తక్సీర్ వల్ హల్క్


తక్సీర్ వల్ హల్క్ అనగా పూర్తి వెంట్రుకలను కత్తిరించడం.హాజీ(పురుషుడు) ఉమ్రా చేసిన తర్వాత లేదా హాజ్ మూడవ రోజు తల వెంట్రుకలను పూర్తిగా లేదా దగ్గరికి కత్తిరించుకోవాలి.లేదా పూర్తిగా హలక్(తల వెంట్రుకలను పూర్తిగాతీసివేయవచ్చు) చేయవచ్చు.[1]

 

విషయసూచిక

 

పరిచయం

హాజీ(పురుషుడు) ఉమ్రా చేసిన తర్వాత లేదా హాజ్ మూడవ రోజు తల వెంట్రుకలను పూర్తిగా లేదా చిన్నగాకత్తిరించుకోవాలి. లేకపోతే పూర్తిగా హలక్(తల వెంట్రుకలను తీసివేయవచ్చు) చేయవచ్చు.అల్లాహ్ప్రవక్త()సాంప్రదాయం హల్క్ చేయించుకోమనిప్రోత్సహిస్తుంది

 

 1. పురుషులకు పూర్తిగా తల వెంట్రుకలు కత్తిరించడం  లేదా చిన్నగాకత్తిరించడం, ఈ  రెండు విషయాలలో దేనినైనా పాటించవచ్చు. స్త్రీలుతన క్రింది వెంట్రుకల నుండి కొంచెం పై భాగం వరకు కత్తిరించవచ్చు. ప్రవక్త()ఎవరైతే పూర్తిగా తల వెంట్రుకలు తీసివేస్తారో వారి కోసం మూడుసార్లు దుఆ చేశారు, అలాగే తల వెంట్రుకలను చిన్నగా కత్తిరించుకున్న వారికి ఒక సారి దుఆ చేసాడు.
   
 2. ఇప్పుడు మీరు స్నానం చేసి ఇహ్రామ్ ను తీసి వేసి సాధారణ దుస్తులను ధరించవచ్చు.
   
 3. ఆ తర్వాత మిగతా నిషేదించిన పనులన్నీ చేయవచ్చు ఒక భార్యతో సంబోగం చేయడం తప్ప. దీనినే అత్ తహ్ల్లుల్ అంటారు.[2]

 

హదీస్

అనస్ బిన్ మాలిక్ (ర.జి) ఉల్లేఖనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త ()మినా కు వచ్చిన తర్వాత, ఆయన()జమరాహ్ దగ్గరకు వెళ్లి రాళ్ళను విసిరేవారు, ఆ తర్వాత మినా కు చేరుకున్న తర్వాత జంతువును బలి ఇచ్చారు. తర్వాతఆయన()మంగళి వాడిని పిలిచి ఆయన కుడి వైపు తిరిగి తల వెంట్రుకలను తీయమని చెప్పి అలా ఎడమ వైపు వరకు పూర్తిగాతీసివేయించారు. తర్వాత ఆయన ()తన తల వెంట్రుకలను ప్రజలకు ఇచ్చేశారు. సహీహ్ ముస్లిం 1305

 

పూర్తివెంట్రుకలనుతీసివేయడానికికల విశిష్టత (హలక్)

యహ్య బిన్ అల్-హుస్సేన్ ఉల్లేఖనం ప్రకారం వీరి తాత గారు చెప్పిన ప్రకారం . ప్రవక్త()ఎవరైతే పూర్తిగా తల వెంట్రుకలు తీసివేస్తారో వారి కోసం మూడుసార్లు దుఆ చేశారు, అలాగే తల వెంట్రుకలను చిన్నగా కత్తిరించుకున్న వారికి ఒక సారి దుఆ చేసాడు. ఇక్కడ ఉల్లేఖుడు ఏ హాజీ గురించి కూడా చెప్పలేదు. సహీహ్ ముస్లిం1303 మరియు సహీహ్ అల్-బుఖారీ 1728 [3]
 

జిల్హజ్జా 10 వ తేదీన చేయవలసిన పనులు

 1. తక్సీర్ వల్ హల్క్ రమీ–పెద్ద జమరాహ్ పై రాళ్ళు విసరడం (జమరా ఏ అక్బా కు7రాళ్ళు విసరడం )
   
 2. హలక్ వ తక్సీర్ – వెంట్రుకలనుపూర్తిగాతీసివేయడం లేదా కత్తిరించడం
   
 3. హాది–జంతువునుబలి ఇవ్వడం
   
 4. తవాఫుల్ ఇఫాదహ్ – హజ్ తర్వాత చేసే చిట్ట చివరి తవాఫ్ 
   
 5. మఖాం ఏ ఇబ్రహీం దగ్గర 2 రకాతుల నమాజు చేయడం
   
 6. జం జం నీరు త్రాగడం
   
 7. సఫా వల్ మర్వా

 

అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ అల్-ఆస్(ర.జి) ఉల్లేఖనం ప్రకారం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కుర్భానీ ఇచ్చే రోజుప్రసంగానికి నేను సాక్ష్యంగా ఉన్నాను. ఒక వ్యక్తి లేచి ఇలా చెప్పాడు, “ నా ఆలోచన ప్రకారం ఈ పనుల ముందుగా ఈ పనులు చేసి ఉండాలి. నేను కుర్భానీ ఇవ్వకముందు పూర్తిగా వెంట్రుకలను కత్తిరింపజేశాను. (ఇంకొక వ్యక్తి ఇలా చెప్పాడు), “ నేను రమీ చేయకముందే కుర్భానీఇచ్చాను అని చెప్పాడు.”  అప్పుడు ప్రజలుఈవిషయంపైవివిధ ప్రశ్నలు అడిగారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు, “ మీరుఈ పనులు తొందరగా చేయండి ఈవిదంగా చేయడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. “ ఎవరైనాప్రవక్త()  కు దేని గురించైనా అడిగితే, ఆయన() ఇలా చెప్పేవారు, “తొందరగా చేయండి ఈవిదంగా చేయడంలో ఎటువంటి ఇబ్బంది లేదు”.“ సహేహ్ అల్-బుఖారీ Vol.2.:1737 మరియు సహీహ్ అల్ – బుఖారీ విభాగం Vol.1: 124 [4]

 

ఇవి కూడా చూడండి

హజ్;ఉమ్రా; మీకాత్; ఇహ్రం; తవాఫ్; జమరాహ్; జమ్ జమ్; సఫా వల్ మర్వా;

 

ఆధారాలు

[1] http://www.onislam.net/content/english/hajj/services/05.shtml

[2] [4] http://www.mecca.net/hajj-information.html

[3] http://www.sunnah.com/search/three-times-for-the-one-who-shaved-their-hair

 

1083 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్