ఈదుల్ అజహా


ఇబ్న్ ఆబిదైన్ ఇలా ఉల్లేఖించారు : "ఈద్ రోజు అని ఎందుకంటారంటే, అల్లాహ్ తన దాసులపై కారుణ్యాన్ని, దాతృత్వాన్ని కురుపిస్తాడు మరియు ఫితర్ అనగా ఈ రోజు ఆహారాన్ని సేకరించే రోజు, ఎందుకనగా అల్లాహ్ తన దాసుల ఉపవాసాల సమయంలో ఆహారం మరియు నీరు సేకరించకపోవడం, అలాగే సదకాతుల్ ఫితర్ (పేదల హక్కు) ను పేదలకు ఇవ్వడం వలన (వారి ఉపవాసాలలో చేసిన చిన్న చిన్న తప్పులను తుడిచేస్తుంది). హజ్ సమయంలో చివరి తవాఫ్ పూర్తి అయిన తర్వాత చేసుకునే పండుగనే ఈదుల్ అద్ హా అంటారు. ఆ రోజు జంతు బలిని అల్లాహ్ కోసం అర్పిస్తారు. మరియు ఆ రోజు అందరితో ఆనందాన్ని పంచుకుంటారు. [హషియహ్ ఇబ్న్ అబిదీన్ (2/165)] [1]

 

విషయసూచిక

 

ప్రాముఖ్యత మరియు ప్రత్యేకత

ఇస్లాం లో ఈద్ అల్ అదహా అనగా బలి ఉత్సవం గా పిలువబడుతుంది. ఈ రోజు ముస్లింలు  అందరూ ప్రవక్త ఇబ్రాహీం లేదా అబ్రహం అలైహిస్సలాం తన కుమారుడైన ప్రవక్త ఇస్మాయిల్ లేదా ఇష్మాయిల్ అలైహిస్సలాం ను బలి ఇవ్వబడిన రోజుగా గుర్తు చేసుకుంటారు. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం అల్లాహ్ ఆజ్ఞను శిరసావహించి సదాచార సంపన్నులుగా పేరు పొందడాన్ని ఖుర్ ఆన్ లో వివరించారు.


మరి ఆ కుర్రాడు అతనివెంట పరుగెత్తే ఈడుకు చేరుకున్నప్పుడు, "ఒరేయ్‌ చంటీ!నేను నిన్ను 'జిబహ్‌' చేస్తున్నట్లు కల చూస్తున్నాను!  మరి నీ అభిప్రాయమేమిటో చెప్పు" అని అతను (ఇబ్రాహీం) అన్నాడు.  "నాన్నగారూ! మీకు ఆజ్ఞాపించబడిన దానిని (నిస్సంకోచంగా) నెరవేర్చండి. అల్లాహ్‌ తలిస్తే మీరు నన్ను సహనశీలిగా పొందుతారు"అని ఆ బాలుడు అన్నాడు. మరి వారిరువురూ  (దైవాజ్ఞను)శిరసావహించినప్పుడు అతను తన కుమారుణ్ణి ఒక పక్కకు తిప్పి పడుకోబెట్టాడు. అప్పుడు మేమతన్ని పిలిచాము - "ఓ ఇబ్రాహీం! నువ్వు కలను నిజం చేసి చూపావు." నిశ్చయంగా మేము సదాచార సంపన్నులకు ఇటువంటి ప్రతిఫలాన్నే ఇస్తాము.


యదార్థానికి అదొక బహిరంగ పరీక్ష! మేము ఒక పెద్ద బలిపశువుని పరిహారంగా ఇచ్చి ఆ బాలుణ్ణి విడిపించాము. ఖుర్ఆన్ సూరా అస్ సాఫ్ఫాత్ 37:102 -107. [2]


నిశ్చయంగా ఇబ్రాహీం ఒక అనుసరణీయ నాయకుడు. నికార్సయిన దైవవిధేయుడు. అల్లాహ్‌ యందే మనస్సు నిలిపిన వాడు. అతడు బహుదైవారాధకులలో చేరినవాడు కాడు. అల్లాహ్‌ అనుగ్రహాల పట్ల కృతజ్ఞతాభావం కలవాడు. అల్లాహ్‌ అతన్ని ఎన్నుకున్నాడు. అతనికిరుజుమార్గంచూపించాడు. ఖుర్ ఆన్ సూరా అన్ నహల్ 16:120-121. [3]

 

హదీస్

ఈద్ అల్ అదహా జుల్ హజ్జా లోని పదవ తేది, ఇస్లామీయ నెల ప్రకారం పన్నెండవ నెల. ప్రవక్త ﷺ ఇలా చెప్పారు :

అల్లాహ్ సుబు హానహు వత ఆలా దృష్టిలో అతి  గొప్ప నెల ఏమిటంటే, కుర్భానీ నెల....” (అబూ దావూద్ ఉల్లేఖనం; చూడండి సహీహ్ అల్-జామి’, 1064). [4])


అనస్ రజియల్లాహుఅన్హు ఉల్లేఖించిన ఒక హదీస్ ఇలా ఉన్నది : ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు వలస వచ్చినప్పుడు, మదీనా వాసులు రెండు దినాలు ఆటపాటలలో గడిపేవారు. అది చూసి, ఆయన వారినిలా ప్రశ్నించినారు : “ఈ రెండు దినాలు ఏమిటి?” వారిలా బదులు పలికినారు: “అజ్ఞాన కాలంలో మేము ఈ రెండు దినాలు ఆట పాటలలో గడిపేవారము.” అది విని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు “వాటికి బదులుగా అల్లాహ్ మీకు వాటికంటే ఉత్తమమైన రెండు దినాలను ప్రసాదించెను: ఈద్ అల్ అదహా దినం (బక్రీదు పండుగ) మరియు ఈదుల్ ఫిత్ర్  (రమజాన్  పండుగ దినం)” ముస్నద్ అహ్మద్ Vol 3: 103, 178 మరియు 235. [5]

 

ఈద్ సాంప్రదాయం

 1. త్వరగా నిదుర లేవాలి. 
   
 2. స్నానం చేయాలి.
   
 3. దుస్తులను ధరించాలి, క్రొత్త వస్త్రాలై ఉండాలి,ఒకవేళ పాత వస్త్రాలు మంచిగా ఉంటే ధరించవచ్చు.
   
 4. సువాసనను పూసుకోవాలి.
   
 5. ఈద్-ఉల్ ఫిత్ర్ నమాజు ముందుగా కొంచెం స్వల్పాహారం తీసుకోవాలి. కాని ఈద్ అల్ అజహా రోజు నమాజు తర్వాత స్వల్పాహారం తినాలి లేదా కుర్బానీ పూర్తయిన తర్వాత తినాలి. 
   
 6. ఈద్ అల్ ఫిత్ర్ నమాజు ముందుగా జకాతుల్ ఫిత్ర్ ఇవ్వాలి.
   
 7. ఈద్గాకు త్వరగా వెళ్ళాలి
   
 8. వర్షం లేక మంచు పడే ఇబ్బంది లేకపోతే నమాజు ఈద్గా లోనే చేయాలి.
   
 9. ఈద్గా నుండి పోయే దారి మరియు వచ్చే దారి వేరు వేరుగా ఉండాలి
   
 10. ఈద్ నమాజు మొదలయ్యేవరకు తక్బీర్ చెప్పుకుంటూ ఈద్గా కు వెళ్ళాలి. అల్లాహు-అక్బర్,  అల్లాహు–అక్బర్. లా ఇలాహా ఇల్లల్లాహ్. అల్లాహు-అక్బర్. వలిల్ అహిల్ హమ్ద్.(అల్లాహ్ గొప్పవాడు, అల్లాహ్ గొప్పవాడు. అల్లాహ్ తప్ప వేరొక దేవుడు లేడు, అల్లాహ్ గొప్పవాడు, అల్లాహ్ గొప్పవాడు. సకల స్తోత్రాలు అల్లాహ్ కే చెందుగాక.)[6]

 

ఈద్ శుభాకాంక్షలు

జుబైర్ బిన్ నుఫైర్ ఇలా చెప్పారు:

అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులు ఈద్ రోజు కలుసుకున్నప్పుడు ఇలాచెప్పుకునేవారు, “తకబ్బలల్లాహు మిన్నా వ మిన్క్ (అల్లాహ్ మీ పుణ్యాలను మా పుణ్యాలను స్వీకరించుగాక )” అల్-మహామిలియ్యాత్ ఇబ్న్ హజర్ ప్రకారం ఈ ఉల్లేఖనం హసన్ గా పరిగణించబడింది. ఫత్-ఉల్-బారీలో చూడండి 2:446 మరియు ముహమ్మద్ బిన్ జియాద్ ఇలా చెప్పారు: నేను అబూ ఉమామహ్ అల్-బాహిలీ ర.జి మరియు ఇంకా కొంతమంది ప్రవక్త ﷺ అనుచరులు కూడా ఉన్నారు. వీరందరూ ఈద్గా నుండి తిరిగి వచ్చేటప్పుడు ఒకరినోకరి ఇలా చెప్పుకునేవారు, “తకబ్బలల్లాహు మిన్నా వ మిన్క్” అల్ ముగ్నీ లోనీ ఇబ్న్ కుదామహ్ 2:259 ఉల్లేఖించారు; ఈ హదీస్ యొక్క ఉల్లేఖనం నిజమైనది అని చెప్పారు.[7]

 

ఆధారాలు

[1] Celebrations in Islam by Muhammad Al Jibaly http://www.qss.org/articles/celebrations/toc.html

[2] http://quran.com/37/102-107

[3] http://quran.com/16/120-121

[4] http://www.islamqa.com/en/ref/628/eid

[5] http://www.ahya.org/amm/modules.php?name=Sections&op=viewarticle&artid=77

[6] http://www.islamicity.com/mosque/hajj/Adha/sunnah_of_eid.html

[7] http://www.qss.org/articles/celebrations/4-7.html

400 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్