కర్కోటకులు

నువ్వు అదేపనిగా ప్రమాణాలు చేసే తుచ్ఛుని మాట వినకు. వాడు (ఎంతసేపటికీ) చులకనగా మాట్లాడతాడు, చాడీలు చెబుతాడు. మంచి పనులను అడ్డుకుంటాడు, బరితెగించిపోయే పాపా త్ముడు వాడు. మిక్కిలి కర్కశుడు, వీటన్నింటికీ తోడు కళంకితుడు. ఇంతకీ వాడి తలబిరుసుతనానికి కారణం వాడికి సిరి సంపదలు, పుత్ర సంతానం ఉండటమే. (కాబట్టి నువ్వు అతన్ని అనుసరించకు). వాడి ముందు మా ఆయతులను పఠించినప్పుడు, ''ఇవి పూర్వీకుల కట్టు కథల''అంటూ తేలిగ్గా కొట్టిపారేస్తాడు. ఇక మేము త్వరలోనే వాడి తొండం (ముక్కు)పై వాత వేస్తాము. సూరా అల్ ఖలమ్ 68:10-16

విషయసూచిక

విరివిగా సంపద సంతానం

నన్నూ, నేను ఒంటరిగా పుట్టించిన వాడినీ వదలిపెట్టు (వాడి సంగతి నేను చూసుకుంటాను). వాడికి నేను విరివిగా సంపద ఇచ్చాను. ఎల్లప్పుడూ వెన్నంటి ఉండే కొడుకులను కూడా (ఇచ్చాను). ఇంకా వాడికోసం అన్ని విధాలా సుఖసౌఖ్యాల సామగ్రిని సమకూర్చాను. అయినా నేను వాడికి ఇంకా... ఇంకా ప్రసాదించాలని వాడు (పిచ్చిగా) ఆశపడుతున్నాడు. అలా జరగదు. వాడు మా ఆయతుల (సూచనల)కు బద్ధ విరోధిగా తయారయ్యాడు. త్వరలోనే నేను వాణ్ణి కఠినమైన ఎత్తుకు ఎక్కిస్తాను.

గర్వం

వాడు ఆలోచించి ఒక ప్రతిపాదన చేశాడు. వాడు నాశనంగాను! ఎటువంటి ప్రతిపాదన చేశాడు వాడు!? మరి వాడు నాశనమైపోను!! ఎలాంటి (తప్పుడు) ప్రతిపాదన చేశాడు!? తరువాత వాడు దృష్టిని సారించాడు (ఆలోచించాడు). ఆపైన నుదురు చిట్లించాడు. పాడు ముఖం పెట్టుకున్నాడు. అటుపిమ్మట వీపు త్రిప్పుకున్నాడు. గర్వం ప్రదర్శించాడు. (చివరికి) ఇలా అన్నాడు: ''ఇది పూర్వం నుంచీ నకలు చేయ బడుతూ వస్తున్న మాయాజాలం మాత్రమే.'' ''ఇది మానవ వాక్కు తప్ప మరేమీ కాదు.''నేను త్వరలోనే వాణ్ణి నరకాగ్నికి ఆహుతి చేస్తాను. సూరా అల్ ముద్దస్సిర్ 74:11-26

పూర్వీకుల కట్టు కథలు

నువ్వు అదేపనిగా ప్రమాణాలు చేసే తుచ్ఛుని మాట వినకు. వాడు (ఎంతసేపటికీ) చులకనగా మాట్లాడతాడు, చాడీలు చెబుతాడు. మంచి పనులను అడ్డుకుంటాడు, బరితెగించిపోయే పాపా త్ముడు వాడు. మిక్కిలి కర్కశుడు, వీటన్నింటికీ తోడు కళంకితుడు. ఇంతకీ వాడి తలబిరుసుతనానికి కారణం వాడికి సిరి సంపదలు, పుత్ర సంతానం ఉండటమే. (కాబట్టి నువ్వు అతన్ని అనుసరించకు). వాడి ముందు మా ఆయతులను పఠించినప్పుడు, ''ఇవి పూర్వీకుల కట్టు కథల''అంటూ తేలిగ్గా కొట్టిపారేస్తాడు. ఇక మేము త్వరలోనే వాడి తొండం (ముక్కు)పై వాత వేస్తాము. సూరా అల్ ఖలమ్ 68:10-16

అబద్ధాన్ని కల్పించే వాడు

అల్లాహ్‌పై అబద్ధాన్ని కల్పించే వాడికంటే, లేదా తనపై ఎలాంటి వహీ అవతరించక పోయినప్పటికీ 'నాపై వహీ అవత రించింది' అని చెప్పే వానికంటే లేదా అల్లాహ్‌ అవతరింపజేసి నటువంటిదే 'నేను కూడా అవతరింపజేస్తాను' అని అనేవాడి కంటే పరమ దుర్మార్గుడు ఎవడుంటాడు? ఈ దుర్మార్గులు మరణ యాతనలో ఉన్నప్పుడు, దైవదూతలు తమ చేతులు చాచి, ''సరే! ఇక మీ ప్రాణాలు (బయటికి) తీయండి. మీరు అల్లాహ్‌కు అబద్ధాలను ఆపాదించినందుకూ, అల్లాహ్‌ ఆయతుల పట్ల గర్వాతిశయంతో విర్రవీగినందుకుగాను ఈ రోజు మీకు పరాభవంతో కూడిన శిక్ష విధించబడుతుంది'' అని చెబుతుండగా (ఆ దృశ్యాన్ని) నీవు చూడగలిగితే ఎంత బావుండు! సూరా అల్ అన్ ఆమ్ 6:93

ఆధారాలు

www.teluguislam.net/ahsanul bayan

320 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్