తర్వియహ్ రోజు


జిల్ హజ్జా 8 వ తేదీని తర్వియహ్ రోజు అంటారు. ఈ రోజు హాజీ లు అందరూ మినా కు వెళ్లి ఆ రోజు రాత్రి పూర్తిగా ఉండాలి, ఈ రోజు హజ్ యొక్క మొదటి రోజు అవుతుంది.

 

విషయసూచిక

 

పరిచయం

జిల్ హజ్జా 8 వ తేది హాజీ హజ్ ఏ తమత్తు చేసేవారు, వారు నివాసం ఉన్న చోటు నుండి మరల ఇహ్రాం ధరించి, ఇలా పలకాలి: “లబ్బైక అల్లాహుమ్మ హజ్జన్”.

 

మినాకు జిల్ హజ్జా 8 వ తేదిన బయలు దేరాలి. హాజీలు జుహర్, అసర్ మరియు  మఘ్రిబ్, ఇషా మరియు జిల్ హజ్జా 9వ తేది(అరఫాత్ రోజు) ఫజర్ ను మినాలోనే  చదవాలి. జుహర్, అసర్ మరియు ఇషా నమాజులను రెండు రకాతులుగా తగ్గించుకోవాలి, ఈ నమాజులను ఆయా సమయాల్లోనే చదవాలి. సహీహ్ అల్-బుఖారీ 1083. ఇక్కడ అల్లాహ్ ను ఎక్కువగా స్మరించాలి మరియ దుఆ చేసుకోవాలి, మారియు తల్బియా ను పలుకుతూనే ఉండాలి.[1]

 

హదీస్

అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ ఉల్లేఖనం ప్రకారం: మినా రోజున  అల్లాహ్ ప్రవక్త జిల్ హజ్జా 8 వ తేదీన (యవమ్ అత్ తర్వియహ్) జుహర్ నమాజు మరియు జిల్ హజ్జా 9 వ తేదీ (యవమ్ అల్ అరఫాత్) ఫజర్ నమాజు ను చేశారు. సునన్ అబి దావూద్ : 1911

 

అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ ఉల్లేఖనం ప్రకారం: అల్లాహ్ ప్రవక్త జిల్ హజ్జా 8 వ తేదీన (యవమ్ అత్ తర్వియహ్) జుహర్, అసర్, మగ్రిబ్ మరియు ఇషా మరియు జిల్ హజ్జా 9 వ తేదీ (యవమ్ అల్ అరఫాత్) ఫజర్ నమాజు ను మినాలో చదివి అరఫాత్ కు వెళ్ళిపోయారు.సునన్ ఇబ్న్ మాజాహ్3004  [2]

 

ఇవి కూడా చూడండి

హజ్; ఉమ్రా; తవాఫ్; అరఫాత్; మినా; ఈద్ ఉల్ ఆజా; సఫా వల్ మర్వా; మక్కా

 

ఆధారాలు

[1] http://www.islamweb.net/ehajj/index.php?page=article&id=135517

[2] http://www.sunnah.com/search/TARWIYAH

980 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్