జుమా(శుక్రవారం)


జుమా అంటే శుక్రవారం. అన్ని రోజుల్లో ‘శుక్రవారం’ మంచిది అని దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం అనేక సార్లు అన్నారు. సాధారణంగా ముస్లింలు ప్రతి రోజు ఐదు పూటలు నమాజ్ చేస్తారు. గడియారం సమయం ప్రకారం కాకుండా సూర్యుని దిశల ప్రకారం నమాజ్ సమయాన్ని పాటిస్తారు. శుక్రవారం నాడు ‘శుక్రవారపు నమాజ్’ కు చాలాప్రాముఖ్యత ఉంది.
 

విషయసూచిక

 

ఖుర్ఆన్

ప్రతి ముస్లింపైరోజువారి ఐదు పూటల నమాజ్ విధి (తప్పనిసరి) చేయబడినట్లే, ‘జుమా(శుక్రవారపు) నమాజ్’ (జమాత్ తో) మస్జిద్ లో సామూహికంగాచేయడం తప్పనిసరి అని ఈ ఆయతు (ఖుర్ఆన్ వచనం) ద్వారా తెలుస్తుంది. “ఓ విశ్వాసులారా! శుక్రవారంనాడు నమాజు కొరకు అజాన్(పిలుపు) ఇవ్వబడినప్పుడు, మీరు అల్లాహ్ ధ్యానం వైపు పరుగెత్తండి. క్రయ విక్రయాలను వదలిపెట్టండి. మీరు గనక తెలుసుకోగలిగితే ఇది మీ కొరకు ఎంతో మేలైనది. మరి నమాజు ముగిసిన తరువాత భూమిలో విస్తరించి, దైవానుగ్రహాన్ని అన్వేషించండి. ఎక్కువగాఅల్లాహ్ ను స్మరిస్తూ ఉండండి. తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు.” (ఖుర్ఆన్, సూరా జుమా 62:9-10)


జుమా నమాజ్ (శుక్రవారపు నమాజ్) జుహర్ నమాజ్ కు సగం చేయబడింది.ముస్లింల సౌకర్యం కోసం ఇలా చేయబడింది.నాలుగు రకాతులకు బదులుగా రెండు రకాతుల నమాజ్ చేయబడింది. ఆ రెండు రకాతుల నమాజ్ కు ముందు (ఖుత్బా) జుమా ప్రసంగం తప్పనిసరి చేయబడింది.


హదీస్

దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం జుమా (శుక్రవారపు) నమాజ్ ప్రాముఖ్యాన్నిచాటుతూ ఇలా అన్నారు: “ప్రజలు జుమా (శుక్రవారపు) నమాజ్ ను నిర్లక్ష్యం చేయకూడదు. ఆలా చేసినవారి హృదయాలపైఅల్లాహ్ ముద్ర వేస్తాడు మరియు వారు అశ్రద్దపరుల్లో జమచేయబడతారు.” (ముస్లిం)


దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం ఇలా కూడా అన్నారు: “ఎవరైతే కావాలని వరుసగా మూడు జుమా (శుక్రవారపు) నమాజులు వదిలేస్తాడో, అతని హృదయంపై అల్లాహ్ ముద్ర వేస్తాడు.” (అబూ దావూద్)


దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం ఇలా అన్నారనిఔస్ ఇబ్న్ ఔస్ రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖించారు: “అన్ని రోజుల్లో శుక్రవారం చాలా మంచిది. ఆ రోజు ఆదం అలైహిస్సలాం సృష్టించబడ్డారు; ఆ రోజే ఆయన మరణించారు; ఆ రోజే (సూర్) గాలి వాద్యము ఊదబడుతుంది మరియు సృష్టితాలన్నీ మూర్ఛపోతాయి. కావున నాపై ఎక్కువగా దరూద్ పంపండి. మీ దరూద్ నాకు చూపించబడుతుంది.” “ఓ దైవప్రవక్తా! మీరు మట్టిగా మారిపోయిన తరువాత మీకు మా దరూద్ ఎలా చూపించబడుతుంది?” అని సహచరులు అడిగారు. అప్పుడుదైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం ఇలా అన్నారు, “దైవప్రవక్తల శరీరాలను నష్టపరచకూడదని అల్లాహ్ భూమినిఆదేశించాడు.” (అబూ దావూద్ 1047, సహీహ్ అబీ దావూద్ 925)


అబూ హురైరా రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖనం ప్రకారందైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం ఇలా అన్నారు: “సూర్యుడు ఉదయించే మంచి దినం శుక్రవారం.ఆ రోజు ఆదం అలైహిస్సలాంసృష్టించబడ్డారు, ఆ రోజు అయన స్వర్గంలో ప్రవేశింపజేయబడ్డారు, ఆ రోజే అందులోనుంచి తీసివేయబడ్డారు.” (సహీహ్ ముస్లిం 1410)


ఖుత్బాహ్ పదాలు

అబ్ద్ అల్లాహ్ ఇబ్న్ మసూద్ రజిఅల్లాహుఅన్హు ఇలాఅన్నారు: “దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం మమ్మల్ని ఖుత్బాత్ అల్ హాజా నేర్పించారు: అల్ హందులిల్లాహి నహ్ మదుహు వ నస్త ఈనుహు వ నస్తఘ్ ఫిరుహు, వ నవూజు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ సయ్యి ఆతి ఆమాలినా మయ్ యహ దిహిల్లాహు ఫలా ముజిల్లలహు వమైయుజ్లిల్ఫలాహాదియలహ్ వ అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్ హదు అన్న ముహమ్మదన్అబ్దుహు వ రసూలుహు. (ప్రశంసలన్నీ అల్లాహ్ కొరకే, మేము ఆయన సహాయాన్ని మరియు క్షమను అర్ధిస్తున్నాము.

 

మా ఆత్మల చెడు నుండి మరియు మా చెడు అలవాట్ల నుండి మేము అల్లాహ్ శరణు కోరుతున్నాము. అల్లాహ్ రుజుమార్గం చూపించినవాడిని ఎవరూ పెడద్రోవ పట్టించలేరు, అలాగే అల్లాహ్ మార్గభ్రష్టతకు గురిచేసిన వానిని ఎవరూ మార్గం చూపించలేరు. అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం అల్లాహ్ దాసుడుమరియుప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను.) ఆ తరువాత దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం ఈ మూడు ఆయతులను పఠిoచారు.యా అయ్యు హల్లజీన ఆమనుత్త ఖుల్లాహహఖ్ఖ తుఖాతిహి వలా తమూతున్న ఇల్లా వ అన్ తుమ్ ముస్లిమూన్.[ఖుర్ఆన్, సూరా ఆలి ఇమ్రాన్ 3:102].(ఓ విశ్వాసులారా! అల్లాహ్ కు ఎంతగా భయపడాలో అంతగా భయపడండి. ముస్లింలుగాతప్ప మరణించకండి.) యా అయ్యుహన్నాసుత్తఖు రబ్బకుం అల్లజిఖలఖకుమ్ మిన్ నఫ్సిన్ వాహిదతిన్ వ ఖలఖ మిన్ హా జౌజహా వ బస్స మిన్ హుమా రిజాలన్ కసీరన్వ నిసా అన్ వత్తఖుల్లా అల్లజీ తసాలూన బిహీ వల్ అర్ హామ ఇన్నల్లాహ కాన అలైకుమ్ రఖీబన్. [ఖుర్ఆన్, సూరా నిసా 4:1](మానవులారా! మిమ్మల్ని ఒకే ప్రాణి నుంచి పుట్టించి, దాన్నుంచే దాని జతను కూడా సృష్టించి, ఆ ఇద్దరి ద్వారా ఎంతో మంది పురుషులను, స్త్రీలను వ్యాపింపజేసిన మీ ప్రభువుకు భయపడండి. ఎవరి పేరుతొ మీరు పరస్పరం మీకు కావలసిన వాటిని అడుగుతారో ఆ అల్లాహ్ కు భయపడండి. బంధుత్వ సంబంధాల తెగత్రెంపులకు దూరంగా ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ మీపై నిఘావేసి ఉన్నాడు.) యా అయ్యు హల్లజీన ఆమనుత్త ఖుల్లాహ వఖూలూ ఖవ్ లన్ సదీద. [ఖుర్ఆన్, సూరా అల్ అహ్ జాబ్ 33:70](ఓ విశ్వాసులారా! అల్లాహ్ కు భయపడండి. మాట్లాడితే సూటిగా మాట్లాడండి (సత్యమే పలకండి).


శుక్రవారం శుభాలు

1 –ఆ రోజు జుమా నమాజ్ (శుక్రవారపు ప్రార్ధన) ఉంది, ఇది చాలా మంచి నమాజు.


 అల్లాహ్ ఇలా అన్నాడు:“ఓ విశ్వాసులారా! శుక్రవారంనాడు నమాజు కొరకు అజాన్ (పిలుపు) ఇవ్వబడినప్పుడు, మీరు అల్లాహ్ ధ్యానం వైపు పరుగెత్తండి. క్రయ విక్రయాలను వదలిపెట్టండి. మీరు గనక తెలుసుకోగలిగితే ఇది మీ కొరకు ఎంతో మేలైనది. (ఖుర్ఆన్, సూరా జుమా 62:9)  


అబూ హురైరా రజిఅల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం ఇలా సెలవిచ్చారు: “రోజువారి ఐదు పూటల నమాజులు మరియు ఒక జుమా నుంచి మరో జుమా -  మధ్యలో జరిగే చిన్న చిన్న పాపాలకు పరిహారం అవుతాయి. పెద్ద పాపాలకు కాదు.(ముస్లిం 233)


2 – శుక్రవారం నాడు ఫజర్ నమాజ్సామూహికంగా చదవడం , అల్లాహ్ దృష్టిలో ఉత్తమమైనది.”


ఇబ్న్ ఉమర్ రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం ఇలా అన్నారు: “శుక్రవారం రోజు ఫజర్ నమాజ్ సామూహికంగా చదవడం అల్లాహ్ దృష్టిలో ఉత్తమమైనది.” (సహీహ్ హుల్ జామి 1119)


శుక్రవారం రోజు ఫజర్ నమాజ్ లోని విశిష్టతఏమిటంటే – మొదటి రకాతులో సూరా సజ్దా, రెండవ రకాతులో సూరా ఇన్సాన్ చదవడం సున్నత్.  


అబూ హురైరా రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖించారు: శుక్రవారం రోజు ఫజర్ నమాజులో దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం మొదటి రకాతులో సూరా సజ్దా మరియు రెండవ రకాతులో సూరా ఇన్సాన్ చదివేవారు.(బుఖారీ 851, ముస్లిం 880)


అల్ హాఫిజ్ ఇబ్న్ హజర్ ఇలా అన్నారు:ఈ రెండు సూరాలు చదవడానికి కారణం – ఈ సూరాలలోశుక్రవారం రోజున జరిగే - ఆదం అలైహిస్సలాం సృష్టి మరియు అంతిమ దినం గురించి ప్రస్తావించబడింది.


3 – శుక్రవారం రోజు(అంటే పగలు, రాత్రి) చనిపోయిన వ్యక్తిని అల్లాహ్ సమాధిలో అడగబడే ప్రశ్నల నుండి రక్షిస్తాడు.


అబ్ద్ అల్లాహ్ ఇబ్న్ అమ్ర్ రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం ఇలా అన్నారు: “శుక్రవారం రోజు పగలు లేదా రాత్రి చనిపోయిన ప్రతి ముస్లింను అల్లాహ్ సమాధిలో అడగబడే ప్రశ్నల నుండి రక్షిస్తాడు.” (అత్ తిర్మిజి 1074)


4 - శుక్రవారంనాటి ఓ సమయంలో దుఆ నిరాకరించబడదు.


అబూ హురైరా రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖించారు:దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం శుక్రవారం గురించి మాట్లాడుతూ ఇలా అన్నారు: “శుక్రవారం రోజు ఓ సమయం ఉంది. అందులో నమాజ్ చదివాక ముస్లిం చేసే దుఆ అల్లాహ్ యందు ఆమోదం పొందుతుంది.” దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం ఆ సమయం ఎంత చిన్నగా ఉంటుందోతమ చేతితో చూపించారు.సహీహ్ అల్ బుఖారీ vol 2:57; సహీహ్ ముస్లిం 852)


5 –పాపాల పరిహారం


అబూ హురైరా రజిఅల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం ఇలా సెలవిచ్చారు: “రోజువారి ఐదు పూటల నమాజులు మరియు ఒక జుమా నుంచి మరో జుమా -   వీటి మధ్యలో జరిగే చిన్న చిన్న పాపాలకు పరిహారం అవుతాయి. పెద్ద పాపాలకు కాదు. (అల్ తహార 342)


అబూ హురైరా రజిఅల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం ఇలా సెలవిచ్చారు: “శుక్రవారం రోజు దైవదూతలు మస్జిద్ లోని అన్ని ద్వారాలలో నిలబడి ఎవరు ముందు మస్జిద్ కు వచ్చారో వ్రాసుకుంటారు. ఇమాం మెంబర్ (మస్జిద్ లో నమాజ్ చదివించే అతను) కూర్చున్నాక వారు కూడా పుస్తకాలను మూసేసి లోపల వచ్చి కూర్చొని ‘ఖుత్బా’ ప్రసంగం వింటారు. జుమా నమాజుకై మస్జిద్ కు మొదట వచ్చిన వాడు ఒంటెను బలి ఇచ్చినట్లు; ఆతరువాత క్రమంలో వచ్చేవారు – అవును బలి ఇచ్చినట్లు,మేకను బలి ఇచ్చినట్లు, కోడిని బలి ఇచ్చినట్లు, ఆఖరిలో గుడ్డును సమర్పించినట్లు.” (సహీహ్ అల్ బుఖారీ, అల్ జుమా, 1416)


దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం ఇలా సెలవిచ్చారు: “ఎవరైతేశుక్రవారం నాడు( లైంగిక సంపర్కం చేసి)  భార్యను ఘుసల్ చేయించి, తాను కూడా ఘుసల్ చేస్తాడో, ఆ తరువాత తొందరగా మస్జిద్ కు కాలినడకనవెళ్ళి, ఇమాం దగ్గరగా కూర్చుని ఎలాంటి శబ్దం చేయకుండా‘ఖుత్బా’ ప్రసంగం వింటాడో- అతనికి అతడు వేసే ప్రతి అడుగుపై ఒక సంవత్సరం పాటు ఉపవాసాలు ఉండి, రాత్రి పూట నమాజ్ చేసినంత ప్రతిఫలం దొరుకుతుంది.” (అబూ దావూద్ 345)


6. పోయిన శుక్రవారం మరియు ఈ శుక్రవారం మధ్యలో జరిగిన తప్పులకు పరిహారం


అబూ హురైరా రజిఅల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం ఇలా సెలవిచ్చారు: “ఎవరైతే ఘుసల్ చేసి జుమా నమాజ్ కోసం వెళ్లి,పూర్తి ధ్యానంతోఖుత్బా విని, ఇమాంతో పాటు నమాజ్ చడువుతాడో – ఆ జుమాతో పాటు వచ్చే జుమా (ఇంకా మూడు రోజులు ఎక్కువ) వరకు అతని పాపాలు మన్నించబడతాయి.” (ముస్లిం 857)


మస్జిద్ కు వేసే ప్రతి అడుగు ద్వారా మానవునికిఒక సంవత్సరం పాటు ఉపవాసాలుండి, రాత్రి పూట నమాజ్ చేసినంత ప్రతిఫలం లభిస్తుంది.


7 –జుమా ప్రసంగం పూర్తి ధ్యానంతో వింటేనే జుమా నమాజ్ ప్రతిఫలం లభిస్తుంది.


అబూ హురైరా రజిఅల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం ఇలా సెలవిచ్చారు: “ఇమాం జుమా ప్రసంగం ఇస్తున్నప్పుడు, ఎవరైనా ఇతరులతో ‘ధ్యానంతో వినండి’ అని అన్నా, పనిలేని సంభాషణ చేసినట్లే.” (బుఖారీ 934, ముస్లిం 851)


8 –జుమా ఖుత్బాను ధ్యానంగా విన్నవానికి రెండు ప్రతిఫలాలు ఉంటాయి.


అలీ ఇబ్న్ అబీ తాలిబ్ రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖించారు: ఎవరైతే ఇమాంను చూడగలిగే, వినగలిగే చోటు నుండి జుమా ఖుత్బా ధ్యానంగా వింటూ, ఎలాంటిపనిలేని సంభాషణ చేయరో, వారికి రెండు ప్రతిఫలాలు ఉంటాయి. ఎవరైతే ఇమాంకు దూరంగా కూర్చొని ప్రసంగం వినపడకున్నా, ఎలాంటి మాట మాట్లాడకుండా ధ్యానంగా వింటారో, వారికి ఒక వంతు ప్రతిఫలం లభిస్తుంది.ఎవరైతే ఇమాంను చూడగలిగే, వినగలిగే చోటులో కూర్చొని, ప్రసంగం ధ్యానంగా వినకుండా, పనికిమాలిన మాటల్లో, చేతల్లో ఉంటారో, వారు పాపానికి ఒడిగట్టిన వారు అవుతారు.” (అబూ దావూద్ 1051)


విద్వాంసుల కోణం

నిస్సందేహంగా ఒక ముస్లిం జుమా ఖుత్బా (ప్రసంగం)ఎటూ కదలకుండా, చాలా ధ్యానంగా వినాలి. అతను రెండు విషయాలు పాటించాలి:
 

  1. నిశ్శబ్దంగా దగ్గర కూర్చొని ఉండాలి.అటూ ఇటూ కదలకూడదు, అనవసరపు మాటలు మాట్లాడకూడదు.
     
  2. జుమా ఖుత్బా (ప్రసంగం) సమయంలో మాట్లాడకూడదు. ఇమాం ఖుత్బా ఇస్తున్నప్పుడు మాట్లాడడం హరాం (నిషేధం). అలాగే అటూ ఇటూ కదలడం, రాళ్ళతో ఆడుకోవడం, భూమిపై గీతలు గీయడం లాంటివి నిషేధించబడ్డాయి.[అల్ మున్తఖా మిన్ ఫతావా అల్షేక్సాలిహ్ అల్ ఫౌజాన్ (5/71)]


ఆధారాలు

http://www.islamqa.com/en/search/friday/AllWords/t,q,a (ఇంగ్లీష్)
 
 

962 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్