ఖుర్ ఆన్ లో ఉన్న దుఅలు


 

విషయసూచిక

 

అన్నితెలిసినవాడు

رَبَّنَا تَقَبَّلْ مِنَّا إِنَّكَ أَنتَ السَّمِيعُ الْعَلِيمُ

 

రబ్బనా తకబ్బల్  మిన్నా   ఇన్నక  అంతస్  సమీ ఉల్    అలీం [2:127]

 

ఓ మా ప్రభూ ! మా సేవలను అంగీకరించు, నిస్సందేహంగా నీవు అందరి మొరలనూ వినేవాడవు సర్వం తెలిసినవాడవు .

 

ముస్లిం సమాజం

رَبَّنَا وَاجْعَلْنَا مُسْلِمَيْنِ لَكَ وَمِن ذُرِّيَّتِنَا أُمَّةً مُّسْلِمَةً لَّكَ وَأَرِنَا مَنَاسِكَنَا وَتُبْ عَلَيْنَا إِنَّكَ أَنتَ التَّوَّابُ الرَّحِيمُ

 

రబ్బనా  వజ్ అల్ నా  ముస్లిమైని లక వ మిన్ జుర్రియ్యతినా ఉమ్మతన్ ముస్లిమతల్ లక వ అర్నామనాసికనా వ తుబ్ అలైనా ఇన్నక అంతత్ తవ్వాబుర్రహీం

 

ఓ మా ప్రభూ ! మాఇద్దరినీనీవిధేయులుగా చెయ్యి. మా సంతానం నుండి నీ కొరకు ఒక ముస్లిం సమాజాన్ని తయారుచెయ్యి, మాకు నిన్ను ఆరాధించే పద్దతులను  నేర్పు, మా పశ్చాతాపాన్నిఅంగీకరించు, నిస్సందేహంగా  నీవుపశ్చాతాపాన్ని  అంగీకరించే వాడవు. దయామయుడవు.[2:128]

 

నరక శిక్ష

رَبَّنَا آتِنَا فِي الدُّنْيَا حَسَنَةً وَفِي الآخِرَةِ حَسَنَةً وَقِنَا عَذَابَ النَّارِ

 

రబ్బనా ఆతినా ఫిద్దున్యా హసనతన్ వ ఫిల్ ఆఖి రతి హసనతన్  వఖినా ‘అజబన్నార్

 

ఓ ప్రభూ ! ఇహలోకం లోనూ మరియు పరలోకం లోనూ మంచిని ప్రసాదించి, నరక శిక్షల నుండి కాపాడుము [2:201]

 

సహనం విజయం

 [البقرة :250] رَبَّنَا أَفْرِغْ عَلَيْنَا صَبْرًا وَثَبِّتْ أَقْدَامَنَا وَانصُرْنَا عَلَى الْقَوْمِ الْكَافِرِينَ

 

రబ్బనా అఫ్  రిగ్ అలైనా  సబ్ రన్ వ సబ్బిత్ అఖ్ దామనా వన్ సుర్ నా అలల్ ఖౌమిల్ కాఫిరీన్

 

ఓ ప్రభూ! శత్రువులని  ఎదుర్కొనునపుడు  సహనము,స్థిరత్వము నొసంగి శత్రువులపై విజయమును నొసంగుము.[2:250] 

 

మరవడం

 [البقرة :286]رَبَّنَا لاَ تُؤَاخِذْنَا إِننَّسِينَا أَوْ أَخْطَأْنَا

 

రబ్బనా లాతు ఆఖిజ్ నా ఇన్ నసీనా ఔ అఖ్ తానా

 

ఓ ప్రభూ ! మేము మరచినను లేక పొరపాటు పడినను మమ్ము పట్టకుము .[2:286] 

 

భారం

 [البقرة :286]رَبَّنَا وَلاَ تَحْمِلْ عَلَيْنَا إِصْرًا كَمَا حَمَلْتَهُ عَلَى الَّذِينَ مِن قَبْلِنَا
 

రబ్బనావలా త హ్ మిల్ అలైనా ఇస్ రన్ కమాహమల్ తహూ అలల్లజీన మిన్ ఖబ్ లినా

 

ఓ మా ప్రభువా ! మాకు ముందు గడచిన వారిపై నీవు మోపినట్టి భారమును మాపై మోపకుము [2:286]

 

సహాయం

 [البقرة :286]رَبَّنَا وَلاَ تُحَمِّلْنَا مَا لاَ طَاقَةَ لَنَا بِهِ وَاعْفُ عَنَّا وَاغْفِرْ لَنَا وَارْحَمْنَا أَنتَ مَوْلاَنَا فَانصُرْنَا عَلَى الْقَوْمِ الْكَافِرِينَ

 

రబ్బనా వలా తుహమ్మిల్ నా మా లా తాఖత లనా బిహీ వ అఫు అన్నా వగ్ ఫిర్ లనా వర్ హమ్ నా అన్త మౌలానా ఫన్ సుర్ నా అలల్ ఖౌమిల్ కాఫిరీన్ 

 

ఓ మా ప్రభూ ! సహింప లేని భారమును మాపై నుంచకుము. మమ్ము వదిలి పెట్టుము . మమ్ము క్షమింపుము . మమ్ము కరుణించుము .నీవే మాకు సహాయుడువు . కావున నీవు అవిశ్వాసులకు విరుద్ధముగా మాకు సహాయము చేయుము [2:286]

 

దయామయుడు

[8: آل عمران] رَبَّنَا لاَ تُزِغْ قُلُوبَنَا بَعْدَ إِذْ هَدَيْتَنَا وَهَبْ لَنَا مِن لَّدُنكَ رَحْمَةً إِنَّكَ أَنتَ الْوَهَّابُ

 

రబ్బనా లాతుజిగ్ ఖులూబనా బ అద ఇజ్ హదైత నా వ హబ్ లనా మిల్ లదున్క రహ్మ తన ఇన్నక అన్ తల్ వహ్హాబ్

 

ఓ ప్రభూ ! నీవు మాకు సన్మార్గము చూపిన పిదప మా హృదయములను తప్పు త్రోవలకుపోనియ్యకుము . నీ దయను మా పై ఉంచుము . నీవే సర్వము నొసంగువాడవు.[3:8]

 

ప్రమాణం

 [آل عمران :9]رَبَّنَا إِنَّكَ جَامِعُ النَّاسِ لِيَوْمٍ لاَّ رَيْبَ فِيهِ إِنَّ اللّهَ لاَ يُخْلِفُ الْمِيعَادَ

 

రబ్బనా  ఇన్నక జామి ఉన్నాసి లియౌమిల్ లారైబ ఫీహి ఇన్న ల్లాహ లా యుఖ్ లిఫుల్ మిఆద్

 

ఓ మా ప్రభూ ! నీవు సర్వ జనులను ఒక దినము చేర్తువు . ఆ దినము గూర్చి ఎట్టిసందేహము లేదు . నిశ్చయముగా అల్లా :   ఎప్పటికిని తానిచ్చిన మాటకువ్యతిరేకము చేయడు. [3:9]

 

పాప క్షమాపణ

رَبَّنَا إِنَّنَا آمَنَّا فَاغْفِرْ لَنَا ذُنُوبَنَا وَقِنَا عَذَابَ النَّارِ

 

రబ్బనా  ఇన్ననా ఆమన్నా  ఫగ్ఫిర్ లనా  జునూబనా వ  ఖిన్నా ‘అధాబన్నార్

 

ఓ మా ప్రభూ ! మేము విశ్వ సించాము, కనుక మా పాపాలను మన్నించు ఇంకా మమ్మల్ని నరక బాధ నుండి కాపాడు.[3:16]

 

విధేయత

    [آل عمران :53]رَبَّنَا آمَنَّا بِمَا أَنزَلَتْ وَاتَّبَعْنَا الرَّسُولَ فَاكْتُبْنَا مَعَ الشَّاهِدِينَ

 

రబ్బనా  ఆమన్నా బిమా అన్ జలత వత్ తబ అ నర్ రసూల ఫక్ తుబ్నా మ అష్ షాహిదీన్

 

ఓ మా ప్రభూ ! నీవు పంపినదానిని విశ్వసించితిమి . ప్రవక్తకు విధేయులైతిమి . కావున విశ్వసించితిమి .ప్రవక్తకు విధేయులైతిమి . కావున విశ్వసించిన సాక్షులలో మమ్ము వ్రాసికొనుము [3:53]

 

స్తిరత్వం

 ربَّنَا اغْفِرْ لَنَا ذُنُوبَنَا وَإِسْرَافَنَا فِي أَمْرِنَا وَثَبِّتْ أَقْدَامَنَا وانصُرْنَا عَلَى الْقَوْمِ الْكَافِرِينََِ
 

రబ్బనగ్ ఫిర్ లనా జునూబనా  వ ఇస్రాఫనా ఫీ అమ్ రినా వ సబ్బిత్ అఖ్ దామనా వన్ సుర్ నా అలల్ ఖౌమిల్ కాఫిరీన్

 

ఓ మా ప్రభూ! మాపాపములను, మాకార్యములలో, మేము మితిమీరి పోయిన దానిని క్షమించుము. మాపాదములను స్థిరముగా ఉంచుము. అవిశ్వాసులను జయించుటకు మాకు సహాయపడుము [3:147]

 

ఆధారాలు

www.teluguislam.net

 

312 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్