కుటుంబ నియంత్రణ


భూమ్యాకాశాల సామ్రాజ్యం అల్లాహ్‌దే. (ఆయన) తాను కోరినది సృష్టిస్తాడు. తాను కోరినవారికి ఆడపిల్లల్ని ఇస్తాడు, తాను కోరిన వారికి మగపిల్లల్ని ఇస్తాడు. లేదా వారికి మగపిల్లలను, ఆడపిల్లలను కలిపి ఇస్తాడు. మరి తాను కోరిన వారిని సంతాన హీనులుగా చేసేస్తాడు. ఆయన మహాజ్ఞాని, సంపూర్ణ అధికారం కలవాడు. సూరా ఆష్ షూరా 42:49-50

 

విషయసూచిక

 

అల్లాహ్‌ మహాజ్ఞాని

భూమ్యాకాశాల సామ్రాజ్యం అల్లాహ్‌దే. (ఆయన) తాను కోరినది సృష్టిస్తాడు. తాను కోరినవారికి ఆడపిల్లల్ని ఇస్తాడు, తాను కోరిన వారికి మగపిల్లల్ని ఇస్తాడు. లేదా వారికి మగపిల్లలను, ఆడపిల్లలను కలిపి ఇస్తాడు. మరి తాను కోరిన వారిని సంతాన హీనులుగా చేసేస్తాడు. ఆయన మహాజ్ఞాని, సంపూర్ణ అధికారం కలవాడు. సూరా ఆష్ షూరా 42:49-50

 

ఉపాధి

మూర్ఖత్వం కొద్దీ, ఏ ఆధారమూ లేకుండానే తమ సంతానాన్ని హత్యచేసిన వారూ, అల్లాహ్‌ ఉపాధిగా ప్రసాదించిన వస్తువులను అల్లాహ్‌కు అబద్ధాలను అంటగడుతూ నిషేధించు కున్నవారూ ముమ్మాటికీ నష్టానికి గురయ్యారు. నిశ్చయంగా వారు మార్గ విహీనతకు లోనయ్యారు. వారు సన్మార్గాన లేరు. సూరా అల్ అన్ ఆమ్ 6:140

 

తల్లిదండ్రుల యెడల ఉత్తమరీతి

(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : ''రండి, మీ ప్రభువు మీపై నిషేధించిన వస్తువులు ఏవో మీకు చదివి వినిపిస్తాను. అవేమంటే; అల్లాహ్‌కు సహవర్తులుగా ఎవరినీ కల్పించకండి. తల్లిదండ్రుల యెడల ఉత్తమరీతిలో మెలగండి. పేదరికపు భయంతో మీ సంతానాన్ని హతమార్చకండి. మేము మీకూ ఆహారం ఇస్తున్నాము, వారికీ ఇస్తాము. సిగ్గు మాలిన పనులు- అవి బాహాటంగా జరిగేవైనా, గుట్టుగా జరిగేవైనా వాటి దరిదాపులక్కూడా వెళ్ళకండి. సత్య (న్యాయ) బద్ధంగా తప్ప అల్లాహ్‌ నిషేధించిన ఏ ప్రాణినీ హతమార్చకండి. మీరు ఆలోచించి పనిచేస్తారని, అల్లాహ్‌ మీకీ విషయాలను గురించి గట్టిగా తాకీదు చేశాడు. సూరా అల్ అన్ ఆమ్ 6:151

 

దారిద్య్ర భయం

దారిద్య్ర భయంతో మీరు మీ సంతానాన్ని చంపేయకండి. వారికీ, మీకూ ఉపాధిని ఇచ్చేది మేమే. ముమ్మాటికీ వారి హత్య మహాపాతకం. సూరా బనీ ఇస్రాయీల్ 17:31

 

ఆహార పదార్థాలు

మరి ఆయనే భూమిలో, దానిపై నుంచి పర్వతాలను పాతిపెట్టాడు. అందులో శుభాన్ని పొందుపరిచాడు. అందులో (నివసించే వారి కొరకు) ఆహార పదార్థాలను కూడా తగు మోతాదులో సమకూర్చాడు. ఇదంతా (కేవలం) నాలుగు రోజుల్లో అయిపోయింది. ఇది అడిగేవారికి తగిన విధంగా ఉంది. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్ 41:10

 

ప్రళయం రోజు

సూర్యుడు చుట్టివేయబడినప్పుడు,నక్షత్రాలు కాంతిహీనం అయిపోయినప్పుడు, పర్వతాలు నడిపింపబడినప్పుడు, పదిమాసాల సూడి ఒంటెలు (వాటి మానాన) వదలివేయ బడినప్పుడు,అడవి జంతువులన్నీ ఒకచోట సమీకరించబడినప్పుడు, సముద్రాలు రాజేయబడినప్పుడు,ఆత్మలు (వాటి తనువులతో) అనుసంధానం చేయబడి నప్పుడు,సజీవంగా పాతిపెట్టబడిన బాలిక ప్రశ్నించబడినప్పుడు,'తను ఏ పాపం చేసిందని హతమార్చబడింది?' అని. కర్మల చిట్టాలు తెరువబడినప్పుడు,ఆకాశం తోలు ఒలచివేయబడినప్పుడు,నరకం మండించబడినప్పుడు,స్వర్గం చాలా దగ్గరగా తేబడినప్పుడు, అప్పుడు (ఆ రోజు) ప్రతి ప్రాణీ తాను తన వెంట తెచ్చుకున్న దేమిటో తెలుసుకుంటుంది. సూరా అత్ తక్వీర్ 81:1-14

 

ఆడ సంతానం

ఏమిటీ, ఆభరణాల మధ్య పెరిగి, వాదోపవాదాలలో (తన మాటను) స్పష్టంగా విడమరచి చెప్పలేని (ఆడ సంతానం అల్లాహ్‌ వాటాలోనికి వస్తుందా?)సూరా అజ్ జుఖ్ రుఫ్ 43:18

 

శుభవార్త

వారిలో ఎవరికైనా కూతురు పుట్టిందన్న శుభవార్తను వినిపిస్తే, వాడి మొహం నల్లగా మారిపోతుంది. లోలోపలే కుత కుత లాడిపోతాడు. ఈ దుర్వార్త విన్న తరువాత (ఇక లోకులకు ముఖం ఎలా చూపేది? అని) అతడు నక్కి నక్కి తిరుగుతుంటాడు. ఈ అవమానాన్ని ఇలాగే భరిస్తూ బిడ్డను అట్టిపెట్టుకోవాలా? లేక దానిని మట్టిలో పూడ్చిపెట్టాలా? అని (పరిపరి విధాలుగా) ఆలోచిస్తాడు. చూడు! ఎంతటి జుగుప్సాకరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు వీరు!? సూరా అన్ నహ్ల్ 16:58-59

 

ఆధారాలు

www.teluguislam.net/ahsanul bayan
 

 

331 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్