తాత ముత్తాతల అనుకరుణ


అల్లాహ్‌ అవతరింపజేసిన దానిని (వహీని) అనుసరించండి అని వారితో అన్నప్పుడు, "లేదు. మా తాత ముత్తాతలు అవలం బిస్తూ ఉండగా చూసిన విధానాన్నే మేము అనుసరిస్తాము" అని వారంటారు. ఒకవేళ షైతాను వారి పెద్దలను నరకయాతన వైపుకు పిలుస్తూ ఉన్నప్పటికీ (వారు దాన్నే అనుసరిస్తారా?)సూరా లుక్మాన్ 31:21

 

విషయసూచిక

 

వహీ

అల్లాహ్‌ అవతరింపజేసిన దానిని (వహీని) అనుసరించండి అని వారితో అన్నప్పుడు, "లేదు. మా తాత ముత్తాతలు అవలం బిస్తూ ఉండగా చూసిన విధానాన్నే మేము అనుసరిస్తాము" అని వారంటారు. ఒకవేళ షైతాను వారి పెద్దలను నరకయాతన వైపుకు పిలుస్తూ ఉన్నప్పటికీ (వారు దాన్నే అనుసరిస్తారా?)సూరా లుక్మాన్ 31:21

 

మార్గ విహీనులు

''అల్లాహ్‌ అవతరింపజేసిన గ్రంథాన్ని అనుసరించండి'' అని వారికి చెప్పినప్పుడల్లా, ‘‘మా తాతలు తండ్రులు అవలంబిస్తూ ఉండగా చూచిన పద్ధతినే మేము పాటిస్తాము'' అని వారు సమాధానమిస్తారు. వారి పూర్వీకులు ఒట్టి అవివేకులు, మార్గ విహీనులైనప్పటికీ (వీళ్లు వారినే అనుసరిస్తారన్నమాట!) సత్య తిరస్కారుల ఉపమానం పశువుల కాపరి యొక్క కేకను, అరుపును మాత్రమే వినే పశువుల వంటిది (ఆలోచన అన్నమాటే ఉండదు). వారు చెవిటివారు, మూగవారు, గ్రుడ్డి వారు. వారు అర్థం చేసుకోరు. సూరా అల్ బఖర 2:170-171

 

అవివేకులు

అల్లాహ్‌ 'బహీరా'నుగానీ, 'సాయిబా' నుగానీ, 'వసీలా'ను గానీ, 'హామ్‌'నుగానీ ఏర్పరచలేదు. అయినప్పటికీ అవిశ్వా సులు అల్లాహ్‌కు అబద్ధాన్ని అంటగడుతున్నారు. వారిలో చాలా మంది అవివేకులు. ''అల్లాహ్‌ అవతరింపజేసిన ఆదేశాల వైపుకు, ప్రవక్త వైపుకు రండి’’ అని వారితో అన్నప్పుడు, ‘‘మా తాత ముత్తాతలు అవలంబిస్తూ ఉండగా మేము చూసిన విధానమే మాకు చాలు’’ అని వారంటారు. ఏమిటీ? వారి తాత ముత్తాతలకు ఏమీ తెలీకపోయినప్పటికీ, వారు సన్మార్గంలో నడవనప్పటికీ వీరు వాళ్లనే అనుసరిస్తారా? సూరా అల్ మాయిద 5:103-104

 

సందేహాలు

కనుక (ఓ ముహమ్మద్‌!) వారు పూజించేవాటి విషయంలో నువ్వు సందేహాలకు లోనుకారాదు. ఇంతకు మునుపు వారి తాత ముత్తాతలు పూజించినట్లుగానే వీళ్ళూ పూజిస్తున్నారు. మేము వాళ్ళందరికీ వారి వారి భాగాన్ని పూర్తిగా ఏ మాత్రం తగ్గించ కుండా ఇస్తాము. సూరా హూద్ 11:109


సత్య వంతుడు

''మేము అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించాలనీ, మా తాత ముత్తాతలు పూజిస్తూ వచ్చిన వాటిని వదలివేయమని (చెప్పటాని కేనా) నువ్వు మా వద్దకు వచ్చింది? ఒకవేళ నువ్వు సత్య వంతుడవే అయితే ఏ శిక్షను గురించి నువ్వు మమ్మల్ని బెదిరి స్తున్నావో దాన్ని మా వద్దకు రప్పించు చూద్దాం'' అని వారు అన్నారు. సూరా అల్ ఆరాఫ్ 7:70

 

రుజు వర్తనుడు

వారిలా అన్నారు : ''ఓ షుఐబ్‌! మేము మా తాతముత్తాతలు పూజిస్తూ వస్తున్న దైవాలను వదలిపెట్టాలనీ, మా సొమ్ములను మా ఇష్టప్రకారం ఖర్చుపెట్టడం మానుకోవాలని నీ నమాజు నీకు ఆజ్ఞాపిస్తోందా? నువ్వు మరీ ఉదాత్త హృదయునిలా, రుజు వర్తనునిలా ఉన్నావే?!''సూరా హూద్ 11:87

 

శ్రీమంతులు

ఇలాగే నీకు మునుపు మేము ఏ బస్తీలో హెచ్చరించేవాణ్ణి పంపినా అక్కడి శ్రీమంతులు కూడా, "మేము మా తాత ముత్తాత లను ఒక పద్ధతిపై ఉండటం చూశాము. మేము కూడా వారి పాదచిహ్నాలలోనే నడుస్తాము" అని చెప్పేవారు. "మీ తాతముత్తాతలు అనుసరిస్తుండగా మీరు చూసిన మార్గం కంటే చాలా మంచి మార్గాన్ని (గమ్యానికి చేర్చే మార్గాన్ని) నేను మీ వద్దకు తీసుకువచ్చాను" అని (దైవప్రవక్త) అన్నప్పుడు, "మీకిచ్చి పంపబడిన పద్ధతిని మేము తిరస్కరిస్తున్నాం" అని వాళ్లు (తెగేసి) చెప్పారు. అందుకే మేము వారిపై ప్రతీకారం తీర్చుకున్నాము. మరి ధిక్కరించిన వారికి పట్టిన గతేమిటో చూడు! సూరా అజ్ జుఖ్ రుఫ్ 43:23-25

 

అల్లాహ్‌ ఎన్నుకున్న దాసులు

తమ తాతముత్తాతలను వీరు భ్రష్టమార్గంలో నడుస్తుండగా చూశారు. అయినప్పటికీ వారి పాద చిహ్నాలలోనే పరుగులు తీశారు. వీరికి మునుపు కూడా ఎందరో పూర్వీకులు పెడదారి పట్టి ఉన్నారు. వాళ్ల మధ్య కూడా మేము హెచ్చరించే వారిని పంపి ఉన్నాము. మరి హెచ్చరించబడిన వారికి పట్టిన గతేమిటో నువ్వే చూడు! అల్లాహ్‌ ఎన్నుకున్న దాసులు తప్ప. (వారు మాత్రం ఆ దుష్పరిణామం నుంచి రక్షించబడ్డారు). సూరా అస్ సాఫ్ఫాత్ 37:69-74

 

సిగ్గుమాలిన పని

వారు సిగ్గుమాలిన పని చేసినప్పుడల్లా, ''మేము మా తాత ముత్తాతలను కూడా ఇలా చేస్తుండగా చూశాము. అల్లాహ్‌ కూడా మాకు ఇలాగే చేయమని ఆజ్ఞాపించాడు'' అని చెబుతారు. ''సిగ్గుమాలిన పనులు చెయ్యమని అల్లాహ్‌ ఎన్నటికీ ఆజ్ఞాపించడు. మీకు ఏ విషయాలైతే తెలియవో అల్లాహ్‌కు అటువంటి వాటిని ఆపాదిస్తారేమిటీ?'' అని (ఓ ప్రవక్తా!) వారిని అడుగు. సూరా అల్ ఆరాఫ్ 7:28

 

షిర్క్‌

''అల్లాహ్ తలచుకొని ఉంటే మేముగానీ, మా తాత ముత్తాతలుగానీ షిర్క్‌కు పాల్పడేవారం కాము; ఏ వస్తువునూ నిషిద్ధంగా ఖరారు చేసేవారం కూడా కాము’’ అని ముష్రిక్కులు అంటారు. వీరికి పూర్వం గతించిన వారు కూడా ఇలాగే ధిక్కార వైఖరిని అవలంబించారు. కడకు వారు మా శిక్షను చవి చూశారు (ఓ ప్రవక్తా!) వారిని అడుగు: ''మీ దగ్గర ఏదైనా ప్రమాణం ఉంటే, దాన్ని మా ముందు సమర్పించండి. మీరు కేవలం ఊహలను అనుసరిస్తారు. అంచనాలతో మాట్లాడతారు.''సూరా అల్ అన్ ఆమ్ 6:148

 

ప్రవక్తల బాధ్యత సందేశాన్ని స్పష్టంగా అందజేయటం

ముష్రిక్కులు ఇలా అన్నారు : ''అల్లాహ్‌ గనక తలచుకుని ఉంటే మేమూ, మా తాతముత్తాతలూ ఆయన్ని తప్ప ఇంకొక రెవరినీ ఆరాధించేవాళ్ళం కాము. ఆయన ఉత్తర్వులేకుండా ఏ వస్తువునూ నిషేధించే వాళ్ళం కాము.'' వీరి పూర్వీకులు చేసింది కూడా అదే. కనుక ప్రవక్తల బాధ్యత సందేశాన్ని స్పష్టంగా అందజేయటం తప్ప మరొకటి కాదు. సూరా అన్ నహ్ల్ 16:35

 

ఆధారాలు

http://www.askislampedia.com/te/quran/-/view/Surah/31#21

http://www.askislampedia.com/te/quran/-/view/Surah/2#170

http://www.askislampedia.com/te/quran/-/view/Surah/5#103

http://www.askislampedia.com/te/quran/-/view/Surah/11#109

http://www.askislampedia.com/te/quran/-/view/Surah/7#70

http://www.askislampedia.com/te/quran/-/view/Surah/11#87

http://www.askislampedia.com/te/quran/-/view/Surah/43#23

http://www.askislampedia.com/te/quran/-/view/Surah/37#69

http://www.askislampedia.com/te/quran/-/view/Surah/7#28

http://www.askislampedia.com/te/quran/-/view/Surah/6#148

http://www.askislampedia.com/te/quran/-/view/Surah/16#35

 

 

375 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్