ఉపవాసము – తప్పనిసరి ఆరాధన (FASTING– AN OBLIGATORY WORSHIP)


ఉపవాసం ఇస్లామీయ మూలస్థంభాలలో ఒకటి. దీని గురించి దివ్య ఖుర్ఆన్ మరియు సున్నత్ లలో వివరించబడింది. ఉపవాసం అంటే, సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు – అన్నపానీయాలు, భార్యతో సంభోగం మరియు ఉపవాసాన్ని భంగపరిచే ప్రతి విషయం నుండి దూరంగా ఉండడం.

 

విషయసూచిక

 

ఖుర్ఆన్

ఓ విశ్వసించినవారలారా! ఉపవాసాలుండటం మీపై విధిగా నిర్ణయించబడింది -  మీ పూర్వీకులపై కూడా ఇదే విధంగా ఉపవాసం విధించబడింది. దీనివల్ల మీలో భయభక్తులు పెంపొందే అవకాశం ఉంది.(ఖుర్ఆన్ సూరా బఖర 2:183)

 

హదీస్

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “ఇస్లాం ఐదు మూలస్తంభాలపై స్థాపితమై ఉంది; అల్లాహ్ తప్ప ఆరాధ్యానికి అర్హులు ఎవ్వరు లేరు మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం అల్లాహ్ ప్రవక్త, రోజు ఐదు పూటలు నమాజ్ చేయాలి, జకాత్ (విధి దానము) చెల్లించాలి, రమజాన్ మాసం లో ఉపవాసాలు పాటించాలి, స్థోమత ఉన్నచో హజ్ (కాబా యాత్ర) చేయాలి.” (సహీహ్ బుఖారీ vol 1:8)


మరో హదీసులో దైవప్రవక్తసల్లల్లాహుఅలైహివసల్లంఇలాఅన్నారు: “అల్లాహ్ పై విశ్వాసం ఉంచి, అల్లాహ్ పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాడని ఆశిస్తూ, రమజాన్ లో ఉపవాసం ఉన్నవారి పూర్వపు పాపాలను అల్లాహ్ క్షమిస్తాడు.అల్లాహ్పైవిశ్వాసంఉంచి, అల్లాహ్పుణ్యఫలాన్నిప్రసాదిస్తాడనిఆశిస్తూ, రమజాన్ లో రాత్రిళ్ళు నమాజ్ చేసే వారి పూర్వపు పాపాలను అల్లాహ్ క్షమిస్తాడు.అల్లాహ్పైవిశ్వాసంఉంచి, అల్లాహ్పుణ్యఫలాన్నిప్రసాదిస్తాడనిఆశిస్తూ, లైలతుల్ ఖద్ర్ (అవతరణరాత్రి) నాడు నమాజ్ చదువుతూ గడుపుతాడో, అల్లాహ్ అతని పూర్వపు పాపాలను క్షమిస్తాడు.” (సహీహ్ బుఖారీ 2014)

 

ఉపవాసపు ప్రాముఖ్యత

ఇతర ఇస్లామీయ ఆదేశాల్లా ఉపవాసపు లాభాలు కూడా కేవలం ఆధ్యాత్మికత వరకే పరిమితం కావు. ఇస్లాంలో ఆధ్యాత్మిక, నైతిక, సామాజిక, ఆర్ధిక,రాజకీయ అంశాలన్నీ ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నాయి. ఉపవాసపు ప్రాముఖ్యాన్ని క్రింద నాలుగు ఉప శీర్షికల – ఆధ్యాత్మిక మరియు నైతిక, మానసిక, సామాజిక, శారీరక మరియు వైద్య పరమైన – ద్వారాచర్చించడం జరిగింది.

 

ఆధ్యాత్మిక మరియు నైతిక విలువలు

  • ఉపవాసంయొక్క అసలు ఉద్దేశంఅల్లాహ్ కు విధేయత చూపడం, ప్రేమించడం మరియు సమర్పించుకోవడం. అల్లాహ్ కు సమర్పించుకోవడం అంటే, అల్లాహ్ప్రసున్నుడయ్యే పనులను చేయాలి మరియు అల్లాహ్ కు అయిష్టమైన పనులకు దూరంగా ఉండాలి. ఉపవాసానికి కారణం ఇదే అయినచో అల్లాహ్ సంతృప్తి చెందుతాడు.
     
  • ఉపవాసం ద్వారా అల్లాహ్ మనపై కురుపించిన లెక్కలేనన్ని అనుగ్రహాలకు కృతఙ్ఞతలు తెలుపడం.
     
  • ఉపవాసం ఒకరిపాపాలకు మరియు ఆజ్ఞ ఉల్లంఘనలకు ప్రాయశ్చితం. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “ఎవరైతే అల్లాహ్ పై పూర్తి విశ్వాసంతో, అల్లాహ్ ప్రసన్నత కోసం రమజాన్ ఉపవాసాలు ఉంటాడో, అతను చేసిన పాపాలన్నీ క్షమించబడుతాయి.” (సహీహ్ బుఖారీ 1901)
     
  • ఉపవాసం ద్వారా విశ్వాసిలో (తఖ్వా) అల్లాహ్ భయం పెరుగుతుంది. ఒక మనిషి ఉపవాస సమయంలోచట్టపరమైన విషయాలకు(అన్నపానియలు మరియు భార్యతో సంభోగం లాంటి వాటికి)స్వచ్చందంగా దూరంగా ఉండగలిగితే, చట్ట పరం కాని వాటికి (పాపాలకు) కూడా దూరంగా ఉండగలిగే శక్తి అతనిలో పెరుగుతుంది.
     
  • ఉపవాసం మనిషిని నిజాయితిపరుణ్ణి చేస్తుంది. ఇతరఆరాధనల్లా కాకుండా ఇది మనిషిలో స్వీయ నియంత్రణ పెంచుతుంది.
     
  • ఉపవాసం ఇంకా ఎన్నో మంచి లక్షణాలను పెంచుతుంది. ఉపవాసం కేవలం మనిషిని అన్నపానీయాల నుంచే ఆపదు, ఇది మనిషిని అన్ని రకాల చెడుల నుండి ఆపుతుంది. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “ఎవరైతే ఉపవాసంలో కూడా చెడు అలవాట్లను వదలరో, వారు అన్నపానీయాలను వదలడాన్ని అల్లాహ్ స్వీకరించడు.” (సహీహ్ బుఖారీ 1904)
     
  • రమజాన్ లో రాత్రి వేళలో ఐచ్చిక నమాజ్ (తరావీహ్) చేయడం ద్వారా మరియుఎక్కువగా ఖుర్ఆన్ చదవడం ద్వారా మనిషిలో ఆధ్యాత్మిక విలువలు పెరుగుతాయి.
     
  • ఉపవాసం అల్లాహ్ మార్గంలో కష్టపడడం లాంటిది. ఉపవాసం మనిషిలో స్వీయ నియంత్రణ పెంచుతుంది మరియు తన మనోవాంఛలకు బానిస కాకుండా ఉండేలా మనిషిని తీర్చిదిద్దుతుంది.

 

మానసిక విలువలు

ఉపవాసం మనిషిలోని ఆత్మకు శాంతి కలిగిస్తుంది. అల్లాహ్ ను సంతృప్తి పరిచామన్న భావన కలుగుతుంది. ఇది సహనాన్ని పెంచుతుంది. అల్లాహ్ అనుగ్రహాలను గుర్తించే అవగాహన కలిగిస్తుంది.


ప్రతి సంవత్సరంలో ఒక నెల ముస్లింలకు తమ రోజువారి దినచర్యకు విరుద్ధంగామెలిగే అవకాశం ఈ మహత్తరమైన రమజాన్ నెల ద్వారా లభిస్తుంది. ఇది మనిషిని జీవితంలో ఎప్పుడైనా ఎదురయ్యే కఠిన సమయాలకు సిద్ధంగా ఉంచుతుంది.

 

సామాజిక విలువలు

ఉపవాసం వల్ల అల్లాహ్ ముందు మానవ సమానత్వం ప్రస్ఫుటమవుతుంది. ముస్లింలందరూ – స్త్రీలు మరియు పురుషులు, బీదవారు మరియు ధనికులు, తెల్లవారు మరియు నల్లవారు – ఉపవాసంలో సమాన కష్టాన్ని అనుభవిస్తారు. ఎవరికీ ఎలాంటి మినహాయింపు ఉండదు.


ఉపవాసం వల్ల మనిషిలో బీదవారిపై సానుభూతి కలుగుతుంది మరియు దానం చేసే భావం ఉత్పన్నమవుతుంది. ధనికులుబీదవారి కష్టాలను, ఆకలి బాధను అర్ధం చేసుకోగలుగుతారు. తాను అనుభవించనంతవరకు ఒకమనిషికిఆకలిబాధఎలాఉంటుందో తెలిసిరాదు. ఉపవాసం వల్ల ధనికులు కూడా దాని బాధను తెలుసుకోగలుగుతారు.


ఇందువల్లే ఈ పవిత్ర మాసమైన రమజాన్ ను దానధర్మాల మరియు కృపల మాసం అని అంటారు. ఈ నెల ఇస్లామీయ సోదరభావాన్ని మరియు ఇస్లామీయ సామాజిక కర్తవ్యాన్ని వ్యక్తపరుస్తుంది.
ఉపవాసం వల్ల ముస్లిం సమాజంలో ఐకమత్యం పెరుగుతుంది. ప్రపంచపు కోట్ల ముస్లింలు ఒకేసారి, ఒకేనియమాన్ని పాటిస్తూ ఉపవాసాన్ని నెరవేరుస్తారు.

 

శారీరక మరియు వైద్యపరమైన అంశాలు

ఉపవాసం గురించిన వైద్యపరమైన మరియు ఆరోగ్యపరమైన ప్రయోజనాల గురించి ముస్లింలు మరియు ముస్లిమేతరులైన శాస్త్రవేత్తలు చాలా వివరంగా వ్రాశారు. ఉపవాసం వల్ల మనిషికి హాని కలిగించే కొవ్వు పదార్థాలు రక్తంలో నుంచి తీసివేయబడుతాయి. దీని వల్ల రక్త నాళాలు శుభ్రపడుతాయి.


కొందరికి ఎక్కువ తినే లేదా సిగరేట్ తాగే అలవాటు ఉంటుంది. రమజాన్ లో ఈ చెడు అలవాట్లు వదిలిపెట్టేఅవకాశం దొరుకుతుంది.

 

ఒక విధంగా ఉపవాసం సంవత్సరానికి ఒకసారి మనిషి శరీరాన్ని శుభ్రపరుస్తుంది. ఇవన్నీ సరే, కానిఉపవాసపు అసలు ఉద్దేశం ఏమిటంటే, మానవుడు అల్లాహ్ కు విధేయత చూపే మరియుప్రసన్నతచూరగొనేసదవకాశం కలిగించుట. దీని వల్ల అల్లాహ్ తన దాసులపై మరిన్ని అనుగ్రహాలు కురిపిస్తాడు.

 

ఇంకా చూడండి

రమజాన్, లైలతుల్ ఖద్ర్, ముహర్రం, అరఫా, ఉపవాసపు శుభాలు

 

ఆధారాలు

Written by By Dr. Jamal Badawi (ఇంగ్లీష్)
http://www.islamforhindus.com/en/why-is-fasting-an-obligatory-worship/
(ఇంగ్లీష్)
 

 

796 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్