తాయత్తులు


తాయాత్తులను దారంతో కట్టి అందులో ఒక కాగితంపై ఏవో సూచనలు వ్రాస్తారు. కొన్ని సార్లు ఒక రకమైన గాజును చేతికి తొడుక్కుంటారు.

 

విషయసూచిక

 

పరిచయం

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం కాలంలో అరబ్బులు చేతులకు గాజులు, మెడలకు హారాలు, గవ్వలు మొదలైనవి తాయతులుగా వేసుకునేవారు. ఇవి వారిని చెడుల నుంచి రక్షించి, మంచిని చేకూరుస్తాయి అని వారు విశ్వసించేవారు.


షిర్క్(బహుదైవారాధన)

ఇది తౌహీద్ అల్ రుబూబియాకు విరుద్ధం. అల్లాహ్ ను కాక ఇతరులకు (సృష్టితాలకు) మంచి చేసే అధికారం ఇవ్వడం.


హదీస్

ఇమ్రాన్ ఇబ్న్ హుసైన్ రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఒకతడు మోచేతి పై భాగంపై రాగి గాజు ధరించడం చూశారు. అప్పుడుదైవప్రవక్తసల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “నీ పాడుగాక! ఇది ఏమిటి?” ఇది నన్ను అల్ వాహినహ్ అనే రోగం నుంచి కాపాడుతుంది అని అతనుజవాబిచ్చాడు. దానికిదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా ఆదేశించారు: “దాన్ని తీసివేయి. అది నీ రోగాన్ని ఇంకా పెంచుతుంది. అది అలానే ఉంచుకుని మరణించినట్లయితే, నీవు సాఫల్యం పొందలేవు.” (అహ్మద్, ఇబ్న్ మాజా, ఇబ్న్ హిబ్బాన్)


“ఒకరు ఇంకొకరి అనారోగ్యానికి చికిత్స చేసుకోండి. కాని,నిషేధించబడిన వాటితోచికిత్సచేయకండిమరియుచేయించుకోకండి.” (సునన్ అబూ దావూద్ vol 3:3865)

 
ఉఖ్బా బిన్ ఆమిర్ రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “తాయత్తులను ధరించేవాడు, ఇతరులకు ధరింపజేసేవాడు- ఇద్దరినీ అల్లాహ్ విఫలం మరియు అశాంతికి గురిచేయుగాక.”(అహ్మద్ 16951)


ఉఖ్బా బిన్ ఆమిర్ రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “తాయత్తు ధరించినవాడి కోరికలను అల్లాహ్ నెరవేర్చడు, పూసలుపెట్టుకునేవాడికి అల్లాహ్ ఆరోగ్యాన్ని, రక్షణనుప్రసాదించడు.” (ముస్నద్ అహ్మద్ vol 4:154)


దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం సున్నత్ ప్రకారం, మానవుడు అల్లాహ్ పేర్లు మరియు లక్షణాలతో ఆయన్ని వేడుకోవాలి.(ఇబ్న్ హజర్ గారి అల్ ఫతావా అల్ హాదితియహ్ లో పేజి నెం 88)


ఆధారాలు

http://www.ahya.org/amm/modules.php?name=Sections&op=viewarticle&artid=161 (ఇంగ్లీష్)
http://abdurrahman.org/tawheed/tawheed_lessons_wasabi/Class_35_-_February_25_06.pdf
(ఇంగ్లీష్)
 

 

530 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్