ఐకమత్యం

ఒకవేళ ముస్లింలలోని రెండు పక్షాల వారు  పరస్పరం  గొడవ పడితే వారి మధ్య సయోధ్య చేయండి.  మరి  వారిలో  ఒక పక్షంవారు రెండవ పక్షం వారిపై దౌర్జన్యం చేస్తే, దౌర్జన్యంచేసే  వర్గం దైవాజ్ఞ వైపు మరలివచ్చే  వరకూ మీరు వారితో పోరా డండి.   వారు  గనక మరలివస్తే  వారి మధ్య న్యాయసమ్మతంగా సయోధ్య   కుదర్చండి.   సమభావంతో  వ్యవహరించండి.  నిశ్చయంగా  సమభావంతో  వ్యవహరించేవారిని  అల్లాహ్‌ ప్రేమి స్తాడు.   విశ్వాసులు (ముస్లింలు)  అన్నదమ్ములు (అన్న సంగతిని మరువకండి). కనుక మీ అన్నదమ్ముల మధ్య సర్దుబాటుకు ప్రయ త్నించండి.   అల్లాహ్‌కు   భయపడుతూ ఉండండి     తద్వారా  మీరు  కరుణించబడవచ్చు. ఖుర్ ఆన్ సూరా అల్ హుజురాత్ 49:9-10

విషయసూచిక

అల్లాహ్‌ మీపై కురిపించిన దయానుగ్రహాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి  

అల్లాహ్‌ త్రాడును అందరూ కలసి గట్టిగా పట్టుకోండి. చీలిపోకండి.  అల్లాహ్‌ మీపై కురిపించిన దయానుగ్రహాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి     అప్పుడు   మీరు  ఒండొకరికి శత్రువులుగా ఉండేవారు. ఆయన మీ హృదయాలలో పరస్పరం ప్రేమానురాగా లను సృజించాడు. దాంతో ఆయన అనుగ్రహం వల్ల మీరు ఒకరి కొకరు అన్నదమ్ములుగా మారారు. మీరు అగ్నిగుండం ఆఖరి అంచులకు చేరుకోగా, ఆయన మిమ్మల్ని దాన్నుంచి కాపాడాడు. మీరు సన్మార్గం పొందాలని  ఈ విధంగా  అల్లాహ్‌  మీకు తన సూచనలను విశదపరుస్తున్నాడు.

మేలు వైపుకు  పిలిచే, మంచిని చెయ్యమని ఆజ్ఞాపించే, చెడుల నుంచి  వారించే   ఒక  వర్గం  మీలో ఉండాలి. ఈ పనిని చేసేవారే సాఫల్యాన్ని  పొందుతారు.  తమ వద్దకు స్పష్టమయిన నిదర్శనాలు వచ్చేసిన  తరువాత  కూడా వర్గాలుగా విడిపోయి, విభేదించుకున్న  వారి మాదిరిగా మీరు  తయారవకండి.  మహాశిక్ష  ఉన్నది  ఇటువంటివారి కోసమే. ఖుర్ ఆన్ సూరా ఆలి ఇమ్రాన్ 3:103-105

అల్లాహ్‌ తాను కోరిన వారికి  రుజుమార్గం చూపుతాడు

మానవులంతా ఒకే సమాజంగా ఉండేవారు.  అల్లాహ్‌   ప్రవక్తలను   శుభవార్తనిచ్చే వారుగా,   భయపెట్టే వారుగా  చేసి పంపాడు.  ప్రజల  మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాలపై   తీర్పు  చేయటానికిగాను  వారివెంట  (అనగా ప్రవక్తల వెంట) సత్య బద్ధమైన గ్రంథాలను పంపాడు. మరి వాళ్ళే (అనగా ప్రజలే)  స్పష్టమైన ఆదేశాలు వొసగబడిన తరువాత కూడా  పరస్పర వైర భావం, అసూయ మూలంగా అందులో విభేదించుకున్నారు. అందుచేత  అల్లాహ్‌  విశ్వాసులకు ఈ  భేదాభిప్రాయం నుండి కూడా తన ఆజ్ఞానుసారం సత్యం వైపుకు  దర్శకత్వం  వహిం చాడు. అల్లాహ్‌ తాను కోరిన వారికి  రుజుమార్గం చూపుతాడు. ఖుర్ ఆన్ సూరా అల్ బఖర 2:213

నిశ్చయంగా  సమభావంతో  వ్యవహరించేవారిని  అల్లాహ్‌ ప్రేమి స్తాడు

ఒకవేళ ముస్లింలలోని రెండు పక్షాల వారు  పరస్పరం  గొడవ పడితే వారి మధ్య సయోధ్య చేయండి.  మరి  వారిలో  ఒక పక్షంవారు రెండవ పక్షం వారిపై దౌర్జన్యం చేస్తే, దౌర్జన్యంచేసే  వర్గం దైవాజ్ఞ వైపు మరలివచ్చే  వరకూ మీరు వారితో పోరా డండి.   వారు  గనక మరలివస్తే  వారి మధ్య న్యాయసమ్మతంగా సయోధ్య   కుదర్చండి.   సమభావంతో  వ్యవహరించండి.  నిశ్చయంగా  సమభావంతో  వ్యవహరించేవారిని  అల్లాహ్‌ ప్రేమి స్తాడు.   విశ్వాసులు (ముస్లింలు)  అన్నదమ్ములు (అన్న సంగతిని మరువకండి). కనుక మీ అన్నదమ్ముల మధ్య సర్దుబాటుకు ప్రయ త్నించండి.   అల్లాహ్‌కు   భయపడుతూ ఉండండి     తద్వారా  మీరు  కరుణించబడవచ్చు. ఖుర్ ఆన్ సూరా అల్ హుజురాత్ 49:9-10

అత్యధికంగా అల్లాహ్‌ను స్మరించండి

ఓ విశ్వాసులారా! మీరు  ఏ ప్రత్యర్థి సైన్యాన్ని అయినా ఎదుర్కోవలసి వచ్చినప్పుడు నిలకడ చూపండి. అత్యధికంగా అల్లాహ్‌ను స్మరించండి. తద్వారా మీకు విజయం ప్రాప్తించ వచ్చు. ఇంకా మీరందరూ అల్లాహ్‌కూ, ఆయన ప్రవక్తకూ విధేయులై  ఉండండి.  పరస్పరం  గొడవ పడకండి. అలా చేస్తే (గొడవపడ్డా రంటే)  మీరు పిరికివారై పోతారు.  మీ శక్తి సన్నగిల్లిపోతుంది.అందుకే సహన స్థయిర్యాలను పాటించండి. స్థయిర్యం కనబరచే వారికి అల్లాహ్‌  తోడుగా ఉంటాడు. ఖుర్ ఆన్ సూరా అల్  అన్ ఫాల్ 8:45-46

అవిశ్వాసులు ఒండొకరికి మిత్రులు. ఒకవేళ మీరు కూడా అలా ఉండకపోతే భువిలో ఉపద్రవం (ఫిత్నా) మొదలవుతుంది. పెద్ద కల్లోలమే చెలరేగుతుంది. ఖుర్ ఆన్ సూరా అల్  అన్ ఫాల్ 8:73

ఆధారాలు

www.teluguislam.net/ahsanul bayan
 
615 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్