జీవనోపాధి (రిజ్ఖ్) మెళుకువలు


మానవుడు జీవితంలో ఎక్కువ శాతం సమయాన్నితన జీవనోపాధిమెళుకువలునేర్చుకోవడానికి కేటాయిస్తాడు.చాలా మంది తమ జీవనోపాధి కోసం కష్టపడుతూ ఉంటారు.

 

విషయసూచిక

 

ఖుర్ఆన్

అల్లాహ్ అర్ రజ్జాఖ్ (మంచిఉపాధి కల్పించేవాడు) అని ఖుర్ఆన్ లో అనబడింది: “భూమిలో సంచరించే ప్రాణులన్నింటికీ  ఆహారాన్ని సమకూర్చే బాధ్యత అల్లాహ్‌దే. అవి ఆగి ఉండే,   అప్పగించబడే స్థానాలు కూడా ఆయనకు తెలుసు. అవన్నీ స్పష్టమైన గ్రంథంలో నమోదై ఉన్నాయి.(ఖుర్ఆన్, సూరా హూద్ 11:6)

 

జీవనోపాధి మెళుకువలు

ఇస్లామీయ చట్టం (ఖుర్ఆన్ మరియు సున్నత్) జీవనోపాధినిపెంచడానికి అనేక దారులు చూపింది.

 

పాపాలకుక్షమాపణ కోరండి, పశ్చాత్తాపం చెందండి

పాపాల క్షమాపణ కోరి, పశ్చాత్తాపం చెందడానికి (1) పాప కార్యానికి పాల్పడినందుకు చింతించడం, పశ్చాత్తాపం చెందడం, (2) పాప కార్యం వదిలేయడం, (3) ఇక

 

ఎప్పుడూ ఆ పాప కార్యం చేయకూడదని సంకల్పించడం.

అల్లాహ్ నూహ్ అలైహిస్సలాం గురించి ఖుర్ఆన్ లో ఇలా అన్నాడు: “నేనిలా అన్నాను -  క్షమాపణకై మీ ప్రభువును వేడుకోండి. నిశ్చయంగా ఆయన అమితంగా క్షమించేవాడు.ఆయన ఆకాశం నుంచి మీపై ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు.మీ సిరిసంపదల్లోనూ, పుత్ర సంతతిలోనూ  పురోభివృద్ధిని వొసగుతాడు. మీ కొరకు తోటల్ని ఉత్పన్నం చేస్తాడు. ఇంకా మీ కోసం  కాలువలను ప్రవహింపజేస్తాడు.” (ఖుర్ఆన్, సూరా నూహ్ 71:10-12)


ప్రవక్త హూద్ అలైహిస్సలాం గురించి అల్లాహ్ ఇలా అన్నాడు: “ఓ నా జాతివారలారా! మీ పోషకుని (అంటే అల్లాహ్‌) సమక్షంలో మీ తప్పుల మన్నింపుకై ప్రార్థించండి. ఆయన సన్నిధిలో పశ్చాత్తాపం చెందండి. ఆయన మీపై (ఆకాశం నుండి) ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు. మీకున్న బలిమికి మరింత శక్తినీ, బలాన్నీ చేకూరుస్తాడు. మీరు మాత్రం అపరాధులుగా తిరిగిపోకండి.” (ఖుర్ఆన్, సూరా హూద్11:52)

 

ఉదయం తొలి జాములో జీవనోపాధి (రిజ్ఖ్) వెతకండి

ఉదయంతొలి జాము కారుణ్య సమయం, దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం ఇలా ప్రార్ధించేవారు: “ఓ అల్లాహ్! నా అనుచర సమాజానికి ఉదయం వేళ చేసే పనుల్లో సమృద్ధిని ప్రసాదించు.” (సహీహ్ ఇబ్న్ మాజా 1832)

 

దైవభీతి(తఖ్వా)

అల్లాహ్కు భయపడుతూ ఉండండి, అన్ని పరిస్థితుల్లో దైవభీతి కలిగి ఉండండి.


మహోన్నతుడైన అల్లాహ్ ఇలా అంటున్నాడు: “....ఎవడయితే అల్లాహ్‌కు భయపడుతూ మసలుకుంటాడో అతనికి అల్లాహ్‌ (ఈ  సంక్షోభం నుండి) బయటపడే మార్గం కల్పిస్తాడు.అతను ఊహించనయినాలేని చోటు నుండి అతనికి ఉపాధిని సమకూరుస్తాడు. అల్లాహ్‌పై భారం మోపిన వానికి అల్లాహ్‌యే చాలు. అల్లాహ్‌ తన కార్యాన్ని చేసి తీరుతాడు.అల్లాహ్‌ ప్రతి విషయానికీ ఒక లెక్కను నిర్ధారించాడు.” (ఖుర్ఆన్, సూరా తలాఖ్ 65:2-3))


“ఈ బస్తీలో నివసించే వాళ్ళేగనక విశ్వసించి, భయభక్తులతో మెలగి ఉన్నట్లయితే మేము వాళ్ల కోసం భూమ్యాకాశాల శుభాల(ద్వారాల)ను తెరచేవాళ్ళం. కాని వాళ్ళు ధిక్కారానికి  పాల్పడ్డారు. అందువల్ల వారి (చెడు) సంపాదనకు కారణంగా మేము వాళ్ళను పట్టుకున్నాము.” (ఖుర్ఆన్, సూరా అల్ ఆరాఫ్ 7:96)

 

పాపాలకు దూరంగా ఉండండి

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

“ప్రజలు చేజేతులా చేసుకున్న (పాప) కార్యాల మూలంగానే భూమిలోనూ, సముద్రంలోనూ  కల్లోలం వ్యాపించింది. వారు చేసుకున్న కొన్ని చేష్టల ప్రతిఫలం అల్లాహ్‌ వారికి చవి చూపించ టానికి (ఇలా జరిగింది). బహుశా వారు (దీనివల్ల) దారికి తిరిగి రావచ్చేమోనని (కూడా ఈ విధంగా జరిగింది).” (ఖుర్ఆన్, సూరా రూమ్ 30:41)

 

అల్లాహ్ పై పూర్తి నమ్మకం (తవక్కుల్ ఇలల్లాహ్)

అల్లాహ్పై పూర్తి నమ్మకం అంటే ప్రపంచంలో జరిగేవన్నీ – సృష్టి, సంరక్షణ, లాభం, హాని,అనారోగ్యం, మరణం, జీవితం – కేవలం అల్లాహ్ ఆదేశానుసారమే జరుగుతాయి.


అల్లాహ్ ఇలా అంటున్నాడు: “....ఎవడయితే అల్లాహ్‌కు భయపడుతూ మసలుకుంటాడో అతనికి అల్లాహ్‌ (ఈ  సంక్షోభం నుండి) బయటపడే మార్గం కల్పిస్తాడు. అతను ఊహించనయినాలేని చోటు నుండి అతనికి ఉపాధిని సమకూరుస్తాడు. అల్లాహ్‌పై భారం మోపిన వానికి అల్లాహ్‌యే చాలు. అల్లాహ్‌ తన కార్యాన్ని చేసి తీరుతాడు.

అల్లాహ్‌ ప్రతి విషయానికీ ఒక లెక్కను నిర్ధారించాడు.”(ఖుర్ఆన్, సూరా తలాఖ్ 65:2-3)


ఉమర్ బిన్ ఖత్తాబ్ రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖనం ప్రకారందైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం ఇలా అన్నారు: “అల్లాహ్ పై సరిఅయిన నమ్మకం ఉంటే, అల్లాహ్ పక్షులకు ఆహారం ప్రసాదించినట్లే మీకు కూడా ప్రసాదిస్తాడు. పక్షులు ఉదయం ఖాళి కడుపుతో బయటకు వెళ్తాయి మరియు సాయంత్రం తమ గూళ్ళకు కడుపు నింపుకుని తిరిగి వస్తాయి.” (సహీహ్ ఇబ్న్ మాజా 3377)

 

అల్లాహ్ ఆరాధన కోసం మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకోండి

అల్లాహ్ ను పూర్తి ఏకాగ్రతతో, విధేయతతోఆరాధించాలి. అన్నిటికంటే ఎక్కువగా అల్లాహ్ ను ఆరాధించే విషయమై మనసును కేంద్రీకరించాలి.


దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం ఇలా సెలవిచ్చారు: “మహోన్నతుడైన అల్లాహ్ ఇలా అన్నాడు: ఓ ఆదం కుమారులారా, నా ఆరాధన కోసం మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకొండి. నేను మీకుఆత్మసంతృప్తినిప్రసాదిస్తాను.మీ పేదరికాన్ని దూరం చేస్తాను. మీరు నా ఆరాధన చేయని పక్షంలో, నేను మీకుపరధ్యానానికి, కలవరానికి గురిచేస్తాను మరియు మీ పేదరికాన్ని దూరం చేయను.” (సహీహ్ ఇబ్న్ మాజా 3331)

 

తరచుగా హజ్, ఉమ్రా చేయండి

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “నిరంతరాయంగా హజ్, ఉమ్రా చేయండి.గాలితిత్తి(బెల్లోస్) లోహానికి, బంగారానికి, వెండికి పట్టిన తుప్పును తీసేసినట్టుగా, హజ్, ఉమ్రా మన దారిద్ర్యాన్ని, పాపాలను కడిగివేస్తాయి.” (సహీహ్ ఇబ్న్ మాజా 2352)

 

అల్లాహ్ ప్రసన్నత కోసం ధనం ఖర్చు చేయండి

అల్లాహ్ ప్రసన్నత పొందే ఉద్దేశంతో దానధర్మాలు చేయండి. ప్రజలకు ధనం అంటే ప్రాణం. దీన్ని అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసినచో అల్లాహ్ ప్రసున్నుడై వారికి మరింత అభివృద్ది వొసగుతాడు.


మహోన్నతుడైన అల్లాహ్ ఇలా అన్నాడు: “(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : "నా ప్రభువు తన దాసులలో తాను తలచిన వారి ఉపాధిని  విస్తృతపరుస్తాడు. మరి తాను తలచిన వారికి కుదిస్తాడు.(అల్లాహ్‌ మార్గంలో) మీరు ఏది ఖర్చు చేసినా ఆయన దానికి (సంపూర్ణ) ప్రతిఫలం ఇస్తాడు. ఆయన అందరి కన్నా ఉత్తమ ఉపాధి ప్రదాత.(ఖుర్ఆన్, సూరా సబా 34:39)


దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ఓ ఆదం వారసులరా! దైవమార్గంలో ఖర్చు చేయండి. నేను మీ పై ఖర్చు చేస్తాను.” (సహీహ్ ముస్లిం 993)

 

ధార్మికవిద్యను అభ్యసించే వారిపై ఖర్చు చేయండి

అనస్ ఇబ్న్ మాలిక్ రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖించారు: “దైవప్రవక్తసల్లల్లాహు అలైహివ సల్లం హయాంలో ఇద్దరు సోదరులు ఉండేవారు. ఒకతనుదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంకు సేవ చేసేవాడు, మరొకతను వ్యాపార వ్యవహారాలు చూసేవాడు. ఒకరోజు రెండో అతను మొదటివాడు తన జీవనోపాధి కోసం ఏమీ చెయ్యట్లేదు అని అన్నాడు. దానికి దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా జవాబిచ్చారు: ‘అతని కారణంగా నీకు జీవనోపాధి లభించి ఉండవచ్చు.’ (తిర్మిజి 2345)

 

బంధుత్వాలను త్రెంచకండి, బంధువులకు మంచి చేయండి

మీ రక్తసంబంధీకులకు, మీ భార్య తరఫు బంధువులకు మంచి చేయండి. అందరినీ ఆప్యాయతతో చూడండి.


దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “బంధుత్వ బాంధవ్యాలను మంచిగా నెరవేర్చేవానికి అల్లాహ్ అతని ఉపాధిలో సమృద్ధిని ప్రసాదిస్తాడు మరియు అతని ఆయుష్షునుపొడిగిస్తాడు.” (బుఖారీ 2067; ముస్లిం 2557)

 

వయసుమళ్ళిన వారికి, బలహీనులకు సహాయపడండి

ముసైబ్ బిన్ సాద్ రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖించారు: “సాద్ బిన్ అబీ వఖ్ఖాస్ తన క్రింది వారి కంటే తాను ఉత్తముడు అని భావించేవారు. ఆ సందర్భంలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “నీకు కలిగే విజయం, దొరికే జీవనోపాధి బీదవారి (వారి ప్రార్ధనల, పిలుపుల) ద్వారానే లభిస్తుంది.” (సహీహ్ అల్ బుఖారీ 2896)

 

ఆధారాలు

[1] Book of Shaikh IbnUthaymeen, on WAYS OF GAINING PROVISION FROM ALLAH (ఇంగ్లీష్)
[2] http://www.dorar.net/enc/feqhia/737(ఇంగ్లీష్)
[3] http://www.kitabosunnat.com/forum (ఇంగ్లీష్)
 

 

477 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్