కౌసర్


సూరాకౌసర్ ఖుర్ఆన్ లోని 108వ సూరా. ఇది ఖుర్ఆన్ లోని అత్యంత చిన్న సూరా. ఈ సూరా మక్కాలో అవతరించింది.

 

విషయసూచిక

 

పారిభాషిక అర్ధం

కౌసర్ పారిభాషిక అర్ధంసమృద్ధి.


ఇస్లామీయ భావం

ఇది స్వర్గంలో గల ఒక సెలయేరు. దీన్ని అల్లాహ్ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం కు ఇచ్చాడు. దీని గురించి ఖుర్ఆన్ లో ఇలా సెలవీయబడింది: “నిశ్చయంగా మేము నీకు కౌసర్ (సరస్సును,మరెన్నోవరాల)ను ప్రసాదించాము.” (ఖుర్ఆన్, సూరా కౌసర్ 108:1)


ఖుర్ఆన్

సూరా అనువాదం:

108:1 - నిశ్చయంగా మేము నీకు కౌసర్ (సరస్సును, మరెన్నో వరాల)ను ప్రసాదించాము.

 
108:2 - కాబట్టి నువ్వు నీ ప్రభువు కోసమే నమాజు చెయ్యి, ఖుర్బానీ ఇవ్వు.

 
108:3 - ముమ్మాటికీ నీ శత్రువే నామరూపాల్లేకుండా పోయేవాడు.

 

హదీస్

దీని గురించి దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు:సహీహ్ ముస్లింలోని హదీస్ (607)లో ఇలా అనబడింది: దీని ఉల్లేఖకులు అనస్ రజిఅల్లాహుఅన్హు ఇలా అన్నారు: ఒకసారి మేము దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంతో ఉన్నప్పుడు, ఆయనతన ముఖాన్ని ఎత్తి నవ్వసాగారు.అప్పుడు మేము అడిగాము, “ఓ దైవప్రవక్తా! మీరెందుకు నవ్వుతున్నారు?” దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “నాపై ఓ సూరా అవతరించింది.” ఆ తరువాత సూరాను పఠిoచారు:“నిశ్చయంగా మేము నీకు కౌసర్ (సరస్సును, మరెన్నో వరాల)ను ప్రసాదించాము.” (ఖుర్ఆన్, సూరా కౌసర్ 108:1).ఆ తరువాత పూర్తి సూరా చదివారు.

 

అప్పుడుదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “అల్ కౌసర్ అంటే ఏమిటో మీకు తెలుసా?” “అల్లాహ్ మరియు అయన ప్రవక్తకు బాగా తెలుసు” అని మేము అన్నాము. “అది అల్లాహ్ నాకు ప్రసాదించిన ఒక మంచి సెలయేరు. ఆ సెలయేరు దగ్గరికి నా అనుచర సమాజం ప్రళయ దినాన వస్తుంది,” అని అన్నారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం.


ఆధారాలు

http://www.sunnah.com/bukhari/81#174 (ఇంగ్లీష్)

 

827 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్