ్ద్ యాలైల్ బిన్ అబ్ద్ కిలాల్ ముందు నా సందేశం ఉంచినప్పుడు అతనుఎటువంటి సమాధానం ఇవ్వలేదు. అప్పుడు నేను అక్కడి నుండి భాదతో బయలుదేరి ఎక్కడా ఆగకుండా వెళ్ళిపోయాను, ఒకానొక చోట కర్న్ సాఆలిబ్ దగ్గరకు చేరాను, అక్కడ నేను తలపైకి ఎత్తి ఆకాశం వైపు చూశాను, పైన ఆకాశంలో అనుకోకుండా ఒక మేఘం నాపై ఆవరించి ఉన్నది. అప్పుడు నేను పైన జిబ్రాయీల్ అలైహిస్సలాం దైవదూతను చూశాను. అయన నన్ను పిలిచి ఇలా చెప్పాడు. “అల్లాహ్سبحانه و تعالىతాయిఫ్ ప్రజలు మీతో ఏమంటున్నారో విన్నాడు, వారు మీ పట్ల ఎలా ప్రవర్తించాడో కూడా చూశారు. అల్లాహ్ سبحانه و تعالىపర్వతాల దైవదూతను పంపాడు, కావున మీరు ఆజ్ఞాపిస్తే ఆ ప్రజలపై మీ ఆజ్ఞను అమలు చేస్తాము అని చెప్పారు. పర్వతాల దైవదూత నన్ను పిలిచి నాకు సలాం చెప్పాడు, ఆ తర్వాత ఇలా చెప్పాడు: “ఓ ముహమ్మద్   మీరు అనుమతించండి. మీరు అనుమతిస్తే  ఈ రెండు పర్వతాలను వారిపై పడవేస్తాను అన్నాడు.”

 

అప్పుడు నేను ఇలా చెప్పాను: “వద్దు,  అల్లాహ్ سبحانه و تعالىవారి సంతానంలోనైనా అల్లాహ్ ను మాత్రమే ఆరాధించేవారిని పుట్టిస్తాడు. అల్లాహ్  తప్ప ఎవరూ లేరు.” సహీహ్ అల్-బుఖారీ విభాగం 4:81,విభాగం 8:168మరియు సహీహ్ ముస్లిం 3/1420

 

తాయిఫ్ ప్రజలు ప్రవక్త ను వ్యతిరేకించారు మరియు ఆయన పట్ల క్రూరంగా ప్రవర్తించారు.ఆయన భాధాకరంతో తాయిఫ్ ప్రజల నుండి తిరిగి మక్కా బయలుదేరారు, కాని అక్కడి ప్రజల అయన పై ఇంకా కోపాన్ని వ్యక్తపరిచారు.

ఆయన అల్-ముత్’ఇమ్ బిన్.ఉదయి  రక్షణ కల్పించడం ద్వారా మక్కాలోకి ప్రవేశించాడు. మొదట అయన అల్-అఖ్నాస్ బిన్.శురక్య్ మరియు సుహయల్  బిన్ అమ్ర్ ను కూడా అడిగారు, కాని వీరు కూడా నిరాకరించారు.

 

ఆధారాలు

http://en.islamtoday.net/artshow-432-4496.htm

321 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్